నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‍‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే? | Bigg Boss 8 Telugu Soniya Akula Engagement With Yashveer, Photo Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Soniya Akula Engagement: సైలెంట్‌గా సోనియా ఎంగేజ్‌మెంట్.. ఫొటో వైరల్

Nov 23 2024 7:17 AM | Updated on Nov 23 2024 5:05 PM

Bigg Boss 8 Telugu Soniya Akula Engagement

బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లకంటే నెగిటివ్ అయిన వాళ్లే ఎక్కువ. అలా ప్రస్తుత సీజన్‌లో పాల్గొని ఎలిమినేట్ అయిన బ్యూటీ సోనియా ఆకుల. ఇప్పుడు ఈమె తన ప్రియుడు యష్ పాల్‌తో నిశ్చితార్థం చేసుకుంది. పెద్దగా హడావుడి లేకుండా గురువారం ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)

మంథనికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అలా బిగ్‌బాస్ 8వ సీజన్ అంటే ఈసారి ఓ కంటెస్టెంట్‌గా హౌసులోకి వచ్చింది. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ నిఖిల్-పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ ఈమెపై విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో ఎలిమినేట్ అయిపోయింది.

బయటకొచ్చిన తర్వాత నిఖిల్ నిజ స్వరూపం తెలుసుకుని పలు ఇంటర్వ్యూలో అతడిని కడిగిపారేసింది. బిగ్‌బాస్ లోనే తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. అతడికి ఆల్రెడీ పెళ్లి అయిందని, కాకపోతే తన భార్యకు విడాకులు ఇచ్చేశాడని.. త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. ఇప్పుడు నవంబర్ 21న నిశ్చితార్థం చేసుకుంది. డిసెంబరు రెండో వారంలో పెళ్లి జరిగే అవకాశముంది.

(ఇదీ చదవండి: 'జీబ్రా' సినిమా రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement