డేవిడ్ వార్నర్ (PC: CA)
David Warner Can Request Review Of His Leadership Ban Now: ‘‘2018లో కేవలం నాలుగు రోజుల్లోనే నిర్ణయం జరిగిపోయింది. కానీ దానికి సంబంధించిన అభ్యర్థనపై స్పందించేందుకు తొమ్మిది నెలల సమయం తీసుకున్నారు’’ అంటూ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తానేమీ క్రిమినల్‌ను కాదంటూ క్రికెట్ ఆస్ట్రేలియా(ఏఈ) తీరును విమర్శించాడు.
సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా 2018 నాటి బాల్ టాంపరింగ్ వివాదం నేపథ్యంలో వార్నర్ భవిష్యత్తులో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే వీల్లేకుండా సీఏ జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సీఏ తీసుకున్న నిర్ణయంతో తన విషయంలో పునరాలోచన చేయాల్సిందగా డేవిడ్ వార్నర్ విజ్ఞప్తి చేసే అవకాశం లభించింది.
9 నెలల తర్వాత
జీవితకాల నిషేధాల ఎత్తివేతపై ఆటగాళ్లు, సిబ్బంది బోర్డును ఆశ్రయించేలా నిబంధనలు సులభతరం చేయాలంటూ ఆస్ట్రేలియా ఆటగాళ్ల యూనియన్ గతంలో సీఏను అభ్యర్థించింది. ఈ క్రమంలో దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీఏ వెల్లడించింది.
స్పందించిన వార్నర్
ఈ నేపథ్యంలో ఈ విషయంపై స్పందించిన డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా మీడియాతో మాట్లాడుతూ.. తన విషయంలో బోర్డును ఆశ్రయించే అవకాశం రావడం హర్షించదగ్గ పరిణామమని పేర్కొన్నాడు. అయితే, నిషేధం విధించడంలో ఉన్నంత తొందర.. ఇలాంటి అంశాలను సమీక్షించే అంశంలో మాత్రం లేకపోవడం దురదృష్టకరమన్నాడు. బాల్ టాంపరింగ్ వివాద సమయంలో తాను, తన కుటుంబం తీవ్ర వేదనకు గురయ్యామంటూ చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.
నేనేమీ క్రిమినల్‌ను కాదు
‘‘నేనేమీ నేరస్తుడిని కాదు.. ప్రతీ వ్యక్తికి తన తప్పు ఏమిటో.. అందుకు ఎంతకాలం శిక్ష అనుభవించాలో.. తెలుసుకునే అవకాశం ఇవ్వాలి. ఇందుకు సంబంధించి తదుపరి పరిణామాలేమిటో తెలుసుకునేందుకు.. పునరాలోచన చేయమని అప్పీలు చేసుకునే హక్కు కల్పించాలి.
వాళ్లు నాపై నిషేధం విధించారు. కానీ జీవితకాల నిషేధం విధించడం నా పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించడమే. నా పేరు పక్కన సీ(కెప్టెన్) లేదంటే వీసీ(వైస్ కెప్టెన్) అన్న హోదా ఉన్నా లేకపోయినా నేను మా జట్టుకు నాయకుడినే’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.
బాల్ టాంపరింగ్ వివాదం వల్లే
2018లో కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టెస్టు సందర్భంగా జరిగిన ‘బాల్ టాంపరింగ్’ ఉదంతం క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ నేపథ్యంలో నాటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ సహా డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై వేటు పడిన విషయం తెలిసిందే.
చదవండి: ఇదేం బాదుడు రా బాబు.. వన్డేల్లో 277 పరుగులు.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
Suryakumar Yadav: సూర్య అత్యుత్తమ టీ20 బ్యాటర్ కాదా!? కివీస్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment