![AR Rahman Dance With His Son AR Ameen for a Song - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/23/ar-rahman.jpg.webp?itok=bTr6dLk4)
తమిళసినిమా: నటులు తమ వారసులతో కలిసి ఆడి పాడటం కొత్తేమీ కాదు. అయితే ఓ దిగ్గజ సంగీత దర్శకుడు తన వారసుడితో కలిసి స్టెప్స్ వేయడమే విశేషం. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మమన్ తన తనయుడితో కలిసి ఒక ప్రమోషన్ సాంగ్‌లో స్టెప్స్ వేయడం ఇంకా విశేషం. ఈయన గతంలో విజయ్ హీరోగా నటించిన బిగిల్ చిత్రం ప్రమోషన్ కోసం సింగ పెన్నే అనే పాటలో నటించడంతో పాటు పలు ప్రైవేట్ ఆల్బంలలో నటించిన విషయం తెలిసిందే.
అంతే కాదు సంగీత దర్శకుడు, గీత రచయిత అయిన ఈయన నిర్మాత కూడా. అంతేకాదు త్వరలో దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఈయన వారసుడు అమీన్ కూడా ఇప్పుడు సంగీత దర్శకుడిగా తండ్రి బాటలో పయనిస్తున్నాడు. ప్రస్తుతం ప్రైవేట్ ఆల్బంలకు సంగీతాన్ని అందిస్తున్న అమీన్ త్వరలోనే మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అవబోతున్నట్లు సమాచారం. ఇకపోతే సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్న ఏఆర్.రెహ్మమన్ ప్రస్తుతం తన తనయుడు అమీన్‌తో కలిసి ఒక ప్రమోషన్ సాంగ్‌లో నటించనున్నాడట.
ఇందులో తనయుడితో కలిసి స్టెప్స్ వేసే పనిలో ఉన్నారని టాక్. నటుడు శింబు, గౌతమ్ కార్తీక్ కలిసి నటిస్తున్న చిత్రం పత్తు తల. చిల్లన్ను ఒరు కాదల్ చిత్రం ఫేమ్ కృష్ణ చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 30వ తేదీ విడుదలకు ముస్తాబవుతున్నట్లు సమాచారం. దీనికి ఏఆర్.రెహ్మమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రమోషన్ సాంగ్‌ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఏఆర్.రెహ్మమన్‌తో కలిసి ఆయన తనయుడు అమీన్ నటిస్తున్నారు. ఈ ప్రమోషన్ సాంగ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment