Test opening batsman
-
స్టీవ్ స్మిత్‌కు ప్రమోషన్
ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు ఆసీస్ టెస్ట్ జట్టు ఓపెనర్‌గా ప్రమోషన్ లభించింది. టెస్ట్‌ల నుంచి వార్నర్ రిటైర్ కావడంతో ఆసీస్ ఓపెనర్ స్థానాన్ని స్టీవ్ స్మిత్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ధృవీకరించాడు. స్వదేశంలో విండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసిన బెయిలీ.. ఇదే సందర్భంగా స్మిత్ న్యూ ఇన్నింగ్స్‌పై (ఓపెనర్) ప్రకటన చేశాడు. వార్నర్ రిటైర్మెంట్ ప్రకటన అనంతరం స్మిత్ టెస్ట్ ఓపెనింగ్ స్థానంపై తన ఇష్టాన్ని స్వయంగా వెల్లడించాడు. దీన్ని పరిగణలోకి తీసుకునే ఆసీస్ సెలెక్టర్లు స్మిత్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చారు. మరోవైపు విండీస్‌తో సిరీస్‌కు రెగ్యులర్ ఓపెనర్ మ్యాట్ రెన్షాను కూడా ఎంపిక చేసిన సెలెక్టర్లు, అతన్ని ఏ స్థానంలో బరిలోకి దించుతారో వేచి చూడాలి. లెగ్ స్పిన్ బౌలర్‌గా మొదలైన ప్రస్తానం.. టెస్ట్‌ల్లో స్టీవ్ స్మిత్ ప్రస్తానం రకరకాల మలుపులు తిరుగూ సాగింది. లెగ్ స్పిన్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన స్మిత్.. దినదినాభివృద్ది చెందుతూ ఆసీస్ అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన స్మిత్్.. ఇప్పుడు ఓపెనర్‌గా ప్రమోషన్ పొందాడు. వన్డే జట్టు కెప్టెన్‌గానూ.. ఆసీస్ సెలెక్టర్లు విండీస్‌తో టెస్ట్ సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు కూడా ఆసీస్ జట్టును ప్రకటించారు. ఈ సిరీస్ కోసం రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు.. స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించారు. వన్డే సిరీస్‌కు కమిన్స్‌తో పాటు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌లకు విశ్రాంతినిచ్చారు. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, మాట్ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, కెమరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, జై రిచర్డ్సన్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్.. తొలి టెస్ట్: జనవరి 17-21 (అడిలైడ్) రెండో టెస్ట్: జనవరి 25-29 (బ్రిస్బేన్) తొలి వన్డే: ఫిబ్రవరి 2 (మెల్బోర్న్) రెండో వన్డే: ఫిబ్రవరి 4 (సిడ్నీ) మూడో వన్డే: ఫిబ్రవరి 6 (కాన్బెర్రా) తొలి టీ20: ఫిబ్రవరి 9 (హోబర్ట్) రెండో టీ20: ఫిబ్రవరి 11 (అడిలైడ్) మూడో టీ20: ఫిబ్రవరి 13 (పెర్త్) -
మ్యాచ్ ఆడుతుండగానే చాతిలో నొప్పి... పరుగున ఆసుపత్రికి
పాకిస్తాన్ టెస్టు ఓపెనర్ అబీద్ అలీ చాతినొప్పికి గురయ్యాడు. క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో భాగంగా కైబర్ పంక్తున్నవాతో జరుగుతున్న మ్యాచ్‌లో అబీద్ అలీ 61 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్ ద్వారా అబీద్ అలీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 9వేల పరుగులు పూర్తి చేశాడు. కాగా మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే అతనికి రెండుసార్లు చాతినొప్పి రావడంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. డ్రెస్సింగ్‌రూమ్‌కు చేరుకున్న అబీద్ వెంటనే ఫిజియో సలహాతో ఆసుపత్రిలో జాయినయ్యాడు. ప్రస్తుతం అబీద్ అలీ అబ్జర్వేషన్లో ఉన్నాడని.. గుండె సంబంధిత వ్యాధి ఏమైనా ఉందా అన్న కోణంలో వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికైతే అతని పరిస్థితి బాగానే ఉందని.. చెకప్ తర్వాత అబీద్ అలీ పరిస్థితిపై ఒక క్లారిటీ వస్తుందని సెంట్రల్ పంజాబ్ మేనేజర్ అశ్రఫ్ అలీ పేర్కొన్నాడు. ఇక క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ ద్వారా 2007లో క్రికెట్లో అరంగేట్రం చేసిన అబీద్ అలీ 31 ఏళ్ల వయసులో పాకిస్తాన్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇక పాక్ జాతీయ జట్టు తరపున 16 టెస్టులు ఆడిన అబీద్ అలీ 16 టెస్టుల్లో 1180 పరుగులు చేశాడు. చదవండి: Shoaib Maliks Nephew: రికార్డు సృష్టించిన షోయబ్ మాలిక్ మేనల్లుడు.. అరుదైన ఘనత -
'రోహిత్‌ను ఓపెనర్‌గా ఆడనివ్వండి'
న్యూఢిల్లీ : వెస్టిండీస్‌తో జరిగిన టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు టీమిండియా విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. మిడిలార్డర్లో అజింక్యా రహానే, హనుమ విహారి అద్భుతంగా ఆడారని, ఇక బౌలింగ్ విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని పేర్కొన్నాడు. ఇక ఓపెనర్లలో మయాంక్ అగర్వాల్ ఆకట్టుకున్నా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడని, అతడి స్థానంలో డాషింగ్ బ్యాట్సమెన్ రోహిత్‌శర్మకు ఓపెనర్‌గా ఆడే అవకాశం ఇవ్వాలని సూచించాడు. ప్రపంచకప్‌లో రోహిత్‌శర్మ 9 మ్యాచుల్లోనే ఐదు శతకాలతో 648 పరుగుల అద్బుత ప్రదర్శనను ఎవరు మర్చిపోలేరు అని తెలిపాడు. విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ స్థానం ఆశించాడని, కానీ అతనికి అవకాశం ఇవ్వకుండా బెంచ్‌కు పరిమితం చేయడం తనకు నచ్చలేదని గంగులీ తెలిపాడు. వరుస అవకాశాలు వచ్చినా కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా విఫలమవుతూ వస్తున్నాడని, ఇప్పటివరకు 27 టెస్టుల్లో 50 సగటుతో పరుగులు సాధించిన రోహిత్‌శర్మను ఓపెనర్‌గా ఆడిస్తే బాగుంటుందని చాలాసార్లు చెప్పినట్లు పేర్కొన్నాడు. మిడిలార్డర్లో అజింక్యా రహానే, హనుమ విహారిలు ఆకట్టుకోవడంతో అక్కడ వేరే వారికి అవకాశం లేకుండా పోయిందని గంగూలీ స్పష్టం చేశాడు. -
పుజారాకు చోటు కష్టమే!
కుండబద్దలు కొట్టిన రవిశాస్త్రి ఐదుగురు బౌలర్లు కావాలన్న డెరైక్టర్ గాలేలో భారత జట్టు సాధన గాలే: టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా బ్రాండ్ ఉన్నా... ప్రస్తుత భారత తుది జట్టులో చతేశ్వర్ పుజారాకు స్థానం దక్కడం కష్టమేనని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. పుజారాకంటే రోహిత్ శర్మకు అవకాశం ఇవ్వడమే సరైనదని ఆయన అభిప్రాయ పడ్డారు. ఐదుగురు బౌలర్ల వ్యూహానికి తాము కట్టుబడినంత వరకు సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్‌ను ఆడించలేమని పరోక్షంగా చెప్పారు. ‘జట్టులో అత్యుత్తమ ఐదుగురు ఆటగాళ్లలో పుజారా ఒకడైతే అతను మ్యాచ్ ఆడతాడు. లేదంటే లేదు. మేం నలుగురు బౌలర్లతో బరిలోకి దిగితే మాత్రం అతను పునరాగమనం చేస్తాడని నాకు నమ్మకముంది. నా దృష్టిలో రోహిత్ క్లాస్ ఆటగాడు. ఒక్కసారి నిలదొక్కుకుంటే అద్భుతాలు చేయగలడు. కౌంటర్ అటాక్ చేసేందుకు గానీ క్రీజ్‌లో నిలబడేందుకు గానీ మూడో స్థానమే అతనికి సరైంది’ అని శాస్త్రి వ్యాఖ్యానించారు. ‘డ్రా’ కోసం ఆడలేం ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేయాలంటే ఐదుగురు బౌలర్లు ఉండటం తప్పనిసరి అని, ఈ విషయంలో కోహ్లి ఆలోచనకు తాను మద్దతు ఇస్తున్నట్లు రవి చెప్పారు. ఏ జట్టు కూడా డ్రా కోసం బరిలోకి దిగదని, అందుబాటులో ఉన్న వనరులతోనే మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఆడుతుందన్న శాస్త్రి...ఇక విదేశాల్లో నిలకడగా విజయాలు సాధించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గత రెండు దశాబ్దాలుగా శ్రీలంకలో భారత్ సిరీస్ విజయాన్ని అడ్డుకోవడంలో మురళీధరన్ కీలక పాత్ర పోషించాడని... ఇప్పుడు అతను లేడనే విషయాన్ని గుర్తు చేశారు. ఇరు జట్లు ఎక్కువ మంది యువ ఆటగాళ్లతో సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయన్నారు. తొలి టెస్టులో ముగ్గురు స్పిన్నర్లతో ఆడే విషయం వాతావరణంపై ఆధారపడి ఉంటుందని శాస్త్రి వెల్లడించారు. చెమటోడ్చిన బౌలర్లు... తొలి టెస్టు సన్నాహకాల్లో భాగంగా సోమవారం భారత జట్టు సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేసింది. వామప్ డ్రిల్స్‌తో పాటు ఎక్కువ సేపు నెట్స్‌లో ఆటగాళ్లు సాధన చేశారు. సెషన్‌ను రవిశాస్త్రి ఆసాంతం పర్యవేక్షించారు. స్పిన్నర్లు అశ్విన్, మిశ్రా ఎక్కువ సేపు బౌలింగ్ చేయగా...హర్భజన్ కొద్ది సేపు బౌలింగ్ చేసి ఎక్కువగా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాడు. మిశ్రాకు ప్రత్యేక సూచనలు ఇచ్చిన శాస్త్రి, ఇషాంత్‌తో కూడా సుదీర్ఘంగా సంభాషించారు. కోహ్లి స్వయంగా ఆటగాళ్లతో క్యాచింగ్ ప్రాక్టీస్ చేయించాడు. అయితే వర్షం కారణంగా భారత ప్రాక్టీస్‌కు అంతరాయం కలిగింది. కొద్ది సేపు వాన రావడంతో ఇండోర్‌లోకి వచ్చిన ఆటగాళ్లు తిరిగి ప్రాక్టీస్‌ను కొనసాగించారు. అయితే వర్షం కారణంగా శ్రీలంక జట్టు ప్రాక్టీస్ మాత్రం దాదాపుగా తుడిచి పెట్టుకుపోయింది. గాలేలో రాబోయే వారం రోజులు కూడా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. క్లీన్‌స్వీప్ చేస్తే మూడో ర్యాంక్‌కు... శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను భారత్ 3-0తో గెలిస్తే ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంకుకు చేరే అవకాశం ఉంది. అయితే మరో వైపు యాషెస్‌లో చివరి టెస్టు ఆస్ట్రేలియా గెలిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా ఐదో స్థానంలో కొనసాగుతోంది. -
ఈ ఇద్దరు... ‘ఆ ఇద్దరు’ కాలేరా!
నమ్మకం నిలబెట్టలేని కోహ్లి, పుజారా - ఇంగ్లండ్‌లో ఘోర వైఫల్యం - జట్టుపై తీవ్ర ప్రభావం భారత క్రికెట్ నుంచి సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాలు తప్పుకుంటే వారి స్థానాలను సరిగ్గా భర్తీ చేయగల ఆటగాళ్లుగా అందరూ ముక్తకంఠంతో అంగీకరించిన పేర్లు విరాట్ కోహ్లి, చతేశ్వర్ పుజారా. అందులోనూ టెస్టుల్లో ఆయువుపట్టులాంటి మూడు, నాలుగు స్థానాలను వీరిద్దరు మరో చర్చకు అవకాశం లేకుండా సొంతం చేసుకున్నారు. అందుకు తగ్గట్లే సచిన్‌ను మరిపిస్తూ అద్భుతమైన వన్డే ఇన్నింగ్స్‌ల తర్వాత కోహ్లి టెస్టుల్లోనూ స్థిరపడితే... ద్రవిడ్ తరహాలో సాంకేతికంగా అసలైన టెస్టు బ్యాట్స్‌మన్ తరహాలో పుజారా కూడా జట్టులో నిలబడ్డాడు. అయితే ఇప్పుడు ఇంగ్లండ్‌లో పరిస్థితి అంతా తలకిందులుగా కనిపిస్తోంది. కోహ్లి, పుజారా ఆటను చూస్తే నాటి దిగ్గజాలకు ప్రత్యామ్నాయం కాలేరా అనే సందేహమూ వస్తోంది. - సాక్షి క్రీడావిభాగం ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టులో 8 పరుగులకు 3 వికెట్లు పడ్డ సమయంలో ద్రవిడ్‌లాగే పుజారా ఆపద్బాంధవుడవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఆ స్థితిలో పుజారా తన శరీరానికి దూరంగా షాట్ ఆడి స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడం నివ్వెర పరచింది. సాంకేతికంగా అత్యున్నత ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను ఇలా అవుట్ కావడం అనూహ్యం. ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెడుతున్నప్పుడు ఎవరు ఆడినా, ఆడకున్నా తన టెక్నిక్‌తో పుజారా నిలబడగలరని భావించారు. వాండరర్స్, డర్బన్‌లలో చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడిన అనంతరం పుజారా ఆట గతి తప్పింది. ఈ ఏడాది 6 టెస్టుల్లో 12 ఇన్నింగ్స్‌లలో పుజారా 22.25 సగటుతో 267 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే అర్ధ సెంచరీ ఉంది. పసలేని నాటింగ్‌హామ్ పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో చేసిన 55 పరుగులు మినహా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో జట్టుకు అతను బలం కాలేకపోయాడు. సాంకేతికంగాకంటే పుజారా సమస్య మానసికమైందని మాజీ క్రికెటర్ల అభిప్రాయం. మనిషి క్రీజ్‌లో... మనసు ఎక్కడో! ‘ఇంగ్లండ్‌లాంటి చోట ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు. ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు’... ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు ముందు విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. జట్టులో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా ఉన్న గుర్తింపుతో కావచ్చు లేదా అంతకు ముందు జొహన్నెస్‌బర్గ్, వెల్లింగ్టన్లలో చేసిన అద్భుతమైన సెంచరీలు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో కావచ్చు కోహ్లి ఈ మాటలు అన్నాడు. అయితే ఈ సిరీస్‌లో నాలుగు టెస్టులు ముగిశాక కోహ్లి ఆట చూస్తే ఇది అతిగానే తోస్తుంది. 1, 8, 25, 0, 39, 28, 0, 7... ఇవీ అతను చేసిన స్కోర్లు. అతను పదే పదే అవుటవుతున్న తీరు చూస్తే ఏకాగ్రత లేనట్లే అనిపిస్తోంది. ఆఫ్‌స్టంప్ బయట పడి దూరంగా వెళుతున్న బంతులను వదిలేయకుండా వెంటాడి అవుట్ కావడం ఒక అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ స్థాయికి తగింది కాదు. ఆ సమయంలో చూపించాల్సిన ఓపిక, సహనం అతనిలో కనిపించడం లేదు. జొహన్నెస్‌బర్గ్‌లో ఇలాంటి స్థితిలోనే అతను పరిపక్వత ప్రదర్శించాడు. బంతి అద్భుతంగా స్వింగ్ అవుతున్నప్పుడు తొలి సెషన్లో మొదటి 28 బంతుల్లో 16... రెండో సెషన్లో తొలి 17 బంతుల్లో 11 బంతులను కనీసం టచ్ కూడా చేయకుండా వదిలేశాడు. ఆ తర్వాత నిలదొక్కుకొని చక్కటి సెంచరీకి బాట పరచుకున్నాడు. ఇంగ్లండ్‌లో మాత్రం ఏదో తొందర ఉన్నట్లు అలా స్లిప్స్‌లోకి తోసి పెవిలియన్ వెళ్లిపోతున్నాడు! ‘అతని వన్డే ఇన్నింగ్స్‌లు చూస్తే నేరుగా వచ్చే బంతులను ప్యాడ్స్ మీదుగా అద్భుతంగా ఆడతాడు. కాబట్టి వికెట్లకు దగ్గరగా బౌలింగ్ చేయకూడదు. అందుకే ఆఫ్ స్టంప్ బయటే బంతులు విసురుతున్నాం’ అని చెప్పిన ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్, అండర్సన్ తోడుగా అదే వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేశాడు. ఈ సిరీస్‌లో అండర్సన్ బౌలింగ్‌లో 30 బంతులు ఎదుర్కొన్న విరాట్, ఏడు పరుగులు మాత్రమే చేసి నాలుగు సార్లు అవుటయ్యాడు. ‘సచిన్ తర్వాతి సచిన్ అనిపించుకోవడం అంత సులువు కాదు. ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్‌గా ఎదగాలంటే విదేశాల్లో భారీగా పరుగులు చేయాల్సిందే’ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన సూచన ఈ సందర్భంగా సరిగ్గా సరిపోతుంది.