సాక్షి ప్రతినిధి, చెన్నై: పది బోగస్ సంస్థల ద్వారా అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ, ఆమె వదిన ఇళవరసి కోట్ల రూపాయల మోసాలకు పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది. త్వరలో వారిద్దరిపై అధికారులు మరో కేసు నమోదు చేయనున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మూతపడ్డ బోగస్ సంస్థల్లో శశికళ, ఇళవరసి, వారి బంధువులకు చెందిన పది కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కంపెనీల్లో రూ. 1,012 కోట్ల అవకతవకలు సాగినట్లుగా చెన్నై ఐటీ అధికారులు గుర్తించారు. బోగస్ సంస్థలకు ఇళవరసి కుమారుడు వివేక్, కుమార్తెలు కృష్ణప్రియ, షకీల, మిత్రులు బినామీలుగా ఉన్నారు. బోగస్ కంపెనీల్లో పేర్కొన్న చిరునామాల్లో ఆయా సంస్థలు కాకుండా ఇళ్లు, ఒకే చిరునామాతో అనేక సంస్థలు ఉన్నాయి. మరోవైపు, విదేశాల నుంచి వస్తువుల దిగుమతి పేరుతో ఆరు బోగస్ సంస్థల ద్వారా రూ.174 కోట్లు విదేశాలకు పంపినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment