డర్బన్: క్రీడా మైదానంలో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాల్సిన క్రికెటర్లు డేవిడ్ వార్నర్-డీకాక్‌లు అన్ని మరిచి మాటల యుద్ధానికి దిగారు. సహచరులు వారిస్తునన్నా వినిపించుకోకుండా ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగారు. ఆసీస్-దక్షిణాఫ్రికా తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆదివారం ఆటలో టీ విరామం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న సమయంలో వార్నర్, డీకాక్ ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు. దాంతో వివాదం తారాస్థాయికి చేరింది.
ఇదిలా ఉంటే మ్యాచ్ పూర్తైన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో వార్నర్‌ను ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ వెనకేసుకొచ్చాడు. ఇందులో వార్నర్ తప్పిదం లేదంటూ స్మిత్ పేర్కొన్నాడు. వార్నర్‌ను పరుష పదజాలంతో ముందు రెచ్చగొట్టింది డీకాక్ అంటూ స్మిత్ తెలిపాడు. ఫీల్డ్‌లో వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడంతో వారి మధ్య వివాదం రాజుకుందన్నాడు. వార్నర్ భార్యను డీకాక్ దూషించిన కారణంగానే అతను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని స్మిత్ అన్నాడు. ఏది ఏమైనా ఈ తరహా ఘటనలు క్రికెట్‌కు అంత మంచివి కావన్నాడు. మరొకవైపు డీకాక్ తల్లి, చెల్లిని వార్నర్ అసభ్యకర పదజాలంతో తిట్టినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment