ఢిల్లీ: స్టార్ ఆటగాళ్లు ఉండి కూడా ఈ ఐపీఎల్‌లో తీవ్రంగా నిరాశపరుస్తున్న జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లు ఆడి మూడు విజయాల్ని మాత్రమే సాధించిన ఆర్సీబీ.. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఆ జట్టు ఇక నుంచి ఆడే ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించాల్సి ఉంది. శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీకి విజయం అత్యంత ముఖ్యం. ఒకవేళ ఆర్సీబీ ఓడితే మాత్రం ఇక ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా రేసు నుంచి నిష్ర్రమించాల్సి ఉంటుంది. దాంతో కోహ్లి అండ్ గ్యాంగ్.. విజయంపై కన్నేసింది. ఇప్పటికే ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్లే ఆఫ్‌కు వెళ్లే దారులు మూసుకుపోయాయి. దాంతో ఆర్సీబీతో మ్యాచ్ ఢిల్లీకి నామమాత్రమే.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన కోహ్లి ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ క్రమంలో ఢిల్లీపై ఆర‍్సీబీ మరోసారి పైచేయి సాధిస్తుందా అనేది ఆసక్తికరం.
తుదిజట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్
విరాట్ కోహ్లి(కెప్టెన్), పార్థీవ్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, ఏబీ డివీలియర్స్, మన్‌దీప్ సింగ్, గ్రాంగ్ హోమ్, మొయిన్ అలీ, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్
ఢిల్లీ డేర్‌డెవిల్స్ తుదిజట్టు
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీషా, జాసన్ రాయ్, రిషభ్ పంత్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, అమిత్ మిశ్రా, సందీప్ లామిచానే, హర్షల్ పటేల్, ట్రెంట్ బౌల్ట్, జూనియర్ డాలా
Comments
Please login to add a commentAdd a comment