ఆస్ట్రేలియాతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ క్రికెట్ జట్టును ఇవాళ (జనవరి 11) ప్రకటించారు. ఈ సిరీస్‌లతో స్టార్ ఆటగాళ్లు జేసన్ హోల్డర్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్ష్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇవ్వగా.. విధ్వంసకర ఆటగాడు షిమ్రోన్ హెట్‌మైర్‌పై వేటు పడింది. హెట్‌మైర్‌కు రెండు జట్లలోనూ చోటు దక్కలేదు.
వన్డే జట్టుకు షాయ్ హోప్.. టీ20 జట్టుకు రోవ్‌మన్ పావెల్ కెప్టెన్‌లుగా ఎంపిక కాగా... పలువురు ఆటగాళ్లు కొత్తగా జట్టులోకి వచ్చారు. వన్డే జట్టులోకి బ్యాటర్ టెడ్డీ బిషప్, వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ టెవిన్ ఇమ్లాచ్ ఎంట్రీ ఇవ్వగా.. టీ20ల్లోకి ఆల్‌రౌండర్లు జస్టిన్ గ్రీవ్స్, కావెమ్ హాడ్జ్ అరంగేట్రం చేయనున్నారు.
ఆసీస్ పర్యటనలో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు విండీస్ జట్టును ఇదివరకే ప్రకటించగా.. ఆసీస్ టెస్ట్, వన్డే ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. ఆసీస్ సెలెక్టర్లు టీ20 జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లు జనవరి 17న మొదలై ఫిబ్రవరి 13తో ముగుస్తాయి.
ఆసీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు..
షాయ్ హోప్ (కెప్టెన్), అల్జరీ జోసెఫ్, అలిక్ అథనాజ్, టెడ్డీ బిషప్, కీసీ కార్టీ, రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, కావెమ్ హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, గుడకేష్ మోటీ, క్జోర్న్ ఓట్లీ, రొమారియో షెపర్డ్, ఒషేన్ థామస్, హేడెన్ వాల్ష్ జూనియర్
ఆసీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు..
రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయ్ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ ఛేజ్, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జరీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, ఒషేన్ థామస్
ఆసీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు..
క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అల్జరీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), తేజ్‌నరైన్ చంద్రపాల్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జస్టిన్ గ్రీవ్స్, జాషువా డసిల్వా, అకీమ్ జోర్డన్, గుడకేష్ మోటీ, కీమర్ రోచ్, కెవిన్ సింక్లైర్, టెవిన్ ఇమ్లాచ్, షమార్ జోసెఫ్, జకరీ మెక్‌కాస్కీ
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు..
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, మాట్ రెన్‌షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు..
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, కెమరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, లాన్స్ మోరిస్, జై రిచర్డ్‌సన్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా
ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్..
తొలి టెస్ట్: జనవరి 17-21 (అడిలైడ్)
రెండో టెస్ట్: జనవరి 25-29 (బ్రిస్బేన్)
తొలి వన్డే: ఫిబ్రవరి 2 (మెల్‌బోర్న్)
రెండో వన్డే: ఫిబ్రవరి 4 (సిడ్నీ)
మూడో వన్డే: ఫిబ్రవరి 6 (కాన్‌బెర్రా)
తొలి టీ20: ఫిబ్రవరి 9 (హోబర్ట్)
రెండో టీ20: ఫిబ్రవరి 11 (అడిలైడ్)
మూడో టీ20: ఫిబ్రవరి 13 (పెర్త్)
Comments
Please login to add a commentAdd a comment