శశికళకు ప్రత్యేక వంటగది! | Special kitchen for sasikala | Sakshi
Sakshi News home page

శశికళకు ప్రత్యేక వంటగది!

Published Thu, Jul 13 2017 1:27 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

శశికళకు ప్రత్యేక వంటగది!

శశికళకు ప్రత్యేక వంటగది!

సాక్షి, బెంగళూరు: అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక వంటగది వసతి కల్పించారా? ఇంకా అక్కడ అనేక అక్రమాలు జరుగుతున్నాయా? కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూప ఆ శాఖ డీజీపీ సత్యనారాయణకు జైలులోని అక్రమాలపై లేఖ రాయడంతో ఈ విషయాలు వెలుగు చూశాయి.

ఆరుపేజీలతో కూడిన ఈ లేఖ జైళ్లశాఖలో కలకలం రేపుతోంది. శశికళకేగాక పలువురు ఖైదీలకూ ఇదే విధమైన వసతి లభిస్తోందని రూప తన లేఖలో తెలిపారు. శశికళకు జైల్లో అక్రమంగా సౌకర్యాలు కల్పించినందుకు ఒక జైళ్లశాఖ ఉన్నతాధికారికి రూ.2 కోట్ల ముడుపులు దక్కినట్లు తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement