madhusudanan
-
తెలంగాణ మండలి ప్రతిపక్ష నేతగా మధుసూదనచారి బాధ్యతల స్వీకరణ
-
రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో.. ఏ1గా మధుసూదన్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసం కేసులో 45 మందిని అరెస్టు చేసిన పోలీసులు యల్లారెడ్డికి చెందిన స్పోర్ట్స్ పర్సన్ మలవెల్లి మధుసూదన్‌ను ఏ1 గా చూపించారు. ప్రస్తుతానికి ఇతడే ప్రధాన నిందితుడు అయినప్పటికీ.. దర్యాప్తులో వేరే వ్యక్తుల పాత్ర తేలే అవకాశం ఉందని చెపున్నారు. మధుసూదన్‌తో సహా అరెస్ట్‌చేసిన నిందితులను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి.. రిమాండ్ రిపోర్టును దాఖ లు చేశారు. ఇందులో మొత్తం 56 మందిని ఇప్పటివరకు నిందితులుగా గుర్తించినట్లు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు పేర్కొన్నారు. 13 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో ఐపీసీ, రైల్వే, ప్రజా ఆస్తుల విధ్వంసక నిరోధక చట్టాల్లోని 15 సెక్షన్ల కింద నిందితులపై ఆరో పణలున మోదుచేశారు. ప్రాథమిక దర్యాప్తులో కుట్రకోణం వెలుగులోకి రావడంతో ఆదివారం నాటి నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో ఆమేరకు ఐపీసీలోని 120బీ సెక్షన్‌ను జోడించారు. కాగా, మధుసూదన్ జాతీయ కబడ్డీ ఆటగాడు. 18 మంది ప్రత్యక్ష సాక్షులు ఈ కేసులో క్షతగాత్రులు సహా 18 మందిని ప్రత్యక్ష సాక్షులుగా చేర్చారు. నిందితులుగా ఉన్న 56 మందీ ఫిజికల్, మెడికల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సా«ధించి ఆర్మీ ఉద్యోగం కోసం ఎదు రుచూస్తున్న వారేనని పోలీసులు పేర్కొన్నా రు. కేంద్రం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ నియా మక పథకానికి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూపు లు ఏర్పాటు చేశారని, ఇప్పటివరకు 8 గ్రూపులను గుర్తించామని, బిహార్‌లో జరిగిన అలర్ల వీడియోలను వీటిలో పోస్టు చేశారని రిపోర్టులో పేర్కొన్నారు. ఏడు వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లు పరారీలో ఉండగా.. ‘రైల్వేస్టేషన్ బ్లాక్’అడ్మిన్ రమేశ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ గ్రూప్ ద్వారా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసానికి ప్లాన్ చేశారని, పలు ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిర్వాహకులు, యజమానులు, డైరెక్టర్లు సహకరించారని పొందుపరిచారు. ఆస్తి, ఆత్మ రక్షణ కోసం పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారని బుల్లెట్ తగిలి రాకేష్ మరణించగా... మరో 12 మందికి గాయాలయ్యాయని రాశారు. ఈ రిపోర్ట్‌లో ఎక్కడా ఏపీలోని నరసరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ యజమాని ఆవుల సుబ్బారావు పేరు కనిపించ లేదు. సికింద్రాబాద్ స్టేషన్ మేనేజర్ రాజ నర్సు ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ వెల్లడించింది. విధ్వంసంలోని ప్రతి ఘట్టమూ సెల్ఫోన్లలో రికార్డింగ్ సికింద్రాబాద్ స్టేషన్లో స్వయంగా విధ్వంసం సృష్టించిన వారే సాక్ష్యాధారాలను పరోక్షంగా ఇచ్చారని అధికారులు చెప్తున్నారు. ఈ విధ్వంసంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తాము చేసే చర్యలను తమ ఫోన్లలో ఇతరుల ద్వారా రికార్డు చేయించారు. రైలు ఇంజిన్ పగలకొట్టడం దగ్గర నుంచి బోగీలు కాల్చడం వరకు ప్రతి ఘట్టాన్నీ ఇలా చిత్రీకరించారు. ఓ ఆందోళనకారుడు ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీలోకి ఎక్కి, అక్కడ దొరికిన కాగితాలను సీటులో వేసి, మంట అంటిస్తున్నదీ తన సెల్ఫోన్లో రికార్డు చేయించాడు. ఇలాంటి ఫొటోలు, వీడియోలను కొన్నింటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయగా మరికొన్ని గ్యాలరీల్లో సేవ్ అయి ఉన్నాయి. 45 మంది నిందితులను అరెస్టు చేసిన జీఆర్పీ పోలీసులు వారి నుంచి 44 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించి ఈ విధ్వంసానికి పథక రచన చేసిన వారి వివరాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలుసుకున్నారు. ఫోన్లలో ఉన్న వీడియో, ఫొటో సాక్ష్యాలను సేకరిం చారు. న్యాయస్థానం అనుమతితో ఈ ఫోన్ల ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి వీటిని పక్కా ఆధారాలుగా తయారు చేయాలని నిర్ణయిం చారు. మరోపక్క విధ్వంసం కేసును హైదరాబాద్ పోలీసులకు బదిలీ చేశామని రైల్వే ఎస్పీ ఆదివారం రాత్రి ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు ఇవ్వాలని, సోమవారం వరకు అలాంటివి అందలేదని నగర పోలీసులు చెప్తున్నారు. సుబ్బారావుని తెస్తారా? లేదా? ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటకు చెందిన సా యి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును ఈ కేసులో అరెస్టు చేయడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. విధ్వంసానికి పాల్పడిన నిందితుల్లో 272 మంది నగరంలోని ఇతడి బ్రాంచ్ అభ్యర్థులని పోలీసులు గుర్తించారు. అభ్యర్థులను రెచ్చగొట్టడంతోపాటు ఉదంతం జరగడానికి ముందు రోజు రాత్రి సికింద్రాబాద్ వచ్చాడని, ఘటన జరిగిన రోజు కొన్ని గంటలు ఉన్నాడని తేల్చారు. అయితే నరసరావుపేట పోలీసుల అదుపులో ఉన్న ఇతడిని తమకు అప్పగించాలంటూ రైల్వే పోలీసులు కోరలేదు. సుబ్బారావును నిందితుడిగా చేర్చడానికి మరికొన్ని ఆధారాలు అవసరమని ఓ అధికారి పేర్కొన్నారు. కీలక నిందితులది కామారెడ్డి జిల్లా సాక్షి, కామారెడ్డి: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేసులో కీలక నిందితులు కామారెడ్డి జిల్లాకు చెందిన వారే ఉన్నారు. కేసులో ఏ1గా ఉన్న మలపెల్లి మధుసూదన్ (20)ది ఎల్లారెడ్డి కాగా.. ఏ5 సంతోష్ (22) గాంధారి మండలం మాతుసంగెంకు చెందిన వాడు, ఏ13 బూక్య పెంట్య (19) మాచారెడ్డి మండలం ఎల్లంపేటకు చెందిన వ్యక్తిగా తేల్చారు. వీరితోపాటు విధ్వంసంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్లకు చెందిన మరో 12 మంది ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం పోలీసులు జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
