దక్షిణాఫ్రికా రెండో గెలుపు | De Kock steers South Africa to 2-0 lead in Sri Lanka | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా రెండో గెలుపు

Published Thu, Aug 2 2018 12:54 AM | Last Updated on Thu, Aug 2 2018 12:54 AM

 De Kock steers South Africa to 2-0 lead in Sri Lanka - Sakshi

దంబుల్లా: బౌలర్ల పట్టుదలకు తోడు బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించడంతో శ్రీలంకతో బుధవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2–0తో ఆధిక్యం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన లంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 244 పరుగులు చేసింది.

కెప్టెన్‌ మాథ్యూస్‌ (79 నాటౌట్‌; 6 ఫోర్లు), డిక్‌వెలా (69; 10 ఫోర్లు) రాణించారు. సఫారీ బౌలర్లలో ఇన్‌గిడి, ఫెలుక్వాయో మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం సఫారీ జట్టు 42.5 ఓవర్లలో 6 వికెట్లకు 246 పరుగులు చేసి గెలుపొందింది. డికాక్‌ (78 బంతుల్లో 87; 13 ఫోర్లు, 1 సిక్స్‌), ఆమ్లా (43; 6 ఫోర్లు), కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (49; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఆదివారం జరుగనుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement