Ameen
-
Ameen Sayani: పాటల పూలమాలి వెళ్లిపోయాడు..!
‘బెహనో.. ఔర్ భాయియో..’ ఈ గొంతుతో ప్రేమలో పడని రేడియో శ్రోత ఉండేవాడు కాదు. ‘బినాకా గీత్మాల’ టాప్ 13లో ఏ పాట నిలుస్తుందో చూద్దామని వారమంతా ఎదురుచూపులు. నవ్వుతూ నవ్విస్తూ గుంజిపారేసే ఆకర్షణీయమైన గొంతుతో దశాబ్దాల పాటు పాటలను పంచిన రేడియో ప్రెజెంటర్ అమిన్ సయానీ తన 91వ ఏట బుధవారం వీడ్కోలు తీసుకున్నాడు. ఇకపై భారతీయ సాంస్కృతిక ఆనవాలై అతను వెలగనున్నాడు. పాటలు విరబూస్తాయి. అదిగో అల్లంత దూరాన ఒక చామంతి పూస్తుంది. ముళ్లను వెనక్కు నెడుతూ ఒక రోజా మెడ నిక్కి చూస్తుంది. గుబురు చాటున మల్లెమొగ్గ ఒకటి సిగ్గుతో మొహం దాచుకుంటుంది. గరిక పచ్చతావులో గడ్డిపూవు వర్ణనకు అందని రంగుతో కాంతిలీనుతుంది. వాటి మానాన అవి ఉన్నప్పుడు మన చూపు పడకపోవచ్చు. పడినా వాటి సౌందర్యమేమిటో తెలియకపోవచ్చు. అప్పుడొక పూలమాలి వస్తాడు. ఒక పువ్వు సువాసన ఎంత ప్రత్యేకమైనదో చెబుతాడు. మరో పూలరెక్క వయ్యారాన్ని చూపి విస్మయపడతాడు. ఒక పువ్వును నాసిక దగ్గర చేర్చడమే భాగ్యమంటాడు. ఒక పువ్వునలా కొమ్మకు వదిలిపెట్టమని మారాము చేస్తాడు. అప్పుడా పూల మీద మనకు ప్రేమ కలుగుతుంది. మనమూ వాటికి మాలిగా మారాలనుకుంటాము. గుండెకు దగ్గరగా చేర్చుకుంటాము. హృదయంతో వాటి పోషణకు పూనుకుంటాము. అమిన్ సయానీ చేసింది అదే.. రేడియో సిలోన్లో హిందీ సినిమా పాటలను శ్రోతలకు చేర్చడం. వాటిపై ప్రేమను పంచడం. వాటిని పాడుకుంటూ, కూనిరాగాలు తీస్తూ, ఆ మనోహర మాయలో చిక్కుకుంటూ జనం తమ బతుకు బాదరబందీని కాసేపు మరచిపోయేలా చేయడం. 1952 డిసెంబర్లో మొదటి షోగా మొదలైన ‘బినాకా గీత్మాల’ బినాకా టూత్‌పేస్ట్ వారి స్పాన్సర్డ్ప్రోగ్రామ్. ప్రతి బుధవారం సాయంత్రం రేడియో సిలోన్లో ప్రసారమయ్యేది. టాప్ 13తో మొదలయ్యి టాప్ 1 వరకూ కౌంట్‌డౌన్‌గా పాటలు ప్రసారమయ్యే ఆ షో చివరలో తర్వాతి వారం కోసం ‘లిస్ట్’ అయిన పాటలను చెప్పి వాటిని శ్రోతలు ఏ వరుసలో మెచ్చుతారో రాసి పంపమనేవారు. టాప్ వన్‌గా నిలిచే పాటను ఎక్కువమంది దేనిని ఎంపిక చేస్తారో దానికి ఆ ర్యాంక్ ఇచ్చేవారు. టాప్ 1ను సూచించిన వారి పేర్ల నుంచి జాక్‌పాట్ తీసి ఒక శ్రోతకు 100 రూపాయల బహుమతి ఇచ్చేవారు. అమిన్ సయాని మొదటి షో చేసేసరికి ఎంత హిట్ అయ్యిందంటే మరుసటి వారానికి 9 వేల ఉత్తరాలు స్పందనగా అందాయి. సంవత్సరం గడిచే సరికి వారం వారం వచ్చే ఉత్తరాల సంఖ్య 65 వేలకు చేరుకుంది. పోస్టాఫీసు వాళ్లు, రేడియో స్టేషన్ వారూ పిచ్చెత్తి పోయేవారు. తర్వాత ఈ రెస్పాన్స్ తంతును ఆపేసి సయానీ ఎంపిక మీద, రికార్డుల అమ్మకాలను బట్టి టాప్ 1ను డిసైడ్ చేసేవారు. ఏ జందగీ ఉసీకి హై.. అమిన్ సయానీ చేసిన బినాకా గీత్ మాలాలో ఏ వారం ఏ సింగర్ పాడిన పాట టాప్ సాంగ్‌గా నిలుస్తుందో తెలుసుకోవడం శ్రోతలకే కాదు సినీ రంగ దిగ్గజాలకు కూడా పెద్ద ఆసక్తిగా ఉండేది. బినాకా చార్ట్‌లో చోటు చేసుకోవడం గౌరవంగా భావించేవారు. ఇక కొన్ని పాటలైతే వారాల తరబడి టాప్ 1గా నిలిచి ఆ గాయకులకు, సంగీత దర్శకులకు క్రేజ్‌ను సంపాదించి పెట్టేవి. సంవత్సరం చివరలో అమిన్ సయానీ ‘సాంగ్ ఆఫ్ ద ఇయర్’ అంటూ ఒక పాటను ప్రకటించేవాడు. ఆ రోజుల్లో ‘ఏ జందగీ ఉసీకి హై’ (అనార్కలీ– 1953), ‘జాయెతో జాయె కహా’ (టాక్సీ డ్రైవర్ – 1954), ‘మేరా జూతా హై జపానీ’ (ఆవారా – 1955), ‘ఏ దిల్ ముష్కిల్ జీనా యహా’ (సి.ఐ.డి – 1956)... ఇలా పాటలు శ్రోతల మెచ్చుకోలుతో వెలిగేవి. బినాకా గీత్మాలాలో ఎక్కువసార్లు టాప్ ΄÷జిషన్‌లో నిల్చున్న గాయని లతా. ఆ తర్వాత రఫీ. ఆ మృదుత్వం.. ఆ దగ్గరితనం.. అమిన్ సయానీ గొంతు, వాడే సులభమైన భాష, ఉచ్చారణ, మధ్య మధ్య జోకులు, కొన్ని ఆసక్తికరమైన కథనాలు ఇవన్నీ కలిసి షోను విపరీతంగా హిట్ చేశాయి. అమిన్ రేడియో అనౌన్సర్లకు మార్గదర్శి అయ్యాడు. ‘గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో’ అనిపించుకున్నాడు. జీవితాంతం ఫ్రీలాన్సర్‌గానే అమిన్ రేడియో సిలోన్లో, వివి«ద్ భారతిలో షోస్ చేశాడు. అలాగే ఎన్నో అడ్వర్టైజ్మెంట్లలో ఆయన గొంతు వినిపించేది. సినిమా వాళ్ల అవార్డు ఫంక్షన్లలో, మ్యూజిక్ ప్రోగ్రాముల్లో అమినే యాంకర్. అంటే ఇవాళ దేశంలో ఉన్న పాపులర్ అనౌన్సర్లకు, యాంకర్లకు సయానీ సిలబస్ సెట్ చేసి వదిలాడు. ‘సినిమా పాటలే మన దేశంలో సగటు ప్రజలందరినీ కలిపి ఉంచాయి’ అంటాడు అమిన్ సయానీ. బొంబాయిలో పుట్టి పెరిగి ముంబైలోనే తుదిశ్వాస వదిలిన అమిన్ సయాని ఆల్ ఇండియా రేడియో ఉజ్వల రోజులను, గోల్డెన్ ఎరా ఆఫ్ హిందీ మ్యూజిక్‌ను ప్రస్తావించినప్పుడల్లా తన ప్రియమైన గొంతుతో పునరుత్థానం చెందుతూనే ఉంటాడు. ఇకపై కూడా అందమైన పూలు ఎన్నో పూయవచ్చు. కాని వాటిని ఊరికూరికే చూస్తూ పదేపదే సంబరపడిపోయే ఒక మాలి మరి ఉండడు. అదంతా గతం. సుందరమైన గతం. ఎంతో శ్రావ్యంగా పదిలపరుచుకునే గతం. అది సినీ సంగీతాన్ని ఇష్టపడే వారి సొంతమైన జ్ఞాపకం. ఇవి చదవండి: Karishma Mehta: కథలు మార్చగలవు -
బినాకా గీత్‌మాలా అమీన్ సయానీ ఇకలేరు
ముంబై: నాలుగు దశాబ్దాలకుపైగా కోట్లాది మంది భారతీయ రేడియో శ్రోతలను తన గాత్రంతో కట్టిపడేసిన దిగ్గజ అనౌన్సర్ అమీన్ సయానీ ఇక లేరు. 91 ఏళ్ల సయానీ ముంబైలో మంగళవారం సాయంత్రం గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు రాజిల్ చెప్పారు. ‘‘సాయంత్రం ఆరింటపుడు గుండెపోటు రాగానే హుటాహుటిన హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రికి తరలించాం. ఎంతగా ప్రయతి్నంచినా వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు’’ అని కుమారుడు రాజిల్ వెల్లడించారు. బినాకా గీత్మాలాతో దేశవ్యాప్తంగా ఖ్యాతి ‘నమస్తే బెహ్నో ఔర్ భాయియో, మై ఆప్కా దోస్త్ అమీన్ సయానీ బోల్ రహా హూ’’ అంటూ మొదలయ్యే ఆయన గాత్రఝరికి మంత్రముగ్ధు్దలు కానివారే లేరు. రేడియో సిలోన్లో 1950వ దశకం ఆయనకు స్వర్ణయుగం. 1952 డిసెంబర్లో మొదలైన ‘బినాకా గీత్‌మాలా’ కార్యక్రమాన్ని అద్భుతమైన తన గాత్రంతో కోట్లాది మంది శ్రోతలకు ఫేవరెట్ ప్రోగ్రామ్‌గా మార్చేశారు. అలనాటి మేటి హిందీ సినిమా పాటలను పరిచయం, ప్రసారంచేస్తూ సాగే ఈ కార్యక్రమం 1952 నుంచి 1988దాకా నిరాటంకంగా ప్రతి బుధవారం ప్రసారమయ్యేది. 1988లో బినాకా గీత్మాలాను ఆలిండియా రేడియో వారి వివిధ్ భారతిలోకి మార్చారు. 1994దాకా ఆ కార్యక్రమం అత్యంత ప్రజాదరణ పొందిన పోగ్రామ్‌గా కీర్తి గడించిందంటే దానికి కారణం సయానీయే. అత్యంత ఎక్కువకాలం నడిచిన కార్యక్రమంగానూ అది రికార్డు సృష్టించింది. ప్రసారమయ్యే పాటల్లోని విశిష్టతను తనదైన విశ్లేషణతో చెబుతూ శ్రోతలను ఆకట్టుకుంటూ ‘రేడియో మ్యా్రస్టో’గా ప్రసిద్ధికెక్కారు. 50,000 ప్రోగ్రామ్‌లు, 19వేలకుపైగా జింగిల్స్ 1932 డిసెంబర్ 21వ తేదీన ముంబైలో ‘బహుభాషా’ కుటుంబంలో జన్మించిన సయానీ 13 ఏళ్ల వయసులోనే తల్లికి ‘రెహ్బార్’ పక్షపత్రికలో రచనలో సాయపడేవారు. ఆలిండియా రేడియో బాంబేలో చిన్నారుల కార్యక్రమంలో పాల్గొనేవారు. కెరీర్ మొదట్లో ఇంగ్లిష్ బ్రాడ్‌కాస్టర్‌గా పనిచేశారు. స్వాతంత్య్రం సిద్ధించాక హిందీలోకి మారారు. రేడియోలో ఏకంగా 50,000 ప్రోగ్రామ్‌లు, 19వేలకుపైగా జింగిల్స్ చేశారు. తన సోదరుడు హమీద్ మరణం తర్వాత ఆయన నుంచి బాధ్యతలు తీసుకుని ఎనిమిదేళ్లపాటు బోర్న్‌వీటా క్విజ్ పోటీని విజయవంతంగా నిర్వహించారు. సంగీత శిఖరాలు లతా మంగేష్కర్, కిశోర్ కుమార్‌లతో ఈయన చేసిన ఇంటర్వ్యూలు ఆనాడు అమిత ఆదరణ పొందాయి. సయానీ మరణంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీసహా పలు రంగాల ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. -
భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఏఆర్ రెహమాన్ కొడుకు
ప్రముఖ సంగీత దర్శకుడు,ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్‌కు భారీ ప్రమాదం తప్పింది. తమిళనాడులో జరిగిన ఓ ప్రమాదంలో అమీన్ తృటిలో తప్పించుకున్నాడు. అయితే ఘటన జరిగి మూడు రోజులైనా ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేపోతున్నట్లు ఆమీన్ తెలిపాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. ''నా టీంతో కలిసి ఓ మ్యూజిక్ వీడియో షూట్ చేస్తుండగా క్రేన్‌కు ఏర్పాటు చేసిన కొన్ని వస్తువులు.. భారీ లైట్లు కింద పడ్డాయి.ఈ ప్రమాదం జరిగిన సమయంలో నేను వాటికి కొద్ది దూరంలోనే ఉన్నాను. పైనుంచి కిందపడిన వాటిలో ఓ భారీ షాండిలియర్ కూడా ఉంది. ఏమాత్రం కాస్త అటుఇటు అయినా అవి మా తలపై పడేవి. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనతో మా టీం అంతా షాక్‌కి గురయ్యాం. ఇప్పటికీ దాన్నుంచి తేరుకోలేకపోతున్నా. ఆ భగవంతుడు, తల్లిదండ్రులు, అభిమానుల ఆశీర్వాదం వల్లే ఆరోజు నేను ప్రమాదం నుంచి బయటపడగలిగాను. లేదంటే చాలా ఘోరం జరిగి ఉండేది'' అంటూ ఘటనకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా షేర్చేశాడు అమీన్. View this post on Instagram A post shared by “A.R.Ameen” (@arrameen) -
తనయుడితో ఏఆర్ రెహమాన్ స్టెప్స్!
తమిళసినిమా: నటులు తమ వారసులతో కలిసి ఆడి పాడటం కొత్తేమీ కాదు. అయితే ఓ దిగ్గజ సంగీత దర్శకుడు తన వారసుడితో కలిసి స్టెప్స్ వేయడమే విశేషం. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మమన్ తన తనయుడితో కలిసి ఒక ప్రమోషన్ సాంగ్‌లో స్టెప్స్ వేయడం ఇంకా విశేషం. ఈయన గతంలో విజయ్ హీరోగా నటించిన బిగిల్ చిత్రం ప్రమోషన్ కోసం సింగ పెన్నే అనే పాటలో నటించడంతో పాటు పలు ప్రైవేట్ ఆల్బంలలో నటించిన విషయం తెలిసిందే. అంతే కాదు సంగీత దర్శకుడు, గీత రచయిత అయిన ఈయన నిర్మాత కూడా. అంతేకాదు త్వరలో దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఈయన వారసుడు అమీన్ కూడా ఇప్పుడు సంగీత దర్శకుడిగా తండ్రి బాటలో పయనిస్తున్నాడు. ప్రస్తుతం ప్రైవేట్ ఆల్బంలకు సంగీతాన్ని అందిస్తున్న అమీన్ త్వరలోనే మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అవబోతున్నట్లు సమాచారం. ఇకపోతే సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్న ఏఆర్.రెహ్మమన్ ప్రస్తుతం తన తనయుడు అమీన్‌తో కలిసి ఒక ప్రమోషన్ సాంగ్‌లో నటించనున్నాడట. ఇందులో తనయుడితో కలిసి స్టెప్స్ వేసే పనిలో ఉన్నారని టాక్. నటుడు శింబు, గౌతమ్ కార్తీక్ కలిసి నటిస్తున్న చిత్రం పత్తు తల. చిల్లన్ను ఒరు కాదల్ చిత్రం ఫేమ్ కృష్ణ చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 30వ తేదీ విడుదలకు ముస్తాబవుతున్నట్లు సమాచారం. దీనికి ఏఆర్.రెహ్మమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రమోషన్ సాంగ్‌ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఏఆర్.రెహ్మమన్తో కలిసి ఆయన తనయుడు అమీన్ నటిస్తున్నారు. ఈ ప్రమోషన్ సాంగ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. -
రెహ్మాన్ కుమారుడు అదరగొట్టేశాడు
చెన్నై: తెలుగు సినిమాకోసం ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ కుమారుడు అమీన్ స్వరాన్నందించాడు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్న 'నిర్మలా కాన్వెంట్' సినిమా కోసం తొలిసారి తెలుగు గీతాన్ని ఆలపించాడు. ఈ పాట చాలా అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది. 'రోషన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం కోసం అమీన్ చాలా బాగా పాడాడు. రికార్డింగ్ చాలా అద్బుతంగా వచ్చింది. మా చిత్ర యూనిట్ అంతా ఇందుకు సంతోషంగా ఉన్నాం' అని చిత్ర వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓ కాదల్ కన్మణి(తెలుగులో ఓకే బంగారం) అనే తమిళ చిత్రం కోసం తొలిసారి అమీన్ పాడటం ప్రారంభించాడు. నిర్మలా కాన్వెంట్ సినిమాకు సినీ నటుడు నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ నిర్మాతలుగా ఉన్నారు. దూకుడు తదితర చిత్రాల్లో బాలనటిగా చేసిన శ్రేయాశర్మ ఇందులో నాయిక. నాగార్జున కూడా ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర చేయనున్నారు. -
జూనియర్ రెహ్మాన్ వస్తున్నాడు
పండిత పుత్ర పరమ శుంఠ అన్న ది నాటి నానుడి. పులి కడుపున పులే పుడుతుందన్నది నేటి నానుడిని నిజం చేస్తూ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్ వారసుడి సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఒక సారి రెండు ఆస్కార్ అవార్డులను గెలిచి భారత దేశ ప్రతిష్టను పెంచిన ఎఆర్ రెహ్మాన్ 11 ఏళ్ల కొడుకు అమీన్ బాల గాయకుడిగా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. విశేషం ఏమిటంటే ఏ.ఆర్.రెహ్మాన్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆయ న వారసుడిని గాయకుడిగా పరిచయం చేయనుండటం విశేషం. ఎస్ మణిరత్నం తాజా చిత్రంలో అమీన్ ఒక పాట పాడనున్నారట. ఈ విషయాన్ని ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏ.ఆర్.రెహ్మాన్ స్వయంగా వెల్లడించారు. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తండ్రి సంగీతంలో తనయుడు పాడనున్నారన్న మాట. నిజం చెప్పాలంటే రెహ్మాన్ కొడుకు అమీన్ ఇంతకు ముందే గాయకుడిగా పరిచయమయ్యారు. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం కపుల్స్ రీట్రీట్‌లో నాన్ నెంబర్ అనే పాటను పాడాడు. అదే విధంగా గత ఏడాది చెన్నైలో జరిగిన 10వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పియానో వాయించి ప్రశంసలందుకున్నాడు. మణిరత్నం ఇప్పుడు తన చిత్రం ద్వారా అమీన్‌ను గాయకుడిగా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేయనున్నారన్నమాట. అయితే అమీన్‌కు నటుడిగానూ పలు అవకాశాలొస్తున్నాయట. ఈ విషయం గురించి రెహ్మాన్ తెలుపుతూ అమీర్‌ను నటింప చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారన్నారు.