
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్(పాత ఫొటో)
టీమిండియాతో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత భారత పర్యటనలో బిజీ కానున్న 15 మంది సభ్యుల పేర్లు వెల్లడించింది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు మాథ్యూ వేడ్‌ను కెప్టెన్‌గా నియమించింది.
ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది. టీమిండియాతో పోటీ పడనున్న జట్టులో ప్రపంచకప్-2023 ఆడుతున్న డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్ సహా ట్రవిస్ హెడ్ తదితరులకు చోటు దక్కింది. ఇక గాయం కారణంగా అష్టన్ అగర్ ఈ సిరీస్‌కు దూరం కానున్నాడు.
అదే విధంగా.. మల్లీ ఫార్మాట్ ఆల్‌రౌండర్లు అయిన కామెరాన్ గ్రీన్, మిచెల్ మార్ష్‌లకు విశ్రాంతినిచ్చినట్లు ఆసీస్ బోర్డు తెలిపింది. ఫాస్ట్‌బౌలర్లు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ కూడా గ్రీన్, మార్ష్‌తో పాటే స్వదేశానికి తిరిగి రానున్నట్లు పేర్కొంది.
వీరంతా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాకు పయనం కానున్నారని తెలియజేసింది. కాగా నవంబరు 23 నుంచి భారత్- ఆస్ట్రేలియా మధ్య వైజాగ్‌లో టీ20 సిరీస్ ఆరంభం కానుంది. హైదరాబాద్‌లో డిసెంబరు 3 నాటి మ్యాచ్‌తో ఈ సిరీస్ ముగుస్తుంది.
టీమిండియాతో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు:
మాథ్యూ వేడ్ (కెప్టెన్), జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, తన్వీర్ సంగా, మ్యాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడం జంపా.
SQUAD! There's more cricket to come in India next month, with Matthew Wade set to lead this talented bunch in five T20I's against India #INDvAUS pic.twitter.com/Mqc8cLe5Ur
— Cricket Australia (@CricketAus) October 28, 2023
Comments
Please login to add a commentAdd a comment