Regulapati Ramya
-
శశికళ నుంచి కేసీఆర్‌కు ప్రాణహాని
టీపీసీసీ అధికార ప్రతినిధి రమ్య ఆరోపణ సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు ఆయన మరదలు కుదురుపాక శశికళ నుంచి ప్రాణహాని ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్య (కేసీఆర్ అన్న కుమార్తె) ఆరోపించారు. శనివారం ఇక్కడ విలేకరులతో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీతోనే ఆయనకు ప్రాణహాని ఉందన్నారు. తమిళనాడులో మాదిరి తెలంగాణలో కుదురుపాక గ్రామానికి చెందిన కొందరు మాఫియాగా ఏర్పడి కేసీఆర్‌ను పొట్టనబెట్టుకునే ప్రమాదముందన్నారు. -
తవ్వకాలను నిలిపివేయాలి
హెచ్ఆర్సీలో సీఎం కేసీఆర్ సోదరుడి కూతురు రమ్య ఫిర్యాదు హైదరాబాద్: భూకబ్జాలు చేసి విచ్చలవిడిగా తవ్వకాలు చేపడుతున్నవారిపై తక్షణం చర్యలు తీసుకునేలా చూడాలని సీఎం కేసీఆర్ అన్న కూతురు రేగులపాటి రమ్య శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)ను ఆశ్రయించారు. కరీంనగర్ జిల్లా ఎలగందులలోని సర్వే నంబర్ 25లో ఉన్న తన మూడెకరాల భూమి పక్కన గల భూమిలో గోల్డ్‌మైన్ అనే కంపెనీ తవ్వకాలు చేపట్టి మట్టిని తన భూమిలో వేస్తోందని ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ తవ్వకాలను నిలిపివేయాలని కోరారు. సీఎంకు అతి సన్నిహితులు ఈ భూములను లీజుకు తీసుకోవడంతో అధికారులు తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ విషయంపై తన భర్తను సీఎం సన్నిహితులు బెదిరిస్తున్నారని, దీంతో తన భర్త ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. తనకు జరిగిన అన్యాయానికి పరిహారం అందేలా చూడాలని హెచ్ఆర్సీని కోరారు. -
కాంగ్రెస్‌లో చేరిన కేసీఆర్ అన్న కూతురు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు రాజకీయంగా, వ్యక్తిగతంగా అభద్రతా భావముందని ఆయన అన్నకూతురు రేగులపాటి రమ్య వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో బుధవారం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమ్య మాట్లాడుతూ.. రాజకీయ అభద్రత వల్లనే ఇతర పార్టీల నుంచి చేరికలు ప్రోత్సహిస్తున్నాడని విమర్శించారు. అబద్ధాలు చెప్పడం చిన్నాన్న(కేసీఆర్)కు చిన్నప్పటి నుంచి అలవాటేనని ఇంట్లోవారందరూ అంటుండేవారని ఆమె చెప్పారు. రామోజీ ఫిలింసిటీలో అసైన్డు భూములున్నాయని టీఆర్ఎస్ ఆవిర్భావంలోనే కేసీఆర్ చెప్పారని, ఇప్పుడేమో మాటమారుస్తున్నారని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఉద్యమకారుడిననే అనుకుంటున్నారని అందుకే నోటికొచ్చినట్లుగా మీడియాను పాతరేస్తానంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.