రైస్‌ పుల్లింగ్‌ ముఠా గుట్టు రట్టు | Pulling the gang betrayed Rice Hill | Sakshi
Sakshi News home page

రైస్‌ పుల్లింగ్‌ ముఠా గుట్టు రట్టు

Published Sat, Dec 17 2016 10:35 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

బిందెతో నిందితులు

బిందెతో నిందితులు

ఇబ్రహీంపట్నంరూరల్‌: రైస్‌పుల్లింగ్‌ పేరుతో ఓ వ్యక్తి నుంచి లక్షలు దండుకున్న వ్యక్తులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రైస్‌పుల్లర్‌ను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఆదిభట్ల సీఐ గోవింద్‌రెడ్డి, ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ ఎస్‌ఐ కాశీనాథం కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని కమ్మగూడ గ్రామానికి చెందిన మదాని జాన్పాల్‌ అనే వ్యక్తికి  అదే గ్రామానికి చెందిన జయరాజ్‌ దివ్యశక్తులు ఉన్న పాత్ర గురించి చెప్పాడు.  తనకు తెలిసిన వ్యక్తుల వద్ద అలాంటి పాత్ర ఉందని నమ్మించాడు.

కర్నూలు జిల్లాకు  మహ్మద్‌ షేక్‌ రఫీ మహ్మద్‌ షేక్‌ షఫీ, చిత్తూరు జిల్లా కు చెందిన రంగనాథం ప్రకాష్‌ అనే వ్యక్తులతో కలిసి జాన్ పాల్‌ను మోసం చేసేందుకు పథకం పన్నారు. చెన్నై నుంచి ఆ పాత్ర తెచ్చేందుకు డబ్బులు కావాలని చెప్పడంతో జాన్పాల్‌ పలు దఫాలుగా రూ.11.45 లక్షలు ఇచ్చాడు. కొద్ది రోజుల క్రితం రఫీ, షఫీ, జయరాజ్, ప్రకాష్‌ అతనికి థర్మకోల్‌లో ప్యాకింగ్‌ చేసిన బిందెను ఇచ్చి ఇంట్లో ఉంచుకుని పూజలు చేయాలని చెప్పారు.

అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement