ఆ రూపం ఎవరిది? | new telugu Shashikala | Sakshi
Sakshi News home page

ఆ రూపం ఎవరిది?

Published Wed, Apr 6 2016 10:26 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

ఆ రూపం ఎవరిది?

ఆ రూపం ఎవరిది?

ఆ భవంతిలో ఇద్దరు పిల్లలు. అమ్మ లేదు. కానీ వాళ్లను ఓ రూపం లాలిస్తోంది. కంటికి రెప్పలా కాపాడుతోంది. ఆ రూపాన్నే అమ్మ అనుకుంటున్నారు. మరి ఆమె ఎవరు.... వాళ్లకి ఆ పిల్లలకి ఏంటి సంబంధం...? అనే అంశాలతో తెరకెక్కిన ఓ తమిళ చిత్రం తెలుగులో రానుంది. జయరాజ్, నితిన్ రాజ్, మిషా ఘోషల్ ముఖ్యపాత్రల్లో  నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘శశికళ’గా  నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులో  ఈ నెల 15న విడుదల చేయనున్నారు.
 
 నిర్మాత మాట్లాడుతూ- ‘‘సెంటిమెంటల్ హారర్ చిత్రంగా రూపొందిన మా ‘శశికళ’లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా సోదరుడు జయరాజ్ ఓ ముఖ్య పాత్ర పోషించారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకటేశ్, సంగీతం: నిత్యన్ కార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శివ వై-ప్రసాద్ బి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement