బలనిరూపణకు లేదా ప్రభుత్వ ఏర్పాటుకు తమిళనాడు ఇన్‌చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఎవర్ని ఆహ్వానిస్తారోనన్న ఉత్కంఠ తమిళనాట బయలుదేరింది. ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంను ఆహ్వానిస్తారా? అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కె.పళనిస్వామిని ఆహ్వానిస్తారా? అన్న విషయమై విస్తృతచర్చ జరుగుతోంది.