ఎవరికీ మద్దతివ్వం: డీఎంకే | Stalin sayes DMK support no to any one | Sakshi
Sakshi News home page

ఎవరికీ మద్దతివ్వం: డీఎంకే

Published Wed, Feb 15 2017 4:08 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

ఎవరికీ మద్దతివ్వం: డీఎంకే - Sakshi

ఎవరికీ మద్దతివ్వం: డీఎంకే

సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రస్తుత రాజకీయ సంక్షోభ పరిస్థితుల్లో తాము ఎవరికీ మద్దతివ్వబోమని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకె స్టాలిన్‌ స్పష్టం చేశారు.రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌ మీద ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరో మారు న్యాయాన్ని నిలబెట్టిందని వ్యాఖ్యానించారు.

దివంగత సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ అవినీతి, దోపిడీకి తగ్గ తీర్పును కోర్టు ఇచ్చిందన్నారు. ఈ తీర్పుతో భవిష్యత్తులో అవినీతికి పాల్పడేందుకు  ఏ రాజకీయ నాయకుడూ సాహసించడని స్టాలిన్‌ పేర్కొన్నారు. అయితే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చట్టానికి అనుగుణంగా గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement