దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా జట్టు వచ్చే నెలలో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా 3 టెస్టులు, 3 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే పాక్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఆసీస్ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ప్రకటించింది. కాగా గాయం కారణంగా యాషెస్ సిరీస్ మధ్యలో నుంచి తప్పుకున్న జోష్ హేజిల్‌వుడ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లిస్, మిచెల్ స్వెప్సన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక ఈ జట్టుకు పాట్ కమిన్స్ నాయకత్వం వహించనున్నాడు. ఇక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు కమిన్స్ కెప్టెన్‌గా అద్భుతమైన విజయం అందించిన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్) ఆష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్ , నాథన్ లి యోన్, మిచెల్ మార్ష్, మైఖేల్ నెజర్ మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్
Comments
Please login to add a commentAdd a comment