సీఎస్‌ఎ అవార్డుల్లో డికాక్‌కు అవార్డుల పంట
జోహన్నస్‌బర్గ్: దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ క్రికెట్ సౌతాఫ్రికా ఏటా ప్రదానం చేసే సీఎస్‌ఏ అవార్డుల్లో ఐదు అవార్డులను కైవసం చేసుకున్నాడు. 2017 ఏడాదికిగానూ ఉత్తమ దక్షిణాఫ్రికా క్రికెటర్ అవార్డుతో పాటు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, పబ్లిక్ ఓటింగ్ అవార్డును కూడా కైవసం చేసుకోవడం విశేషం.
గాలాలో జరిగన అవార్డుల కార్యక్రమంలో డికాక్ ఈ అవార్డులను అందుకున్నారు. ఈ ఐదు అవార్డులతో పాటు ఐసీసీ వన్డే క్రికెటర్ అవార్డును కూడా సాధించాడు. ఇదిలా ఉండగా ఉత్తమ టీ–20 క్రికెటర్ అవార్డును వరుసగా రెండో ఏడాది కూడా ఇమ్రాన్ తాహిర్ ఎగరేసుకెళ్లాడు.