ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఈ రూల్‌ను సమర్ధిస్తుంటే.. మరి కొంతమంది తప్పుబడుతున్నారు. తాజాగా ఈ రూల్‌పై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు రవిశాస్త్రి మద్దతుగా నిలిచాడు. ఈ రూల్ కారణంగానే మ్యాచ్‌లు ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయని రవిశాస్త్రి తెలిపాడు. "నా వరకు అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ చాలా బాగుంది. కాలంతో పాటు ఆటలో కూడా మార్పులు ఉండాలి.
ఇతర క్రీడలలో క్రమంగా మార్పులు జరుగుతున్నాయి. ఈ రూల్ వల్ల మ్యాచ్‌లు చాలా క్లోజ్‌గా జరుగుతున్నాయి. గత సీజన్‌లో కూడా చాలా మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా జరిగాయి. ఇంపాక్ట్ రూల్ ఐపీఎల్‌లో విప్లవాత్మకమైన మార్పు తీసుకు వచ్చింది.
ఎప్పుడైనా కొత్త రూల్స్ వస్తే, ఆ రూల్స్‌ను వ్యతిరేకించే వ్యక్తులు కూడా ఉంటారు. కానీ 200, 190 స్కోర్లను కూడా ఛేజ్ చేస్తున్న వైనం చూసి.. వ్యతిరేకించిన వారే ఇంపాక్ట్ రూల్‌పై పునరాలోచిన పునరాలోచిస్తున్నారని" అశ్విన్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment