మా నాన్నపై అసత్య ప్రచారం చేయొద్దు: ఏఆర్‌ రెహమాన్‌ తనయుడు అమీన్‌ | AR Rahman son Ameen defends his father against rumors | Sakshi
Sakshi News home page

మా నాన్నపై అసత్య ప్రచారం చేయొద్దు: ఏఆర్‌ రెహమాన్‌ తనయుడు అమీన్‌

Nov 23 2024 3:44 AM | Updated on Nov 23 2024 3:44 AM

AR Rahman son Ameen defends his father against rumors

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్, ఆయన సతీమణి సైరా భాను పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వారి ప్రకటన అనంతరం వస్తున్న వార్తలపై వారి తనయుడు అమీన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘మా నాన్న ఓ లెజెండ్‌. ఎన్నో ఏళ్ల నుంచి వృత్తిపరంగా అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో పాటు ఎంతోమంది ప్రేమాభిమానాలను పొందారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా వదంతులు వ్యాప్తి చెందడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక వ్యక్తి జీవితం, వారసత్వం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి.

దయచేసి మా నాన్నపై అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయడం ఆపండి. ఆయన్ని, ఆయన వృత్తిని గౌరవిద్దాం. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి’’ అని రాసుకొచ్చారు. ఏఆర్‌ రెహమాన్‌ కుమార్తె రహీమా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశాన్ని పంచుకున్నారు. ‘‘మనల్ని ద్వేషించే వాళ్లే వదంతులు సృష్టిస్తారు. తెలివితక్కువ వాళ్లు వాటిని వ్యాప్తి చేస్తారు. పనికి రానివాళ్లు వాటిని అంగీకరిస్తారు. దీన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి’’ అంటూ పోస్ట్‌ చేశారామె.

ఇక ఈ నెల 19న ఏఆర్‌ రెహమాన్, సైరాల విడాకుల ప్రకటన వచ్చిన అనంతరం రెహమాన్‌ బృందంలోని మోహినీ దే అనే అమ్మాయి కూడా తన భర్త, తాను విడిపోతున్నట్లు ప్రకటించారు. దాంతో రెహమాన్, మోహినీ ఒకేసారి విడాకుల గురించి ప్రస్తావించడం వెనక ఏదో కారణం ఉందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఉద్దేశించే అమీన్, రహీమా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఇలా స్పందించి ఉంటారని ఊహించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement