
శశికళ నుంచి కేసీఆర్‌కు ప్రాణహాని
టీపీసీసీ అధికార ప్రతినిధి రమ్య ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు ఆయన మరదలు కుదురుపాక శశికళ నుంచి ప్రాణహాని ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్య (కేసీఆర్ అన్న కుమార్తె) ఆరోపించారు.
శనివారం ఇక్కడ విలేకరులతో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీతోనే ఆయనకు ప్రాణహాని ఉందన్నారు. తమిళనాడులో మాదిరి తెలంగాణలో కుదురుపాక గ్రామానికి చెందిన కొందరు మాఫియాగా ఏర్పడి కేసీఆర్‌ను పొట్టనబెట్టుకునే ప్రమాదముందన్నారు.