మలింగ ఖాతాలో అరుదైన ఫీట్‌ | mumbai indians player Lasith Malinga into 150 wickets club | Sakshi
Sakshi News home page

మలింగ ఖాతాలో అరుదైన ఫీట్‌

Published Sun, May 7 2017 11:39 AM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM

మలింగ ఖాతాలో అరుదైన ఫీట్‌

మలింగ ఖాతాలో అరుదైన ఫీట్‌

న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌ అన్ని సీజన్లలో కలిసి 150 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌ 10లో భాగంగా నిన్న (శనివారం) ఢిల్లీ సొంతగడ్డ ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో మలింగ ఈ ఘనత సాధించాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన మలింగ.. ఆ ఓవర్లో ఐదో బంతికి ఢిల్లీ బ్యాట్స్‌ మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(3)ను ఔట​ చేయడంతో ఈ ఫీట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు మలింగ.

మలింగ బంతిని అయ్యర్‌ షాట్‌ కొట్టగా ముంబై ప్లేయర్‌ హర్బజన్‌ క్యాచ్‌ పట్టడంతో ముంబై క్రికెటర్‌ కళ్లల్లో చెప్పలేనంత సంబరం మొదలైంది. ఆ తర్వాత కోరే అండర్సన్‌ ను ఔట్‌ చేసి మరో వికెట్‌ తీశాడు. ఐపీఎల్‌ లో ఓవరాల్‌ గా 105 మ్యాచ్‌ లాడిన మలింగ ఉత్తమ ప్రదర్శన 5/13గా ఉంది. వంద వికెట్లకు పైగా తీసిన బౌలర్లలో 18.47 సగటుతో అందరికంటే ముందున్నాడు.

ఢిల్లీతో మ్యాచ్‌ లో కరణ్‌ శర్మ, హర్భజన్‌లు మూడేసి వికెట్లు తీయగా, మలింగ రెండు వికెట్లతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 66 పరుగులకే చాపచుట్టేసి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ముంబై ఇండియన్స్‌ 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement