ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ "పుష్ప" కేవలం సినిమా ప్రపంచాన్నే కాకుండా యావత్ జగత్తును ఉర్రూతలూగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మూవీ విడుదలై నెలలు గడుస్తున్నా దీనికున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా పుష్ప మత్తులోనే ఉన్నారు. టీమిండియా క్రికెటర్లనైతే పుష్ప ఫోబియా వదలనంటుంది. ముఖ్యంగా ఇందులోనే 'తగ్గేదేలే' డైలాగ్‌ను భారత క్రికెటర్లు ఇంకా జపిస్తూనే ఉన్నారు.
తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సహచర క్రికెటర్లైన నవ్‌దీప్ సైనీ, హర్‌ప్రీత్ బ్రార్‌తో కలిసి బస్సుల్లో ప్రయాణిస్తూ తగ్గేదేలా హిందీ డైలాగ్‌కు రీల్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. తగ్గేదేలే డైలాగ్‌కు క్రికెటర్ల హావభావాలు అభిమానలును తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను చహల్ ఇన్‌స్టా పోస్ట్ చేయగా లైక్‌లు , కామెంట్ల వర్షం కురుస్తుంది. శ్రీలంకతో సిరీస్‌లోనూ ఏ మత్రం తగ్గొద్దంటూ అభిమానులు కామెంట్ల ద్వారా క్రికెటర్లను ఎంకరేజ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, లంకతో టీ20 సిరీస్ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. లక్నో వేదికగా తొలి టీ20, ఫిబ్రవరి 26, 27 తేదీల్లో ధర్మశాల వేదికగా రెండు, మూడు టీ20లు జరగనున్నాయి. అనంతరం మార్చి 4-8 వరకు మొహాలీలో తొలి టెస్టు, మార్చి 12-16 వరకు బెంగళూరు వేదికగా రెండో టెస్టు(డే అండ్ నైట్) జరగనుంది.
చదవండి: Ind Vs SL: జట్టులోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది: టీమిండియా ఆల్‌రౌండర్
Comments
Please login to add a commentAdd a comment