దేశం ఓ గొప్ప నేతను కోల్పోయింది | India Has Lost One Great Leader Said By YS Jagan | Sakshi
Sakshi News home page

దేశం ఓ గొప్ప నేతను కోల్పోయింది

Aug 16 2018 6:42 PM | Updated on Sep 4 2018 5:53 PM

India Has Lost One Great Leader Said By YS Jagan - Sakshi

భారతరత్న వాజ్‌పేయి మరణించారన్న వార్త ఎంతగానో బాధించిందని తెలిపారు

హైదరాబాద్‌: భారత మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతిపట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందన్నారు. భారతరత్న వాజ్‌పేయి మరణించారన్న వార్త ఎంతగానో బాధించిందని తెలిపారు. అటల్‌జీ మరణంతో మన దేశ రాజకీయాల్లో ఓ గొప్పశకం ముగిసినట్టయిందని పేర్కొన్నారు.

విభేదించే రాజకీయ పార్టీల వారికి కూడా ఆమోదయోగ్యుడిగా, అద్భుతమైన-ఆకట్టుకునే వక్తగా, కవిగా, రాజకీయ విలువలూ మర్యాదల పరంగా శిఖర సమానుడిగా, విదేశీ దౌత్య దురంధరుడిగా, పార్లమెంటరీ సంప్రదాయాల పరంగా మహోన్నతుడిగా వాజ్‌పేయి అందరి మన్ననలూ పొందారని..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ప్రకటన ద్వారా తెలియజేశారు.

ఓ చరిష్మా ఉన్న లీడర్‌ను దేశం కోల్పోయింది: విజయసాయి రెడ్డి(వైఎస్సార్‌సీపీ ఎంపీ)

దేశం ఓ చరిష్మా ఉన్న, అత్యంత గౌరవనీయుడైన వ్యక్తిని కోల్పోయిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. అటల్‌జీ మృతి బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement