jayaraj
-
చిరస్మరణీయుడు కాళోజీ
గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): ప్రముఖ ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహనీయుడని పలువురు ప్రముఖులు కొనియాడారు. శనివారం ఇక్కడి రవీంద్రభారతిలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాళోజీ 109వ జయంతి ఉత్సవాలు, తెలంగాణ భాషా దినోత్సవాలను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎౖMð్సజ్, సాంస్కృతిక శాఖల మంత్రి వి.శ్రీని వాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్ప డిన తర్వాత ఈ ప్రాంత మహనీయుల జయంతి, వర్థంతి వేడుకలను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికా రికంగా నిర్వహిస్తోందని తెలిపారు. సాహిత్య రంగానికి కాళోజీ చేసిన సేవలను కొనియాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాళోజీ స్వాతంత్య్ర సమరయోధుడిగా, ప్రజా కవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. కొంతమంది మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని, అందులో కాళోజీ ఒకరని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ కవి జయరాజ్ కు కాళోజీ స్మారక పురస్కారం ప్రదానం చేశారు. రూ.1,00,116 రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీని వాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమ ణాచారి, కార్పొరేషన్ల చైర్మన్లు జూలూరు గౌరీశంకర్, ఆయాచితం శ్రీధర్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, దీపికారెడ్డి, ఎం.శ్రీదేవి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పలువురు కవులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్
హీరోయిన్ ఒక హత్య చూస్తుంది. కెవ్వున అరుస్తుంది. పోలీసులకు చెప్పడానికి పరుగెడుతుంది. హీరో ఒక హత్య చూస్తాడు. కెవ్వున అరవబోయిన.. హీరోయిన్ నోటిని చేత్తో మూసేస్తాడు. అతడి రియాక్షన్ తర్వాతెప్పుడో ఉంటుంది. అమె స్పందన మాత్రం వెంటనే ఉంటుంది. తమిళ పోలీసుల ‘బ్రూటాలిటీ’ పై ఇప్పుడు హీరోయిన్లే ముందుగా స్పందించారు. ‘జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్’ అని నినదిస్తున్నారు. స్త్రీలో ఉండే సహజ గుణమే ఇది.. అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించడం. ప్రియాంక చోప్రా శాడ్ అండ్ యాంగ్రీ. నేరం ఏదైనా, చనిపోయేంతగా నిందితుల్ని కొట్టడం అమానుషం. ఆ తండ్రీకొడుకుల కుటుంబాల పరిస్థితిని ఊహించలేకపోతున్నాను. మనమంతా వారికి సపోర్ట్‌గా నిలవాలి. వారి తరఫున మాట్లాడాలి. కరీనా కపూర్ ఇంతటి దుర్మార్గాన్ని సహించకూడదు. కాఠిన్యంపై నోరు తెరవడం మన సామాజిక బాధ్యత. మళ్లీ మళ్లీ ఇలాంటివి జరగకుండా పోరాడాలి. బాధితులకు న్యాయం జరిగేవరకు వారికి మద్దతుగా నిలవాలి. ఖష్బూ జయరాజ్ బెనిక్స్‌ల విషయంలో చట్టం తన పని తను చేసుకుపోయి దోషులైన పోలీసులకు శిక్ష విధిస్తుందని మనం ఆశించవచ్చా? వాళ్ల కుటుంబాలకు తీరని నష్టం జరిగింది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. కాజల్ అగర్వాల్ నా మనసును మెలిపెట్టింది. సిక్ అయ్యాను. దీనిపై మౌనం వహించకూడదు. అందరం మన నిరసనను వినిపించాలి. ఆ తండ్రీకొడుకుల కుటుంబ సభ్యులకు అండగా ఉండాలి. తాప్సీ పన్ను తరచు జరుగుతుండే వాటిలో ఇదొకటి కావచ్చు. కానీ ఈ ఒక్కటీ ఇక ముందు ఇలాంటివి జరక్కుండా ఉండేందుకు దోహదం అవ్వాలి. వాళ్లెవరో తెలియని వారు కావచ్చు. కానీ వారిపై జరిగిన అమానుషం భీతినిగొల్పింది. నరాలను మెలితిప్పింది. హన్సిక వింటేనే భీతిగొల్పుతోంది! పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే అవమానం. దేశానికి కూడా. దోషుల్ని ఉపేక్షించకూడదు. వారిని చట్టం ముందు నిలబెట్టి తీరాలి. జెనీలియా నిశ్చేష్టురాలిని అయ్యాను. ఆ ఘటన గురించి విని నా మనసు గాయపడింది. ఇలాంటిది జరగవలసింది కాదు. గుండె పగిలిపోయింది. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. రకుల్ ప్రీత్‌సింగ్ గుండె బద్ధలైపోయింది. మనసు చెడిపోయింది. ఈ క్రూరత్వం అమానుషమైనది. కడుపులో తిప్పేసింది. వారి కుటుంబ సభ్యులకు తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలి. ‘సింగం’ వన్, టు, త్రీ.. సినిమాల డైరెక్టర్ హరి గోపాలకృష్ణన్ ‘డీప్ షాక్’లో ఉన్నారు. పోలీసుల్ని తనెంతో ఉన్నతంగా, గొప్పగా చూపించాడు! కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. తమిళనాడులో ఇద్దరు తండ్రీకొడుకులు పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురై మరణించిన ఘటనను డైరెక్టర్ హరి మరచిపోలేకపోతున్నారు. పోలీసులను హీరోలుగా చూపించినందుకు ప్రాయశ్చిత్తంగా ఇక ఆయన సింగమ్ 4ను తీయాలన్న తన ప్రయత్నాలను విరమించుకోవచ్చనే అనిపిస్తోంది. అయితే ‘సింగమ్’ సిరీస్ హీరో సూర్య ఇంతవరకు ఆ తండ్రీకొడుకుల కస్టడీ డెత్‌పై నేరుగా ఏమీ వ్యాఖ్యానించలేదు! బహుశా ఇవాళో, రేపో ఏమైనా ఖండన వంటిదేమైనా ట్వీట్ చేస్తారేమో. వాస్తవానికి ఇప్పటికే ఆయన ఒక ‘పోలీస్ హీరో’గా తన అభిప్రాయాన్ని వెల్లడించవలసింది. ఆయన ఒక్కరనే కాదు, మిగతా స్టార్ హీరోలు కూడా! ఘటన జరిగి నేటికి వారం. చప్పుడు లేదు. ఉండవలసినంత లేదు. యు.ఎస్.లో గత నెల జార్జి ఫ్లాయిడ్ ఏ విధంగానైతే ఒక పోలీసు చేతిలో చనిపోయాడో.. అదే విధంగా తమిళనాడు, తూత్తుకుడి సమీపంలోని శంతన్కుళంలో తండ్రి జయరాజ్ (58), కొడుకు బెన్నిక్స్ పోలీస్ కస్టడీలో చనిపోయారు. లాక్డౌన్ పని వేళల ఆంక్షల్ని ఉల్లంఘించి తమ సెల్‌ఫోన్ దుకాణాన్ని నడుపుతున్నారన్న ఆరోపణపై ఈ నెల 19 ఆ తండ్రీకొడుకులను పోలీస్‌లు ఆరెస్ట్ చేసి తీసుకెళ్లారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తీవ్ర రక్తస్రావంతో జూన్ 22 సాయంత్రం కొడుకు, 23 ఉదయం తండ్రి చనిపోయారు. ఏడు రోజులైంది. మానవ హక్కుల సంఘాల వాళ్లింకా పూర్తిగా బయటికి రాలేదు! తమిళ ప్రముఖులెవరూ ఖండనలు ఇవ్వలేదు! హర్హా భోగ్లే, శిఖర్ ధావన్, రితేశ్ దేశ్‌ముఖ్, రాజ్‌దీప్ సర్దేశాయ్, హీరో విశాల్, రాహుల్ గాంధీ, జయం రవి, జీవా.. మరి కొందరు మాత్రం పోలీసుల ‘బ్రూటల్ యాక్ట్’ తమను నిర్ఘాంతపరిచిందని సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని, ఆందోళనను వ్యక్తం చేశారు. తమిళనాడు సీయం స్పందించి, కేసును సీబీఐకి అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని మద్రాసు హైకోర్టును కోరబోతున్నట్లు ఆదివారం ప్రకటించారు. అందరికంటే ముందుగా, ఎక్కువగా బాలీవుడ్ నటీమణులు ఈ ఘటనపై మాట్లాడ్డం, న్యాయం జరగాలని కోరడం, పోలీసుల దౌర్జన్యానికి నిరసన తెలియజేయడం విశేషం. మునుపెన్నడూ ఇంతమంది హీరోయిలు ఇలా బయటికి వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. ‘జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నీ’ అంటూ ప్రియాంకా చోప్రా లాజ్ ఏంజెలిస్ నుంచి ట్వీట్ చేశాక.. సింగర్ సుచిత్ర.. పోలీసుల రాక్షసత్వం పై ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఆ తండ్రీ కొడుకులను ఎలా చిత్రహింసలు పెట్టి చంపిందీ తమిళ్లో, ఇంగ్లిష్‌లో వివరించారు. ఇంకా.. హన్సిక, ఖుష్బూ, ఐశ్వర్యా రాజేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, పరిణీతి చోప్రా, ఈషా రెబ్బా, రమ్యా సుబ్రహ్మణ్యన్, తమన్నా భాటియా, కైరా అద్వానీ, రకుల్ ప్రీత్ సింగ్, జెనీలియా, కాజల్ అగర్వాల్, తాప్సీ, కరీనా కపూర్.. ఆ ఘటన తమను ఎంతగానో నిర్ఘాంత పరిచిందని సోషల్ మీడియాలో వెల్లడించారు. మౌనంగా ఉండటం సేఫ్ అనే భావన సాధారణంగా సెలబ్రిటీలలో ఉంటుంది. ఏమాట అంటే ఎటుపోయి వస్తుందోనన్న భయం కూడా ఉంటుంది. వీళ్లేం చేశారో, వాళ్లకెందుకు అంత కోపం వచ్చిందో అని ఆలోచించేవారూ ఉంటారు. అయితే హీరోయిన్లు అలా అనుకోవడం లేదు. నిజమైన హీరోల్లా తమ కోపాన్ని, తమ ఆవేదనను, తమ మనసులోని మాటను ధైర్యంగా బయటికి చెబుతున్నారు. -
‘జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా’
చెన్నై: తమిళనాడులో తండ్రి కొడుకుల కస్టడీ మృతిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు హింసించడంతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తానుకులం ప్రాంతానికి చెందిన జయరాజ్(59), ఆయన కొడుకు బెనిక్స్(31) మరణించినట్టు ఆరోపణలు వచ్చాయి. వీరి మరణానికి కారకులైన దోషులను చట్టప్రకారం శిక్షించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. సోషల్ మీడియాలోనూ #JusticeForJayarajandBennicks హ్యష్‌టాగ్‌తో ప్రముఖులు, నెటిజనులు న్యాయం కోసం నినదిస్తున్నారు. మాకు వాస్తవాలు కావాలి ‘జయరాజ్, బెనిక్స్ మరణవార్త విని హతశురాలిని అయ్యాను. చాలా కోపం వచ్చింది. ఇలాంటి క్రూరత్వానికి ఎవరూ పాల్పడరాదు. దోషులు తప్పించుకోకుండా చూడాలి. మాకు వాస్తవాలు కావాలి. ఇద్దరిని కోల్పోయిన మృతుల కుటుంబ సభ్యుల బాధను ఊహించడానికి కూడా సాహసించలేకపోతున్నాను. వారికి న్యాయం జరిగే వరకు మనమంతా సమైక్యంగా #JusticeForJayarajandBennicks హ్యష్‌టాగ్‌తో గళం వినిపిద్దామ’ని ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా ట్వీట్ చేశారు. హృదయ విదారకం గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని ఈ సంఘటనను అమెరికాలో ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో పోల్చారు. ‘ప్రియమైన బాలీవుడ్ ప్రముఖులారా, తమిళనాడులో ఏం జరిగిందో మీరు విన్నారా లేదా మీ ఇన్స్టాగ్రామ్ యాక్టివిజం ఇతర దేశాలకు మాత్రమే విస్తరించిందా? జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఇటువంటి పోలీసు హింస, లైంగిక వేధింపుల కథ హృదయ విదారకం’ అంటూ మేవాని ట్వీట్ చేశారు. (‘మై డాడీ ఛేంజ్డ్ ద వరల్ట్’) తమిళనాడు పోలీసుల కస్టడీలో తండ్రి, కొడుకుల మృతిపై ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధవన్ కూడా ట్విటర్లో స్పందించాడు. ‘తమిళనాడులో జయరాజ్, బెనిక్స్ పై జరిగిన దారుణం గురించి విని భయపడ్డాను. మృతుల కుటుంబానికి న్యాయం జరిగేలా మనమంతా బలంగా గళం విన్పించాల’ని ధవన్ ట్విటర్లో పేర్కొన్నాడు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఈ అమానవీయ చర్యకు పాల్పడిన వారిని శిక్షించి.. బాధితులకు న్యాయం చేయాలని తమిళ హీరో జయం రవి ట్విటర్లో డిమాండ్ చేశారు. అసలేం జరిగింది? అనుమతించిన సమయానికి మించి తమ మొబైల్ దుకాణాన్ని తెరిచివుంచారన్న కారణంతో పి జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ను గత శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల తర్వాత ఆసుపత్రిలో వారిద్దరూ ఒకరి తర్వాత ఒకరు మరణించారు. సాత్తానుకులం పోలీస్‌స్టేషన్‌లో పోలీసు సిబ్బంది తీవ్రంగా కొట్టడం వల్లే జయరాజ్, అతడి కొడుకు చనిపోయారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, తాము అడిగిన సెల్ఫోన్లను ఇవ్వలేదన్న అక్కసుతోనే జయరాజ్, బెనిక్స్‌లపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించినట్టు విచారణలో వెల్లడైంది. తండ్రి కొడుకుల లాకప్‌డెత్‌కు నిరసగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వర్తకులు దుకాణాల బంద్ పాటించారు. జయరాజ్, బెనిక్స్లను కొట్టి చంపిన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కస్టడీ మరణాలను తీవ్రంగా పరిగణించిన మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. (‘సెల్’ కోసమే దాష్టీకమా?) -
డబ్బు వాపసు చేస్తేనే నిజమైన నిరసన
ఇటీవల నేషనల్ అవార్డ్స్‌లో రాష్ట్రపతి పరిమిత సమయం కారణంగా అందరికీ అవార్డ్స్ ప్రదానం చేయరని తెలిసి పలువురు విజేతలు నేషనల్ అవార్డ్స్‌ను బాయ్‌కాట్ చేసిన సంగతి తెలిసిందే. అవార్డ్ ఫంక్షన్ బాయ్‌కాట్ చేసినవాళ్లను ఉద్దేశిస్తూ.. 2018 నేషనల్ అవార్డ్ అందుకున్న మలయాళ దర్శకుడు జయరాజ్ మాట్లాడుతూ– ‘‘కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతీ ఇరానీ చేతుల మీదగా అవార్డ్ అందుకోవటం మాకు ఇష్టం లేదు అని బాయ్‌కాట్ చేసిన నిరసనకారులంతా కేవలం అవార్డ్ ఫంక్షన్‌ని బాయ్‌కాట్ చేయడమే కాదు నేషనల్ అవార్డ్‌తో పాటుగా మీకు అందే క్యాష్ ప్రైజ్‌ను కూడా తిరిగి ఇవ్వాలి. అదే నిజమైన నిరసన’’ అన్నారు. పాయింటే కదా. -
మంచికి సహకారం.. చెడుపై గళం
సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు అండగా ఉంటామని ప్రజాకవి జయరాజ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని శ్రీవాణి కళాశాలలో సోమవారం ఆయన సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పటివరకు 450 పాటలు రచించగా, 150 పాటలు విప్లవ సాహిత్యంతో కూడినవని చెప్పారు. అడవిలోఅన్న, దండోర, చీకటి సూర్యులు, చలో అసెంబ్లీ సినిమాలకు పేరు ప్రఖ్యాతలు వచ్చాయన్నారు. వసంత గీతం, జ్ఞాపకాలు పుస్తక రచనలకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ప్రస్తుతం ప్రకృతి సంపద కొల్లగొట్టడంపై రాస్తున్న ‘‘మా’’ అనే పుస్తకం రెండునెలల్లో పూర్తవుతుందన్నారు. ప్రజల గొంతుకగా గళం విప్పేందుకు వెనుకాడనని స్పష్టం చేశారు. ప్రశ్న: మీ స్వగ్రామం? జయరాజ్: ఉమ్మడి వరంగల్ జిల్లా గుమ్మనూర్ కుగ్రామం. ప్రశ్న: కుటుంబ నేపథ్యం? జయరాజ్: అమ్మపేరు చిన్నమ్మ, నాన్న గొడిషెల కిష్టయ్య, ఇద్దరు చెల్లెలు. ప్రశ్న: విప్లవ సాహిత్యం రాయడానికి ప్రేరణ? జయరాజ్: అట్టడుగు వర్గాల అభ్యున్నతికోసం పాటు పడాలనే తపన పాటలు రాసేలా చేసింది. ప్రశ్న: అండర్ గ్రౌండ్‌కి వెళ్లి పనిచేశారా? జయరాజ్: బయట ఉండే ప్రజలను చైతన్య పరిచేలా పాటలు రాశా. ప్రశ్న: తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ? జయరాజ్: తెలంగాణ రాష్ట్ర సాధనలో విప్లవకవి గద్దర్‌తో మణుగూర్ నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేశా. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు మమేకమై వచ్చేందుకు పాటలు రాసి, గళం విప్పి చైతన్యపరిచా. ప్రశ్న: టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై మీ అభిప్రాయం? జయరాజ్: హరితహారం, కేసీఆర్ కిట్, గురుకులాలు, మిషన్ కాకతీయ, 24గంటల విద్యుత్ ప్రజలకు ఉపయోగకరంగానే ఉన్నాయి. ప్రశ్న: ఎన్నికల హామీల అమలుపై? జయరాజ్: ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే ప్రజాగళం విప్పుతా.. ప్రశ్న: ప్రకృతి సంపద కొల్లగొట్టడంపై మీ అభిప్రాయం? జయరాజ్: ప్రకృతి సంపదను కొల్లగొట్టడంతో అనేక అనార్థాలు వచ్చి చేరుతున్నాయి. ప్రజల సంపాదనంతా వైద్యానికే పోతుంది. ప్రకృతి పరిరక్షణకు అందరం నడుంబిగించాల్సిన అవసరముంది. ప్రశ్న: యువతకు మీరిచ్చే సందేశం? జయరాజ్: సినిమా హీరోలుగా భావించుకోవద్దు. యదార్థాన్ని గ్రహించే శక్తి యువకులకు ఉండాలి. ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రులకు శోకం మిగిలించొద్దు. గమ్యాన్ని నిర్ధేశించుకొని క్రమశిక్షణతో మెదిలి ఉన్న ఊరు, తల్లిదండ్రులకు పేరు తేవాలి. -
రైస్ పుల్లింగ్ ముఠా గుట్టు రట్టు
ఇబ్రహీంపట్నంరూరల్: రైస్‌పుల్లింగ్ పేరుతో ఓ వ్యక్తి నుంచి లక్షలు దండుకున్న వ్యక్తులను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రైస్‌పుల్లర్‌ను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఆదిభట్ల సీఐ గోవింద్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎస్వోటీ ఎస్ఐ కాశీనాథం కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని కమ్మగూడ గ్రామానికి చెందిన మదాని జాన్‌పాల్ అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన జయరాజ్ దివ్యశక్తులు ఉన్న పాత్ర గురించి చెప్పాడు. తనకు తెలిసిన వ్యక్తుల వద్ద అలాంటి పాత్ర ఉందని నమ్మించాడు. కర్నూలు జిల్లాకు మహ్మద్ షేక్ రఫీ మహ్మద్ షేక్ షఫీ, చిత్తూరు జిల్లా కు చెందిన రంగనాథం ప్రకాష్ అనే వ్యక్తులతో కలిసి జాన్ పాల్‌ను మోసం చేసేందుకు పథకం పన్నారు. చెన్నై నుంచి ఆ పాత్ర తెచ్చేందుకు డబ్బులు కావాలని చెప్పడంతో జాన్‌పాల్ పలు దఫాలుగా రూ.11.45 లక్షలు ఇచ్చాడు. కొద్ది రోజుల క్రితం రఫీ, షఫీ, జయరాజ్, ప్రకాష్ అతనికి థర్మకోల్‌లో ప్యాకింగ్ చేసిన బిందెను ఇచ్చి ఇంట్లో ఉంచుకుని పూజలు చేయాలని చెప్పారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. -
గాంధీ, వైఎస్ విగ్రహాల తొలగింపు హేయం
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో పుష్కరాల అభివృద్ధి పేరుతో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యుడు జయరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహాత్ముడి విగ్రహం తొలగించిన విషయంపై సాక్షి పత్రికలో కథనాలు ప్రచురితం కావడం... ప్రజాగ్రహం పెద్ద ఎత్తున వ్యక్తం కావడంతో తలొంచిన తెలుగుదేశం ప్రభుత్వం రాత్రికి రాత్రే గాంధీ విగ్రహాన్ని పునఃప్రతిష్టించిన విషయాన్ని గుర్తుచేశారు. విజయవాడలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ప్రభుత్వం తొలగించడంపై తక్షణమే కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం తొలగించిన వైఎస్సార్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించకపోతే ఆందోళన కార్యక్రమాలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
కన్న కొడుకును అమ్ముకున్నడు?
భర్తపై ఫిర్యాదు సైదాపూర్ మోసం చేసి తనను పెళ్లి చేసుకున్న భర్త పుట్టిన బిడ్డను అమ్ముకున్నాడని ఓ బాలింత ఆదివారం సైదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు,బాధితురాలి కథనం ప్రకారం.. సైదాపూర్‌కు చెందిన కూరగాయల వ్యాపారి జివ్వాజి జయరాజ్‌కు మొదట కొత్తగూడెంకు చెందిన రబేకరాణితో వివాహం జరిగింది. ఏడాది తిరగక ముందే ఆమెతో విడాకులు తీసుకున్నాడు. తర్వాత జమ్మికుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన హేమను 2012, ఏప్రిల్ 28న పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే హేమకు కాగజ్‌నగర్‌కు చెందిన శేషుకుమార్‌తో వివాహం జరిగింది. వారికి కుమారుడు జన్మించాడు. తర్వాత శేషుకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒంటరిగా ఉన్న హేమను నమ్మించి జయరాజ్ పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కొడుకులు జన్మించారు. రెండో కొడుకు జూన్ 10న హన్మకొండలోని మిషన్ ఆస్పత్రిలో పుట్టాడు. అపస్మారక స్థితిలో ఉన్న హేమకు కొడుకును చూపించక ముందే ఆరోగ్యం బాగాలేదని వేరే ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు చెప్పాడు. అనంతరం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు నమ్మించాడు. రోజులు గడిచినా పసికందును తీసుకురాకపోవడంతో జయరాజ్‌ను నిలదీసింది. ఆగ్రహించిన భర్త బాలింత అని చూడకుండా తీవ్రంగా కొట్టి పుట్టింటికి వెళ్లిపొమ్మన్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నయం కాని వ్యాధితో బాధపడుతున్న జయరాజ్ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, 20 రోజుల క్రితం పుట్టిన పసికందును రూ.2 లక్షలకు అమ్ముకున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో జయరాజ్‌ను పిలిపించిన పోలీసులు పసికందు గురించి ఆరా తీశారు. తాను పిల్లవాడిని ఆస్పత్రిలో చూపించాలని వరుసకు మరదలు అయిన అరుణశ్రీకి అప్పగించానని జయరాజ్ తెలిపాడు. తర్వాత అరుణశ్రీకి ఫోన్ చేస్తే బాబు చనిపోయాడని చెప్పిందని పేర్కొన్నాడు. తాను కొడుకును అమ్ముకోలేదని తెలిపాడు. ప్రస్తుతం శిశువు ఉన్నాడా..? చనిపోయాడా..? ఎవరైనా అమ్ముకున్నారా..?అనేది తేలాల్సి ఉంది. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
కర్నూలు జిల్లా మానవపాడు గ్రామంలో వడదెబ్బతో జయరాజ్(55) అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం మృతిచెందాడు. బుధవారం ఉదయం వడదెబ్బకు గురైన జయరాజ్‌ను కర్నూలు ఆస్పత్రికి తరలించగా క్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య లక్ష్మీదేవి, నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
ఆ రూపం ఎవరిది?
ఆ భవంతిలో ఇద్దరు పిల్లలు. అమ్మ లేదు. కానీ వాళ్లను ఓ రూపం లాలిస్తోంది. కంటికి రెప్పలా కాపాడుతోంది. ఆ రూపాన్నే అమ్మ అనుకుంటున్నారు. మరి ఆమె ఎవరు.... వాళ్లకి ఆ పిల్లలకి ఏంటి సంబంధం...? అనే అంశాలతో తెరకెక్కిన ఓ తమిళ చిత్రం తెలుగులో రానుంది. జయరాజ్, నితిన్ రాజ్, మిషా ఘోషల్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘శశికళ’గా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులో ఈ నెల 15న విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘సెంటిమెంటల్ హారర్ చిత్రంగా రూపొందిన మా ‘శశికళ’లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా సోదరుడు జయరాజ్ ఓ ముఖ్య పాత్ర పోషించారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకటేశ్, సంగీతం: నిత్యన్ కార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శివ వై-ప్రసాద్ బి. -
ఉల్లం‘ఘనులు’
వికారాబాద్: కంచే చేను మేసింది. ప్రభుత్వ అధికారులే పక్కదారి పట్టారు. అక్రమ మైనింగ్‌కు అనుమతులిచ్చారు. రూ.5 కోట్ల ప్రభుత్వాదాయానికి గండి కొట్టారు. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత చందాన గనులను కొల్లగొట్టారు. ఈ అక్రమ వ్యవహారం ఐదేళ్లుగా కొనసాగుతున్నా పట్టించుకునేవారే లేకుండాపోయారు. దీనికంతటికీ ప్రధాన సూత్రధారిగా మైనింగ్ ఏడీపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు.. జిల్లా పరిధిలోని పెద్దేముల్, మోమిన్‌పేట్, ధారూరు మండలాల్లో ఎక్కువగా సుద్ద గనుల తవ్వకాలు జరుగుతుంటాయి. వీటికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను తనిఖీ చేసే ఏడీ కార్యాలయం తాండూరులో ఉంది. సుద్ద మైనింగ్ ప్రాంతాలు మారేపల్లి, గోపాల్పూర్, తింసాన్‌పల్లి, ఇందోల్, అల్లీపూర్, అవుసుపల్లి, జైద్‌పల్లి, తరిగోపుల, నాగ్సాన్పల్లిలలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. గత 5 ఏళ్లుగా.. సంవత్సరానికి 2 లక్షల టన్నుల చొప్పున ఆయా గ్రామాలను నుంచి సుద్దను కాకినాడ పోర్టుకు రవాణా చేస్తున్నారు. అక్కడి నుంచి వ్యాపారులు ఓడల ద్వారా మలేషియాకు తరలిస్తున్నారు. కాగా.. సుద్ద మైనింగ్‌లో సక్రమం సగం ఉండగా.. అక్రమం సగం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. యేటా జనవరి నుంచి మొదలుకొని మే నెలాఖరువరకు సుద్ద ఉన్న ప్రాంతాల్లో లీజ్‌కు తీసుకున్న వ్యాపారులు తవ్వకాలు జరిపి కుప్పలు పోసి నిల్వ చేస్తారు. కాగా.. ఇక్కడే అసలు సంగతి ఉంది. అనుమతి పొందింది అర ఎకరం అయితే అక్రమ మైనింగ్ చేస్తున్నది ఆరు ఎకరాల వరకు ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది కొంత కాగా అక్రమ తవ్వకాలు చేస్తోంది మాత్రం ఎక్కువగా ఉంది. సాక్ష్యం ఇదిగో.. ధారూరు మండలం తరిగోపులలోని సర్వేనంబర్ 389లో అర ఎకరం లీజ్ తీసుకొని ఆరు ఎకరాల వరకు తవ్వకాలు జరిపారు. ఇందులో మైనింగ్ ఏడీ జయరాజ్ అర ఎకరానికి అనుమతినిచ్చి ఆరు ఎకరాల వరకు తవ్వకాలకు సరిపడా రాయల్టీని మంజూరు చేశారు. అర ఎకరం భూమిలో 10 ఫీట్ల వరకు సుద్ద ఉంది. 6 వేల టన్నుల వరకు ఉత్పత్తి అవుతోంది. కానీ ఆ భూమిలో 4 ఫీట్లు లేని సుద్దకు సుమారు 20 వేల టన్నుల రాయల్టీలు ఇచ్చారు. జయరాజ్ అండదండలతోనే అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయనే విషయం స్పష్టమవుతోంది. మరో ఆసక్తికర విషయమేంటంటే.. ఆరేళ్లుగా ఆయన బదిలీ కాకుండా పెద్దల అండదండలతో తాండూరులోనే తిష్టవేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తవ్వకం ఓ ఊరిలో.. రాయల్టీ మరో గ్రామంలో.. జైద్‌పల్లి సమీపంలోని సుద్ద స్టాక్ పాయింట్‌ను పరిశీలించగా.. అదే గ్రామానికి చెందిన ఓ భూమిలో అక్రమ మైనింగ్ చేసిన సుద్దను తరిగోపుల భూములకు సంబంధించిన రాయల్టీపై స్టాక్‌పాయింట్‌కు తరలించి నిల్వ చేశారు. దీంతో సుద్ద మైనింగ్‌లో ఎన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయో అవగతమవుతోంది. ఈ వ్యవహారంలో మైనింగ్ అధికారికి లక్షలాది రూపాయలు ముడుపులు ముట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. స్టాక్‌పాయింట్‌లో ప్రస్తుతం అక్రమ నిల్వలు సుమారు 25 వేల టన్నులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సుద్ద తవ్వకాలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకోలేదని సమాచారం. ఏడీ జయరాజ్ వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించేందుకు ఆయన అందుబాటులోకి రాలేదు. సుద్ద గనుల్లో తహసీల్దార్ ఆకస్మిక తనిఖీలు ధారూరు: మండలంలోని జైదుపల్లి సమీపంలోని సుద్ద గనుల నిల్వలను శుక్రవారం తహసీల్దార్ విజయ, ఇన్చార్జి ఆర్ఐ ఓం కుమార్, వీఆర్వో ఆకస్మిక తనిఖీలు చేశారు. పొలాల నుంచి సేకరించిన సుద్దను రాయితీ చెల్లించకుండా రాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్నారనే ఫిర్యాదుపై తనిఖీలు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. తనిఖీ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అధికారులు వెనుదిరిగివచ్చారు. -
ప్రకృతిని ప్రేమిస్తేనే పచ్చని తెలంగాణ
ప్రజాగాయకుడు జయరాజ్ ‘ప్రకృతికి అందరూ సమానమే. పేద, ధనిక.. ఉన్నత వర్గం, అట్టడుగు వర్గం అనే తారతమ్యాలు ఉండవు’ అంటున్నారు ప్రజా గాయకుడు జయరాజ్. ‘ప్రకృతి కూడా కమ్యూనిస్టే. దానిని మానవులే కలుషితం చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగం లో నిష్ణాతులవుతుంటారని, వీరు నేర్చుకున్నదంతా ప్రకృతిని చూసేనని అన్నారు. శనివారం ఖమ్మం వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జయరాజ్ మనోభావాలు ఆయన మాటల్లోనే... మానువుడి అభివృద్ధి వెనుక ప్రకృతి పాత్ర కీలకం. అగ్గిపెట్టెలో ఇమిడే ఆరు గజాల చీరెను నేచి ప్రపంచాన్ని అబ్బురపర్చిన నేతన్నకు సాలీడు ఆది గురువు. భూమికి ఆకర్షణ శక్తి ఉంటుందని న్యూటన్ కనుగొన్నది చెట్టు పైనుంచి యాపిల్ కిందకు పడ్డప్పుడే. మధుర గీతాలతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసే గాయకులు కోకిల రాగాల నుంచే నేర్చుకున్నారు. ఇలా మానవుడు నేర్చుకున్నవన్నీ ప్రకృతిని చూసే. అందుకే.. ప్రకృతిలో చెట్టూ చేమ, రాయీ రప్పా, వాగులు, వంకలు, పిల్లగాలి, సెలయేరు కవులకు కవితా వస్తువులయ్యాయి. చెట్లను నరకొద్దు ప్రకృతికి దగ్గరగా ఎవరుంటారో వారే సుఖంగా జీవిస్తారు. వారికి ఏ కష్టమూ ఉండదు. చెట్లను నరకడం, వాతావరణాన్ని కలుషితం చేయడం మూలంగా మనిషి అనేక కష్టాలను కొనితెచ్చుకుంటున్నాడు. సకాలంలో వర్షాలు పడటం లేదు. పంటలు పండటంలేదు. కరెంట్ కొరత తీవ్రంగా ఉంది. వీటన్నింటికీ కారణం మానవుడు ప్రకృతిని నాశనం చేయడమే. చెట్లను విరివిగా పెంచినప్పుడే పచ్చని తెలంగాణ సాధ్యం. నిజాం కాలం నాటి గొలుసుకట్టు చెరువులు పూడుకుపోయాయి. వాటిని పునరుద్ధరిస్తే ప్రకృతిని కాపాడినట్టవుతుంది. సాగునీరు, తాగునీరుకు ఇబ్బంది ఉండదు. చెరువులు నిండుగా ఉన్నచోటికే పశువులు, పక్షులు, చేపలు, సకల జంతువులు వస్తాయి. ఏడు మండలాలు ఏపీలో కలపడం వెనక కుట్ర ఖమ్మం జిల్లా రాజకీయ, సాంస్కృతిక, సాహితి రంగాలకు పెట్టింది పేరు. నదీ జలాలు, అపారమైన ఖనిజ సంపదకు ఇక్కడ కొదువలేదు. గిరిజనుల సంస్కృతి కనుమరుగైన ఖమ్మం జిల్లాను ఊహించాలంటే ఎవరికైనా దుఃఖం వస్తుంది. ఆరు దశాబ్దాల పోరాటాల అనంతరం తెలంగాణను సాధించుకున్నాం. అయినా మనకు పూర్తిస్థాయిలో ఊరట కలగలేదు. జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలపారు. దీని వెనక పెద్ద కుట్రే దాగుంది. సమాజ హితం కోసమే నా పాట సమాజ హితం కోసమే తన పాట అని జయరాజ్ అన్నారు. మనిషి ముందుగా తనను తాను ప్రేమించుకోవాలని, సమాజానికి ఏ విధంగా ఉపయోగ పడాలో ఆలోచించుకోవాలని అన్నారు. ఆకలి, అవమానాలు, కష్టాలు, కడు దారిద్య్రం అనుభవించి.. సమాజంలో నేలకు కొట్టబడిన వారు అదే వేగంతో లేవాలని అన్నారు. అప్పుడే ప్రాయోజకులవుతారని, సమాజాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తారని అభిప్రాయపడ్డారు. ఇందుకు బీఆర్ అంబేద్కర్ విధానమే ఆదర్శమన్నారు. ‘జాగోరే జాగో అంబేద్కర్... జగతికి మార్గం అంబేద్కర్... మా చల్లని టీచర్ అంబేద్కర్... మా దారికి టార్చి అంబేద్కర్.. భారత్‌కు మార్క్స్ అంబేద్కర్..’ అని తన గాన మాధుర్యంతో కొనియాడారు. తల్లిదండ్రులను ప్రేమించిన వారే ఉత్తములన్నారు. ‘అమ్మా నీ పిలుపులోనే అమృతం ఉన్నది.. అమ్మా నీ పిలుపులోనే అనురాగం ఉన్నది’ అంటూ మాతృమూర్తి మమతలనురాగాలపై రాగం ఆలపించారు. ‘నాయనా నీ మట్టికాళ్లకు దండమే... నీ మంచి మనసుకు దండమే..’ అంటూ తండ్రిపై ఉన్న వాత్సల్యాన్ని తన పాటతో చాటిచెప్పారు. ‘కొమ్మల్లో కోకిల పాటలు పాడాలి.. పల్లెల్లో అక్షర దీపం వెలగాలి’ అంటూ అక్షరాస్యత ఆవశ్యకతను ఎత్తిచూపారు. -
ర్యాగింగ్ సాంఘిక దురాచారం
రిమ్స్‌క్యాంపస్: ర్యాగింగ్‌కు దూరంగా విద్యార్థులు ఉండాలని రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ టి.జయరాజ్ అన్నారు. ర్యాగింగ్ అనేది సాంఘిక దురాచారమని, దీనికి కఠిన శిక్షలు ఉన్నాయన్నారు. రిమ్స్ వైద్య కళాశాల సమావేశ మందిరంలో యాంటీ ర్యాగింగ్ సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు ఉన్నాయని, జైలు శిక్ష పడే అవకాశముందన్నారు. ఇదే జరిగితే విద్యార్థులు అమూల్యమైన భవిష్యత్‌ను కోల్పోతారన్నారు. ర్యాగింగ్ అనే సాంఘిక దురాచారానికి విద్యార్థులు దూరంగా ఉండాలని హితవు పలికారు. -
వెండి తెరపై జయరాజసం
బాలీవుడ్లో మన ‘జయ’కేతనాన్ని ఎగురవేసిన తొలితరం నటుడు. భారతీయ చలనచిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న తొలి తెలుగుసినీప్రముఖుడు కూడా ఆయనే. కరీంనగర్ బిడ్డ అయిన పైడి జయరాజ్ చదువు సంధ్యలు సాగింది హైదరాబాద్‌లోనే. నాటి హైదరాబాద్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో 1909 సెప్టెంబర్ 28న జయరాజ్ జన్మించారు. ఆయన చదువు సంధ్యలన్నీ హైదరాబాద్‌లోనే సాగాయి. నిజాం కాలేజీలో ఆయన డిగ్రీ చదువుకున్నారు. టాకీలు ఇంకా ప్రారంభం కాని ఆ కాలంలోనే ఆయనకు సినిమాలపై మక్కువ ఏర్పడి, 1929లో బాంబే చేరుకున్నారు. మూకీ సినిమా ‘స్టార్ క్లింగ్ యూత్’ ఆయన తొలిచిత్రం. ‘ట్రయాంగిల్ ఆఫ్ లవ్’, ‘మాతృభూమి’, ‘ఆల్ ఫర్ లవర్’, ‘మహా సాగర్ మోతీ’, ‘ఫ్లైట్ ఇన్టు డెత్’, ‘మై హీరో’ వంటి పదకొండు మూకీ సినిమాల్లో జయరాజ్ నటించారు. 1931లో ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో రూపొందించిన ‘షికారీ’ ఆయన తొలి టాకీ చిత్రం. అక్కడి నుంచి జయరాజ్ వెనుదిరిగి చూసుకోలేదు. ఆనాటి నట దిగ్గజాలు పృథ్వీరాజ్ కపూర్, శాంతారామ్, మోతీలాల్ వంటి వారికి దీటుగా దాదాపు రెండు దశాబ్దాల పాటు యాక్షన్ హీరోగా బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగారు. నిరూపా రాయ్, శోభనా సమర్థ్, షకీలా, శశికళ, దేవికారాణి, మీనాకుమారి, చాంద్ ఉస్మానీ, జేబున్నీసా, ఖుర్షీద్ వంటి హీరోయిన్ల సరసన ఆయన నటించిన చిత్రాలు ఘనవిజయం సాధించాయి. చారిత్రక పాత్రలతో చెరగని ముద్ర మంచి శరీర దారుఢ్యానికి స్ఫురద్రూపం తోడవడంతో చారిత్రక పాత్రల్లో జయరాజ్ అద్భుతంగా రాణించగలిగారు. రూప దారుఢ్యాలకు మించి అద్భుతమైన అభినయంతో చారిత్రక పాత్రలతో ఆయన ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. రాజ్పుటానీ, షాజహాన్, అమర్‌సింగ్ రాథోడ్, వీర్ దుర్గాదాస్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణాప్రతాప్, టిప్పు సుల్తాన్, రజియా సుల్తానా, అల్లావుద్దీన్, జై చిత్తోడ్, రాణా హమీర్ వంటి పాత్రలు ఆయనను తిరుగులేని యాక్షన్ హీరోగా నిలిపాయి. అదేకాలంలో మజ్దూర్, షేర్దిల్ ఔరత్, జీవన్ నాటక్, తూఫానీ ఖజానా, మధుర్ మిలన్, ప్రభాత్, మాలా, స్వామి, నయీ దునియా, నయీ కహానీ, హమారీ బాత్, ప్రేమ్ సంగీత్ వంటి సాంఘిక చిత్రాల్లోనూ రాణించారు. మొహర్, మాలా (1943), ప్రతిమా, రాజ్‌ఘర్, సాగర్ (1951) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘సాగర్’ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. వయసు మళ్లిన తర్వాత కేరక్టర్ యాక్టర్‌గా పలు చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. షోలే, ముకద్దర్ కా సికందర్, డాన్, ఫిఫ్టీ ఫిఫ్టీ వంటి బ్లాక్‌బస్టర్స్‌లో కీలక పాత్రలు ధరించారు. ‘గాడ్ అండ్ గన్’ ఆయన చివరి చిత్రం. తెలుగువాడైన జయరాజ్ హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, మరాఠీ, గుజరాతీ చిత్రాల్లో నటించినా, ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేదు. తెలుగు సినీరంగం సైతం ఆయనను పట్టించుకోకపోవడమే విషాదం. అయితే భారత సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం 1980లో పద్మభూషణ్ అవార్డునిచ్చింది. అదే ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా జయరాజ్‌ను వరించింది. చరమాంకం విషాదకరం దాదాపు ఆరున్నర దశాబ్దాల నట జీవితాన్ని విజయవంతంగా గడిపిన జయరాజ్‌కు చరమాంకం మాత్రం విషాదమే. పంజాబీ మహిళ సావిత్రిని పెళ్లాడిన ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. ఆస్తి కోసం కొడుకు దిలీప్‌రాజ్ వేధింపులకు దిగడంతో భరించలేక వార్ధక్యంలో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. సొంత ఫ్లాట్‌పై జయరాజ్‌కే అధికారం ఉంటుందని, కొడుకు దిలీప్ రాజ్ రోజుకు ఒకసారి చూసిపోవడం తప్ప అక్కడ ఉండేందుకు వీలులేదని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత జయరాజ్ ఎన్నాళ్లో బతకలేదు. 2000 ఆగస్టు 11న తుదిశ్వాస విడిచారు. - పన్యాల జగన్నాథదాసు -
టీడీపీలో రాజుకుంటున్న అగ్గి!
ఎన్నికల సమయంలో ఒకరి టిక్కెట్‌ను ఇంకొకరు తన్నుకుపోయారు. దీనికి ప్రతీకారంగా రెబల్‌గా రంగంలోకి దిగి అతని ఓటమికి కారణమై మరొకరు కక్ష తీర్చుకున్నారు. వారిద్దరే నిమ్మక జయరాజ్, జనార్దన్ థాట్రాజ్. అయితే జయరాజ్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నాలు సాగుతుండడంతో దానికి థాట్రాజ్ వర్గం తీవ్రస్థాయిలో అభ్యంతరం చెబుతోంది. పార్టీ ఓటమికి కారణమైన వారిని మళ్లీ ఎలా ఆహ్వానిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో కురుపాం నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం : కురుపాం నియోజకవర్గం టీడీపీలో మళ్లీ అగ్గి రాజుకుంటోంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో టీడీపీ రెబెల్‌గా బరిలోకి దిగి న నిమ్మక జయరాజ్‌ను పార్టీలోకి రప్పించే యత్నాలను జనార్దన్ థాట్రాజ్ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని మళ్లీ ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నా రు. అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ వర్గీయులు హెచ్చరిస్తున్నారు. కురుపాం నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కుగా మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ ఉండేవా రు. కాకపోతే, ఎన్నికల సమయానికొచ్చేసరికి సీటు రాకపోవడం వల్ల వేరే పార్టీలోకి జంప్ చేయడమో, రెబల్‌గా బరిలో దిగడమో చేస్తున్నారు. దీంతో కొన్నాళ్లు పార్టీకి దూరమవుతున్నారు. అంతా సద్దుమణిగిన తర్వాత మళ్లీ ఆ పార్టీలో చేరుతున్నారు. మళ్లీ క్రియాశీలకంగా తయారవుతున్నారు. గత కొంతకాలంగా ఇదే జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో కూడా అదే జరిగింది. టిక్కెట్ తనదే అని జయరాజ్ నమ్మకం పెట్టుకున్నారు. కానీ, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు టీడీపీలో చేరడంతో కురుపాం టిక్కెట్‌ను ఆయన మేనల్లుడు వి.టి.జనార్దన్ థాట్రాజ్‌కు ఎగరేసుకుపోయారు. చంద్రబాబుతో విజయరామరాజు చేసుకున్న ఒప్పందంలో భాగంగా నిమ్మక జయరాజ్‌కు మొండిచేయి ఎదురైంది. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రతీసారి ఇలాగే జరుగుతోందని ఆవేదనకు లోనయ్యారు. చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించి, టీడీపీ రెబెల్‌గా పోటీ చేశారు. కానీ ఓటర్లు కనికరించలేదు. మళ్లీ ఓడించారు. దీంతో స్తబ్ధుగా ఉండిపోయారు. టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆయనకు పార్టీపై మోజు ఏర్పడింది. టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన్ను కలుపుకొని పనిచేసేందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ తదితరులు తహతహలాడుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సానుకూల సంకేతాలొచ్చాయో ఏమో గాని జియ్యమ్మవలస మండల పరిషత్ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అందరూ కలుపుకొని పనిచేద్దామని జగదీష్ అన్నారు. పార్టీలోకి రావాలని జయరాజ్‌కు పరోక్షంగా సూచించారు. దీంతో జయరాజ్ కూడా స్పందిస్తూ తాను పార్టీలోనే ఉన్నానని, తనకు టిక్కెట్ రాకపోవడం వల్లఅన్యాయం జరిగిందని బాధపడ్డానని చెప్పుకొచ్చినట్టు తెలిసింది. ఈ పరిణామాలన్నీ తెలుసుకున్న జనార్దన్ థాట్రాజ్‌తో పాటు ఆయన వర్గీయులు గుర్రుగా ఉన్నారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేసేం దుకు చంద్రబాబు వద్దకు వెళ్లినట్టు సమాచా రం. జయరాజ్ విషయంలో ఒక్క థాట్రాజే కాదు ఆయన అనుచరులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆ రెండు వర్గాల మధ్య వివాదానికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. -
‘పోరాటానికి’ వెన్నుపోటు !
పార్వతీపురం టౌన్, న్యూస్‌లైన్ : పార్టీని నమ్ముకుని చాలా కాలంగా సేవ చేస్తున్న తెలుగు తమ్ముళ్లు నాయకుల ఆగడాలను సహిం చలేకపోయారు. తమకు టిక్కెట్లు ఇస్తున్నట్టు చేసిన టీడీపీ గిరిజన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలుపెరగని పోరాటం చేసిన తమను ఇరకాటంలో పెట్టారని కోపోద్రిక్తులవుతున్నారు. నీతిమాలిన రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేశారని ఆరోపిస్తున్నారు.మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఎస్టీయా కాదా అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతం. దేనికిందకొస్తారన్నది న్యాయస్థానంలో తేలే అంశం. కాకపోతే, ఈ వ్యవహారంలో టీడీపీ అనుసరించిన ద్వంద్వ విధానమే తప్పు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. శత్రుచర్ల విజయరామరాజు కుల వివాదంపై టీడీపీ నేత నిమ్మక జయరాజ్ సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నారు. న్యాయస్థానాలను తరుచూ ఆశ్రయిస్తున్నారు. అందుకు టీడీపీ పూర్తిగా సహకరించింది. ఆర్థిక, న్యాయపరమైన సహాయ సహాకారాలను అందించింది. రాజధానిలో ఎప్పటికప్పుడు కేసును ముందుకునడిపిస్తూ వచ్చింది. కుల వివాదం రూపంలో శత్రుచర్లను దెబ్బకొట్టేందుకు అన్ని రకాల శక్తియుక్తులను ప్రదర్శించింది. చెప్పాలంటే నిమ్మక జయరాజ్‌ను పావుగా వాడుకుందన్న వాదనలు ఉన్నాయి. ఎవరిపైనైతే పరోక్ష పోరాటం చేసిందో అదే నాయకుడ్ని ఈ రోజు పార్టీలోకి ఆహ్వానించింది. జరిగిన పరిణామాలను గమనించిన టీడీపీ గిరిజన నేతలంతా అవాక్కయ్యారు. ఇంత ఘోరమా అని ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారిపోవాలా అని అంతర్మథనం చెందుతున్నారు. ప్రత్యర్థిగా ఉన్నప్పుడు తమను పావుగా వాడుకుని, ఇప్పుడు అతనిని పార్టీలో చేర్చుకున్నారని, తామంతా ఏమైపోవాలని వాపోతున్నారు. పక్కలో బల్లెం పెట్టుకున్నట్టే అయ్యిందని కూడా మదనపడుతున్నారు. అప్పుడు పార్టీకి శత్రుచర్ల వెన్నుపోటు ఇదంతా ఒక ఎత్తు అయితే టీడీపీ తరఫున ఎంపీగా ఎన్నికైన శత్రుచర్ల విజయరామరాజు అప్పట్లో కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సమ యంలో టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసి, వెన్నుపోటు పొడిచిన సందర్భం ఇప్పటికీ టీడీపీ నేతలను బాధిస్తోంది. ఆ మధ్య శత్రుచర్ల రాకను వ్యతిరేకిస్తూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు తమ అనుచరుల వద్ద ఇదే విషయాన్ని వ్యక్తం చేశారు. కాకపోతే అశోక్ మాట చెల్లుబాటు కాకపోవడంతో శత్రుచర్ల ఓవర్ టేక్ చేశారు. కానీ, టీడీపీ నాయకుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి ఉంది. అంతేలే వెన్నుపోటు రాజకీయాలు నెరిపే పార్టీలో వెన్నుపోటుదారులు ప్రోత్సహించరని అనుకోవడం తమ పొరపాటు అని అంతర్మథనం చెందుతున్నారు. మొత్తానికి శత్రుచర్ల రాకతో కురుపాం టీడీపీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. -
ప్రజాసమస్యలు విస్మరించిన సర్కార్
సదాశివపేట, న్యూస్‌లైన్: ప్రజా సమస్యలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా గాల్లో కలపడం ఖాయమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జయరాజ్ అన్నారు. మంజీర జలాలు, తాగు, సాగుకు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం చే స్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, కుంభకోణాలు పెరిగిపోయాయన్నారు. యూపీఏ మంత్రులు చేసిన టెలికం, బొగ్గు కుంభకోణాల డబ్బులతో దేశంలోని పేదలందరికీ 35 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వవచ్చన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అసంఘటిత, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 12,500 చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మండల ప్రజలకు మంజీర తాగు సాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇళ్ల స్థలాల పట్టాలిచ్చిన వారందరికీ వెంటనే పొజిషన్ చూపించి ఇందిరమ్మ రుణాలు మంజూరు చేయాలన్నారు. మండల పరిధిలోని గంగకత్వవాగు ఎత్తు పెంచి కాలువ మరమ్మత్తు పనులు చేపట్టి సాగుకు నీరందించాలని ఆయన కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీపీఎం చేపట్టిన సైకిల్‌యాత్ర ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, మండల కార్యదర్శి నర్సింలు, ఖయ్యూం, హోలి అహ్మద్, అడివయ్య, రవి, మల్లేశం, నరేందర్, గోపాల్ పాల్గొన్నారు. -
మీ ఇలాఖాలో.. ఇలా..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ సొంత జిల్లాలోనే... ఆ విభాగం చేతులు ముడుచుకుంది. నిరుపేద లబ్ధిదారులకు అందాల్సిన సొమ్ము పక్కదారి పడుతుంటే మీనమేషాలు లెక్కిస్తోంది. గతంలో వెలుగులోకి వచ్చిన అవినీతి తతంగాలన్నీ ఇక్కడ తూతూమంత్రంగా తుడుచు పెట్టుకుపోవడం కార్పొరేషన్ పనితీరును ప్రశ్నార్థకంగా మార్చాయి. కొన్నింట విచారణలు చేపట్టి... బాధ్యులను గుర్తించినప్పటికీ... నిధులు రికవరీ చేయకుండా కాలం నెట్టుకొస్తున్న తీరు అనుమానాలకు తెరలేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన అవినీతి వ్యవహారాలను సైతం పట్టించుకోకపోవడం పాత ఆనవాయితీని గుర్తుకుతెస్తోంది. ఇటీవల బోర్ బావులు, సబ్ మెర్సిబుల్ పంప్ సెట్ల పేరుతో జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన సబ్సిడీ సొమ్ము భారీ మొత్తంలో దుర్వినియోగమైన వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిం ది. మెట్‌పల్లికి చెందిన ఓ పంప్సెట్ల డీలర్ బ్యాంకర్లను, అధికారులను మేనేజ్ చేసి ఒక్క కథలాపూర్ మండలంలోనే ఎక్కువ యూనిట్లు మంజూరు చేయించి.. సబ్సిడీ సొమ్మును మింగేసిన తీరు రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది. బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కార్పొరేషన్ ఎండీ జయరాజ్ కరీంనగర్, కాకినాడ జిల్లాల్లో సబ్సిడీ సొమ్ముపై వచ్చిన ఆరోపణలపై ఆరా తీసినట్లు తెలిసింది. పంప్సెట్ల వ్యవహారంపై ప్రాథమిక నివేదిక ఎందుకు పంపించలేదని.. గతంలో విచారణకు వచ్చిన అధికారికి సైతం సంబంధిత ఫైలు ఎందుకు అప్పగించలేదని జిల్లా కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు అధికారులు అలసత్వం ప్రదర్శించిన కొద్దీ సబ్సిడీ సొమ్ముతో దాగుడు మూతలాడిన బ్యాం కర్లు, అక్కడి అధికారులు, స్థానిక నేతలు అప్రమత్తమయ్యారు. తమ తప్పేమీ లేదని తప్పిం చుకునేందుకు బోగస్ లబ్ధిదారులను మూటగట్టుకొని తిమ్మిని బమ్మిచేసే ప్రయత్నాలు ప్రారం భించారు. గతంలో జిల్లాలో జోగినీ స్త్రీలకు పునరావాసం, ఆర్థిక సాయం పంపిణీలో అవినీతి జరిగింది. మహిళా సమృద్ధి యోజన పేరిట మహిళా గ్రూపులకు ఇచ్చే ఆర్థిక సాయం కూడా పక్కదారి పట్టింది. స్వయంగా అప్పుడు పనిచేసిన కార్పొరేషన్ అధికారులు, కొందరు ఉద్యోగులకు అందులో ప్రమేయముందని.. కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ నిధులను సొంత ఖాతాలకు మళ్లించారని అభియోగాలు నమోదయ్యాయి. తదుపరి జరిగిన విజిలెన్స్ విచారణలోనూ ఈ నిజాలు బయటపడ్డాయి. బాధ్యులైన వారిలో ఎక్కువ మంది జిల్లా నుంచి బదిలీపై వెళ్లగా... కొందరు ఇప్పటికీ ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్న కార్పొరేషన్ కనీసం దుర్వినియోగమెన లక్షలాది రూపాయలను వారి నుంచి రికవరీ చేయటం మరిచిపోయింది. ఇదే తీరు కొనసాగితే... సర్కారు సబ్సిడీలన్నీ యథేచ్ఛగా పక్కదారి పట్టే ప్రమాదముంది. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి ఎదిగిన లక్ష్మణ్‌కుమార్ ఈ వ్యవహారాలపై ఇప్పటికైనా దృష్టి సారిస్తారా? లేదా వేచి చూడాల్సిందే!