మిస్టరీ ఛేదిస్తా! | Info on Jayalalitha health given as per her wish: Apollo hospital to HC | Sakshi
Sakshi News home page

మిస్టరీ ఛేదిస్తా!

Published Sat, Feb 25 2017 4:52 AM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

జయతో పన్నీర్‌ సెల్వం(ఫైల్‌)

జయతో పన్నీర్‌ సెల్వం(ఫైల్‌)

► జయ మృతి మిస్టరీపై  పన్నీరుసెల్వం శపథం
► అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంటా
► విచారణ కమిషన్  వల్లే శశికళతో విభేదాలు
►ఆర్కేనగర్‌లో జయ జయంతి వేడుకలు


సాక్షి ప్రతినిధి,చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంలోని మిస్టరీని ఛేదించి తీరుతా, పార్టీని, ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంటానని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం శపథం చేశారు. ఎమ్మెల్యేగా జయలలిత ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్కేనగర్‌లో శుక్రవారం ఆమె 69వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదికపై ఏర్పాటు చేసిన జయ చిత్రపటానికి నివాళులర్పిం చారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్  మధుసూదన్  సభకు అధ్యక్షత వహించగా,  పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ ఎంజీ రామచంద్రన్  మరణం తరువాత పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కోగా ఎ న్నో కష్టనష్టాలకోర్చి జయలలిత వాటిని అధిగమించారని తెలిపారు.

అయితే నేడు అదే పార్టీ, ప్రభుత్వం కొందరి కబంధహస్తాల్లో చికు్కకు పోయిందని తెలిపారు. జయలలిత ఆశయాలకు విరుద్ధంగా వీరు వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబటా్టరు. ఎవరి చేతులో్లకి పార్టీ, ప్రభుత్వం వెళ్లకూడదని అమ్మ జాగ్రతపడ్డారో నేడు అదే వ్యకు్తలు పార్టీ పెద్దలుగా మారిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ, ప్రభుత్వాలను ఆ కుటుంబ సభ్యుల నుంచి కాపాడుకునే పోరాటంలో తమకు విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

జయలలిత మరణంపై ప్రజల మనస్సుల్లో అనేక సందేహాలు ఉన్నాయని, ఈ సందేహాల నివృత్తి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవిచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నట్లు తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరు తూ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన అన్నాడీఎంకే కార్యకర్తను కలిసేందుకు ఇటీవల తాను కీల్‌పాక్‌ ప్రభుత్వఆసుపత్రికి వెళ్లానని తెలిపారు. జయ మరణానికి అసలైన కారణాలను బైటపెటా్టల్సిందిగా అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక వృదు్ధరాలు తనను వేడుకున్నదని చెప్పారు. జయ మరణంపై విచారణ కమిషన్  వేసే ప్రయత్నంలోనే తనకు, శశికళ మధ్య విభేదాలు పొడచూపగా ప్రభుత్వం చేజారిపోయిందని అన్నారు.

అందుకే జయ మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీని ఛేదించే వరకు తమ ధర్మయుద్ధం ఆగదని శపథం చేశారు. ధర్మయుద్ధం ఓడినట్లుగా చరిత్రలోనే లేదని ఆయన అన్నారు. తన జన్మదినాన ఎవ్వరూ తనను కలవొద్దు, పేదల ఇళ్లకు వెళ్లండని అమ్మ అభీష్టం మేరకు రూ.40 లక్షల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు ఆయన తెలిపారు. పన్నీర్‌ సెల్వం తన మొత్తం ప్రసంగంలో ఎక్కడా శశికళ పేరును ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డారు. అయితే ప్రజలు, కార్యకర్తలు శశికళ డౌన్  డౌన్  అంటూ నినాదాలు చేశారు. అలాగే ఆర్కేనగర్‌ ప్రజలు, కార్యకర్తలు పన్నీర్‌సెల్వంను ఘనంగా సత్కరించి ‘ప్రజల ముఖ్యమంత్రి’, జల్లికట్టు కోసం కేంద్రంతో పోరాడిన వీరుడు’ అంటూ నినాదాలు చేశారు.

దీప దూరమే: అన్నాడీఎంకేలో ఇటీవల చోటుచేసుకున్న సంక్షోభ దినాల్లో పన్నీర్‌సెల్వం పక్కన నిలిచిన జయలలిత మేనకోడలు దీప ఆర్కేనగర్‌ సభలో కానరాలేదు. ఆర్కేనగర్‌లో జరిగే జయ జయంతి వేడుకల్లో ఒకే వేదికపై నుంచి ప్రసంగించనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే ఆర్కేనగర్‌లోని సభకు దీప గైర్హాజరుకావడం ద్వారా రాజకీయాల్లో పన్నీర్‌సెల్వంతో కలిసి నడిచే అవకాశం లేదని భావించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement