గాంధీ, వైఎస్ విగ్రహాల తొలగింపు హేయం | Gandhi , YS statues removal is disgusting | Sakshi
Sakshi News home page

గాంధీ, వైఎస్ విగ్రహాల తొలగింపు హేయం

Published Mon, Aug 8 2016 5:51 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Gandhi , YS statues removal is disgusting

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో పుష్కరాల అభివృద్ధి పేరుతో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యుడు జయరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 

మహాత్ముడి విగ్రహం తొలగించిన విషయంపై సాక్షి పత్రికలో కథనాలు ప్రచురితం కావడం... ప్రజాగ్రహం పెద్ద ఎత్తున వ్యక్తం కావడంతో తలొంచిన తెలుగుదేశం ప్రభుత్వం రాత్రికి రాత్రే గాంధీ విగ్రహాన్ని పునఃప్రతిష్టించిన విషయాన్ని గుర్తుచేశారు. విజయవాడలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ప్రభుత్వం తొలగించడంపై తక్షణమే కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం తొలగించిన వైఎస్సార్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించకపోతే ఆందోళన కార్యక్రమాలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement