టాలీవుడ్ హీరోయిన్‪‌గా టీమిండియా క్రికెటర్ భార్య! | Cricketer Chahal Wife Dhanashree Verma Set To Debut In Tollywood, More Details Inside | Sakshi
Sakshi News home page

Dhanashree Verma: ప్రముఖ నిర్మాత కొత్త సినిమాలో చాహల్ భార్య!

Published Sat, Nov 23 2024 8:29 AM | Last Updated on Sat, Nov 23 2024 9:12 AM

Cricketer Chahal Wife Dhanashree Verma Telugu Movie

టీమిండియా స్పిన్నర్ చాహల్ గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన బౌలింగ్, ఫన్ మూమెంట్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. అటు ఐపీఎల్‌లోనూ చాలామంది స్టార్ క్రికెటర్లతో ఇతడికి మంచి బాండింగ్ ఉంది. కొన్నేళ్ల క్రితం ధనశ్రీ వర్మ అనే యూట్యూబర్‌ని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈమెనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా మారబోతుందని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‍‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?)

స్వతహాగా డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మ.. పలు ఆల్బమ్ సాంగ్స్‌తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్‌లోనూ ఈమెకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈమె తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీస్తున్న ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్.. హీరోగా పరిచయమవుతున్నాడు.

చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైంది. డ్యాన్స్ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా డ్యాన్స్ కచ్చితంగా రావాల్సిన హీరోయిన్ పాత్ర ఉంది. దాని కోసమే ధనశ్రీని అడగ్గా.. ఆమె ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. ఈమెకు సంబంధించిన షూటింగ్ కూడా కొంతమేర జరిగినట్లు సమాచారం. ఏదేమైనా టీమిండియా క్రికెటర్ భార్య.. టాలీవుడ్‌లో హీరోయిన్ అంటే వినడానికే ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా!

(ఇదీ చదవండి: మా నాన్నపై అసత్య ప్రచారం చేయొద్దు: ఏఆర్‌ రెహమాన్‌ కొడుకు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement