జూనియర్ రెహ్మాన్ వస్తున్నాడు
పండిత పుత్ర పరమ శుంఠ అన్న ది నాటి నానుడి. పులి కడుపున పులే పుడుతుందన్నది నేటి నానుడిని నిజం చేస్తూ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్ వారసుడి సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఒక సారి రెండు ఆస్కార్ అవార్డులను గెలిచి భారత దేశ ప్రతిష్టను పెంచిన ఎఆర్ రెహ్మాన్ 11 ఏళ్ల కొడుకు అమీన్ బాల గాయకుడిగా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. విశేషం ఏమిటంటే ఏ.ఆర్.రెహ్మాన్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆయ న వారసుడిని గాయకుడిగా పరిచయం చేయనుండటం విశేషం.
ఎస్ మణిరత్నం తాజా చిత్రంలో అమీన్ ఒక పాట పాడనున్నారట. ఈ విషయాన్ని ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏ.ఆర్.రెహ్మాన్ స్వయంగా వెల్లడించారు. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తండ్రి సంగీతంలో తనయుడు పాడనున్నారన్న మాట. నిజం చెప్పాలంటే రెహ్మాన్ కొడుకు అమీన్ ఇంతకు ముందే గాయకుడిగా పరిచయమయ్యారు.
రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం కపుల్స్ రీట్రీట్‌లో నాన్ నెంబర్ అనే పాటను పాడాడు. అదే విధంగా గత ఏడాది చెన్నైలో జరిగిన 10వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పియానో వాయించి ప్రశంసలందుకున్నాడు. మణిరత్నం ఇప్పుడు తన చిత్రం ద్వారా అమీన్‌ను గాయకుడిగా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేయనున్నారన్నమాట. అయితే అమీన్‌కు నటుడిగానూ పలు అవకాశాలొస్తున్నాయట. ఈ విషయం గురించి రెహ్మాన్ తెలుపుతూ అమీర్‌ను నటింప చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారన్నారు.