ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు ఆసీస్ టెస్ట్ జట్టు ఓపెనర్‌గా ప్రమోషన్ లభించింది. టెస్ట్‌ల నుంచి వార్నర్ రిటైర్ కావడంతో ఆసీస్ ఓపెనర్ స్థానాన్ని స్టీవ్ స్మిత్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ధృవీకరించాడు. స్వదేశంలో విండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసిన బెయిలీ.. ఇదే సందర్భంగా స్మిత్ న్యూ ఇన్నింగ్స్‌పై (ఓపెనర్) ప్రకటన చేశాడు.
వార్నర్ రిటైర్మెంట్ ప్రకటన అనంతరం స్మిత్ టెస్ట్ ఓపెనింగ్ స్థానంపై తన ఇష్టాన్ని స్వయంగా వెల్లడించాడు. దీన్ని పరిగణలోకి తీసుకునే ఆసీస్ సెలెక్టర్లు స్మిత్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చారు. మరోవైపు విండీస్‌తో సిరీస్‌కు రెగ్యులర్ ఓపెనర్ మ్యాట్ రెన్‌షాను కూడా ఎంపిక చేసిన సెలెక్టర్లు, అతన్ని ఏ స్థానంలో బరిలోకి దించుతారో వేచి చూడాలి.
లెగ్ స్పిన్ బౌలర్‌గా మొదలైన ప్రస్తానం..
టెస్ట్‌ల్లో స్టీవ్ స్మిత్ ప్రస్తానం రకరకాల మలుపులు తిరుగూ సాగింది. లెగ్ స్పిన్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన స్మిత్.. దినదినాభివృద్ది చెందుతూ ఆసీస్ అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన స్మిత్‌్.. ఇప్పుడు ఓపెనర్‌గా ప్రమోషన్ పొందాడు.
వన్డే జట్టు కెప్టెన్‌గానూ..
ఆసీస్ సెలెక్టర్లు విండీస్‌తో టెస్ట్ సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు కూడా ఆసీస్ జట్టును ప్రకటించారు. ఈ సిరీస్ కోసం రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు.. స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించారు. వన్డే సిరీస్‌కు కమిన్స్‌తో పాటు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌లకు విశ్రాంతినిచ్చారు.
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, మాట్ రెన్‌షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, కెమరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, లాన్స్ మోరిస్, జై రిచర్డ్‌సన్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా
ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్..
తొలి టెస్ట్: జనవరి 17-21 (అడిలైడ్)
రెండో టెస్ట్: జనవరి 25-29 (బ్రిస్బేన్)
తొలి వన్డే: ఫిబ్రవరి 2 (మెల్‌బోర్న్)
రెండో వన్డే: ఫిబ్రవరి 4 (సిడ్నీ)
మూడో వన్డే: ఫిబ్రవరి 6 (కాన్‌బెర్రా)
తొలి టీ20: ఫిబ్రవరి 9 (హోబర్ట్)
రెండో టీ20: ఫిబ్రవరి 11 (అడిలైడ్)
మూడో టీ20: ఫిబ్రవరి 13 (పెర్త్)
Comments
Please login to add a commentAdd a comment