panniruselvam
-
రూటు మార్చిన ఓపీఎస్
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే వ్యవహారంలో మాజీ సీఎం పన్నీరుసెల్వం రూటు మార్చారు. తమ పార్టీ జెండాను ఉపయోగించకూడదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వర్గం నుంచి హెచ్చరికలు రావడంతో జెండాకు కొత్త మెరుగులు దిద్దారు. ఆ పార్టీ జెండాలో రెండాకులను జోడించి ఉపయోగించేందుకు నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే వర్గాల అమ్మ జయలలిత మరణంతో పార్టీలో చీలిక ఏర్పడిన విషయం తెలిసిందే. టీటీవీ దినకరన్ నేతృత్వంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఆవిర్భవించింది. ఆ పార్టీ జెండా అన్నాడీఎంకే జెండాను పోలిన వర్ణంతో తీసు కొచ్చినా, జెండా మధ్యలో అన్నాదురై ఫొటోను తొలగించి జయలలిత ఫొటోను పొందు పరిచారు. తాజాగా పళనిస్వామి, పన్నీరుసెల్వం మధ్య వివాదాల నేపథ్యంలో మళ్లీ ఆ జెండా వివాదానికి దారి తీసింది. జెండాలో రెండాకులు.. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు, కోర్టు తీర్పులతో అన్నాడీఎంకే పళనిస్వామి గుప్పెట్లోకి చేరింది. దీంతో తమ పార్టీ పేరును, జెండాను ఉపయోగించకూడదని పన్నీరుసెల్వంకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఒక వేళ ఉపయోగించిన పక్షంలో చట్ట పరంగా చర్యలు తప్పవని పళనిస్వామి శిబిరం స్పష్టం చేసింది. అదే సమయంలో తిరుచ్చి వేదికగా ఈనెల 24న జరగనున్న పన్నీరు సెల్వం నేతృత్వంలోని మహానాడులో పార్టీ జెండా వినియోగం వివాదానికి దారి తీసే అవకాశాలు కనిపించాయి. దీనిని ముందుగానే పసిగట్టిన పన్నీరు శిబిరం జెండాను తమకు అనుకూలంగా మలుచుకోవడం గమనార్హం. అన్నాడీఎంకే జెండా నలుపు, ఎరుపు వర్ణాలతో ఉంటుంది. మధ్యలో దివంగత నేత అన్నాదురై ఫొటో ఉంటుంది. అయితే, ఈ జెండాను అలాగే వాడేసుకుంటూ, అన్నాదురైకు పైభాగంలో రెండాకుల చిహ్నం పన్నీరు శిబిరం పొందుపరచడం చర్చకు దారి తీసింది. పన్నీరు కొత్త పార్టీ పెట్టేనా అన్న చర్చ తెరపైకి వచ్చింది. అయితే, న్యాయపోరాటంలో తుది గెలుపు తమదే అని, అందుకే ప్రస్తుతానికి జెండాలో పార్టీ గుర్తు రెండాకుల చిహ్నంను పొందు పరిచినట్టు పన్నీరు శిబిరం నేతలు పేర్కొంటున్నారు. ఈవ్యవహారంపై పన్నీరు శిబిరం సీనియర్ నేత బన్రూటి రామచంద్రన్ పేర్కొంటూ అన్నాడీఎంకే పేరును, జెండాను, చిహ్నంను తాము వినియోగిస్తామని, ఇది తమ హక్కుగా వ్యాఖ్యలు చేశారు. చట్టపరంగా చర్యలు... పన్నీరు సెల్వం శిబిరం తీరుపై పళనిస్వామి తీవ్రంగా స్పందించారు. ఎన్నికల కమిషన్, కోర్టు స్పష్టంగా పార్టీ, జెండా, చిహ్నం తమకే చెందుతుందని చెప్పాయని, అలాంటప్పుడు ఆయన రాజకీయ నాగరికతకు అనుగుణంగా నడుచుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. పార్టీ పేరు, జెండాను ఆయన వినియోగించడం అనాగరిక చర్యగా వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం విశ్వాసంగా ఉండే వాళ్లను చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు, అయితే, ద్రోహులకు అన్నాడీఎంకేలో చోటు లేదని పరోక్షంగా పన్నీరును ఉద్దేశించి పళనిస్వామి వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే సీనియర్‌నేత జయకుమార్ స్పందిస్తూ, పన్నీరు తన ధోరణి మార్చుకోకుంటే చట్టపరంగా చిక్కులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పార్టీ పేరు, జెండాను ఆయన వినియోగించడంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నామన్నారు. -
మంతనాల్లో దినకరన్
► జిల్లాల వారీగా సమాలోచన ► కేడర్ చేజారకుండా జాగ్రత్తలు పార్టీ మీద పట్టు బిగించే పనిలో ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ నిమగ్నమయ్యారు. జిల్లాల వారీగా నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మంతనాల్లో మునిగారు. శనివారం వేలూరు, విల్లుపురం జిల్లాల్లో పార్టీపరిస్థితిపై సమాలోచించారు. కేడర్ చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ జైల్లో ఉండడంతో పార్టీ మీద పట్టు సాధించే పనిలో ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వేగం పెంచారు. చిన్నమ్మ ఆదేశాలను ఆచరణలో పెట్టే రీతిలో ముఖ్య నేతలు చేజారకుండా, నిత్యం ఏదో ఒక సమావేశంతో ముందుకు సాగే పనిలోపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై సమాలోచనకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం విల్లుపురం, వేలూరు జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఆ జిల్లాల్లోని మాజీ మంత్రులను సైతం పిలిపించి పార్టీ పరిస్థితిపై సమావేశం కావడం గమనార్హం. వచ్చిన నేతలు, మంత్రులు టీటీవీ దినకరన్ ముందు వినయాన్ని ప్రదర్శించడం ఆలోచించాలి్సందే. ఇందులో మంత్రులు కూడా ఉండడం గమనార్హం. ప్రధానంగా పార్టీ కేడర్ చేజారకుండా, ఆయా జిల్లాల్లో మాజీ సీఎం పన్నీరు శిబిరం వైపుగా ఉన్న స్థానిక నాయకులు వివరాలను ఈసందర్భంగా టీటీవీ సేకరించినట్టు సమాచారం. జిల్లాల వారీగా సమీక్ష కేవలం తమకు ఉన్న అనుమానాల్ని నివృత్తి చేసుకునేందుకే టీటీవీ సాగిస్తున్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పన్నీరు శిబిరంతో సంప్రదింపుల్లో ఉన్నట్టుగా సంకేతాలు వెలువడడంతోనే, ఆయా జిల్లాల్లోని నేతల్ని ముందస్తుగా పిలిపించి మాట్లాడే పనిలో దినకరన్ ఉన్నారని చెబుతున్నారు. తన దృష్టికి వచ్చిన జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రుల మీద నిఘా పెంచేందుకు స్థానికంగా ఉన్న నాయకులకు టీటీవి ఆదేశాలు సైతం ఇచ్చినట్టు సమాచారం. అలాగే, ఎన్నికల కమిషన్ కు చిన్నమ్మ శశికళ వివరణ ఇవ్వాల్సి ఉండడంతో, ఈ విషయంగా పరప్పన అగ్రహార చెరకు వెళ్లి ఆమెతో భేటికి టీటీవీ కసరత్తుల్లో ఉన్నట్టు అన్నాడిఎంకే కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసందర్భంగా ఆయా జిల్లాల్లోని పార్టీ వివరాలను చిన్నమ్మ దృష్టికి తీసుకెళ్లి, ఆమె సలహాల్ని పాటించేందుకు టీటీవీ కసరత్తుల్లో ఉన్నట్టు చెబుతున్నారు. -
అప్పుడు మౌనమేల?
► పన్నీరుకు స్టాలిన్ ప్రశ్న సాక్షి, చెన్నై : అధికారంలో ఉన్నప్పుడు మౌనం వహించి, ఇప్పుడేమో విశ్వాసాన్ని చాటుకోవడం వెనుక ఆంతర్యమేమిటో అని మాజీ సీఎం పన్నీరుసెల్వంను డీఎంకే కార్యనిర్వాహక అధ్య క్షుడు ఎంకే స్టాలిన్ ప్రశ్నించారు. అమ్మ బొమ్మల్ని తొలగించాల్సిందేనని ప్రధాన ప్రతి పక్ష నేత హోదాతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ తో ఎంకే స్టాలిన్ సమావేశవైున విషయం తెలిసిందే. అమ్మ జయలలిత బొమ్మల్ని తొలగించాలని పట్టుబట్టే అధికారం స్టాలిన్ కు ఎవరిచ్చారని, ఆయనకు సంబంధం ఏమిటంటూ, తమ అమ్మను ప్రజల మదిలో నుంచి తొలగించేందుకు డీఎంకే తీవ్ర కుట్రలు చేస్తున్నదని అన్నాడీఎంకే వర్గాలు తీవ్రంగానే ప్రశ్నలతో ఎదురుదాడికి దిగాయి. అయితే, వారందరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్నట్టుగా, కేవలం మాజీ సీఎం పన్నీరుసెల్వం సంధించిన ప్రశ్నలపై ఎదురుదాడికి దిగుతూ స్టాలిన్ స్పందించారు. మౌనమేలనోయి.. సుప్రీంకోర్టు తీర్పు మేరకు దోషిగా ముద్ర పడ్డ వారి ఫొటోలను ఎలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచుతారని, ప్రభుత్వ పథకాల్లో పొందుపరుస్తారని ప్రశ్నించారు. అక్రమ ఆస్తుల కేసులో దోషిగా ముద్రపడ్డ వారిని దోషి అని పిలవకుండా, మరెలా పిలవాలో చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి, పదవిలేని సమయంలో అమ్మభక్తి, విశ్వాసం అని వ్యాఖ్యలు సంధించడంశోచనీయమని మండిపడ్డారు. నిజంగా అమ్మమీద గౌరవం, విశ్వాసం ఉండి ఉంటే, పదవి చేతిలో ఉన్నప్పుడు ఆమె మరణంపై న్యాయవిచారణకు ఆదేశించి ఉండాలని సూచించారు. పదవీ సుఖం ప్రస్తుతం దూ రం కావడంతో అమ్మ మరణం వెనుక మిస్టరీ అంటూ తెర మీదకు కొత్తకొత్త వ్యాఖ్యల్ని తెస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ స్వలాభం కోసం అమ్మ భక్తి, విశ్వాసం అని వ్యాఖ్యానించడం కాదు అని, నిజవైున సేవకుడిగా పదవిలో ఉన్నప్పుడే స్పందించి ఉంటే, అందరూ ఆహ్వానించి ఉండే వారని మండిపడ్డారు. త్వరలో చరమ గీతం: ఇక డీఎంకే కేడర్‌ను ఉద్దేశించి స్టాలిన్ స్పందిస్తూ మార్చి ఒకటో తేదీన తన 65వ బర్త్‌డేను ఆర్బాటాలతో చేయవద్దని సూచించారు. ప్రజల కు ఉపయోగ పడే విధంగా కార్యక్రమాలు సాగాలని సూచించారు. అలాగే, తనకు ఎలాంటి విలువైన కా నుకల్ని సమర్పించ వద్దు అని, ఏదేని పుస్తకాల రూపంలో అందిస్తే చాలు అని విజ్ఞప్తి చేశారు. నమ్మకంతో ముందుకు సాగుదామని, ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజాసంక్షేమం లక్ష్యంగా మరెన్నో పోరాటాలను సాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అవినీతి ఊబిలో కూరుకున్న బినామీ ప్రభుత్వాన్ని, ప్రజావ్యతిరేక శకు్తల్ని సాగనంపుదామని పిలుపునిచ్చారు. ఇందుకు సమయం ఆసన్నమవుతోందన్నారు. -
ఎంజీఆర్ బాటలో పన్నీరు
► న్యాయం కోసం పయనం సాక్షి, చెన్నై: దివంగత పురట్చితలైవర్ ఎంజీఆర్ బాటలో మాజీ సీఎం పన్నీరుసెల్వం ప్రజలో్లకి వెళ్లేందుకు నిర్ణయించారు. గతంలో ఎంజీఆర్ అనుసరించినట్టే, తాను సైతం ‘న్యాయం కోసం’ అంటూ కేడర్‌లోకి చొచ్చుకు వెళ్లనున్నారు. అన్నాడీఎంకే మూడుగా చీలడంతో ఎవరి వ్యూహాలతో వారు కేడర్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో తమ సత్తాను చాటుకునేందుకు తగ్గ పయనానికి సిద్ధం అవుతున్నారు. చిన్నమ్మ శశికళ శిబిరం ప్రస్తుతం అధికారంలో ఉండడంతో, మిగిలిన రెండు శిబిరాలు ప్రజా, కేడర్ మద్దతు లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి. ఓ వైపు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై సిద్ధం అవుతుంటే, మరోవైపు అన్నాడీఎంకే తమదేనని చాటుకునే విధంగా మాజీ సీఎం పన్నీరుసెల్వం కార్యాచరణలో నిమగ్నం అయ్యారు. కేడర్, పార్టీ వర్గాలతో సుదీర్ఘ చర్చలు సాగిస్తున్నారు. ఆదివారం కూడా ఈ సమావేశం సాగింది. ఇందులో సీనియర్లు నత్తం విశ్వనాథన్, పొన్నయ్యన్, కేపీ మునుస్వామి పాల్గొన్నారు. అన్నాదురై మరణంతో డీఎంకేను కరుణానిధి ఏ విధంగా తన గుప్పెట్లోకి తీసుకున్నారో, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ, అన్నాడీఎంకే ఆవిర్భావానికి నాంది పలుకుతూ అప్పట్లో ఎంజీఆర్ సాగించిన పయనాన్ని ఆసరాగా తీసుకునేందుకు నిర్ణయించారు. ఎంజీఆర్ బాటలో ‘న్యాయం కోసం ’ అన్న నినాదంతో కేడర్, ప్రజలో్లకి చొచు్చకు వెళ్లేందుకు నిర్ణయించారు. ఈ పయనం ఏ జిల్లా నుంచి శ్రీకారం చుటా్టలో అన్న విషయంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక, సమావేశానంతరం పొన్నయ్యన్ మీడియాతో మాట్లాడుతూ, అమ్మ మరణం మిస్టరీపై తీవ్రంగానే స్పందించారు. శశికి అంటుకోలేదుగా : పన్నీరు శిబిరంలోని సీనియర్ నేత పొన్నయ్యన్ మాట్లాడుతూ అమ్మ జయలలిత అపోలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు పలుమార్లు ఆమెను చూడడానికి ప్రయత్నించామన్నారు. అయితే, అమ్మకు భయంకరైన అంటు రోగం వచ్చినట్టు, ఈ ప్రభావం ఇతరులకు సోకే ప్రమాదం ఉన్నట్టు ప్రచారాన్ని గుప్పించారని ఆరోపించారు. అయితే, అమ్మ వెన్నంటి శశికళ మాత్రమే ఉన్నారని, ఆమెకు మాత్రం ఆ రోగం ఎందుకు రాలేదని ప్రశ్నించారు.పోయెస్ గార్డెన్ నుంచి అపోలో ఆసుపత్రికి వచ్చేటప్పుడే అమ్మకు స్ప్పహ లేదన్న సమాచారాలు వస్తుండడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రి, శశికళకు మధ్య ఏదో రహస్య ఒప్పందం ఉన్నట్టుందని, అందుకే అమ్మ ఆరోగ్య పరిస్థితి, మరణం గురించి పొంతనలేని సమాధానాలు, ప్రకటనల్ని చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. న్యాయ విచారణ జరిపించడం ద్వారా అన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చి తీరుతాయన్నారు. -
సభ్యులపై గురి!
► సర్వ సభ్య సమావేశానికి పన్నీరుసెల్వం కసరత్తు ► ఈసీ నిర్ణయం మేరకు అడుగులు ► రెండాకుల చిహ్నం కైవసం లక్ష్యం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సర్వసభ్య సభ్యుల్ని తన వైపునకు తిప్పుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం వ్యూహ రచనలో పడ్డారు. ఎన్నికల యంత్రాంగం వెలువరించే నిర్ణయం మేరకు తన కార్యాచరణ వేగవంతం చేయడానికి వ్యూహరచన చేశారు. సర్వసభ్య సమావేశానికి పిలుపునిచ్చి, అన్నాడీఎంకేను, రెండాకుల చిహ్నం కైవసం లక్ష్యంగా పావులు కదిపేందుకు నిర్ణయించారు. సాక్షి, చెన్న: దివంగత ఎంజీఆర్ చేతుల మీదుగా ఆవిర్భవించి, అమ్మ జయలలిత శ్రమకు తగ్గ ఫలితంగా దేశంలోనే మూడో అతి పెద్ద పార్టీగా అన్నాడీఎంకే అవతరంచింది. అయితే, ఆ అమ్మ మరణంతో చోటు చేసుకున్న పరిణామాలకు అన్నాడీఎంకే మూడు ముక్కలు కావాల్సిన పరిస్థితి. కోటిన్నర మంది సభ్యులు తలా ఓ దిక్కు అన్నట్టు చెల్లాచెదరు అయ్యే ప్రమాదం ఏర్పడింది. జయలలిత మేన కోడలు దీపా బాటలో కొందరు, పన్నీరు బాటలో మరికొందరు, మిగిలిన వారు చిన్నమ్మ శశికళ నేతృత్వంలోని శిబిరం గొడుగు నీడలో చేరారు. మెజారిటీ శాతం మంది ఎమ్మెల్యేలు చిన్నమ్మ శిబిరం వైపు నిలబడడంతో అధికారాన్ని దూరం చేసుకున్న పన్నీరుసెల్వం, కేడర్ సాయంతో అన్నాడీఎంకేను గుప్పెట్లోకి తీసుకునే వ్యూహం రచించారు. పార్టీలో సర్వసభ్య సమావేశం నిర్ణయం కీలకం కావడంతో, ఆ సభ్యుల్ని తన వైపునకు తిప్పుకోవడం లక్ష్యంగా కసరతు్తల్లో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో క్రియా శీలకంగా ఉన్న సర్వసభ్య సభ్యుల మద్దతు కూడగట్టుకునే వ్యూహంతో ముఖ్య నాయకుల్ని రంగంలోకి దించారు. ఎన్నికల యంత్రాంగం శశికళ నియమకానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న తదుపరి తక్షణం సర్వ సభ్య సమావేశానికి పిలుపునిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈసీ నిర్ణయంతో : అన్నాడీఎంకే నియమ నిబంధనలకు విరుద్ధంగా శశికళను ప్రధాన కార్యదర్శిగా నియమించినట్టు ఇప్పటికే పన్నీరు శిబిరం కేంద్రం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై ఈసీ విచారణ చేపట్టింది. వివరణ కోరుతూ ఈనెల 28 వరకు శశికళకు గడువు ఇచ్చారు. ఆమె ఇచ్చే వివరణను ఈసీ ఏకీభవించని పక్షంలో, ఆమె ప్రధాన కార్యదర్శి నియామకం రద్దు అవుతుంది. దీంతో సర్వసభ్య సభ్యులు మద్దతుతో సమావేశానికి పిలుపునిచ్చే వ్యూహంతో పన్నీరు అడుగులు సాగనున్నాయి. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు తానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టడం, రెండాకుల చిహ్నం కైవసం తదుపరి, ప్రభుత్వం మీద దృష్టి పెట్టేందుకు తగ్గ కార్యచరణతో పన్నీరు ముందుకు సాగేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు బలం చేకూరే విధంగా శనివారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటరూ్వ్యలో పన్నీరు వ్యాఖ్యలు ఉండడం గమనార్హం. న్యాయం కోరుతూ: పార్టీ పరంగా తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కోరుతూ కేడర్‌లోకి వెళ్తానని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల తేదీ ప్రకటనతో రాష్ట్ర పర్యటన సాగుతుందన్నారు. దీపా కొత్త పేరవై ఏర్పాటు చేయడం ఆహ్వానించ తగ్గ విషయమేనని, ఆమెకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నరు. తన గురించి పరోక్షంగా సినీ నటుడు కమల్ వ్యాఖ్యలు చేయడం ఆనందంగా ఉందంటూ, ఆయన అంటే ఎంతో గౌరవం ఉందన్నారు. ఆయన అన్నట్టుగా ఎన్నికలు వస్తే ఆహ్వానిస్తానని స్పందించారు. అన్నాడీఎంకే తమదేనని ధీమా వ్యక్తం చేశారు. -
ప్రజాక్షేత్రంలోకి పన్నీరు
► రథం సిద్ధం ► రూట్ మ్యాప్ రూపకల్పన ► నేతలతో మాజీ సీఎం సమాలోచన ► అమ్మ జయంతికి శ్రీకారం ► ఆర్కేనగర్ నుంచి పయనం అన్నాడీఎంకేను రక్షించుకోవడమే లక్ష్యంగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు మాజీ సీఎం పన్నీరు సెల్వం సిద్ధం అయా్యరు. ప్రచార రథం కూడా రెడీ కావడంతో ఇక , రూట్ మ్యాప్ రూపకల్పనలో పన్నీరు శిబిరం బిజీ అయింది. ముఖ్య నేతలతో పన్నీరు సెల్వం రాష్ట్ర పర్యటనపై సమాలోచించారు. అమ్మ జయలలిత జయంతికి ఆర్కే నగర్ నుంచి బయల్దేరడానికి శ్రీకారం చుట్టేందుకు తగ్గట్టుగా కార్యాచరణ సిద్ధం చేసినట్టు సమాచారం. సాక్షి,చెన్నై: అన్నాడీఎంకేలో చిన్నమ్మ శశికళ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎం పన్నీరు సెల్వం తిరుగుబాటు బావు టా ఎగుర వేసిన విషయం తెలి సిందే. అధికార పగ్గాలు లక్ష్యంగా ఆయన చేసిన ప్రయత్నాలకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దిగి రాలేదు. మెజారిటీ శాతం మంది తన వెంట ఉంటారని భావించి, చివరకు పన్నెం డు మందితో సరు్దకోవాల్సిన పరిస్థితి. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలు చిన్నమ్మ శశికళ విధేయుడు పళనిస్వామిని ఆదరించడం పన్నీరుకు పెద్ద షాకే. అసెంబ్లీలో పరాభావం ఎదురైనా, ప్రజా క్షేత్రంలో గెలుపు లక్ష్యంగా ముందుకు సాగేందుకు పన్నీరు సెల్వం సిద్ధం అయా్యరు. ఇప్పటికే ప్రజా మద్దతు, ద్వితీయ, తృతీయ శ్రేణి వర్గాల మద్దతు తనకు ఎకు్కవగా ఉండడంతో, రా ష్ట్ర పర్యటనతో చిన్నమ్మ రూపంలో అన్నాడీఎంకేకు ఎదురు కానున్న ముప్పును ప్రజలో్లకి, కేడర్‌లోకి తీసుకెళ్లేందుకు పన్నీరు సెల్వం ఉరకలు తీస్తున్నారు.ఇందు కోసం ప్రత్యేక ప్రచార రథం సిద్ధం కావడం విశేషం. రథం సిద్ధం: హంగు ఆర్భాటాలు లేకుండా, ప్రజ ల్లో మమేకం అయ్యే విధంగా పన్నీరు తన పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీపు తరహా వాహనాన్ని ప్రచార రథంగా ఎంపిక చేశారు. ఇందులో కేవలం అమ్మ జయలలిత ఫొటో పెద్దదిగా కనిపించే విధంగా, ఎంజీఆర్ ఫొటో, రెండాకుల చిహ్నం మాత్రమే కనిపించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎక్కడా తన ఫొటో కూడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం పార్టీని రక్షించుకోవడం, కేడర్‌తో పాటుగా ప్రజా మద్దతును కూడగట్టుకోవడం లక్ష్యంగా ఈ పర్యటనకు పన్నీరు నిర్ణయించి ఉన్నారు. నేతలతో సమాలోచన: గ్రీన్ వేస్ రోడు్డలోని నివాసంలో తన మద్దతు నేతలు మధుసూదనన్, మైత్రేయన్, కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్ తదితరులతో రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై పన్నీరు సెల్వం సోమవారం సమాలోచించారు. రూట్ మ్యాప్ రూపకల్పన మీద దృష్టి పెటా్టరు. ప్రధానంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పర్యటన సాగించేందుకు నిర్ణయించి ఉన్నారు. దివంగత సీఎం అమ్మ జయలలిత వరుసగా రెండు సార్లు విజయ కేతనం ఎగుర వేసిన ఆర్కే నగర్ నుంచి తన పర్యటనకు శ్రీకారం చుట్టే విధంగా కార్యచరణను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ నెల 24వ తేదీన జయలలిత జయంతి కావడంతో ఆ రోజున సేవా కార్యక్రమాలతో, పర్యటనకు శ్రీకారం చుటా్టలన్న నిర్ణయానికి వచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, అధికారికంగా పర్యటన వివరాలు మంగళ లేదా బుధవారం ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు పన్నీరు శిబిరం వర్గాలు పేర్కొంటున్నాయి. పన్నీరు సెల్వంకు మద్దతుగా పలు చోట్ల నుంచి లేఖలను గ్రీన్‌వేస్ రోడు్డకు వెల్లువెతు్తతున్నాయి. ఇందులో అనేక మంది ఇక ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలని, అమ్మ ఆశయ సాధన లక్ష్యంగా ప్రజా మద్దతుతో పయనాన్ని వేగవంతం చేయాలని, ఎవ్వరికీ తల వంచ వద్దు అని, ధైర్యంగా సమాధానాలు ఇవ్వాలని, గంభీరంగా మా ట్లాడాలంటూ పలువురు పన్నీరుకు సూచిస్తుండ డం ఆహ్వానించ దగ్గ విషయం. పన్నీరుకు మద్దతుగా నిలిచిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పాండియరాజన్ ఆవడిలోని తన నియోజకవర్గంలో పర్యటించగా, ప్రజలు బ్రహ్మరథం పట్టి ఆహ్వానించడం విశేషం. పార్టీని రక్షించుకుంటాం: పన్నీరు శిబిరంలో గత వారం చేరిన జయలలిత మేన కోడలు దీపా తన మద్దతుదారుల్ని ఉద్దేశించి టీ నగర్‌లోని ఇంటి వద్ద మాట్లాడారు. అన్నాడీఎంకేను రక్షించుకుంటామని, జయలలిత పేరుకు అపఖ్యాతి తెచ్చే విధం గా ఎమ్మెల్యేలు వ్యవహరించారని మండి పడ్డారు. అందరికీ గుణపాఠం చెప్పే రోజు త్వరలో రానున్నదని, మేనత్త జయంతి రోజున అన్ని వివరాలను ప్రకటిస్తానన్నారు. -
బలం ఎవరికో?
► అప్రమత్తంగా పళని ► చివరి ప్రయత్నంలో పన్నీరు ► వ్యతిరేకంగా డీఎంకే ఓటు ► కాంగ్రెస్ నాన్చుడు ► గతం పునరావృతం అయ్యేనా? ► సర్వత్రా ఉత్కంఠ ‘గవర్నర్ ఛాన్స్ ఇచ్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇక, బల నిరూపణ లక్ష్యం’ ఇందులో కే పళనిస్వామి సత్తా చాటేనా, పన్నీరు ప్రయత్నాలకు బలి అయ్యేనా..! అన్న హైటెన్షన్ తమిళనాట నెలకొంది. మరికొన్ని గంటల్లో తేలనున్న బలనిరూపణ మీద తమిళ ప్రజానీకం దృష్టి పడింది. ఈ పరీక్షలో పళని నెగ్గేనా..? గతం పునరావృతం అయ్యేనా..! అన్న ఎదురు చూపులు పెరిగాయి. సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అధికార సమరం క్లైమాక్స్‌కు చేరింది. చిన్నమ్మ శిబిరమా..? పన్నీరు శిబిరమా..?అని ఆసక్తికరంగా సాగిన ఎపిసోడ్లో శనివారం క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో అన్న ఉత్కంఠలో తమిళనాడే కాదు, ప్రపంచ దేశాల్లోని తమిళుడు ఎదురు చూపుల్లో పడ్డారు. కీలక మలుపు తిరిగేనా.. అన్న ఉత్కంఠ సర్వత్రా బయలు దేరింది. చిన్నమ్మ శశికళ విధేయుడు కే పళని స్వామి సీఎం పగ్గాలు చేపట్టిన మూడో రోజు జరగనున్న అసెంబ్లీ వేదికగా జరగనున్న బల పరీక్షలో తీర్పు అనుకులమా...? ప్రతి కూలమా..? అన్న చర్చ శుక్రవారం రాష్ట్రంలో జోరందుకుంది. ఎక్కడ చూసినా అవిశ్వాస చర్చే. బల నిరూపణ లక్ష్యంగా పళని స్వామి తీవ్రంగానే కుస్తీలు పట్టారు. ఎమ్మెల్యేలు చేజారి పోకుండా అప్రమత్తంగానే వ్యవహరించారు. కూవత్తూరు క్యాంప్‌నకు చేరుకుని ఎమ్మెల్యేలతో మాట్లాడారు. చిన్నమ్మ శశికళ సైతం పరప్పన అగ్రహారం చెర నుంచి ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో తమకు ఇచ్చిన హామీల్ని పళని విస్మరించినట్టు పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించడం ఆ శిబిరంలో కలవరాన్ని రేపింది. బలపరీక్షలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగుర వేయకుండా, విప్‌ను సైతం పళని జారీ చేయించడం గమనార్హం. ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నా, శాసన సభలో తిరగబడ్డ పక్షంలో పరిస్థితి ఏమిటో అన్న ఆందోళన పళనిని వీడడం లేదు. చివరి ప్రయత్నంలో పన్నీరు బల నిరూపణలో పళని పతనం లక్ష్యంగా చివరి ప్రయత్నాల్లో పన్నీరు శిబిరం నిమగ్నమైంది. బహిరంగ ఓటింగ్ కాకుండా రహస్య ఓటింగ్ సాగే విధంగా చర్యలకు స్పీకర్ ధనపాల్కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ తమకు ప్రతికూలంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయన్న ఆరోపణల్ని సైతం ఆ శిబిరం గుప్పించడం గమనార్హం. శిబిరంలోని ముఖ్య నాయకులతో పన్నీరు సెల్వం సమాలోచనలతో రాజకీయ పావుల్ని కదపడంలో తీవ్రంగానే నిమగ్నం అయ్యారు. కూవత్తూరు క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యేల మద్దతు దారులతో సంప్రదింపులు సాగించినట్టు, సభలో పళనికి వ్యతిరేకంగా వ్యవహరించే విధంగా విజ్ఞప్తి చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, అన్నాడీఎంకే తమదేనని చాటుకునేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. తాత్కాలిక ప్రధానకార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, సీఎం పళని స్వామిలతో పాటుగా పలువురికి ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. అదే సమయంలో పన్నీరు శిబిరం చేసిన ఫిర్యాదును ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోవడం, వివరణ కోరుతూ శశికళ శిబిరానికి ఆదేశాలు ఇవ్వడం పన్నీరు శిబిరంలో కాస్త ఆనందాన్ని నింపింది. అయితే, క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యేలు సభలో ఎలా వ్యవహరిస్తారోనన్న కలవరం పన్నీరు శిబిరాన్ని వెంటాడుతున్నది. ఇక , మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజ్ తమ శిబిరంలో అడుగు పెట్టడంతో, మిగిలిన ఎమ్మెల్యేలు తప్పకుండా పన్నీరును ఆదరిస్తారన్న ఆశాభావం పెరిగి ఉన్నది. వ్యతిరేకంగా డిఎంకే : సభలో పళని స్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని డిఎంకేతో పాటుగా, మిత్ర పక్షం ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్నిర్ణయం ఢిల్లీకి చేరడంతో ఎలా వ్యవహరిస్తారోనన్న ఉత్కంఠ తప్పడం లేదు. గతం పునరావృతం అయ్యేనా : ముఫ్పై సంవత్సరాల తదుపరి తమిళ అసెంబ్లీలో శనివారం బల పరీక్ష జరగనున్నది. తన బలాన్ని నిరూపించుకునేందుకు సీఎం పళని స్వామి సిద్ధం అయ్యారు. సరిగ్గా పద కొండు గంటలకు సభ ప్రారంభం కానున్నది. బల నిరూపణలో రహస్య ఓటింగ్ సాగేనా, లేదా బహిరంగంగానే ఓటింగ్‌తో ఏదేని వివాదాలు సభలో రాజుకునేనా అన్న ఆందోళన బయలు దేరి ఉన్నది. ఇప్పటి వరకు బల పరీక్షల్లో సీఎంలుగా ఉన్న రాజాజీ, కరుణానిధి నెగ్గారు. ఎంజీఆర్ మరణానంతరం అన్నాడిఎంకేలో అధికారం కోసం తీవ్ర సమరమే సాగింది. ఆయన సతీమని జానకీ రామచంద్రన్, జయలలిత మధ్య సాగిన ఈ సమరంలో జానకీ రామంద్రన్ కు అనుకూలంగా ఫలితం వచ్చింది. అయితే, సభలో కుమ్ములాట, ఉద్రిక్తత పరిస్థితులు రాష్ట్రపతి పాలన వైపుగా అడుగులు పడేలా చేశాయి. ఇదే పరిస్థితి తాజాగా పునరావృతం అయ్యేనా...? లేదా, రాజాజీ, కరుణానిధిలు నెగ్గినట్టుగా పళని స్వామికి మద్దతుగా ఎమ్మెల్యేలు నిలిచేనా అన్నది మరి కొన్ని గంటల్లో తేలనుంది. -
కోలాహలం
► పన్నీరు ఇంట అభిమాన కెరటం ► తండోపతండాలుగా రాక ► ఆనందోత్సాహాల రెట్టింపు ► కువత్తూరుకు చిన్నమ్మ పరుగు ► పోయెస్‌గార్డెన్ వద్ద హడావుడి ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వం ఇంటి పరిసరాల్లో ఆదివారం కోలాహల వాతావరణం నెలకొంది. అభిమాన కెరటం ఉప్పొంగింది. తండోపతండాలుగా రాష్ట్రం నలుమూలల నుంచి అన్నాడీఎంకే కార్యకర్తలు తరలివచ్చి మద్దతు పలికారు. ఐదుగురు ఎంపీలు, పదిమంది మాజీ ఎమ్మెల్యేలు పన్నీరు శిబిరంలో చేరారు. పన్నీరు శిబిరంలో ఆనందోత్సాహాలు రెట్టింపు అయితే, చిన్నమ్మ శిబిరంలో ఉత్కంఠ తప్పడం లేదు. మెజారిటీ ఎమ్మెల్యేలు క్యాంప్‌లోనే ఉండడం వారికి ఊరట. పోయెస్ గార్డెన్ వద్ద హడావుడి సాగినా, చిన్నమ్మ క్యాంప్‌నకు పరుగులు తీయడంతో తదుపరి అడుగులు ఎలా ఉంటాయోనన్న ఎదురు చూపులు పెరిగాయి. సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ, ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వం మధ్య సమరం రోజు రోజుకు ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్యేలు చిన్నమ్మ ఏర్పాటు చేసిన శిబిరంలోనే ఉన్నా, ఆ పార్టీ ఎంపీలు ఒక్కొక్కరుగా పన్నీరు శిబిరంలో చేరుతున్నారు. రెండు మూడు రోజులుగా గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు ఇంట సందడి వాతావరణం నెలకొన్నా, ఆదివారం వాతావరణం కోలాహలంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి వ్యాన్లు, బస్సుల్లో అన్నాడీఎంకే కింది స్థాయి కార్యకర్తలు సైతం పోటెత్తుతున్నారు. డప్పులు వాయిస్తూ, అన్నాడీఎంకే పతకాలను చేతబట్టి, పన్నీరుకు మద్దతుగా నినదిస్తూ తండోపతండాలుగా తరలి వచ్చి మద్దతు పలుకుతుండడం విశేషం. పన్నీరుకు మద్దతు పలికేందుకు అభిమాన కెరటం తరలి వస్తుండడంతో ఆ పరిసరాలు కిక్కిరిశాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు తీవ్రంగా కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి. ఇక, ఆ పరిసరాల్లోని దుకాణాల్లో వ్యాపారం మరింతగా పుంజు కుంది. అలాగే, అన్నాడీఎంకే పతాకాలు, అమ్మ, పన్నీరు ఫొటోలు, శాలువాలతో కూడిన రోడ్డు సైడ్ దుకాణాలు పుట్టుకు రావడం గమనార్హం. ఆనందోత్సాహాలు రెట్టింపు : అభిమాన కెరటం పన్నీరుకు మద్దతు ప్రకటించినానంతరం, అక్కడ ఏర్పాటు చేసిన హోర్డింగ్, బ్యానర్లలో తమ సంతకాలు పెట్టారు. పోయెస్‌గార్డెన్ లోని అమ్మ జయలలిత ఇంటిని స్మారక మందిరంగా ప్రకటించాల్సిందేనని నినదిస్తూ, తమ సంతకాలు చేశారు. తూత్తుకుడి ఎంపీ జయసింగ్ త్యాగరాజ్ నటర్జీ, వేలూరు ఎంపీ సెంగుట్టువన్, పెరంబలూరు ఎంపీ మారుతీ రాజా, విల్లుపురం ఎంపీ రాజేంద్రన్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణన్ లతో పాటు పది మంది మాజీ ఎమ్మెల్యేలు పన్నీరుకు మద్దతు ప్రకటించారు. దీంతో పన్నీరు శిబిరంలో ఎంపీల సంఖ్య మొత్తం పదికి చేరింది. అలాగే, సినీనటులు, అరుణ్ పాండియన్, రామరాజన్, విఘ్నేష్, త్యాగు, మనోబాల సైతం పన్నీరుకు జై కొట్టారు. రామరాజన్ మీడియాతో మాట్లాడుతూ పన్నీరు సెల్వం నిజమైన హీరో అని కొనియాడారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతో ఆనందాన్ని కల్గించిందన్నారు. ఇక, పన్నీరుకు మద్దతుగా మిస్డ్ కాల్ కొట్టు నినాదానికి విశేష స్పందన రావడం గమనార్హం. పన్నీరు శిబిరంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణన్ చేరిన సమాచారంతో ఆయన చేతిలో ఉన్న విల్లుపురం ఉత్తర జిల్లా పార్టీ కార్యదర్శి పదవిని తొలగిస్తు చిన్నమ్మ శశికళ నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదుల హోరు : ఆదివారం కూడా ఆయా నియోజకవర్గాల్లో తమ ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ ఓటర్లు పోలీసుస్టేçÙన్లలో ఫిర్యాదు చేశారు. మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజ్ కార్యాలయం వద్ద పలువురు ఆందోళనకు సైతం దిగారు. పన్నీరుకు మద్దతుగా నిర్ణయం తీసుకోవాలని చిన్నమ్మ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పలు చోట్ల అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగడం గమనార్హం. అలాగే, మంత్రులు ఓఎస్ మణియన్, వలర్మతి, దురైకన్ను కన్పించడం లేదని వారి నియోజకవర్గ ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూవత్తూరుకు చిన్నమ్మ : పోయెస్‌గార్డెన్ వద్ద పార్టీ వర్గాలతో చిన్నమ్మ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమావేశం అయ్యారు. పార్టీ ముఖ్యులతోనూ, పార్టీలో వ్యాఖ్యాతలుగా ఉన్న సినీ నటులు పలువురితోనూ చిన్నమ్మ భేటీ అయ్యారు. ఈసందర్భంగా తమకు బెదిరింపులు వస్తున్నట్టుగా చిన్నమ్మ దృష్టికి సీఆర్ సరస్వతి, గుండు కల్యాణం తదితర నటులు తీసుకెళ్లారు. ఇక, నాలుగున్నర గంటల సమయంలో చిన్నమ్మ కువత్తూరుకు వెళ్తూ మీడియాతో మాట్లాడడం ఆ శిబిరంలో కాస్త జోష్‌ను నింపింది. ఆందోళన వద్దు అని, అధికారం మనదేనని ఆమె చేసిన వ్యాఖ్యలతో శ్రేణులు ఆనందంలో మునిగారు. ఇక, ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల మరింత ఆనందమే. ఎమ్మెల్యేలు అందరూ తన వెంటేనని, పార్టీ పరిరక్షణ, ప్రభుత్వానికి భంగపాటు రానివ్వకుండా స్వతంత్రంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉన్నారని ఆమె వ్యాఖ్యానించడం ఆ శిబిరంలో కాస్త టెన్షన్ తగ్గినట్టు అయింది. -
పన్నీర్ జోష్
► ఆనందోత్సాహాల్లో మద్దతుదారులు ► గ్రీన్ వేస్ రోడ్డులో అభిమాన తాకిడి ► సందిగ్ధంలో చిన్నమ్మ శిబిరం ఆపద్ధర్మ సీఎం పన్నీరు శిబిరం ఆనందోత్సాహాలతో మునిగింది. బల నిరూపణకు చాన్స్ ఇస్తే, నెగ్గి తీరుతామన్న ధీమా మద్దతుదారుల్లో పెరిగింది. పన్నీరుకు మద్దతుగా ఎంపీలు, ఓ మంత్రి తమ శిబిరంలోకి చేరడంతో, బలం మరింత పెరగడం ఖాయం అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ వేస్ రోడ్డుకు అభిమాన తాకిడి రోజురోజుకు పెరుగుతుండడంతో ఆ పరిసరాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుతున్నాయి. సాక్షి, చెన్నై : సీఎం కుర్చీకోసం చిన్నమ్మ శశికళ, పన్నీరుసెల్వం మధ్య సాగుతున్న సమరంలో ఆసక్తికర మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ ఎత్తుగ డలో నువ్వా..నేనా అన్నట్టుగా ఇరువురూ ముం దుకు దూసుకెళుతున్నారు. ఈ సమయంలో శనివా రం పన్నీరుసెల్వం శిబిరాన్ని ఆనందకర క్షణాలు మెండుగా ఆవహించాయి. ఇందుకు కారణం ఒకే రోజు ముగ్గురు ఎంపీలు కదలి రావడం, ఓ మంత్రి, పార్టీ సీనియర్‌నాయకుడు సైతం మద్దతు ప్రకటించడం వెరసి ఆ శిబిరంలో ఆనందాన్ని నింపా యి. నామక్కల్ ఎంపీ సుందరం, కృష్ణగిరి ఎంపీ అశోక్‌కుమార్, తిరుప్పూర్ ఎంపీ సత్యభామా, తిరువణ్ణామలై ఎంపీ వనరోజా తమ మద్దతును ప్రకటించినానంతరం చేసిన వ్యాఖ్యలు పన్నీరు శిబిరంలో మరింత జోష్ నింపాయి. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మినహా తక్కిన ఎంపీలు అందరూ పన్నీరు వెంట నడవడం ఖాయం అని వారు చేసిన వ్యాఖ్యలతో ఆ శిబిరంలో ఉత్సాహం రెట్టింపు అయింది. అలాగే, నిన్నటి వరకు చిన్నమ్మ వెంట ఉన్న విద్యాశాఖ మంత్రి పాండియరాజన్, పార్టీ సీనియర్ నాయకుడు పొన్నయ్యన్ సైతం పన్నీరుకు మద్దతుగా ముందుకు రావడం మహదానందమే. మంత్రులు, ఎమ్మెల్యేలు మరికొద్ది రోజుల్లో పన్నీరు సమక్షంలో మద్దతు ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారని పాండియరాజన్ చేసిన వ్యాఖ్యలు, కోటిన్నర మంది అన్నాడీఎంకే కేడర్ పన్నీరు వెంట నడవబోతున్నారన్న పొన్నయ్యన్ ప్రకటన ఆ శిబిరాన్ని ఆనందపు జల్లుల్లో ముంచింది. అసెంబ్లీలో బలనిరూపణకు గవర్నర్ అవకాశం ఇస్తే, పన్నీరు నెగ్గడం ఖాయం అన్న ధీమాను వ్యక్తం చేసే మద్దతుదారుల సంఖ్య పెరుగుతుండడం గమనార్హం. ఎమ్మెల్యేలు తప్పకండా పన్నీరుకు అండగా నిలబడి తీరుతారని మాజీ ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో తరలి వచిచ మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే, అభిమానతాకిడి క్రమంగా గ్రీన్ వేస్ రోడ్డు వైపుగా కదులుతుండడంతో ఆ పరిసరాల్లో భద్రతను మరింతగా పెంచారు. వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో ఆ రోడ్డు కిక్కిరిసింది. ఇక, అమ్మ జయలలిత బాల్య మిత్రులు , స్కూల్ మెంట్స్ శ్రీమతి అయ్యంగార్, శాంతినీ పంకజ్, పదర్ సయ్యద్ సైతం పన్నీరుకే తమ ఓటు అని ఓ మీడియా ముందు ప్రకటించడాన్ని మద్దతుదారులు ఆహ్వానిస్తున్నారు. ఇక, చిన్నమ్మ శిబిరం నుంచి మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, కేటీ రాజేంద్ర బాలాజీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ జంప్ అయ్యారన్న సమాచారంతో, వారు తప్పకుండా తమ శిబిరంలోకి అడుగు పెడుతారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నారు. కాగా, పోయెస్ గార్డెన్ లోని జయలలిత నివాసం వేదానిలయంను అమ్మ స్మారక మందిరంగా తీర్చిదిద్దాలన్న నినాదంతో పన్నీరుసెల్వం సంతకాల సేకరణకు శ్రీకారంచుట్టడంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయడానికి మద్దతుదారులు పరుగులు తీసే పనిలో పడ్డారు. సందిగ్ధంలో చిన్నమ్మ శిబిరం : పన్నీరు శిబిరాన్ని ఆనందం ఆవహిస్తే, చిన్నమ్మ శిబిరం సందిగ్ధంలో పడింది. జంప్ జిలానీల సంఖ్య పెరుగుతుండడంతో పన్నీరు శిబిరం వైపుగా ఉత్కంఠతో ఎదురు చూసే చిన్నమ్మ సేనలు పెరుగుతున్నారు. ఆగమేఘాలపై చిన్నమ్మ కువత్తూరు క్యాంప్‌కు పరుగులు పెట్టడం, ఎమ్మెల్యేలతో సమాలోచన సాగించే పనిలో పడడంతో తదుపరి అడుగులు ఎలా ఉంటాయోనన్న ఎదురుచూపుల్లో మద్దతుదారులు ఉన్నారు. గవర్నర్ తీరుపై చిన్నమ్మ ఆగ్రహాన్ని వ్యక్తంచేసి ఉండడం, తదుపరి తమ నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడడంటూ ఆమె స్పందించి ఉన్న దృష్ట్యా, ఆదివారం పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాల్సిందే. -
సంతాపంతో సరి
► జయకు సంతాపం ►అసెంబ్లీలో నివాళి ► హృదయ ‘దేవత’ : పన్నీరు ► ధైర్యానికి ప్రతిరూపం : స్టాలిన్ సాక్షి, చెన్నై : తమిళుల అమ్మ జయలలితకు మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ నివాళులర్పించింది. సంతాప తీర్మానంతో సభ్యులందరూ మౌన అంజలి ఘటించారు. అమ్మ భౌతికంగా దూరమైనా తమ అందరి హృదయంలో ఆ దేవత చిరస్మరణీయం అని ఉద్వేగ భరిత ప్రసంగంతో ఈ సందర్భంగా సీఎం పన్నీరుసెల్వం స్పందించారు. ధైర్యానికి ప్రతి రూపం అమ్మ అని ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో రెండవ రోజు మంగళవారం సంతాప తీర్మానాలతో సరిపెట్టారు. పది గంటలకు సభ ప్రారంభం కాగానే, స్పీకర్ ధనపాల్ సంతాప తీర్మానాలను ప్రవేశ పెట్టారు. మాజీ గవర్నర్ సూర్జిత్‌సింగ్ బర్నాలా, తుగ్లక్ సంపాదకుడు నటుడు చోరామస్వామి, కర్ణాటక సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫెడల్ క్యాస్ట్రో, మాజీ మంత్రి కేసీ మణిలతోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపం ప్రకటించారు. దీంతో సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం అమ్మ జయలలిత మృతికి సంతాపం తెలుపుతూ సీఎం పన్నీరుసెల్వం తీర్మానం తీసుకొచ్చారు. అమ్మ ఖ్యాతిని ఎలుగెత్తి చాటుతూ ప్రజాహిత పాలనను గుర్తు చేస్తూ ప్రసంగాన్ని సాగించారు. అమ్మ పథకాల గురించి వివరిస్తూ, ప్రజాస్వామ పరిరక్షణ, తమిళుల హక్కుల రక్షణ లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన మహానాయకులు తమ అమ్మ అని కొనియాడారు. అమ్మ భౌతికంగా దూరమైనా, ఆ దేవత తమ హృదయాల్లో చిరస్మరణీయం అని వ్యాఖ్యానించారు. కొన్ని వ్యాఖ్యల్ని సంధించే క్రమంలో పన్నీరు కాస్త ఉద్వేగానికి లోనైనట్టు కన్పించినా, ప్రసంగ పాఠాన్ని ముగించారు. ఇక, రెండు నిమిషాల పాటు అమ్మకు మౌన అంజలి ఘటించినానంతరం సభలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ప్రసంగించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తన పట్ల అధికారులు వ్యవహరించిన తీరును పరిగణించి జయలలిత ఓ ప్రకటన విడుదల చేశారని గుర్తుచేశారు. తనను గానీ, డీఎంకేనుగానీ అవమాన పరచాలన్న ఉద్దేశం తనకు లేదు అని, కలసికట్టుగా ప్రజాహితాన్ని కాంక్షిస్తూ పయనం సాగిద్దామని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్న అంశాలు ఎంతో ఆనందాన్ని కల్గించాయన్నారు. అమ్మ ఆసుపత్రిలో ఉన్న సమాచారంతో తమ అధినేత కరుణానిధి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని, స్వయంగా తనను వెళ్లి పరామర్శించి రావాలని సూచించినట్టు గుర్తు చేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో అందరి ముందుకు వస్తారని భావించానని, అయితే, హఠాత్తుగా అందర్నీ వీడి అనంత లోకాలకు వెళ్లడం తీవ్ర వేదనకు గురిచేసినట్టు పేర్కొన్నారు. జయలలిత ఎన్నో సేవలు చేశారంటూ, తమ వరకు ధైర్యానికి ప్రతీరూపంగా ఆమె కనిపించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కేఆర్ రామస్వామి తన ప్రసంగంలో జయలలితకు సాటి మరొకరు లేరని వ్యాఖ్యానించారు. ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ సభ్యుడు అబూబక్కర్, కొంగు ఇలంజరై పేరవై తనియరసు, ఎమ్మెల్యేలు కరుణాస్, తమీమున్ అన్సారీ ప్రసంగించారు. అమ్మకు సంతాపం తదుపరి సభను బుధవారానికి వాయిదా వేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ, వివిధ అంశాలపై చర్చ సాగనున్న దృష్ట్యా సభలో వాతావరణం వేడెక్కే అవకాశాలు ఉన్నాయి. -
పన్నీరు భరోసా
► ఎట్టకేలకు స్పందన ► అన్నదాతకు అండగా చర్యలు ► ‘కరువు’ నివేదికకు ఆదేశాలు ► గ్రామాల్లోకి జిల్లా కలెక్టర్లు ►మంత్రులు, సీనియర్ ఐఏఎస్‌లతో ఉన్నత స్థాయి కమిటీ ►పదో తేదీ నాటికి నివేదిక సమర్పణ సాక్షి, చెన్నై : అన్నదాతల ఆక్రందనలు, పదుల సంఖ్యలో బలవన్మరణాలు, ఆగుతున్న గుండె చప్పుడు వెరసి ఎట్టకేలకు అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కదిలించాయి. సీఎం పన్నీరు ప్రభుత్వంలో చలనం రావడంతో అన్నదాతలను ఆదుకునేందుకు తగ్గ తొలి అడుగు మంగళవారం పడింది. ఆందోళన వద్దన్న భరోసా ఇస్తూ, కరువు నివేదిక సమర్పణకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకుగాను, ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో బృందాలు, అన్ని విభాగాల మంత్రులు, సీనియర్ ఐఏఎస్‌ల సమన్వయంతో ఉన్నత స్థాయి కమిటీ రంగంలోకి దిగనుంది. కొన్నేళ్లుగా రాష్ట్రం మీద నైరుతి రుతు పవనాలు శీత కన్ను వేయడం, ఈ ఏడాది ఈశాన్య రుతు పవనాలు సైతం ముఖం చాటేయడం వెరసి అన్నదాతలు కన్నీటి మడుగులో మునగాల్సిన పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. కళ్లెదుట ఎండుతున్న పంట, మొలకెత్తని విత్తనాలను చూసి అన్నదాతల గుండెలు పగులుతున్నాయి. ఆత్మహత్యల పర్వం ఊపందుకుంది. ఇప్పటి వరకు ఎనభై మంది వరకు రైతులు విగత జీవులయ్యారు. మంగళవారం కూడా డెల్టాలో ఐదుగురు అన్నదాతల గుండెలు పగిలాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పదే పదే రైతు సంఘాలు, ప్రధాన ప్రతి పక్షంతో పాటు ఇతర పార్టీలు అన్నదాతల్ని ఆదుకునే విధంగా భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చినా ఫలితం శూన్యం. తాజాగా అన్నదాతల మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో పన్నీరు ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టుంది. సచివాలయంలో మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, ఎడపాడి పళనిస్వామి, తంగమణి, ఎస్పీ వేలుమణి, దురై కన్ను, ఆర్బీ.ఉదయకుమార్లతో పాటు ఆయా శాఖల కార్యదర్శులతో సీఎం పన్నీరు సమావేశమయ్యారు. ఈ సమావేశానంతరం అన్నదాతలకు తామున్నామన్న భరోసా ఇచ్చే విధంగా స్పందిస్తూ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పన్నీరు భరోసా : అన్నదాతల్లో నెలకొన్న ఆందోళనను తొలగించే విధంగా సీఎం పన్నీరు సెల్వం భరోసా ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది నైరుతి రుతు పవనాలతో పాటు ఈశాన్య రుతు పవనాల ప్రభావం కన్పించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు 440 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉందని, అయితే, ఈ సారి కేవలం 168 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసినట్టు వివరించారు. డెల్టాలో 12.86 లక్షల ఎకరాల్లో సంబా సాగుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇందులో 11.01 లక్షల ఎకరాల పంటను బీమా చేసినట్టు వివరించారు. రాష్ట్రం కరువుతో తల్లడిళ్లుతుండడాన్ని పరిగణలోకి తాము తీసుకునే అవకాశం ఉన్నా, అందుకు తగ్గట్టు కేంద్రం విధించిన నిబంధనల మేరకు పరిశీలన సాగాల్సి ఉందని పేర్కొన్నారు. గ్రామాల్లో పంట నష్టం వివరాలను నివేదిక రూపంలో కేంద్రం ముందు ఉంచి, అందుకు తగ్గ నష్ట పరిహారం రాబట్టడం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నష్టపరిహారంతో అన్నదాతల్ని ఆదుకునే విధంగా ప్రత్యేక కార్యాచరణకు ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియను సాగించేందుకు చెన్నై మినహా తక్కిన 31 జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో బృందాలు ఈనెల తొమ్మిదో తేదీ వరకు గ్రామాల్లో పర్యటించి, నివేదికను పదో తేదీన ప్రభుత్వానికి సమర్పించే విధంగా ఆదేశాలు జారీ చేసినట్టు ప్రకటించారు. సంక్రాంతిని పురస్కరించుకుని కుటుంబ కార్డు దారులందరికీ పొగల్ వస్తువుల్ని కానుకగా ఇచ్చేందుకు నిర్ణయించినట్టు ప్రకటించారు. పన్నీరు భరోసాను రైతు సంఘాలు ఆహ్వానించాయి. ఈనెల ఐదో తేదీ నుంచి చేపట్ట దలచిన ఆందోళనల్ని విరమించుకున్నాయి. నేడు కెబినెట్ మీటింగ్ : రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి సీఎం పన్నీరు సెల్వం పిలుపు నిచ్చారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు సచివాలయం వేదికగా మంత్రి వర్గం భేటీ కానుంది. -
సీఎస్‌గా పగ్గాలు!
► గిరిజా వైద్యనాథన్ బాధ్యతల స్వీకరణ ► తొలి రోజే బిజీబిజీ ► తంగంకు రూ. 2 కోట్లు ► చెన్నై ఓపెన్ కు మరో రూ. రెండు కోట్లు సాక్షి, చెన్నై : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణతో శుక్రవారం తన విధుల్లో బిజీ అయ్యారు. సీఎం పన్నీరుసెల్వంతో కలసి సమీక్షల్లో, సచివాలయంలో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం పన్నీరు సెల్వం చేతుల మీదుగా రియో పారాలింపిక్ హీరో తంగవేల్‌కు, చెన్నై ఓపెన్ కు ప్రభుత్వ వాటా గా తలా రూ.రెండు కోట్లు చొప్పున చెక్కులను అందజేశారు. రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా సచివాలయంకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాకు మచ్చ చేకూర్చే రీతిలో ఐఏఎస్ అధికారి రామ్మోహన్ రావు అవినీతి బండారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు ఉద్వాసన పలికి ప్రధాన కార్యదర్శి స్థానాన్ని మహిళా అధికారి గిరిజా వైద్యనాథన్ ద్వారా భర్తీ చేస్తూ సీఎం పన్నీరుసెల్వం ప్రభుత్వం నిర్ణయించింది. 1981వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గిరిజా వైద్యనాథన్ 1983లో తిరువళ్లూరు సబ్‌కలెక్టర్‌గా, 1992లో మధురై కలెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో అడుగు పెట్టి, ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా స్థాయికి ఎదిగారు. రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో 45వ ప్రధాన కార్యదర్శిగా, మహిళా శక్తుల్లో నాలుగో అధికారిగా పగ్గాలు చేపట్టేందుకు శుక్రవారం ఉదయం సచివాలయానికి వచ్చిన గిరిజా వైద్యనాథన్ కు సహచర అధికారులు సాదర స్వాగతం పలికారు. తన చాంబర్లో కొత్త సీఎస్‌గా పగ్గాలు చేపట్టినానంతరం సీఎం పన్నీరుసెల్వంను మర్యాద పూర్వకంగా గిరిజా వైద్యనాథన్ కలిశారు. ఈసందర్భంగా పలువురు ఐఏఎస్‌లు, సచివాలయం వర్గాలు, కార్యదర్శులు కొత్త సీఎస్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పగుచ్ఛాలను అందజేశారు. పగ్గాలు చేపట్టగానే, సీఎం పన్నీరుసెల్వం వెన్నంటి ఉంటూ, పలు కార్యక్రమాల్లో గిరిజా వైద్యనాథన్ తొలి రోజే తన పదవికి న్యాయం చేకూర్చే విధంగా బిజీ అయ్యారు. తంగంకు రూ.2 కోట్లు : రియోలో జరిగిన పారాలింపిక్లో తమిళ తంగం మారియప్పన్ తంగవేలు బంగారు పతకం దక్కించుకున్న విషయం తెలిసిందే. తమిళ ఖ్యాతిని ఎలుగెత్తి చాటిన తంగంను సత్కరించే విధంగా, ప్రోత్సహించే రీతిలో అమ్మ జయలలిత రూ. రెండు కోట్లు నగదు బహుమతిని ప్రకటించారు. రియో నుంచి చెన్నైకు తంగం వచ్చే సమయానికి అమ్మ జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం, తదనంతర పరిణామాలతో ఆ నగదు బహుమతి వ్యవహారం తెర మరుగున పడిందని చెప్పవచ్చు. అయితే, అమ్మ జయలలిత చేసిన ప్రకటన మేరకు తంగంకు రూ. రెండు కోట్లు బహుమతిని అందించేందుకు సీఎం పన్నీరుసెల్వం నిర్ణయించారు. కొత్త సీఎస్ పగ్గాలు చేపట్టిన రోజే, తంగంకు ఆ బహుమతిని సచివాలయంలో అందజేశారు. తన కోచ్ సత్యనారాయణన్ తో కలిసి సచివాలయానికి వచ్చిన మారియప్పన్ తంగ వేలు రూ. రెండు కోట్లకుగాను చెక్కును సీఎం పన్నీరు సెల్వం చేతుల మీదుగా అందుకున్నారు. చెన్నై ఓపెన్ కు రూ. రెండు కోట్లు : ప్రతి ఏటా చెన్నైలో టెన్నిస్ పోటీలు సాగుతున్న విషయం తెలిసిందే. చెన్నై ఓపెన్ పేరుతో సాగుతున్న ఈ పోటీలకు అమ్మ జయలలిత తొలి నాళ్లలో రూ. కోటి నగదు కేటాయించారు. తదుపరి రూ. రెండు కోట్ల మేరకు నగదును అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ ఏడాది పోటీలకు రూ. రెండు కోట్లకుగాను చెక్కును సీఎం పన్నీరుసెల్వం అందించేందుకు నిర్ణయించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో చెన్నై ఓపెన్ అధ్యక్షుడు అళగప్పన్ ఆ చెక్కును అందుకున్నారు.ఈ కార్యక్రమంలో కొత్త సీఎస్ గిరిజా వైద్యనాథన్ పాల్గొన్నారు. తదుపరి రాష్ట్రంలో పెట్టుబడులు లక్ష్యంగా ముందుకు వచ్చిన జపాన్ కు చెందిన ప్రతినిధుల బృందంతో జరిగిన సమీక్షలో సీఎం పన్నీరుసెల్వం, ఇతర మంత్రుల బృందంతో కలిసి కొత్త సీఎస్ బిజీ అయ్యారు. -
అన్నదాతకు కన్నీళ్లే
► వర్దాతో భారీగా పంటనష్టం ► 28వేల హెక్టార్లలో దెబ్బతిన్న పంట ► త్వరలో సాయం ► మృతుల కుంటుంబాలకు రూ.4 లక్షలు ► మరో గండం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం ► రెవెన్యూ మంత్రి ఆర్బీ.ఉదయకుమార్ ► ముందస్తు చర్యలతో తగ్గిన ప్రాణనష్టం సాక్షి, చెన్నై : అసలే తీవ్ర కష్టాల్లో ఉన్న అన్నదాతను వర్దా మరింతగా దెబ్బతీసింది. మూడు జిల్లాల్లోని రైతులకు కన్నీళ్లు మిగిల్చే రీతిలో వర్దా విలయతాండవం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల మేరకు 28 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగింది. త్వరలో బాధితులకు సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, మరో గండం ముంచుకొస్తోందన్న ఆందోళన వద్దని, ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు ముందస్తుగానే సిద్ధం చేశామని ప్రకటించింది. తాజాగా తీసుకున్న ముందస్తు చర్యలతో పెను ప్రాణనష్టం తప్పినట్టు తెలిపింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ని అన్నదాతలు పంట సాగును పక్కనబెట్టి వలసబాట పట్టాల్సిన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కొందరు రైతులు సాహసం చేస్తుండగా, మరి కొందరు బతుకు బండి లాగించేందుకు పొలం బాట పడుతున్నారు. డెల్టా అన్నదాతలు కావేరి నీళ్లు అందక తీవ్ర కష్టాల్లో ఉంటే, దక్షిణాది, కొంగు మండలం రైతులు వర్షాలు కరువై కన్నీటి మడుగులో మునిగారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని రైతులను వర్దా ముంచేసిందని చెప్పవచ్చు. ఏ మేరకు పంటనష్టం జరిగిందో ఆ వివరాలు ప్రభుత్వం గుప్పెట్లోకి చేరడం బట్టి చూస్తే, ఏ మేరకు అన్నదాతలు విలవిల్లాడాల్సిన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. 28 వేల హెక్టార్లలో పంటనష్టం: సోమవారం ఎళిలగంలో రెవెన్యూ మంత్రి ఆర్బీ.ఉదయకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. వర్దా రూపంలో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో ఏ మేరకు పంటనష్టం జరిగిందో వివరాలను సేకరించినట్టు తెలిపారు. మొత్తం 28 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగిందని, రైతు లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అందరికీ త్వరలో నష్ట పరిహారం అందిస్తామన్నారు. 529 పశువులు, 299 మేకలు, 33 వేల కోళ్లు వర్దా ధాటికి మరణించాయని వివరించారు. 70 వేల గుడిసెలు దెబ్బతిన్నాయని, విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో అందించేందుకు ముమ్మరంగా చర్యలు సాగుతున్నాయన్నారు. ఆరుగురు మంత్రులు స్వయంగా పనుల్ని పర్యవేక్షిçస్తున్నారని వివరించారు. మరో గండాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం వర్దా ముప్పును ముందే గుర్తించి, ముందస్తుగా తీసుకున్న చర్యలతో పెను ప్రాణనష్టం తప్పినట్టు రెవెన్యూ శాఖ మంత్రి ఆర్బీ.ఉదయకుమార్ పేర్కొన్నారు. ఈ ధాటికి 24 మంది మరణించారని, ఈ కుటుంబాలను ఆదుకునేందుకు తలా రూ.4 లక్షలు చొప్పున సాయాన్ని ఇప్పటికే ప్రకటించామన్నారు. బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని గుర్తుచేశారు. దీని గురించి ఆందోళన వద్దని ప్రజలకు భరోసా ఇచ్చారు. మరో తుపాను ముప్పు తప్పదన్నట్టుగా ప్రచారం జరుగుతోందని, దీనిపై ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరో గండం ముంచుకొచ్చినా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలను ప్రభుత్వం సిద్ధం చేసిందని ధీమా వ్యక్తం చేశారు. సీఎంకు సహకారం సీఎం పన్నీరు సెల్వంకు తాను పూర్తి సహకారం అందిస్తున్నానని, ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు ఆర్బీ ఉదయకుమార్ సమాధానమిచ్చారు. పార్టీలోనూ, అధికారంలోనూ ఒకరే నేతృత్వం వహిస్తే, ఎలాంటి విమర్శలు, ఆరోపణలు, అపోహలకు తావు ఉండదన్నదే తన అభిమతంగా వ్యాఖ్యానించారు. సీఎం పన్నీరు సెల్వం అమ్మ జయలలితకు, అన్నాడీఎంకేకు విశ్వాసపాత్రుడు అని, ఆయన నుంచి విశ్వాసం నేర్చుకున్నానని పేర్కొన్నారు. -
పన్నీరుకు ఎసరా?
►జయ పేరవై తీర్మానంతో చర్చ ►చిన్నమ్మ చేతికి అధికారం చిక్కేనా? ►ఢిల్లీకి పన్నీర్ ► ఆసక్తికంగా అన్నాడీఎంకే రాజకీయం సాక్షి, చెన్నై: సీఎం పన్నీరుసెల్వం పదవికి ఎసరు పెట్టేందుకు పలువురు మంత్రులు సిద్ధమైనట్టున్నారు. అందుకే కాబోలు చిన్నమ్మ త్వరితగతిన సీఎం పగ్గాలు చేపట్టాలన్న నినాదాన్ని తెర మీదకు తెచ్చారు. అన్నాడీఎంకేలో కీలక పాత్ర పోషిస్తున్న జయ పేరవై వర్గాలు ఈ నినాదాన్ని అందుకోవడం చర్చకు దారి తీసింది. అదే సమయంలో సీఎం పన్నీరు సెల్వం ఢిల్లీకి పరుగులు తీయడం గమనించాల్సిన విషయం.అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ నాటకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్క ర్లేదు. చిన్నమ్మ శశికళలో అమ్మను చూసుకునేందుకు తగ్గట్టుగా అన్నాడీఎంకే సేనల చర్యలు సాగుతున్నాయి. ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టాలంటూ చిన్నమ్మ మీద ఒత్తిడి తెచ్చే రీతిలో తీర్మానాలు, కాళ్ల మీద పడి మరీ వేడుకోలు పర్వాలు సాగుతున్నాయి. అదే సమయంలో ఇదంతా చిన్నమ్మ దర్శకత్వమేనని విమర్శలు, ఆరోపణలు గుప్పించే వాళ్లూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జయ పేరవై తెరమీదకు తెచ్చిన కొత్త నినాదం అన్నాడీఎంకేలో చర్చకు దారి తీసింది. అలాగే, త్వరలో పన్నీరు సీఎం పదవికి ఎసరు తప్పదన్నట్టు ప్రచారం ఊపందుకుంది. పన్నీరుకు ఎసరా..జయలలిత మరణం తదుపరి సీఎం పగ్గాలు చేపట్టే విషయంగా అన్నాడీఎంకేలో పెద్ద వివాదమే సాగినట్టుగా సంకేతాలు ఉన్న విషయం తెలిసిందే. చివరకు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ జోక్యంతో ఆ పదవి పన్నీరు గుప్పెట్లోకి వచ్చిందన్న సమాచారం ఉంది. ఈ పరిస్థితుల్లో చినమ్మకు జై కొడుతున్న అమ్మ సేనల్లో అనేకులు ఏకంగా పన్నీరు పదవికి ఎసరు పెట్టేందుకు తగ్గ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టుంది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు తాజాగా అన్నాడీఎంకేలో తెర మీదకు వస్తున్నాయి. ఇన్నాళ్లు చిన్నమ్మే వారసురాలు, చిన్నమ్మే ప్రధాన కార్యదర్శి అని నినదించిన అన్నాడీఎంకే సేనలు, ఇక సీఎం పగ్గాలు చేపట్టాల్సిందేనని ఒత్తిడి తెచ్చే విధంగా ముందుకు సాగడం తథ్యం. ఇందుకు తగ్గ తీర్మానం ఏకంగా మెరీనాతీరంలోని అమ్మ సమాధి వద్ద ఆదివారం జయ పేరవై వర్గాలు తీసుకోవడం గమనించాల్సిన విషయం. జయ పేరవై తీర్మానంతో చర్చ : అన్నాడీఎంకే అనుబంధ విభాగాల్లో జయ పేరవై పాత్ర పార్టీలో కీలకంగా ఉంటున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే తరఫున ప్రతి ఎన్నికల్లో పోటీ చేసే వారిలో మెజారిటీ శాతం మంది జయ పేరవై వర్గాలే అన్న విషయం తెలిసిందే. ఈ పేరవై నుంచి విజయకేతనం ఎగురవేసే వారిలో పలువురికి మంత్రి పదవులు గ్యారంటీ. ప్రస్తుతం ఈ పేరవైకు రెవెన్యూ మంత్రి ఆర్బీ.ఉదయకుమార్ కార్యదర్శిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఈ పేరవై ప్రతినిధులు అనేక మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ నేపథ్యంలో అందరి కన్నా భిన్నంగా ఈ పేరవై వర్గాలు ఆదివారం తెర మీదకు తెచ్చిన తీర్మానం అన్నాడీఎంకేలో చర్చకు దారి తీసింది. ఏకంగా చిన్నమ్మే సీఎం అంటూ తీర్మానం చేయడమే కాదు, అందుకు తగ్గ నివేదికను తీసుకొచ్చి చిన్నమ్మ శశికళకు సమర్పించి ఆచరణలో పెట్టాలని వేడుకోవడం గమనార్హం. చిన్నమ్మే సీఎం : దివంగత సీఎం జయలలిత సమాధి వద్ద అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ సమక్షంలో జయ పేరవై కార్యవర్గం భేటీ అయింది. ఇందులో ఆ విభాగంలోని యాభై జిల్లాల కార్యదర్శులు, మంత్రులు ఆర్బీ. ఉదయకుమార్, కడంబూరు రాజు, సేవూరు రామచంద్రన్ పాల్గొని, చిన్నమ్మే సీఎం అని తీర్మానించడం గమనార్హం. ఆర్కే నగర్ నుంచి ఆమె పోటీ చేయాలని, సీఎం పగ్గాలు చేపట్టి, అమ్మ వదలి వెళ్లిన పనుల్ని కొనసాగించాలని నేతలందరూ ముక్తకంఠంగా నినదించారు. ఇది తమ నినాదం మాత్రం కాదు అని, అన్నాడీఎంకే వర్గాల ఎదురు చూపుగా జయ పేరవై ప్రకటించడం విశేషం. ఈ తీర్మానంతో ఇక, ప్రధాన కార్యదర్శి పగ్గాలు శశికళ చేపట్టాలని ఇన్నాళ్లు సాగుతున్న నినాదాలు తెర మరుగై సీఎం పగ్గాలు చేపట్టాలని నినదించే వారి సంఖ్య పెరుగుతుందేమో. ఇది కాస్త పన్నీరు పదవికి ఎసరు పెట్టేనా అన్న చర్చ బయలు దేరడం గమనించాల్సిందే. జయ పేరవై తీర్మానం సాగేందుకు కొన్ని గంటల ముందుగా పన్నీరుసెల్వం ఢిల్లీ పర్యటన ఖరారు కావడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. ఢిల్లీకి పన్నీరు సెల్వం : ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకీ పన్నీరు నిర్ణయించారు. సోమవారం ఢిల్లీలో ఈ భేటీ సాగనుంది. వర్దా తాండవంతో ఏర్పడ్డ నష్టాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు తగ్గ నివేదికను సిద్ధం చేసి ఉన్నారు. నిధుల కేటాయింపులతో పాటు, దివంగత సీఎంకు భారతరత్న ఇవ్వాలని, పార్లమెంట్ ఆవరణలో నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తులను ప్రధాని నరేంద్రమోదీ ముందు పన్నీరు ఉంచబోతున్నట్టు సమాచారం. అయితే, ఈ ఢిల్లీ పర్యటన పన్నీరు పదవిని నిలబెట్టేందుకు తగ్గ ప్రయత్నాలుగా కూడా ఉండొచ్చన్న ప్రచారం సాగడం గమనార్హం. -
కావేరీ..కలిపింది!
• భిన్న ధ్రువాల భేటీ • మంత్రి పన్నీరు సెల్వంతో స్టాలిన్ • కావేరీపై అఖిలపక్షానికి విజ్ఞప్తి • కావేరీ కోసం సహకరిస్తా: • గవర్నర్ హామీ తమిళనాడు రాజకీయాల్లో బలమైన భిన్న ధ్రువాలు భేటీ అయ్యాయి. రాజకీయ విభేదాలతో కత్తులు దూసుకునే ఇద్దరు అగ్రనేతలు కావేరీపై చర్చించుకున్నారు. వారిద్దరూ ఎవరో కాదు మంత్రి పన్నీర్ సెల్వం, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్. -సాక్షి ప్రతినిధి, చెన్నై సాక్షి ప్రతినిధి, చెన్నై : రాష్ట్రంలో ప్రధానంగా రెండు విషయాలు ప్రజల నోళ్లలో నానుతున్నాయి. ఒకటి ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం. మరొకటి కావేరీ జలవివాదం. కావేరీ వివాదం దశాబ్దాల తరబడి నానుతుండగా, జయ అనారోగ్యానికి జరుగుతున్న చికిత్స నెలరోజులకు చేరుకుంటోంది. ఈ రెండు అంశాలు ప్రస్తావనకు రాకుండా పొద్దుపొడవడం లేదు, పొద్దుగుంకడం లేదు అంటే అతిశయోక్తి కాదు. కాగా, కావేరీ సమస్యపై ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ఏకమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేపనిలో పడ్డాయి. డీఎంకే కార్యాలయంలో గురువారం నాడు స్టాలిన్ అధ్యక్షతన వివిధ పార్టీల నేతలు, రైతు సంఘాలు సమావేశమయ్యారు. కావేరీ జల వివాదంపై నిర్ణయాలు తీసుకునే బాధ్యతను స్టాలిన్‌కు ఏకగ్రీవంగా కట్టబెట్టాయి. కావేరీ పోరాటంపై స్టాలిన్ వెంటే నడుస్తామని ప్రకటించాయి. ఇందులో భాగంగా డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ శుక్రవారం ఉదయం సచివాలయానికి చేరుకున్నారు. స్టాలిన్ సచివాలయానికి రావడం సహజమే కాబట్టి సాధారణంగానే పరిగణించారు. అయితే ప్రతిపక్ష నేత కావడంతో మీడియా ఆయన్ను అనుసరించింది. స్టాలిన్ తన కార్యాలయానికి వెళతారు అని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన నేరుగా మంత్రి పన్నీర్‌సెల్వం చాంబర్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే వారి వద్ద సమాచారం ఉందేమో అక్కడి అధికారులు స్టాలిన్‌ను హడావుడిగా పన్నీర్‌సెల్వం చాంబర్లో పంపి తలుపు వేశారు. సుమారు అరగంటకు పైగా మంత్రి పన్నీర్‌సెల్వంతో సమావేశమైన స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతన్నల కన్నీరు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కావేరీ అంశంలో ప్రజలు సైతం ఏకతాటిపై నిలిచి ఉన్నారని కేంద్రానికి తెలియజేయాలి. సుప్రీంకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం ధిక్కరించడాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా ఖండించే విధంగా వెంటనే అన్ని పార్టీల అధ్యక్షులతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అన్నదాత జీవనాధారాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగాలి. అలాగే అత్యవసర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కావేరీపై తీర్మానాన్ని ఆమోదించాలని డీఎంకే కార్యాలయంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పన్నీర్ సెల్వం ముందు ఉంచినట్లు స్టాలిన్ తెలిపారు. సమావేశంలో చేసిన తీర్మానాల ప్రతిని అందజేశానని అన్నారు. మంత్రి పన్నీర్ సెల్వంకు తీర్మానాల ప్రతిని ఇచ్చినందువల్ల ఫలితం ఉంటుందని నమ్ముతున్నారా అని మీడియా ప్రశ్నించగా, నమ్మకం ఉన్నందునే ప్రతిని ఇచ్చానని బదులిచ్చారు. కావేరీ అంశం కోర్టులో ఉందని తమిళనాడు ప్రభుత్వం దాటవేస్తోంది కదా అని ప్రశ్నించగా, అది వేరు, ఇది వేరు, కర్ణాటక ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి అందరి అభిప్రాయాన్ని ఎలా ప్రజల ముందు ఉంచిందో తమిళనాడు ప్రభుత్వం కూడా అదే పోకడలో పయనించాలని ఆయన అన్నారు. అఖిలపక్ష నేతలతో ప్రధానిని కలిసేఁఊందుకు ప్రభుత్వం పూనుకోవాలని మంత్రి పన్నీర్ సెల్వంను కోరినట్లు తెలిపారు. అఖిలపక్షం అవసరం లేదు: బన్రుట్టి కావేరీ జలాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడం బాధాకరమని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి బన్రుట్టి రామచంద్రన్ అన్నారు. ఈనెల 18వ తేదీన కావేరీపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పనున్న తరుణంలో స్టాలిన్ కోరుతున్నట్లుగా అఖిల పక్ష సమావేశం అవసరం లేదని వ్యాఖ్యానించారు. కావేరీకి సహకరిస్తా: గవర్నర్ విద్యాసాగర్ రావుకావేరీ జల వివాదాన్ని పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తానని తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు హామీ ఇచ్చారు. తంజావూరులోని ఆలయాన్ని గురువారం సతీసమేతంగా సందర్శించారు. చెన్నై తమిళ్ సంఘం ఆధ్వర్యంలో తంజావూరు తమిళ్ యూనివర్సిటీలో ఆయనకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆహూతులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నలుగుతున్న కావేరీ సమస్య పరిష్కారానికి తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు.