ఆసియా కప్-2023 కోసం సెలెక్టర్లు నిన్న (ఆగస్ట్ 21) 17 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో చోటు కోసం ధవన్, చహల్, శాంసన్, యశస్వి లాంటి ఆశావహులు ఎంతో ఆశగా ఎదురు చూసినప్పటికీ.. వీరికి నిరాశే మిగిలింది. గాయాల నుంచి కోలుకున్న సీనియర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లకు సెలెక్టర్లు పెద్దపీట వేశారు. ట్రావెలింగ్ రిజర్వ్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేసినప్పటికీ.. ఈ ఎంపిక నామమాత్రమే.
ఇదిలా ఉంటే, ఆసియా కప్ ఆశావహులతో రూపొందించబడిన ఓ నమూనా భారత జట్టు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ జట్టు ఆసియా కప్‌ను ఎంపిక చేసిన 17 మంది సభ్యుల భారత జట్టుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఈ జట్టుకు శిఖర్ ధవన్ కెప్టెన్‌గా ఉంటే.. చహల్, శాంసన్ లాంటి ఆసియా కప్ ఆశావహులు మిగతా సభ్యులుగా ఉన్నారు. ఈ జట్టుకు ఓపెనర్లుగా ధవన్, రుతురాజ్ ఉండగా.. వన్‌డౌన్‌లో యశస్వి జైస్వాల్, నాలుగో స్థానంలో సంజూ శాంసన్, ఆతర్వాత రింకూ సింగ్, శివమ్ దూబే, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, పేసర్ల కోటాలో దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ ఉన్నారు.
ఆసియా కప్ ఆశావహులతో రూపొందించబడిన ఈ జట్టును చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ధవన్ నేతృత్వంలోని ఈ జట్టు బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్‌లను సునాయాసంగా ఓడిస్తుందని, ఈ జట్టు టీమిండియాకు ఏమాత్రం తీసిపోదని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే, ఆసియా కప్‌కు ఎంపిక చేసిన భారత జట్టుతో పోలిస్తే ఈ జట్టు చాలా సమతూకంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఐసీసీ సభ్య దేశాలైన చాలా జట్లకంటే ఈ జట్టు మెరుగ్గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ జట్టు సోషల్‌మీడియాలో నెటిజన్లకు మాంచి టాపిక్‌గా మారింది.
ఆసియాకప్ భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ
ట్రావెలింగ్ రిజర్వ్: సంజూ శాంసన్
ఆసియా కప్ ఆశావహుల భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (వికెట్‌కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, దీపక్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్
Comments
Please login to add a commentAdd a comment