
ఐపీఎల్-2025 సీజన్‌కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. మార్చి 22 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మెగా ఈవెంట్ షూరూ కానుంది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు బీసీసీఐ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్‌లో సాయంత్రం వేళ జరిగే మ్యాచ్‌ల్లో రెండో ఇన్నింగ్స్‌లో రెండు బంతులను వినియోగించుకునే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది.
గురువారం(మార్చి 20) ముంబైలో జరిగిన కెప్టెన్ల సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఐపీఎల్‌లో సాయంత్రం జరిగే మ్యాచ్‌లలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. డ్యూ ఫాక్టర్ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బంతి తడిగా మారి బౌలర్లకు గ్రిప్ దొరికేది కాదు.
దీంతో బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు వేయలేక పరుగులు సమర్పించుకునేవారు. చాలా మ్యాచ్‌ల్లో మంచునే ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారేది. అందుకే ప్రతీ జట్టు టాస్ గెలిస్తే తొలుత బౌలింగ్ ఎంచుకునేందుక మొగ్గు చూపేవారు. ఈ క్రమంలోనే డ్యూ ఫాక్టర్‌ను తగ్గించడానికి రెండు కొత్త బంతుల రూల్‌ను బీసీసీఐ తీసుకొచ్చింది.
ఈ రూల్ ప్రకారం.. రెండో కొత్త బంతిని సెకెండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం ఉపయోగించాలి. అది కూడా 11వ ఓవర్ తర్వాత మాత్రమే జట్ల కెప్టెన్లు కొత్త బంతిని తీసుకునే అవకాశముంటుంది. అయితే బంతిని మార్చాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం అంపైర్‌దే.
మంచు ఎక్కువగా ఉందా లేదా అని పరిశీలించి అంపైర్ తుది నిర్ణయం తీసుకుంటారు. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లకు ఈ రూల్ వర్తించదు. ఈ నిర్ణయంతో బౌలర్లకు ప్రయోజనం చేకూరనుంది.
అదేవిధంగా ఇంపాక్ట్ రూల్‌ను కొనసాగించేందుకు బీసీసీఐ మొగ్గు చూపింది. ఐపీఎల్-2023 సీజన్‌లో ప్రవేశిపెట్టిన ఈ రూల్ పట్ల మొత్తం పది మంది కెప్టెన్లు కూడా సముఖుత చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు సలైవా బ్యాన్‌ను కూడా బీసీసీఐ ఎత్తివేసింది.
చదవండి: BCCI: ఒక్కో ఆటగాడికి రూ. 3 కోట్లు.. గంభీర్‌కు ఎంతో వెల్లడించిన బీసీసీఐ
Comments
Please login to add a commentAdd a comment