డికాక్ అవుట్..శామ్యూల్స్ ఇన్
డికాక్ అవుట్..శామ్యూల్స్ ఇన్
Published Thu, Apr 27 2017 4:50 PM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు వెస్టీండిస్ ఆల్‌రౌండర్ మార్లన్ శామ్యూల్స్‌ను ఎంపిక చేసింది. జట్టులోని ప్రధాన ఆటగాడు సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ గాయంతో ఈ సీజన్ కు దూరమయ్యాడు. ఇతని స్థానంలో శ్యాముల్స్ ను ఎంపిక చేసినట్లు ఆ జట్టు ప్రకటించింది. డికాక్ ఇప్పటి వరకు ఢిల్లీ ఆడిన మ్యాచ్‌లకు అందుబాటులో లేడు.
అయితే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో వెస్టీండిస్ గెలుపుకు కీలక పాత్ర పోషించిన శ్యాముల్స్‌ను ఐపీఎల్-10 సీజన్ వేలంలో ఏ జట్టు తీసుకోలేదు. దీంతో 7 వ స్థానంలో దాటిగా ఆడే ఆల్ రౌండర్ లేక సతమతమవుతున్నఢిల్లీ శ్యామ్యూల్స్‌ను ఎంపిక చేసింది. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలవాలని ఢిల్లీ భావిస్తుంది. ఇప్పటికీ 6 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ రెండు నెగ్గి, నాలుగు మ్యాచుల్లో ఓడింది.
Advertisement
Advertisement