ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఆదివారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఆదిలోనే విష్ణు వినోద్(3) వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలో క్రిస్ గేల్- విరాట్ కోహ్లిలు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు.
గేల్ (48;38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో హాఫ్ సెంచరీ మిస్సవ్వగా, విరాట్ కోహ్లి(58;45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ జోడి 66 పరుగుల్ని జత చేసి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. అయితే గేల్ అవుటైన స్వల్ప వ్యవధిలో ట్రావిస్ హెడ్(2)తో పాటు కోహ్లి కూడా నిష్ర్కమించడంతో బెంగళూరు తడబడింది. ఇక చివర్లో పవన్ నేగీ(13 నాటౌట్;5 బంతుల్లో 3 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.ఢిల్లీ బౌలర్లలో కమిన్స్ రెండు వికెట్లు సాధించగా, జహీర్ ఖాన్, నదీమ్ లు తలో వికెట్ తీశారు.