Australia v West Indies
-
విండీస్‌తో తొలి టెస్ట్‌కు ఆసీస్ తుది జట్టు ఇదే.. స్మిత్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభం
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జనవరి 17 నుంచి అడిలైడ్ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తమ తుది జట్ల వివరాలను వెల్లడించాయి. ఈ మ్యాచ్‌తో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా వెల్లడించింది. స్మిత్ ఓపెనర్ అవతారమెత్తడంతో మరో ఓపెనర్ మ్యాట్ రెన్షా బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. తుది జట్టులో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కెమారూన్ గ్రీన్ కూడా చోటు దక్కించుకున్నాడు. వార్నర్ రిటైర్మెంట్ అనంతరం ఆసీస్ ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. మరోవైపు ఈ మ్యాచ్‌తో ముగ్గురు విండీస్ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నారు. కవెమ్ హాడ్జ్, జస్టిన్ గ్రీవ్స్, షమార్ జోసఫ్‌లు సుదీర్ఘ ఫార్మాట్లో తమ తొలి మ్యాచ్ ఆడనున్నారు. ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, కెమరూన్ గ్రీన్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, నాథన్ లయోన్, జోష్ హాజిల్‌వుడ్ వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), తేజ్‌నరైన్ చందర్‌పాల్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జస్టిన్ గ్రీవ్స్, జాషువా డసిల్వా (వికెట్‌కీపర్), గుడకేష్ మోటీ, అల్జరీ జోసెఫ్, షమార్ జోసఫ్, కీమర్ రోచ్ -
ఆసీస్‌తో సిరీస్‌లు: విండీస్ జట్ల ప్రకటన.. విధ్వంసకర ఆటగాడిపై వేటు
ఆస్ట్రేలియాతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ క్రికెట్ జట్టును ఇవాళ (జనవరి 11) ప్రకటించారు. ఈ సిరీస్‌లతో స్టార్ ఆటగాళ్లు జేసన్ హోల్డర్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్ష్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇవ్వగా.. విధ్వంసకర ఆటగాడు షిమ్రోన్ హెట్‌మైర్‌పై వేటు పడింది. హెట్‌మైర్‌కు రెండు జట్లలోనూ చోటు దక్కలేదు. వన్డే జట్టుకు షాయ్ హోప్.. టీ20 జట్టుకు రోవ్‌మన్ పావెల్ కెప్టెన్లుగా ఎంపిక కాగా... పలువురు ఆటగాళ్లు కొత్తగా జట్టులోకి వచ్చారు. వన్డే జట్టులోకి బ్యాటర్ టెడ్డీ బిషప్, వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ టెవిన్ ఇమ్లాచ్ ఎంట్రీ ఇవ్వగా.. టీ20ల్లోకి ఆల్‌రౌండర్లు జస్టిన్ గ్రీవ్స్, కావెమ్ హాడ్జ్ అరంగేట్రం చేయనున్నారు. ఆసీస్ పర్యటనలో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు విండీస్ జట్టును ఇదివరకే ప్రకటించగా.. ఆసీస్ టెస్ట్, వన్డే ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. ఆసీస్ సెలెక్టర్లు టీ20 జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లు జనవరి 17న మొదలై ఫిబ్రవరి 13తో ముగుస్తాయి. ఆసీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు.. షాయ్ హోప్ (కెప్టెన్), అల్జరీ జోసెఫ్, అలిక్ అథనాజ్, టెడ్డీ బిషప్, కీసీ కార్టీ, రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, కావెమ్ హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, గుడకేష్ మోటీ, క్జోర్న్ ఓట్లీ, రొమారియో షెపర్డ్, ఒషేన్ థామస్, హేడెన్ వాల్ష్ జూనియర్ ఆసీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు.. రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయ్ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ ఛేజ్, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జరీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, ఒషేన్ థామస్ ఆసీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు.. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అల్జరీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), తేజ్‌నరైన్ చంద్రపాల్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జస్టిన్ గ్రీవ్స్, జాషువా డసిల్వా, అకీమ్ జోర్డన్, గుడకేష్ మోటీ, కీమర్ రోచ్, కెవిన్ సింక్లైర్, టెవిన్ ఇమ్లాచ్, షమార్ జోసెఫ్, జకరీ మెక్‌కాస్కీ వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు.. పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, మాట్ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు.. స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, కెమరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, జై రిచర్డ్సన్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్.. తొలి టెస్ట్: జనవరి 17-21 (అడిలైడ్) రెండో టెస్ట్: జనవరి 25-29 (బ్రిస్బేన్) తొలి వన్డే: ఫిబ్రవరి 2 (మెల్బోర్న్) రెండో వన్డే: ఫిబ్రవరి 4 (సిడ్నీ) మూడో వన్డే: ఫిబ్రవరి 6 (కాన్బెర్రా) తొలి టీ20: ఫిబ్రవరి 9 (హోబర్ట్) రెండో టీ20: ఫిబ్రవరి 11 (అడిలైడ్) మూడో టీ20: ఫిబ్రవరి 13 (పెర్త్) -
స్టీవ్ స్మిత్‌కు ప్రమోషన్
ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు ఆసీస్ టెస్ట్ జట్టు ఓపెనర్‌గా ప్రమోషన్ లభించింది. టెస్ట్‌ల నుంచి వార్నర్ రిటైర్ కావడంతో ఆసీస్ ఓపెనర్ స్థానాన్ని స్టీవ్ స్మిత్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ధృవీకరించాడు. స్వదేశంలో విండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసిన బెయిలీ.. ఇదే సందర్భంగా స్మిత్ న్యూ ఇన్నింగ్స్‌పై (ఓపెనర్) ప్రకటన చేశాడు. వార్నర్ రిటైర్మెంట్ ప్రకటన అనంతరం స్మిత్ టెస్ట్ ఓపెనింగ్ స్థానంపై తన ఇష్టాన్ని స్వయంగా వెల్లడించాడు. దీన్ని పరిగణలోకి తీసుకునే ఆసీస్ సెలెక్టర్లు స్మిత్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చారు. మరోవైపు విండీస్‌తో సిరీస్‌కు రెగ్యులర్ ఓపెనర్ మ్యాట్ రెన్షాను కూడా ఎంపిక చేసిన సెలెక్టర్లు, అతన్ని ఏ స్థానంలో బరిలోకి దించుతారో వేచి చూడాలి. లెగ్ స్పిన్ బౌలర్‌గా మొదలైన ప్రస్తానం.. టెస్ట్‌ల్లో స్టీవ్ స్మిత్ ప్రస్తానం రకరకాల మలుపులు తిరుగూ సాగింది. లెగ్ స్పిన్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన స్మిత్.. దినదినాభివృద్ది చెందుతూ ఆసీస్ అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన స్మిత్్.. ఇప్పుడు ఓపెనర్‌గా ప్రమోషన్ పొందాడు. వన్డే జట్టు కెప్టెన్‌గానూ.. ఆసీస్ సెలెక్టర్లు విండీస్‌తో టెస్ట్ సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు కూడా ఆసీస్ జట్టును ప్రకటించారు. ఈ సిరీస్ కోసం రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు.. స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించారు. వన్డే సిరీస్‌కు కమిన్స్‌తో పాటు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌లకు విశ్రాంతినిచ్చారు. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, మాట్ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, కెమరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, జై రిచర్డ్సన్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్.. తొలి టెస్ట్: జనవరి 17-21 (అడిలైడ్) రెండో టెస్ట్: జనవరి 25-29 (బ్రిస్బేన్) తొలి వన్డే: ఫిబ్రవరి 2 (మెల్బోర్న్) రెండో వన్డే: ఫిబ్రవరి 4 (సిడ్నీ) మూడో వన్డే: ఫిబ్రవరి 6 (కాన్బెర్రా) తొలి టీ20: ఫిబ్రవరి 9 (హోబర్ట్) రెండో టీ20: ఫిబ్రవరి 11 (అడిలైడ్) మూడో టీ20: ఫిబ్రవరి 13 (పెర్త్) -
విండీస్‌తో సిరీస్ కోసం ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే జట్ల ప్రకటన
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్ట్‌లు, మూడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. వార్నర్ టెస్ట్‌ల నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో మ్యాట్ రెన్షాను ఎంపిక చేశారు ఆసీస్ సెలెక్టర్లు. వార్నర్ రిటైర్మెంట్ అనంతరం టెస్ట్‌ల్లో ఓపెనింగ్ అవకాశాలపై గంపెడాశలు పెట్టుకున్న కెమరూన్ బాన్‌క్రాఫ్ట్, మార్కస్ హ్యారిస్లకు నిరాశ తప్పలేదు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ తిరిగి జట్టులో చోటు సంపాదించగలిగాడు. మిచెల్ మార్ష్ ఆగమనంతో సరైన అవకాశాలు దక్కని గ్రీన్‌పై సెలెక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు. విండీస్‌తో తొలి టెస్ట్‌కు మ్యాట్ రెన్షా, స్కాట్ బోలాండ్ తుది జట్టులో ఉంటారని ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ సూచనప్రాయంగా చెప్పాడు. టెస్ట్ సిరీస్ అనంతరం ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కూడా జట్టును ఎంపిక చేశారు ఆసీస్ సెలెక్టర్లు. ఈ సిరీస్ కోసం రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు.. స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించారు. వన్డే సిరీస్‌కు కమిన్స్‌తో పాటు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌లకు విశ్రాంతినిచ్చారు. విండీస్ ఈ పర్యటనలో టెస్ట్, వన్డే సిరీస్‌లతో పాటు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. ఇందు కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించాల్సి ఉంది. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, మాట్ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, కెమరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, జై రిచర్డ్సన్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ షెడ్యూల్.. తొలి టెస్ట్: జనవరి 17-21 (అడిలైడ్) రెండో టెస్ట్: జనవరి 25-29 (బ్రిస్బేన్) తొలి వన్డే: ఫిబ్రవరి 2 (మెల్బోర్న్) రెండో వన్డే: ఫిబ్రవరి 4 (సిడ్నీ) మూడో వన్డే: ఫిబ్రవరి 6 (కాన్బెర్రా) తొలి టీ20: ఫిబ్రవరి 9 (హోబర్ట్) రెండో టీ20: ఫిబ్రవరి 11 (అడిలైడ్) మూడో టీ20: ఫిబ్రవరి 13 (పెర్త్) -
Chris Gayle: నేనింకా రిటైర్ కాలేదు.. ఆ హడావుడి అంతా అందుకే..!
Chris Gayle Confirms That He Hasnt Retired Yet From International Cricket: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా విండీస్ విధ్వంసకర ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ప్రవర్తించిన తీరును చూసి.. ఈ కరీబియన్ యోధుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడేమోనని అంతా భావించారు. అయితే, ఈ అంశంపై స్పందించిన గేల్.. తానింకా రిటైర్ కాలేదని, మరికొద్ది రోజులు క్రికెట్ ఆటడల సత్తా తనలో ఉందని.. స్వదేశంలో సొంత ప్రేక్షకుల సమక్షంలోనే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతానని స్పష్టం చేశాడు. అయితే, ఓ రకంగా ఇది ఆటకు వీడ్కోలు పలికినట్టేనని తికమక పెట్టాడు. ‘ప్రపంచకప్‌లో తనకు చివరి మ్యాచ్ కావడంతో ప్రేక్షకులతో సరదాగా వ్యవహరించానని, మరో ప్రపంచకప్ ఆడాలని ఉన్నా బోర్డు అవకాశం ఇస్తుందని అనుకోవడం లేదని తెలిపాడు. స్వస్థలం అయిన జమైకాలో తన వీడ్కోలు మ్యాచ్ ఆడేందకు బోర్డు అవకాశం ఇవ్వాలని కోరాడు. ఈ మేరకు ఫేస్బుక్ లైవ్ ద్వారా స్పందించాడు. గేల్ ఇదివరకే వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలసిందే. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన గేల్ 15 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. గేల్ పిచ్‌ను వీడుతున్నప్పుడు వీడ్కోలు అన్నట్టుగా బ్యాట్‌ను ప్రేక్షకులు, కెమెరా వైపు చూపిస్తూ బయటకు వస్తుండగా.. సహచరులంతా బౌండరీ రోప్ వద్ద నిల్చొని గౌరవ స్వాగతం పలికారు. మరోవైపు, ఈ మ్యాచ్‌కు ముందే రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావోకు మ్యాచ్ అనంతరం ఆసీస్ ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. చదవండి: భారత టీ20 కెప్టెన్‌గా ఆ ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేయండి... -
ఆడకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తాం
సిడ్నీ: ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య చివరి టెస్టుకు వరుసగా మూడు రోజుల పాటు వర్షం అంతరాయం కలిగించింది. చివరి రోజు ఆట సాధ్యం కావడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్... ప్రత్యర్థితో ఓ వినూత్న ప్రతిపాదన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 112.1 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడకుండా డిక్లేర్ చేస్తుందని... వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసి డిక్లేర్ చేస్తే... ఆ తర్వాత చివరి రోజు మిగిలే 70 ఓవర్లలో 370 లక్ష్యంతో తాము ఆడతామని ప్రతిపాదించాడు. కానీ వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ తమ జట్టు సభ్యులతో సంప్రదించి దీనిని తిరస్కరించారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టి 38 ఓవర్లలో 2 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ (103 బంతుల్లో 122; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు సెంచరీ చేశాడు. 82 బంతుల్లో శతకం పూర్తి చేసిన వార్నర్... సిడ్నీ మైదానంలో వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వోజెస్ (ఆస్ట్రేలియా)కు రిచీ బెనాడ్ పేరిట పతకాన్ని ఇచ్చారు. ఇకపై ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య జరిగే ఫ్రాంక్ వారెల్ ట్రోఫీలో ప్రతిసారీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలిచిన క్రికెటర్‌కు బెనాడ్ పతకం ఇస్తారు.