కరోనాతోనే మధుసూదన్ మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన అల్లంపల్లి మధుసూదన్ మే 1న కరోనా కారణంగా మరణించారని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ హైకోర్టుకు తెలియజేశారు. తన భర్త మధుసూదన్ కు పాజిటివ్ వచ్చిందని గాంధీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లాక అతని ఆచూకీ తెలియడం లేదని భార్య మాధవి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. మధుసూదన్ మరణించిన సమాచారాన్ని తెలియజేద్దామంటే అప్పుడు ఆయన భార్య పిల్లలు క్వారంటైన్ లో ఉన్నారని ఏజీ తెలిపారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులే అంత్యక్రియలు నిర్వహించారని చెప్పారు. అంత్యక్రియల వీడియో రికార్డు, చితాభస్మం, మరణ ధ్రువీకరణ పత్రాలను పిటిషనర్‌కు అధికారులు అందజేస్తారని తెలిపారు. వీటిని పిటిషనర్‌కు అందజేసిన సమాచారాన్ని ఈ నెల 9న జరిగే విచారణ సమయంలో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. -
దినకరన్ కలవరం
► కేడర్‌తో రహస్య మంతనాలు ► గెలుపు కోసం తీవ్ర కుస్తీ ► దూసుకెళ్తోన్న మధుసూదనన్ ఆర్కేనగర్ రేసులో దిగిన అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ లో అప్పుడే కలవరం బయల్దేరింది. ఇందుకు కారణం, తన కోసం రంగంలోకి దిగి పనిచేసే ఆర్కేనగర్కు చెందిన స్థానిక నాయకులు ఒక్కొక్కరుగా పన్నీరు శిబిరం వైపుగా జంప్ అవుతోండడమే. సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణంతో ఖాళీగా ఉన్న ఆర్కేనగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందడి రాజుకున్న విషయం తెలిసిందే. ఈ సీటును కైవసం చేసుకునేందుకు ఓ వైపు డీఎంకే తీవ్రంగానే ప్రయత్నాలు, వ్యూహ రచనల్లో నిమగ్నమైంది. అన్నాడీఎంకేలో సాగుతున్న కుమ్ములాటల నేపథ్యంలో తమ సిట్టింగ్ స్థానం మళ్లీ ఖాతాలో పడేనా అన్న ఉత్కంఠ ఆ పార్టీ వర్గాల్లో బయల్దేరింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శిబిరానికి చెందిన ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ స్వయంగా రేసులో దిగారు. ఆయన్ను ఢీ కొట్టేందుకు మాజీ సీఎం పన్నీరు శిబిరంలో బలమైన వ్యక్తిగా మధుసూదనన్ బరిలో ఉన్నారు. అన్నాడీఎంకే ఓట్లను చీల్చేందుకు జయలలిత మేన కోడలు దీప సిద్ధం అవుతున్నారు. ఈ పరిణామాలు తమకు కలిసి వచ్చే అంశంగా డీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఓట్లు చీలకుండా, అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని తన గెలుపు లక్ష్యంగా ముందుకు సాగేందుకు టీటీవీ వ్యూహ రచనల్లో ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగా దీప కుటుంబంలో చిచ్చు రగిల్చారని చెప్పవచ్చు. అయితే అసలు చిక్కు అంతా మధుసూదనన్ రూపంలో దినకరన్ కు ముచ్చెమటలు పట్టే అవకాశాలు ఎక్కువే. దినకరన్ లో కలవరం: మధుసూదనన్ దివంగత ఎంజీయార్ కాలం నుంచి ఆర్కేనగర్ ఓటర్లకు సుపరిచితుడే. గతంలో ఓ మారు ఇక్కడి నుంచే ఆయన అసెంబ్లీ మెట్లు ఎక్కారు. నియోజకవర్గంలో ప్రతి వీధి, ప్రతి నాయకుడితో సంబంధాలు ఉండడం మధుసూదనన్ కు కలిసి వచ్చే అంశం. ముందుగా ఆయన ఆ నియోజకవర్గంలోని నాయకుల్ని గురి పెట్టి వారి ఇంటి గడప తొక్కి వస్తున్నారు. దీంతో స్థానికంగా ఎన్నికల బరిలో దిగి పనిచేసే ముఖ్య నాయకులు అనేక మంది మధుసూదనన్ కు మద్దతుగా పన్నీరు శిబిరం వైపుగా కదులుతుండడం టీటీవీ దినకరన్ ను కలవరంలో పడేసింది. స్థానికంగా ఉన్న రాజేష్, జనార్దన్, అంజులక్ష్మి, లలిత, శశి వంటి నాయకులు పన్నీరు వైపుగా వెళ్లినా, కార్యకర్తలు మాత్రం తనకు అండగా ఉంటారన్న ఎదురు చూపుల్లో దినకరన్ ఉన్నారు. ఒక్కో ప్రాంతం నుంచి నాయకుల్ని పక్కన పెట్టి కార్యకర్తల్ని పార్టీ కార్యాలయానికి పిలిపించి దినకరన్ రహస్య మంతనాలు సాగిస్తుండడం గమనించాల్సిన విషయం. కార్యకర్తల్లో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపే విధంగా ఈ మంతనాలు సాగుతున్నట్టు సమాచారం. స్థానిక నాయకులు హ్యాండిచ్చినా, కార్యకర్త తనకు అండగా ఉంటే, వారి ద్వారా ఎన్నికల పనుల్ని వేగవంతం చేయించవచ్చన్న ఆశాభావంతో దినకరన్ అడుగులు ముందుకు కదులుతున్నట్టు ఆర్కేనగర్లోని అన్నాడీఎంకే కార్యకర్తలు పేర్కొంటున్నారు. -
మరింత వేడెక్కిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక
జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక మరింత వేడెక్కింది. ఏప్రిల్ 12వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. గతంలో అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌గా పోటీ చేసిన ఇ. మధుసూదనన్‌ను తమ వర్గం తరఫున అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే అన్నాడీఎంకే అభ్యర్థిగా శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. డీఎంకే నుంచి మరుతు గణేశ్ పోటీలో ఉండబోతున్నారు. బీజేపీ నుంచి ప్రముఖ సినీనటి గౌతమి బరిలోకి దిగుతున్నారని వినిపించింది. ఇక జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ పోటీ చేస్తారా లేదా అన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఆమె సొంతంగా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించినా, ఇప్పటివరకు ఆమెకు ఎంతమంది మద్దతుగా ఉంటారో తెలియరాలేదు. అయితే.. అవతలి నుంచి ఎంతమంది పోటీలో ఉన్నా తాను మాత్రం కనీసం 50వేల ఓట్ల మెజారిటీతో నెగ్గుతానని దినకరన్ ధీమాగా చెబుతున్నారు. పార్టీ గుర్తయిన రెండాకుల గుర్తు మీద ఈనెల 23వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. అయితే, ఆ గుర్తు తమకే చెందాలంటూ పన్నీర్ సెల్వం వర్గం ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ విషయంలో ఈసీ ఇంకా తన నిర్ణయం వెలువరించాల్సి ఉంది. -
మాటల తూటాలు
► పరస్పర బెదిరింపులు ► ఫిర్యాదుల హోరు ► పలు చోట్ల భద్రత కట్టుదిట్టం ► మద్రాసు వర్సిటీ వద్ద భద్రత వెనక్కి అన్నాడీఎంకే రాజకీయ ధారావాహికలో మలుపులు ఉత్కంఠగా సాగుతున్నాయి. చిన్నమ్మ శశికళ, ఆపద్ధ్దర్మ సీఎం పన్నీరు శిబిరాల మధ్య మాటల తూటాలు శుక్రవారం పేలాయి. బెదిరింపులు, హెచ్చరికల పర్వాలతో పరస్పరం ఫిర్యాదులు హోరెత్తాయి. రెండు శిబిరాల మధ్య సమరం వేడెక్కుతుండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక, మద్రాసు వర్సిటీ వద్ద భద్రత వెనక్కి తీసుకున్నారు. సాక్షి, చెన్నై : సీఎం కుర్చీ కోసం అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ సమరంలో ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శిబిరాల మధ్య మూడో రోజుగా శుక్రవారం ఎవరి ఎత్తులు వారివే అన్నట్టుగా రాజకీయ వ్యూహాలు సాగాయి. మాటల తూటాలు పేలాయి. తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారికి ఉద్వాసనలు పలికే విధంగా చిన్నమ్మ దూకుడును పెంచారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ ను తొలగించి, ఆ స్థానాన్ని పార్టీ నిర్వాహక కార్యదర్శి సెంగోట్టయ్యన్ కు అప్పగించారు. సెంగోట్టయ్యన్ చేతికి పగ్గాలు అప్పగిస్తూ చిన్నమ్మ తీసుకున్న నిర్ణయాన్ని అన్నాడీఎంకే శ్రేణులు ఆనందంగా ఆహ్వానించాయి. అలాగే, నిన్నటి వరకు పన్నీరు సెల్వంను టార్గెట్ చేసి దుమ్మెత్తి పోసిన చిన్నమ్మ శిబిరం, తాజాగా మధుసూదనన్ ను గురి పెట్టి విమర్శలు గుప్పించే పనిలో పడ్డాయి. చిన్నమ్మకు మద్దతుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రులు గోకుల ఇందిర, వలర్మతి, అన్నాడీఎంకే అధికార ప్రతినిధులు వైగై సెల్వన్ , సీఆర్ సరస్వతి వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ప్రధాన కార్యదర్శి, సీఎం పగ్గాలుచేపట్టాలని చిన్నమ్మ చేతులు పట్టుకుని మరీ వేడుకున్న నోరు, ఇప్పుడు మాట మార్చి క్షమించ రాని తప్ప చేసిందని ధ్వజమెత్తారు. ఆ ఇద్దరికీ ఇక, కష్ట కాలమేనని, వారి వెంట వెళ్లే వాళ్లు, వెళ్లాలన్న ప్రయత్నంలో ఉన్న వాళ్లు పునరాలోచించుకుంటే మందని హెచ్చరించారు. చిన్నమ్మ ఎన్నడూ పదవిని ఆశించ లేదని, పార్టీకి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి రంగంలోకి దిగారన్నారు. తప్పులు చేసింది కాకుండా, వాటిని కప్పి పుచ్చుకునేందుకు పన్నీరు, మదుసూదన్ ధల్ని చిన్నమ మీద వేస్తున్నారని మండి పడ్డారు. సెంగోట్టయ్యన్ కు బాధ్యతల అప్పగింతతో పార్టీకి మరింత బలం చేకూరినట్టేనని ఆనందం వ్యక్తం చేశారు. చిన్నమ్మకు మద్దతు పలుకుతూ పోయేస్ గార్డెన్ కు వచ్చేనాయకులు అందరూ మీడియా ముందుకు వచ్చి మరీ స్వరాన్ని పెంచి పన్నీరు శిబిరం మీద మాటల తూటాల్ని పేల్చి వెళ్లారు. ఎదురు దాడి : తమను టార్గెట్ చేసి తూటాల్ని పేల్చిన చిన్న మ్మ శిబిరానికి గట్టిగా సమాధానం ఇచ్చే విధంగా మదుసూదనన్ స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీని సర్వనాశనం చేయడానికి చిన్నమ్మ ప్రయత్నాల్లో పడటం, ఆమె కుటుంబ పెత్తనం పెరగడం వల్లే తాను బయటకు వచ్చానన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పన్నీరు నేతృత్వంలో పార్టీని రక్షించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తనను తొలగించే అధికారం ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. పన్నీరు శిబిరంలోకి చేరుతున్న మాజీలు మీడియా ముందుకు వస్తూ, చిన్నమ్మ శిబిరం మీద దుమ్మెత్తి పోస్తూ ఎదురు దాడికి దిగే పనిలో పడ్డారు. ఇక, నాగపట్నం జిల్లాకు చెందిన రాధాకృష్ణన్, పౌన్ , భారతీలు ప్రస్తుతానికి చిన్నమ్మ క్యాంప్‌లో ఉన్నా, పన్నీరు శిబిరంలోకి దూరం ఖాయం అని వారి మద్దతు దారులు ప్రకటించడం గమనార్హం. కాగా, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు పొన్ను స్వామి పన్నీరు శిబిరంలోకి చేరారు. భద్రత కట్టుదిట్టం : ఇరు శిబిరాల మధ్య మాటల తూటా లు పెరగడం, విమర్శలు ఆరోపణలు హోరెత్తుతుండటం వెరసి శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా ముందు జాగ్రత్తల్లో పోలీసు యంత్రాంగం నిమగ్నం అయింది. గ్రీన్ వేస్ రోడ్డు, పోయేస్ గార్డెన్, అన్నాడిఎంకే కార్యాలయం ఆవరణలో గతంలో ఉన్న భద్రతను రెట్టింపు చేశారు. ఇక, రెండు శిబిరాలు, పరస్పరం బెదిరింపులు, హెచ్చరికల ఆరోపణలతో ఫిర్యాదులు హోరెత్తించే పనిలో పడ్డాయి. టీ నగర్ మాజీ ఎమ్మెల్యే కలై రాజన్ తమను బెదిరిస్తున్నట్టుగా పోలీసులకు పన్నీరు శిబిరం ఫిర్యాదు చేసింది. అలాగే, తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని కొందరు, తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటు మరి కొందరు తమ తమ ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదులు చేయడం పెరుగుతున్నాయి. అలా గే, పోస్టర్లతో ఆహ్వానాలు, విజ్ఞప్తులు,చివరకు బెదిరింపుల పర్వం బయలు దేరి ఉన్నాయి. పన్నీరు శిబిరంలో చేరిన ఎమ్మెల్యే షన్ముగనాథన్ ఏకంగా చెన్నై కమిషనరేట్‌లో తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని, తప్పించకు వచ్చిన ట్టు వివరిస్తూ , సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అదే సమయంలో పన్నీరు శిబిరం తమను బెదిరిస్తున్నట్టుగా చిన్నమ్మ శిబిరం ఫిర్యాదులకు సిద్ధం అవుతోన్నాయి. తనను హతమారుస్తామన్న బెదిరింపులు వస్తున్నట్టు చిన్నమ్మ శిబిరంలో సీఆర్ సరస్వతి ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో రెండు శిబిరాల మధ్య వివాదం మరింతగా రాజుకునే పరిస్థితులు బయలు దేరడంతో చెన్నైలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి ఉన్నారు. కాగా, చిన్నమ్మ ప్రమాణ స్వీకారం తేది ఇప్పట్లో తేలే అవకాశాలు లే ని దృష్ట్యా, ఇందు కోసం ఎంపిక చేసిన వేదిక మద్రాసు వర్సి టీ ఆవరణలో కల్పించిన భద్రతను వెనక్కి తీసుకున్నారు. స్వతంత్రంగా ఉన్నాం : కిడ్నాప్ వ్యవహారంకోర్టుకు చేరడంతోచిన్నమ్మ మద్దతు ఎమ్మెల్యేలు పలువురు మీడియా ముందుకు వచ్చారు. క్యాంప్లోతాము ఆనందంగా ఉన్నామని, తమకు బెదిరింపులు వస్తుండటంతోనే ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టు తెలిపారు. ఎవరూ తమను నిర్భందించ లేదని, తాము స్వతంత్రంగా ఇక్కడ ఉన్నట్టు చెప్పారు. తమ కుటుంబీకులతో అవసరం వచ్చినప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నామని పలువురు మాత్రం ముందుకు వచ్చినా, వారి చుట్టూ భద్రతా కవచం వలే మన్నార్గుడి సేనలు ఉండటం గమనార్హం. సుధాకరన్ పూజలు : జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్ మ్మ శశికళ సిఎం కావాలని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. దిండుగల్ జిల్లా పళనిలోని ప్రసిద్ది చెందిన సుబ్రమణ్యస్వామి ఆలయం కొండ కింద ఉన్న ఓ మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడ్డంకులు తొలగి చిన్నమ్మ సీఎం కావాలని వేడకున్నారు. . -
శశికళ కుటుంబానికి సేవలు చేయాలా?
-
శశికళ కుటుంబానికి సేవలు చేయాలా?
అన్నాడీఎంకే వ్యవస్థాపక సభ్యులలో ఆయనొకరు. పార్టీలో జయలలిత తర్వాత దాదాపు అంతటిస్థానంలో ఉన్న వ్యక్తి. అలాంటి పెద్దమనిషి తొలుత శశికళ ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. కానీ తర్వాత బయటకు వచ్చేసి పన్నీర్ సెల్వానికి బహిరంగంగా మద్దతు పలికారు. ఆయనే ఇ. మధుసూదనన్. పార్టీ ప్రిసీడియం చైర్మన్. శశికళ కుటుంబ సభ్యుల పెత్తనం భరించలేకే తాను అక్కడి నుంచి వచ్చేశానని, పన్నీర్ సెల్వానికి జరిగిన అవమానం రేపు తనకూ జరగొచ్చన్న అంచనాయే తనను బయటకు రప్పించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జయలలిత మరణం తర్వాత శశికళ స్వతంత్రంగా, గౌరవప్రదంగా పార్టీని నడిపిస్తారని తాను భావించాను గానీ.. క్రమంగా ఆమె కుటుంబ సభ్యులంతా పెత్తనం చేయడం మొదలుపెట్టారని ఆయన అన్నారు. దాన్ని తాను భరించలేకపోయానని చెప్పారు. ఓపీఎస్‌కు జరిగిన అవమానం విషయం కూడా తనకు తొలుత తెలియదని, ఆ తర్వాత తెలిసి.. రేపు తనకు కూడా అలా జరగబోదన్న నమ్మకం ఏముందని భావించినట్లు మధుసూదనన్ తెలిపారు. ప్రిసీడియం చైర్మన్ స్థానంలో ఉన్న తాను, ఇతర నాయకులు శశికళ కుటుంబానికి సేవలు చేసేందుకు లేమని, పార్టీని కాపాడాలన్నదే తన ధ్యేయమని అన్నారు. తొలుత శశికళ మేనల్లుడు దినకరన్ వచ్చాడని, ఆ తర్వాత మొత్తం కుటుంబం అంతా దిగిపోయిందని చెప్పారు. జయలలిత ఎవరెవరిని బహిష్కరించారో వాళ్లంతా ఇప్పుడు మళ్లీ వచ్చేసి పార్టీపై పెత్తనం చలాయిస్తున్నారని మండిపడ్డారు. డీఎంకేలో కుటుంబ పాలనను తాను ఎప్పుడూ వ్యతిరేకించానని, ఇప్పుడు అవే రాజకీయాలు సొంత పార్టీలోకి వస్తే ఎలా భరిస్తానని ప్రశ్నించారు. పన్నీర్ సెల్వానికి డీఎంకే మద్దతు లేనే లేదని, తామిద్దరం అన్నాడీఎంకే వ్యవస్థపక సభ్యులమని చెప్పారు. అయినా రాష్ట్రాన్ని పాలించాలనుకున్న డీఎంకే.. పన్నీర్ సెల్వానికి మద్దతు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. తన రక్తంలో చివరి బొట్టువరకు డీఎంకేను వ్యతిరేకిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఇక సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేలను దాదాపు అరెస్టు చేసినంత పని చేశారని, చివరకు అసెంబ్లీలో బల నిరూపణ వరకు వచ్చేసరికి వాళ్లలో చాలామంది ఓపీఎస్‌కే మద్దతు పలుకుతారని ధీమా వ్యక్తం చేశారు. జయలలిత మరణించి మూడు నెలలు కూడా కాకముందే శశికళ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారని, ఆమెకంత తొందర ఎందుకుని మధుసూదనన్ ప్రశ్నించారు. సంబంధిత కథనాలు చదవండి.. శశికళకు భారీ ఊరట! మా ఆవిడ మిస్సింగ్..! మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్! శశికళకు మేం మద్దతు ఇవ్వం చిన్నమ్మకే ఛాన్స్.. కానీ! గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. శశికళ దిష్టి బొమ్మల దహనం శశికళ కాదు కుట్రకళ విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం! 'జయ వారసుడు' హీరో అజిత్ ఎక్కడ? శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్? పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు! -
దూకుడు పెంచిన పన్నీర్
-
దూకుడు పెంచిన పన్నీర్
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దూకుడు పెంచారు. ప్రస్తుతం ఎటూ ముఖ్యమంత్రి హోదాలోనే ఉన్నారు కాబట్టి, తనకున్న అన్ని అవకాశాలను వదలకుండా వాడుకుంటున్నారు. సాయంత్రం 5 గంటలకు శశికళకు గవర్నర్ అపాయింట్మెంట్ దొరికిందన్న విషయం తెలిసి.. అంతకంటే ముందే ఆయనను కలిసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నేరుగా విమానాశ్రయానికే వెళ్లి విద్యాసాగర్‌రావును కలవాలని నిర్ణయించుకున్నారు. గవర్నర్‌కు స్వాగతం పలికే అవకాశం ముఖ్యమంత్రికి ఉంటుంది కాబట్టి.. అక్కడే ఆయనను కలిసి తన వాదన వినిపించడం, ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కూడా వీలైతే అక్కడే ఇచ్చేయడం ద్వారా ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక పార్టీ ప్రిసీడియం చైర్మన్ (గౌరవాధ్యక్షుడు) మధుసూదనన్ తమవైపు రావడం, తనకు మద్దతివ్వడం పట్ల పన్నీర్ సెల్వం సంతోషం వ్యక్తం చేశారు. పార్టీని సంరక్షించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. శశికళ ఎమ్మెల్యేలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని, సీనియర్ నాయకుడైన మధుసూదనన్‌ను సైతం ఆమె బెదిరించారని చెప్పారు. ఎమ్మెల్యేలంతా తమతోనే వస్తారని, పార్టీని కాపాడకపోతే అమ్మ ఆత్మ తనను క్షమించదని అన్నారు. జయలలితను కూడా శశికళ మోసం చేశారని, పార్టీని ప్రభుత్వాన్ని తన స్వార్థం కోసం వాడుకున్నారని పన్నీర్ సెల్వం చెప్పారు. శశికళ ముఖ్యమంత్రి అయితే అది ప్రజాస్వామ్యానికే మచ్చ అని, ఆమె సీఎం కాకుండా సర్వశక్తులు ఒడ్డుతామని అన్నారు. పదవి కోసం శశికళ చెత్త రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. -
శశికళకు భారీ ఝలక్: మధు ఔట్!
ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలన్న ఆశలు శశికళ శిబిరంలో క్రమంగా ఆవిరవుతున్నాయి. పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదనన్ శశి వర్గం నుంచి జారిపోయారు. ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వద్దకు వెళ్లారు. మధుసూదన్నను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయాలని అమ్మ తనకు చెప్పినట్లు రెండు రోజుల క్రితం పన్నీర్ సెల్వం మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. దాంతో మధుసూదన్ కూడా అమ్మకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరున్న పన్నీర్ సెల్వం వైపు వచ్చేశారు. మరోవైపు క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా పన్నీర్ సెల్వం వైపు వెళ్లిపోతున్నారు. దాంతో శశికళ వర్గంలో ఆందోళన మొదలైంది. మహాబలిపురం గోల్డెన్ బే రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలలో ఎవరూ బయటకు కదలకుండా చూడాలని గట్టి ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు బల నిరూపణకు ఆదేశిస్తే మరికొందరు ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వైపు వెళ్లిపోతారేమోనన్న గుబులు పుడుతోంది. దీంతో క్యాంపు చుట్టూ పటిష్ఠమైన భద్రత ఏర్పాటుచేస్తున్నారు. అయితే.. శశికళకు విధేయుడిగా ఉంటున్నారన్న అనుమానంతో చెన్నై పోలీసు కమిషనర్ జార్జిపై ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బదిలీ వేటు వేశారు. అలాగే క్యాంపులో బంధించిన ఎమ్మెల్యేలందరినీ తీసుకురావాలని కూడా డీజీపీకి, ఇంటెలిజెన్స్ చీఫ్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ఇవన్నీ తెలిసి శశికళ వర్గంలో నిరాశా నిస్పృహలు మొదలయ్యాయి. -
శశికళకు భారీ ఝలక్: మధు ఔట్!