మాటల తూటాలు | ayalalithaa's Legacy is Not Anyone's Property, Says Panneerselvam | Sakshi
Sakshi News home page

మాటల తూటాలు

Published Sat, Feb 11 2017 2:35 AM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM

ayalalithaa's Legacy is Not Anyone's Property, Says Panneerselvam

► పరస్పర బెదిరింపులు
► ఫిర్యాదుల హోరు
► పలు చోట్ల  భద్రత కట్టుదిట్టం
► మద్రాసు వర్సిటీ వద్ద భద్రత వెనక్కి


అన్నాడీఎంకే రాజకీయ ధారావాహికలో మలుపులు ఉత్కంఠగా సాగుతున్నాయి. చిన్నమ్మ శశికళ, ఆపద్ధ్దర్మ సీఎం పన్నీరు శిబిరాల మధ్య మాటల తూటాలు శుక్రవారం పేలాయి. బెదిరింపులు, హెచ్చరికల పర్వాలతో పరస్పరం ఫిర్యాదులు హోరెత్తాయి. రెండు శిబిరాల మధ్య సమరం వేడెక్కుతుండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక, మద్రాసు వర్సిటీ వద్ద భద్రత వెనక్కి తీసుకున్నారు.

సాక్షి, చెన్నై :   సీఎం కుర్చీ కోసం అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ సమరంలో ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శిబిరాల మధ్య మూడో రోజుగా శుక్రవారం ఎవరి ఎత్తులు వారివే అన్నట్టుగా రాజకీయ వ్యూహాలు సాగాయి. మాటల తూటాలు పేలాయి. తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారికి ఉద్వాసనలు పలికే విధంగా చిన్నమ్మ దూకుడును పెంచారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్  మధుసూదనన్ ను తొలగించి,  ఆ స్థానాన్ని పార్టీ నిర్వాహక కార్యదర్శి సెంగోట్టయ్యన్ కు అప్పగించారు. సెంగోట్టయ్యన్  చేతికి పగ్గాలు అప్పగిస్తూ చిన్నమ్మ తీసుకున్న నిర్ణయాన్ని అన్నాడీఎంకే శ్రేణులు ఆనందంగా ఆహ్వానించాయి. అలాగే, నిన్నటి వరకు పన్నీరు సెల్వంను టార్గెట్‌ చేసి దుమ్మెత్తి పోసిన చిన్నమ్మ శిబిరం, తాజాగా మధుసూదనన్ ను గురి పెట్టి విమర్శలు గుప్పించే పనిలో పడ్డాయి.

చిన్నమ్మకు మద్దతుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రులు గోకుల ఇందిర, వలర్మతి, అన్నాడీఎంకే అధికార ప్రతినిధులు వైగై సెల్వన్ , సీఆర్‌ సరస్వతి వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ప్రధాన కార్యదర్శి,   సీఎం పగ్గాలుచేపట్టాలని చిన్నమ్మ చేతులు పట్టుకుని మరీ వేడుకున్న నోరు, ఇప్పుడు మాట మార్చి క్షమించ రాని తప్ప చేసిందని ధ్వజమెత్తారు. ఆ ఇద్దరికీ ఇక, కష్ట కాలమేనని, వారి  వెంట వెళ్లే వాళ్లు, వెళ్లాలన్న ప్రయత్నంలో ఉన్న వాళ్లు  పునరాలోచించుకుంటే మందని హెచ్చరించారు. చిన్నమ్మ ఎన్నడూ పదవిని ఆశించ లేదని,  పార్టీకి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి రంగంలోకి దిగారన్నారు. తప్పులు చేసింది కాకుండా, వాటిని కప్పి పుచ్చుకునేందుకు పన్నీరు, మదుసూదన్ ధల్ని చిన్నమ మీద వేస్తున్నారని మండి పడ్డారు. సెంగోట్టయ్యన్ కు బాధ్యతల అప్పగింతతో పార్టీకి మరింత బలం చేకూరినట్టేనని ఆనందం వ్యక్తం చేశారు. చిన్నమ్మకు మద్దతు పలుకుతూ పోయేస్‌ గార్డెన్ కు వచ్చేనాయకులు  అందరూ మీడియా ముందుకు వచ్చి మరీ స్వరాన్ని పెంచి  పన్నీరు శిబిరం మీద మాటల తూటాల్ని పేల్చి వెళ్లారు.

