T20 World Cup 2021: Chris Gayle Clarified on Retirement Rumors - Sakshi
Sakshi News home page

Chris Gayle: నేనింకా రిటైర్‌ కాలేదు.. ఆ హడావుడి అంతా అందుకే..!

Published Sun, Nov 7 2021 4:27 PM | Last Updated on Sun, Nov 7 2021 5:04 PM

T20 World Cup 2021: Chris Gayle Reveals That He Hasnt Retired Yet - Sakshi

Chris Gayle Confirms That He Hasnt Retired Yet From International Cricket: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా విండీస్‌ విధ్వంసకర ఆటగాడు, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ ప్రవర్తించిన తీరును చూసి.. ఈ కరీబియన్‌ యోధుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడేమోనని అంతా భావించారు. అయితే, ఈ అంశంపై స్పందించిన గేల్‌.. తానింకా రిటైర్‌ కాలేదని, మరికొద్ది రోజులు క్రికెట్‌ ఆటడల సత్తా తనలో ఉందని.. స్వదేశంలో సొంత ప్రేక్షకుల సమక్షంలోనే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతానని స్పష్టం చేశాడు. 

అయితే, ఓ రకంగా ఇది ఆటకు వీడ్కోలు పలికినట్టేనని తికమక పెట్టాడు. ‘ప్రపంచకప్‌లో తనకు చివరి మ్యాచ్‌ కావడంతో ప్రేక్షకులతో సరదాగా వ్యవహరించానని, మరో ప్రపంచకప్‌ ఆడాలని ఉన్నా బోర్డు అవకాశం ఇస్తుందని అనుకోవడం లేదని తెలిపాడు. స్వస్థలం అయిన జమైకాలో తన వీడ్కోలు మ్యాచ్‌ ఆడేందకు బోర్డు అవకాశం ఇవ్వాలని కోరాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా స్పందించాడు. గేల్‌ ఇదివరకే వన్డే, టెస్ట్‌ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలసిందే. 

ఇదిలా ఉంటే, ఆసీస్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన గేల్‌ 15 పరుగులు చేసి కమిన్స్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. గేల్‌ పిచ్‌ను వీడుతున్నప్పుడు వీడ్కోలు అన్నట్టుగా బ్యాట్‌ను ప్రేక్షకులు, కెమెరా వైపు చూపిస్తూ బయటకు వస్తుండగా.. సహచరులంతా బౌండరీ రోప్‌ వద్ద నిల్చొని గౌరవ స్వాగతం పలికారు. మరోవైపు, ఈ మ్యాచ్‌కు ముందే రిటైర్మెంట్‌ ప్రకటించిన బ్రావోకు మ్యాచ్‌ అనంతరం ఆసీస్‌  ఆటగాళ్లు గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ ఇచ్చారు. 
చదవండి: భారత టీ20 కెప్టెన్‌గా ఆ ఫాస్ట్‌ బౌలర్‌ను ఎంపిక చేయండి...

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement