టీమిండియా యువ ఆటగాడు యజ్వేంద్ర చహల్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటాడు. ఈ విషయం చహల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతి ఒక్క క్రీడాభిమానికి తెలుసు. ఎప్పుడు ఏదో ఆసక్తికర వీడియోలతోనో.. ఫోటోలతోనో ఆకట్టుకునే చహల్.. తాజాగా మరో టిక్‌టాక్ వీడియోతో దర్శనమిచ్చాడు. ఈ వీడియో చూశాక మాత్రం చహల్ టిక్‌టాక్ పిచ్చి ఏ రేంజ్‌లో ఉందో అర్థమైపోతుంది. న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా చహల్ తన సహచర ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, పేసర్ ఖలీల్ అహ్మద్ కలిసి చేసిన ఓ టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. చదవండి: అసూయ పడకు రోహిత్ భయ్యా: చహల్
కాగా ఆ వీడియోలో ఓ బాలీవుడ్ సినిమా సీన్‌ని రీ క్రేయేట్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేశాడు. ఇందులో చహల్ తన జాకెట్‌ను తికమక వేసుకొని కింద పడుకోగా రోహిత్, ఖలీల్ అతని స్నేహితుల్లా నటించారు. కానీ ఆ సీన్ క్రియేట్ చేయడంలో విఫలమైన స్టార్ క్రికెటర్లు కావాల్సినంత ఫన్ మాత్రం క్రియేట్ చేశారు. చహల్ అయితే తన తింగరి వేశాలతో కళ్లు తెరిచి సీన్‌ను చెడగొట్టడంతో ఖలీల్ ఈ లెగ్ స్పిన్నర్‌ను ఒక తన్ను తన్నాడు. ప్రస్తుతం ఈ వీడియోను చహల్ 'వీ ఆర్ బ్యాక్' అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: ఆ మిస్టరీ క్రికెటర్ ఎవరు?
We are back 😂😂 @ImRo45 @imK_Ahmed13 pic.twitter.com/THo3qiD7Qt
— Yuzvendra Chahal (@yuzi_chahal) February 25, 2020
Comments
Please login to add a commentAdd a comment