జయలలిత మరణం తర్వాత తమిళనాడు అసెంబ్లీలో 233 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. పన్నీర్ సెల్వంకు 50 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది తన వర్గంలో చేరితే ఆయన బలం పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతిపక్ష నేత స్టాలిన్ సైతం పన్నీర్‌కు అండగా నిలుస్తున్నారు. డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు