ఈవెంట్
రావిశాస్త్రి 93వ జయంతి సభ జూలై 30న సాయంత్రం 6 గంటలకు విశాఖ పౌరగ్రంథాలయంలో జరగనుంది. సూత్రధారి: రావిశాస్త్రి తమ్ముడు రాచకొండ నరసింహశర్మ. అధ్యక్షత: ఎల్.ఆర్.స్వామి. ‘రావిశాస్త్రి సాహిత్యం-సామాజిక న్యాయం’ అంశంపై దుప్పల రవికుమార్, గరిమెళ్ళ నాగేశ్వరరావు, పేరి రవికుమార్, కె.జి.వేణు ప్రసంగిస్తారు. అద్దేపల్లి రామమోహనరావు, వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి, మంగు శివరామప్రసాద్, ఎస్.గోవిందరాజులు ప్రభృతులు పాల్గొంటారు. వివరాలకు రామతీర్థ ఫోన్: 9849200385
కవిత్వ కార్యశాల
సాహితీస్రవంతి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని పౌరగ్రంథాలయంలో ఆగస్టు 2న(ఆదివారం) పూర్తిరోజు కవిత్వ కార్యశాల జరగనుంది. ఈ కవిత్వ శిక్షణా శిబిరాన్ని తెలకపల్లి రవి ప్రారంభిస్తారు. సీతారం, మేడిపల్లి రవికుమార్ నిర్వహిస్తారు. గంటేడ గౌరునాయుడు, అరుణ పప్పు, చందు సుబ్బారావు, వొరప్రసాద్, సత్యాజీ తదితరులు పాల్గొంటారు. పేర్లు నమోదు చేసుకునేవారు సాహితీ స్రవంతి అధ్యక్షులు ఎ.వి.రమణారావును 9848710507 నంబర్లో సంప్రదించవచ్చు.
‘గడియారం’ స్మారక పురస్కారం
35 ఏళ్లుగా రచన సాహిత్య వేదిక వారు అందిస్తున్న మహాకవి గడియారం వేంకట శేషశాస్త్రి స్మారక సాహిత్య పురస్కారం- 2015 కొరకు పద్యకావ్యాలను ఆహ్వానిస్తున్నాం. విజేతకు 5,000 రూపాయల నగదు, సత్కారం ఉంటాయి. పోటీకి పంపే పద్యకావ్య ముద్రణ జనవరి 1, 2011- డిసెంబర్ 31, 2014 మధ్యకాలంలో జరిగివుండాలి. 4 ప్రతుల్ని ఆగస్టు 31లోగా ఈ చిరునామాకు పంపండి: ఎన్.సి.రామసుబ్బారెడ్డి, 7/201-3ఇ, జయనగర్ కాలనీ, కడప-516002; ఫోన్: 7893089007
- విహారి, అధ్యక్షుడు
ఫోన్: 9848025600.
రావిశాస్త్రి జయంతి సభ
Published Sun, Jul 26 2015 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM
Advertisement
Advertisement