► రథం సిద్ధం
► రూట్ మ్యాప్ రూపకల్పన
► నేతలతో మాజీ సీఎం సమాలోచన
► అమ్మ జయంతికి శ్రీకారం
► ఆర్‌కేనగర్ నుంచి పయనం
అన్నాడీఎంకేను రక్షించుకోవడమే లక్ష్యంగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు మాజీ సీఎం పన్నీరు సెల్వం సిద్ధం అయా్యరు. ప్రచార రథం కూడా రెడీ కావడంతో ఇక , రూట్ మ్యాప్ రూపకల్పనలో పన్నీరు శిబిరం బిజీ అయింది. ముఖ్య నేతలతో పన్నీరు సెల్వం రాష్ట్ర పర్యటనపై సమాలోచించారు. అమ్మ జయలలిత జయంతికి ఆర్‌కే నగర్ నుంచి బయల్దేరడానికి శ్రీకారం చుట్టేందుకు తగ్గట్టుగా కార్యాచరణ సిద్ధం చేసినట్టు సమాచారం.
సాక్షి,చెన్నై: అన్నాడీఎంకేలో చిన్నమ్మ శశికళ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎం పన్నీరు సెల్వం తిరుగుబాటు బావు టా ఎగుర వేసిన విషయం తెలి సిందే. అధికార పగ్గాలు లక్ష్యంగా ఆయన చేసిన ప్రయత్నాలకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దిగి రాలేదు. మెజారిటీ శాతం మంది తన వెంట ఉంటారని భావించి, చివరకు పన్నెం డు మందితో సరు్దకోవాల్సిన పరిస్థితి. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలు చిన్నమ్మ శశికళ విధేయుడు పళనిస్వామిని ఆదరించడం పన్నీరుకు పెద్ద షాకే.
అసెంబ్లీలో పరాభావం ఎదురైనా, ప్రజా క్షేత్రంలో గెలుపు లక్ష్యంగా ముందుకు సాగేందుకు పన్నీరు సెల్వం సిద్ధం అయా్యరు. ఇప్పటికే ప్రజా మద్దతు, ద్వితీయ, తృతీయ శ్రేణి వర్గాల మద్దతు తనకు ఎకు్కవగా ఉండడంతో, రా ష్ట్ర పర్యటనతో చిన్నమ్మ రూపంలో అన్నాడీఎంకేకు ఎదురు కానున్న ముప్పును ప్రజలో్లకి, కేడర్‌లోకి తీసుకెళ్లేందుకు పన్నీరు సెల్వం ఉరకలు తీస్తున్నారు.ఇందు కోసం ప్రత్యేక ప్రచార రథం సిద్ధం కావడం విశేషం.
రథం సిద్ధం: హంగు ఆర్భాటాలు లేకుండా, ప్రజ ల్లో మమేకం అయ్యే విధంగా పన్నీరు తన పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీపు తరహా వాహనాన్ని ప్రచార రథంగా ఎంపిక చేశారు. ఇందులో కేవలం అమ్మ జయలలిత ఫొటో పెద్దదిగా కనిపించే విధంగా, ఎంజీఆర్ ఫొటో, రెండాకుల చిహ్నం మాత్రమే కనిపించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎక్కడా తన ఫొటో కూడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం పార్టీని రక్షించుకోవడం, కేడర్‌తో పాటుగా ప్రజా మద్దతును కూడగట్టుకోవడం లక్ష్యంగా ఈ పర్యటనకు పన్నీరు నిర్ణయించి ఉన్నారు.
నేతలతో సమాలోచన: గ్రీన్ వేస్ రోడు్డలోని నివాసంలో తన మద్దతు నేతలు మధుసూదనన్, మైత్రేయన్, కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్ తదితరులతో రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై పన్నీరు సెల్వం సోమవారం సమాలోచించారు. రూట్ మ్యాప్ రూపకల్పన మీద దృష్టి పెటా్టరు. ప్రధానంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పర్యటన సాగించేందుకు నిర్ణయించి ఉన్నారు. దివంగత సీఎం అమ్మ జయలలిత వరుసగా రెండు సార్లు విజయ కేతనం ఎగుర వేసిన ఆర్‌కే నగర్ నుంచి తన పర్యటనకు శ్రీకారం చుట్టే విధంగా కార్యచరణను సిద్ధం చేసినట్టు సమాచారం.
ఈ నెల 24వ తేదీన జయలలిత జయంతి కావడంతో ఆ రోజున సేవా కార్యక్రమాలతో, పర్యటనకు శ్రీకారం చుటా్టలన్న నిర్ణయానికి వచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, అధికారికంగా పర్యటన వివరాలు మంగళ లేదా బుధవారం ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు పన్నీరు శిబిరం వర్గాలు పేర్కొంటున్నాయి. పన్నీరు సెల్వంకు మద్దతుగా పలు చోట్ల నుంచి లేఖలను గ్రీన్వేస్ రోడు్డకు వెల్లువెతు్తతున్నాయి. ఇందులో అనేక మంది ఇక ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలని, అమ్మ ఆశయ సాధన లక్ష్యంగా ప్రజా మద్దతుతో పయనాన్ని వేగవంతం చేయాలని, ఎవ్వరికీ తల వంచ వద్దు అని, ధైర్యంగా సమాధానాలు ఇవ్వాలని, గంభీరంగా మా ట్లాడాలంటూ పలువురు పన్నీరుకు సూచిస్తుండ డం ఆహ్వానించ దగ్గ విషయం. పన్నీరుకు మద్దతుగా నిలిచిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పాండియరాజన్ ఆవడిలోని తన నియోజకవర్గంలో పర్యటించగా, ప్రజలు బ్రహ్మరథం పట్టి ఆహ్వానించడం విశేషం.
పార్టీని రక్షించుకుంటాం: పన్నీరు శిబిరంలో గత వారం చేరిన జయలలిత మేన కోడలు దీపా తన మద్దతుదారుల్ని ఉద్దేశించి టీ నగర్‌లోని ఇంటి వద్ద మాట్లాడారు. అన్నాడీఎంకేను రక్షించుకుంటామని, జయలలిత పేరుకు అపఖ్యాతి తెచ్చే విధం గా ఎమ్మెల్యేలు వ్యవహరించారని మండి పడ్డారు. అందరికీ గుణపాఠం చెప్పే రోజు త్వరలో రానున్నదని, మేనత్త జయంతి రోజున అన్ని వివరాలను ప్రకటిస్తానన్నారు.