ఎదురు దాడి :  తమను టార్గెట్‌ చేసి తూటాల్ని పేల్చిన చిన్న మ్మ శిబిరానికి గట్టిగా సమాధానం ఇచ్చే విధంగా మదుసూదనన్  స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీని సర్వనాశనం చేయడానికి చిన్నమ్మ ప్రయత్నాల్లో పడటం, ఆమె కుటుంబ పెత్తనం పెరగడం వల్లే తాను బయటకు వచ్చానన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పన్నీరు నేతృత్వంలో పార్టీని రక్షించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తనను తొలగించే అధికారం ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. పన్నీరు శిబిరంలోకి చేరుతున్న మాజీలు మీడియా ముందుకు వస్తూ, చిన్నమ్మ శిబిరం మీద దుమ్మెత్తి పోస్తూ ఎదురు దాడికి దిగే పనిలో పడ్డారు. ఇక, నాగపట్నం జిల్లాకు చెందిన రాధాకృష్ణన్, పౌన్ , భారతీలు ప్రస్తుతానికి చిన్నమ్మ క్యాంప్‌లో ఉన్నా, పన్నీరు శిబిరంలోకి దూరం ఖాయం అని వారి మద్దతు దారులు ప్రకటించడం గమనార్హం. కాగా, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు పొన్ను స్వామి పన్నీరు శిబిరంలోకి చేరారు.

భద్రత కట్టుదిట్టం : ఇరు శిబిరాల మధ్య మాటల తూటా లు పెరగడం, విమర్శలు ఆరోపణలు  హోరెత్తుతుండటం వెరసి శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా ముందు జాగ్రత్తల్లో పోలీసు యంత్రాంగం నిమగ్నం అయింది. గ్రీన్  వేస్‌ రోడ్డు, పోయేస్‌ గార్డెన్, అన్నాడిఎంకే కార్యాలయం ఆవరణలో గతంలో ఉన్న భద్రతను రెట్టింపు చేశారు. ఇక, రెండు శిబిరాలు, పరస్పరం బెదిరింపులు, హెచ్చరికల ఆరోపణలతో ఫిర్యాదులు హోరెత్తించే పనిలో పడ్డాయి. టీ నగర్‌ మాజీ ఎమ్మెల్యే కలై రాజన్  తమను బెదిరిస్తున్నట్టుగా పోలీసులకు పన్నీరు శిబిరం ఫిర్యాదు చేసింది. అలాగే, తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్‌ చేశారని కొందరు, తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటు మరి కొందరు తమ తమ ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదులు చేయడం పెరుగుతున్నాయి.

అలా గే, పోస్టర్లతో ఆహ్వానాలు, విజ్ఞప్తులు,చివరకు బెదిరింపుల పర్వం బయలు దేరి ఉన్నాయి. పన్నీరు శిబిరంలో చేరిన ఎమ్మెల్యే షన్ముగనాథన్  ఏకంగా చెన్నై కమిషనరేట్‌లో తనను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించారని, తప్పించకు వచ్చిన ట్టు వివరిస్తూ , సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అదే సమయంలో పన్నీరు శిబిరం తమను బెదిరిస్తున్నట్టుగా చిన్నమ్మ శిబిరం ఫిర్యాదులకు సిద్ధం అవుతోన్నాయి. తనను హతమారుస్తామన్న బెదిరింపులు వస్తున్నట్టు చిన్నమ్మ శిబిరంలో సీఆర్‌ సరస్వతి ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో రెండు శిబిరాల మధ్య వివాదం మరింతగా రాజుకునే పరిస్థితులు బయలు దేరడంతో చెన్నైలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి ఉన్నారు. కాగా, చిన్నమ్మ ప్రమాణ స్వీకారం తేది ఇప్పట్లో తేలే అవకాశాలు లే ని దృష్ట్యా, ఇందు కోసం ఎంపిక చేసిన వేదిక మద్రాసు వర్సి టీ ఆవరణలో కల్పించిన భద్రతను వెనక్కి తీసుకున్నారు.

స్వతంత్రంగా ఉన్నాం :  కిడ్నాప్‌ వ్యవహారంకోర్టుకు చేరడంతోచిన్నమ్మ మద్దతు ఎమ్మెల్యేలు పలువురు మీడియా ముందుకు వచ్చారు. క్యాంప్‌లోతాము ఆనందంగా ఉన్నామని, తమకు బెదిరింపులు వస్తుండటంతోనే ఫోన్లను స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నట్టు తెలిపారు. ఎవరూ తమను నిర్భందించ లేదని, తాము స్వతంత్రంగా  ఇక్కడ ఉన్నట్టు చెప్పారు. తమ కుటుంబీకులతో అవసరం వచ్చినప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నామని పలువురు మాత్రం ముందుకు వచ్చినా, వారి చుట్టూ భద్రతా కవచం వలే మన్నార్‌గుడి సేనలు ఉండటం గమనార్హం.

సుధాకరన్ పూజలు : జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్ మ్మ శశికళ సిఎం కావాలని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. దిండుగల్‌ జిల్లా పళనిలోని ప్రసిద్ది చెందిన సుబ్రమణ్యస్వామి ఆలయం కొండ కింద ఉన్న ఓ మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడ్డంకులు తొలగి చిన్నమ్మ సీఎం కావాలని వేడకున్నారు. .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement