
చెన్నై : తమిళనాడులో కొత్త పార్టీలకు కొదవలేకుండా పోతుంది. తాజాగా శశికళ సోదరుడు దివాకరన్ కొత్త రాజకీయా పార్టీని స్థాపించారు. గతంలో అన్నాడీఎంకే నుంచి బయటికిచ్చిన శశికళ వర్గం నాయకుడు దినకరన్ పెట్టిన అమ్మ మక్కల్ మున్నెట్రా కదగజం పార్టీలో ఉన్న దివాకరన్ ఇప్పుడు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని ‘అమ్మ అని’ అనగా ‘అమ్మ జట్టు’ అనే కొత్త పార్టీని నెలకొల్పారు. తెలుపు, నలుపు, ఎరుపు, మధ్యలో ఆకుపచ్చ వర్ణాలతో పార్టీ జెండాను ఆదివారం చెన్నైలో ఆవిష్కరించారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం అనంతరం తమిళనాడలో ఇప్పటికే దినకరన్, ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌లు కొత్త పార్టీలను స్థాపించిన సంగతి తెలిసిందే. అలాగే గతంతో జయలలిత మేనకోడలు దీప కూడా ఎంజీఆర్ అమ్మ దీప పేరవాయి పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. సుపర్‌స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయ పార్టీ పడతానని ప్రకటించారు. కేవలం జయ మరణం కారణంగానే తమిళనాడులో ఇన్ని రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.