ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. చెలరేగి ఆడుతోన్న పాక్‌ | Ton up Imam ul Haq Punishes Faltering Australia in 1st Test | Sakshi
Sakshi News home page

PAK Vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. చెలరేగి ఆడుతోన్న పాక్‌

Published Sat, Mar 5 2022 8:10 AM | Last Updated on Sat, Mar 5 2022 8:13 AM

Ton up Imam ul Haq Punishes Faltering Australia in 1st Test - Sakshi

రావల్పిండి: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు పాకిస్తాన్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టపోయి 245 పరుగులు సాధించింది. ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (132 బ్యాటింగ్‌; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. అజహర్‌ అలీ (64 బ్యాటింగ్‌)తో కలిసి రెండో వికెట్‌కు ఇమామ్‌ 140 పరుగులు.. ఓపెనర్‌ షఫీఖ్‌ (44)తో  తొలి వికెట్‌కు 105 పరుగులు జత చేశాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్‌ లయాన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. ఇక 24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌ ఆడుతుంది. ఇది ఇలా ఉంటే.. పెషావర్‌లోని ఒక మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడి ఆస్ట్రేలియా క్రికెటర్లను ఆందోళనకు గురి చేసింది.  ఎందుకంటే పెషావర్‌కు 187 కిమీ దూరంలో ఉన్న రావల్పిండి వేదికగానే తొలి టెస్ట్‌ జరగుతోంది.

చదవండి: India Vs Sri Lanka 1st Test: శ్రీలంక బౌలర్లకు చుక్కలు.. తొలి రోజు మనదే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement