pannirselvam
-
మద్రాస్ హైకోర్టులో ఈపీఎస్‌కు ఊరట
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం ఈకే పళనిస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. అన్నాడీఎంకే నాయకత్వ వివాదంపై న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. పార్టీకి పళనిస్వామే సుప్రీం నాయకుడని స్పష్టం చేసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నిక చెల్లుతుందని డివిజన్ బెంచ్ పేర్కొంది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. జులై 11న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నాడీఎంకే తాత్కాలిక కార్యదర్శిగా పళనిస్వామి ఎన్నికయ్యారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఓ పన్నీర్‌సెల్వం కోర్టును ఆశ్రయించారు. అప్పటి సింగిల్ బెంచ్ ధర్మాసనం పళనిస్వామి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. అయితే ఈ వ్యవహారంపై పళనిస్వామి మరోసారి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో ఈపీఎస్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు కోర్టు తీర్పు అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఎర్పాటు చేశారు. గతంలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఆపీస్లో విధ్వంసం సృష్టించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈమేరకు చర్యలు తీసుకున్నారు. చదవండి: కేసీఆర్‌కు ఘోర అవమానం.. ఇందుకేనా బిహార్ వెళ్లింది?: బీజేపీ -
ఇదిగో సాక్ష్యం
► ముడుపుల వీడియో ప్రదర్శించిన స్థాలిన్ ► చర్చకు అనుమతించని అధికారపక్షం ► అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన విపక్షం రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ముడుపుల వ్యవహారంపై ఇదిగో సాక్ష్యమంటూ ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సీడీని ప్రదర్శించడంతో శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపు స్తంభించిపోయాయి. చర్చకు అనుమతించాలనే డిమాండ్‌పై విపక్షాలు పట్టువీడకపోవడం, ససేమిరా అంటూ అధికారపక్షం భీష్మించుకోవడం, వాకౌట్లతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: విశ్వాస పరీక్ష నెగ్గడం ద్వారా ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగా శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలు ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున ముడుపులు ముట్టజెప్పారని ఎమ్మెల్యే శరవణన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రయివేటు ఇంగ్లి్లషు చానల్లో ప్రసారమైన ఇంటర్వూ్య తనదే, అయితే గొంతు మాత్రం వేరేవారిదని శరవణన్ కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా విపక్షం మాత్రం నమ్మడం లేదు. ఈనెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా, ప్రతిరోజూ ఇదే అంశంపై సభ అట్టుడికి పోతోంది. ముడుపుల వ్యవహారంపై చర్చకు స్పీకర్ ధనపాల్ గట్టిగా నిరాకరిస్తుండగా, డీఎంకే సభ్యులు అదేపనిగా పట్టుబడుతూనే ఉన్నారు. ఆధారం లేని ఆరోపణలపై అసెంబీలో చర్చకు తావులేదనే వాదనతో గురువారం నాటి సమావేశంలో స్పీకర్ అడ్డుకున్నారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే స్టాలిన్ లేచి నిలబడి ముడుపులపై ప్రసంగించడం ప్రారంభించి సభలో ఆధారాలను సమర్పించేందుకు సిద్ధమన్నారు. ఆ తరువాత డీఎంకే ఉపసభాపక్ష నేత దురైమురుగన్ కూడా మాట్లాడారు. అయితే వీరిద్దరి ప్రసంగాలు అభ్యంతరకంగా ఉన్నందున రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంతో డీఎంకే సభ్యులంతా వాకౌట్ చేశారు. రాష్ట్రంలో పేదలకు 10లక్షల ఇళ్ల నిర్మాణాలను త్వరలో చేపట్టనున్నట్లు మంత్రి ఉడుమలై రా«ధాకృష్ణన్ సభలో ప్రకటించారు. మదురైలో బ్రహ్మాండమైన గ్రంధాలయం, పుస్తక ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తున్నామని, చెన్నైలోని అన్నా గ్రంధాలయ అభివృద్ధికి రూ.5 కోట్లు కేటాంచామని మంత్రి సెంగొట్టయ్యన్ తెలిపారు. అసెంబ్లీ నుంచి బైటకు వచ్చిన అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ ముడుపులపై ఆధారాలు లేవని చర్చకు నిరాకరించారు, నేడు ఆధారాలతో కూడిన సీడీని సిద్ధం చేసుకుని అసెంబ్లీకి వెళ్లినట్లు చెప్పారు. అసెంబ్లీకి ఆధారాలు సమర్పించేందుకు సిద్ధమని చెప్పినా చర్చకు అనుమతించక పోవడం విడ్డూరమని అన్నారు. సచివాలయంలో సర్పాలు: రాజకీయ రణగొణ ధ్వనులతో అసెంబ్లీ ఒకవైపు దద్దరిల్లుతుండగా సచివాలయ ప్రాంగణంలో రెండు సర్పాలు ప్రవేశించి అందరినీ భయపెట్టాయి. గురువారం ఉదయం 8.45 గంటల సమయంలో సచివాలయ ప్రవేశ ద్వారం సమీపంలో పిచ్చిమొక్కలను పారిశుద్ధ్య సిబ్బంది పీకి వేస్తున్నారు. అదే సమయంలో ఐదడుగుల చారల పాము మెల్లగా సచివాలయంలోకి ప్రవేశించడాన్ని కనుగొన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే సమీపంలోని సీఐకి తెలుపగా ఆయన ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మొక్కల్లో నక్కి ఉన్న పామును లాఘవంగా పట్టుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మీడియా ప్రతినిధుల చాంబర్ సమీపంలో మరో పాము దర్శనమిచ్చి దడపుట్టించింది. అగ్నిమాపక సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టిన అనంతరం పాము చిక్కడంతో టెన్షన్ వీడింది. -
పట్టు వీడండి!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నో ఆశలతో ఢిల్లీకి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు నిరాశే ఎదురైంది. పన్నీర్ రాజకీయ వ్యవహార శైలిపై ప్రధాని నరేంద్రమోదీ గట్టిగా క్లాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ తన పక్షం అని ధీమాతో ఉన్న పన్నీర్ సెల్వం డీలాపడిపోయినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే రాజకీయాలు అల్లకల్లోలమయ్యా యి. జయలలిత అభిమానాన్ని చూరగొన్న నేతగా పేరుగాంచిన పన్నీర్‌సెల్వంను ప్రధాని చేరదీసి శశికళ వర్గాన్ని దూరం పెట్టారు. తదనంతర పరిణామాల్లో శశికళ, దినకరన్ జైలు పాలుకాగా, సీఎంగా ఎడపాడి ఎన్నికై పాలన సాగిస్తున్నారు. అంతేగాక రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తామని ప్రకటించి కేంద్ర ప్రభుత్వానికి చేరువయ్యారు. రాజకీయాల్లో శాశ్వత శతృత్వం, మిత్రత్వం లేదన్న సామెతను ప్రధాని మోదీ మరోసారి రుజువుచేస్తూ ఎడపాడి పట్ల సానుకూల వైఖరిని ప్రారంభించారు. ఈ పరిణామాలతో ఖంగుతిన్న పన్నీర్‌సెల్వం ఢిల్లీ విమానం ఎక్కారు. సుమారు 45 నిమిషాలపాటు ప్రధానితో జరిగిన సంభాషణల్లో పన్నీర్‌కు ఊరట లభించకపోగా ఉసూరుమంటూ బైటకు వచ్చారు. ‘శశికళ కుటుంబీకులు పాలనకు మాత్రమే తాను వ్యతిరేకం, మరెవరైనా తనకు అభ్యంతరం లేదు, సీఎం ఎడపాడి వైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు గణనీయమైన సంఖ్యలో ఉండగా, మీ వద్ద నామమాత్రం ఉన్నారు. సీఎం, ప్రధాన కార్యదర్శి పదవులే మీకు ముఖ్యం, పార్టీ ఏమై పోయినా ఫరవాలేదు. పట్టువిడుపులు ప్రదర్శించి విలీనంపై దృష్టిపెట్టండి’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ పన్నీర్‌సెల్వంను తూర్పారపట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఊహించని ఈ పరిణామంతో బిక్కచచ్చిపోయిన పన్నీర్‌సెల్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మద్దతుపై పునరాలోచనలో పడ్డారు. బీజేపీతో కలిసి పోటీచేస్తామని గతంలో ప్రకటించిన పన్నీర్ సెల్వం శనివారం తన ట్విట్టర్లో మాటమార్చారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీ ప్రకటించిన తరువాతనే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించి ప్రధాని మోదీపై తనకున్న కోపాన్ని చాటుకున్నారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం అన్నాడీఎంకేలోని ఇరువర్గాలు బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో పన్నీర్‌సెల్వం చేదు అనుభవాలను అందిపుచ్చుకున్న సీఎం ఎడపాడి మేట్టుపాళయంలో శనివారం జరిగిన సభలో విలీనంపై మళ్లీ ఆహ్వానం పలికారు. తమ ప్రభుత్వాన్ని ఎవ్వరూ కూల్చలేరు, నాలుగేళ్లు కొనసాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. శశికళ, దినకర్లు జైలు నుంచే ఎడపాడి ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, అందుకే విలీనంపై వెనకడుగు వేశామని పన్నీర్వర్గంలోని మధుసూదనన్ విమర్శించారు. -
గుర్తు పట్టాలని!
► రెండాకుల చిహ్నం కోసం మూడు పార్టీల పట్టు ► దీప పేరవై పేరు మార్పు ► ఈసీకి పన్నీర్ వర్గం ప్రమాణపత్రాల సమర్పణ అన్నాడీఎంకేకు ఆయువు పట్టు రెండాకుల చిహ్నం. ఈ గుర్తుకోసం మూడు పార్టీలు పోరుబాట పట్టాయి. శశికళ వర్గం ఇప్పటికే ఎన్నికల కమిషన్ వద్ద తన వాదన వినిపించింది. ఇప్పుడు పార్టీ పేరు మార్పుతో దీప, ఈసీకి ప్రమాణపత్రాల సమర్పణతో పన్నీర్‌సెల్వం రెండాకుల గుర్తు దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత గత ఏడాది కన్నుమూసిన కొద్దిరోజుల్లోనే రెండాకుల పార్టీ రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకేకు అసలైన వారసులం తామంటే తామని శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాల ప్రకటించుకోగా ఎవ్వరూ కాదు పొమ్మంటూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నంపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ పరిణామంతో విస్తుపోయిన ఇరువర్గాలు రెండు పార్టీలు పెట్టుకున్నాయి. శశికళ వర్గం తమ పార్టీకి ‘అన్నాడీంకే అమ్మ’ (టోపీ గుర్తు), పన్నీర్ వర్గం ‘అన్నాడీఎంకే పురట్చితలైవీ అమ్మ’ (రెండు దీపాల విద్యుత్ స్తంభం గుర్తు) అని నామకరణం చేసుకుని ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో తలపడ్డాయి. అయితే అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం లేకుండా నెగ్గుకు రావడం కష్టమని కొద్దిరోజుల్లోనే ఇరు వర్గాలకూ తెలిసిపోయింది. అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్ ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల చిహ్నం లేని లోటును డబ్బుతో అధిగమించేందుకు ప్రయత్నించి అభాసుపాలు కావడంతోపాటు ఎన్నికల రద్దు కారకుడయ్యాడు. అంతేగాక రెండాకుల చిహ్నంను దొడ్డిదారిన దక్కించుకునేందుకు ఏకంగా ఎన్నికల కమిషన్‌కే రూ.50 కోట్ల ఎరవేసి జైలు పాలయ్యాడు. రెండాకుల కోసం మూడు పార్టీల పోరు ఇదిలా ఉండగా, ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్న అన్నాడీఎంకేను, రెండాకుల చిహ్నాన్ని ఎలాగైనా దక్కించుకునే ప్రయత్నాలను మానివేసి పార్టీ క్యాడర్ బలం ద్వారా పొందాలని శశికళ వర్గం నిర్ణయించుకుంది. ప్రస్తుతం పార్టీ, మెజార్టీ ఎమ్మెల్యేల బలం ప్రభుత్వం తమ చేతుల్లో ఉందనే ధీమాతో ఎన్నికల కమిషన్‌కు ఇప్పటికే అనేక పత్రాలను సమర్పించిన శశికళ వర్గం నింపాదిగా వ్యవహరిస్తోంది. పన్నీర్ వర్గం ప్రమాణ పత్రాల సమర్పణ: ఇక పన్నీర్‌సెల్వం వర్గం సైతం ఎన్నికల కమిషన్నే నమ్ముకుంది. అమ్మ పార్టీకి అసలైన వారసులం అంటూ గతంలో 20 వేల పేజీలతో కూడిన ప్రమాణ పత్రాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. ఇందుకు అదనంగా శుక్రవారం 12,600 పేజీలతో కూడిన ప్రమాణ పత్రాలను అందజేసింది. పన్నీర్‌సెల్వం నాయకత్వాన్ని తాము సమర్థిస్తున్నామంటూ పార్టీ నేతలు, సభ్యుల సంతకాలతో కూడిన ప్రమాణ పత్రాలు అందులో ఉన్నాయి. ఇరువర్గాల పత్రాలను ఎన్నికల కమిషన్ పరిశీలిస్తోంది. పేరు మార్చుకున్న దీప పేరవై: రెండాకుల చిహ్నం కోసం శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలు పోటీ పడుతుండగా జయలలిత అన్నకుమార్తె దీప సైతం రంగంలోకి దిగారు. అమ్మకు రక్తసంబంధీకులమేకాదు, రాజకీయ వారసురాలిని కూడా నేనే అంటూ ఎంజీఆర్ ‘అమ్మ దీప పేరవై’ పేరుతో జనం ముందుకు వచ్చారు. రెండాకుల చిహ్నం దక్కించుకోవడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఆర్కేనగర్ ఎన్నికల్లో సైతం పేరవై పేరుతో పోటీచేసిన దీప... రెండాకుల చిహ్నం రేసులో ఉరికేందుకు తాజాగా తన పార్టీ పేరును మార్చారు. పేరవై ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి రుమాన పాండియన్ అధ్యక్షతన నిర్వాహకులతో శుక్రవారం సమావేశమై పలు తీర్మానాలు చేశారు. ఎంజీఆర్ అమ్మ దీప పేరవైని రద్దు చేసి ‘అన్నాడీఎంకే దీప’ వర్గంగా మార్చడం తీర్మానాల్లో ప్రధానమైనది. -
జయ మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి
పార్లమెంటులో పన్నీర్ అనుకూల ఎంపీల డిమాండ్ న్యూఢిల్లీ: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతికి దారితీసిన పరిస్థితులపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు మద్దతిస్తున్న ఆ పార్టీ ఎంపీలు శుక్రవారం పార్లమెంటులో డిమాండ్ చేశారు. పలుసార్లు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో లోక్‌సభ ఒకసారి వాయిదాపడగా, రాజ్యసభలో కార్యక్రమాలు కాసేపు స్తంభించాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే ఆరుగురు అన్నాడీఎంకే ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి జయ మృతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ ఆమె ఆస్పత్రిలో ఉన్న ఫొటో ప్లకార్డులు ప్రదర్శించారు. సబ్సిడీ వంటగ్యాస్, ఇతర ఇంధన ధరల పెంపుపై విపక్షాలు లోక్‌సభలో మండిపడ్డాయి. ధరలు పెంచి ప్రభుత్వం పేదలపై పెనుభారాన్ని మోపుతోందని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కాగా, శత్రు ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన సవరణ బిల్లును రాజ్యసభ శుక్రవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. విద్యాసంస్థల్లో నైతిక విద్య కింద భగవద్గీత బోధనను తప్పనిసరి చేయాలంటూ బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. మొత్తం 103 ప్రైవేటు బిల్లులను సభ్యులు తీసుకొచ్చారు. -
మోగిన ఉప నగారా
► వచ్చే నెల 12న ఆర్కేనగర్ ఉప ఎన్నిక ► మార్చి 16 నుంచి నామినేషన్లు ► ఏప్రిల్ 15న ఓట్ల లెక్కింపు ► పోటీకి దీప సిద్ధం సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై ఆర్కేనగర్లో ఉప ఎన్నిక నగారా మోగింది. వచ్చేనెల 12వ తేదీన ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించింది. ఈనెల 16న నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. గత ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆర్కేనగర్ నుంచి పోటీచేసి గెలుపొందారు. అనారోగ్య కారణాలతో గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత డిసెంబర్ 5వ తేదీన కన్నుమూశారు. ఆమె మరణంతో ఆమె ప్రాతిని«థ్యం వహించిన ఆర్కేనగర్లో ఉపఎన్నిక ఏర్పడింది. అమ్మ మరణం తరువాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ, ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వం బాధ్యతలు స్వీకరించారు. అయితే అనతికాలంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోగా తదనంతర పరిణా మాల వల్ల రెండాకుల పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. పన్నీర్‌సెల్వంతో ఆయన మద్దతుదారులపై శశికళ బహిష్కరణ వేటువేశారు. ఒక వర్గానికి పన్నీర్‌సెల్వం, మరో వర్గానికి శశికళ నాయకత్వం వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా శశికళ జైలు కెళ్లే ముందు ఆమె అక్క కుమారుడు టీటీవీ దినకరన్ ను ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు. బెంగళూరు జైలు నుంచి ఆమె పార్టీ చక్రం తిప్పుతున్నారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేలోని ఒక వర్గం జయ మేనకోడలు దీపను అనుసరిస్తోంది. దీంతో రెండుగా ఉండిన పార్టీ మూడు వర్గాలుగా మారిపోయింది. శశికళపై ఎన్నికల కమిషన్ కు పన్నీర్‌సెల్వం వర్గం ఫిర్యాదు చేయగా ఈనెల 10వ తేదీలోగా బదులివ్వాల్సిందిగా ఆమెకు నోటీసులు అందాయి. శశికళ ఇచ్చిన వివరణకు ఎన్నికల కమిషన్ సంతృప్తిచెందని పక్షంలో పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు పన్నీర్‌సెల్వం పావులు కదుపుతున్నారు. ఇటువంటి కీలకమైన తరుణంలో ఆర్కేనగర్ ఉప ఎన్నిక ముంచుకొచి్చంది. ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కార్యాలయం గురువారం మధ్యాహ్నం ఆర్కేనగర్ ఉపఎన్నిక నగారాను మోగించింది. ఆర్కేనగర్లో ఉప ఎన్నిక ప్రకటన వల్ల ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చింది. దీంతో అధికార అన్నాడీఎంకే నేతలు, ప్రభుత్వ అధికారులు హడావుడిగా నియోజక వర్గానికి చేరుకుని ప్రజల సమస్యలను తెలుసుకోవడం ప్రారంభించారు. అలాగే దీప, పన్నీర్‌సెల్వం అనుచరులు వేర్వేరుగా సమావేశమై ఎన్నికలపై సమాలోచనలు జరిపారు. ఆర్కేనగర్ నుంచి దీప పోటీ: అన్నాడీఎంకే ప్రతిష్ట, అమ్మ ప్రభావంపై ఆధారపడి మూడు వర్గాలు అభ్యర్థులను పోటీకి పెట్టడం దాదాపు ఖాయమని భావించవచ్చు. శశికళ జైలు కెళ్లకుంటే పోటీచేసి ఉండేవారు. దీంతో ఆమెకు బదులుగా దినకరన్ పోటీచేసేందుకు ఉత్సాహపడుతున్నారు. పన్నీర్‌సెల్వం ఎవరిని పోటీకి పెడతారో ఇంకా తేటతెల్లం కాలేదు. ఇక మూడో వర్గం నుంచి దీప పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్కేనగర్ నుంచి పోటీచేయనున్నట్లు దీప గురువారం సాయంత్రం ప్రకటించారు. ఇక డీఎంకే, కాంగ్రెస్ కలిసి ఒక అభ్యర్థిని, బీజేపీ, డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, వీసీకే పార్టీలు కూడా రంగంలో నిలిచే అవకాశం ఉంది ఎన్నికల షెడ్యూలు: మార్చి 16వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. నామినేషన్ల స్వీకరణ ఈనెల 23 వ తేదీతో ముగుస్తుంది. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు 27వ తేదీ ఆఖరు రోజు. ఏప్రిల్ 12వ తేదీన పోలింగ్, 15వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడితో ఉప ఎన్నికకు తెరపడనుంది. -
పన్నీర్ గృహప్రవేశం
► పోయెస్‌గార్డెన్ లోకి మారిన మాజీ సీఎం ► కొత్త ఇంటి నుంచే రాజకీయాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పోయెస్గార్డెస్ లోని తన కొత్త నివాసంలో గురువారం గృహప్రవేశం చేశారు. సంప్రదాయబద్ధంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిలోకి వెళ్లి పాలుపొంగించి కాపురం పెట్టారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటి వెనుకనున్న వీనస్ కాలనీలోనే పన్నీర్ గృహప్రవేశం చేసిన ఇల్లు ఉండడం విశేషం. అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో జయలలిత తరువాత అంతటి ప్రాధాన్యతను కలిగి ఉన్న పన్నీర్‌సెల్వం అమ్మ మరణంతో అవస్థలపాలయ్యారు. జయ జైలుకెళ్లిన రెండుసార్లు తాత్కాలిక ముఖ్యమంత్రి వ్యవహరించిన పన్నీర్‌సెల్వం ఆమె మరణించిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ కనుసన్నల్లో ఉంటూనే స్వంత నిర్ణయాలతో పాలన సాగించారు. ముఖ్యంగా తీవ్రస్తాయిలో సాగుతున్న జల్లికట్టు ఉద్యమాన్ని చల్లార్చేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావడం, సదరు ఆర్డినెన్స పై కేంద్రం సహాయంతో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించడంలోనూ విజయం సా«ధించారు. సీఎంగా తనదైన ముద్రలో దూసుకుపోవడం ద్వారా ప్రతిపక్షాల ఆదరాభిమానాలను సైతం చూరగొన్నారు. జయ మరణించగానే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితోపాటూ సీఎం కుర్చీపై సైతం కన్నేసిన శశికళ పన్నీర్ దూకుడుకు కళ్లెం వేయాలని నిర్ణయించుకున్నారు. గత నెల 5వ తేదీన పోయెస్‌గార్డెన్ లో సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామా చేశారు. ఆదే రోజున అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా (సీఎంగా) శశికళను ఎన్నుకున్నారు. అకస్మాతుగా తనను ఇంటికి పిలిపించుకుని తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని శశికళపై పన్నీర్‌సెల్వం ఆరోపణలు చేయడం ద్వారా తిరుగుబాటు జెండా ఎగరవేశారు. దీంతో అన్నాడీఎంకే పన్నీర్‌సెల్వం, శశికళ వర్గాలుగా చీలిపోయింది. పన్నీర్‌సెల్వం అతని మద్దతుదారులను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు శశికళ ప్రకటించారు. అయితే సీఎం బాధ్యతలు చేపట్టేలోగా ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టు తీర్పుతో జైలుపాలయ్యారు. శశికళ స్థానంలో ఎడపాడి పళనిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పన్నీర్ క్వార్టర్‌పై కన్ను: పన్నీర్, శశికళ వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనే తీరులో విధ్వేషాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ క్వార్టర్లో ఉన్న పన్నీర్‌ను బైటకు పంపివేయడం ద్వారా పగ తీర్చుకోవాలని శశికళ వర్గం నిర్ణయించుకుంది. 2011లో జయ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆమె కేబినెట్లో ఆర్థికమంత్రిగా వ్యవహరిస్తున్న పన్నీర్‌సెల్వం చెన్నై అడయారు గ్రీన్ వేస్ రోడ్డులోని ప్రభుత్వ క్వార్టరులో నివాసం ఉంటున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత సైతం అక్కడే కొనసాగారు. ప్రభుత్వ క్వార్టర్స్‌ను వెంటనే ఖాళీ చేయాలంటూ సీఎం ఎడపాడి ప్రజాపనుల శాఖ ద్వారా పన్నీర్‌సెల్వంకు నోటీసులు పంపారు. అంతకు రెండు రోజుల ముందు శశికళ వర్గీయలు పన్నీర్‌సెల్వం ఇంటి వద్దకు చేరుకుని అక్కడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. మంత్రులు, ముఖ్యమంత్రులు తమ పదవిని కోల్పోయినట్లయితే మరో ఆరునెలలపాటు అదే క్వార్టర్స్‌లో కొనసాగవచ్చనే నిబంధనలను ఖాతరుచేయకుండా పన్నీర్‌సెల్వంకు నోటీసులు జారీచేశారు. ఎడపాడి ప్రభుత్వం వల్ల మరిన్ని అవమానాలకు గురయ్యేలోగా ప్రభుత్వ క్వారును ఖాళీ చేయాలని, అంతేగాక పన్నీర్‌సెల్వం పోయెస్‌గార్డెన్ లో మకాం వేయాలని నిర్ణయించుకున్నారు. జయ ఇంటికి వెనుకవైపున ఉన్న వీనస్ కాలనీలో ఒక ఇల్లును ఎంచుకున్నారు. ఈ ఇంట్లో గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి పాలు పొంగించి గృహప్రవేశం చేశారు. ఇకపై తన రాజకీయ కార్యకలాపాలు కొత్త ఇంటి నుంచి కొనసాగించనున్నారు. -
జయను తోసేశారు
► డిశ్చార్జ్ రిపోర్టులో స్పష్టీకరణ ► అమ్మ మరణంపై అన్నీ అనుమానాలే ► మాజీ స్పీకర్, మాజీ ఎంపీ ఆరోపణ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి మరణించే వరకూ అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్, అయన కుమారుడైన మాజీ ఎంపీ మనోజ్ పాండియన్ అన్నారు. జయలలిత తోసివేసి నట్లుగా ఆమె మరణం తరువాత విడుదల చేసిన డిశ్చార్జ్ రిపోర్టులో స్పష్టం చేశారు. ఇంతకూ జయను తోసివేసింది ఎవరో తేలాల్సి ఉందని వారు చెప్పారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన వారిద్దరూ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జయలలిత మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జవాబు దొరకని అనేక ప్రశ్నల వల్ల జయలలిత మరణం ఒక మిస్టరీగా తాము విశ్వసిస్తున్నామని చెప్పారు. జయలలిత కిందికి తోసివేయబడినట్లుగా అపోలో ఆసుపత్రి డిశ్చార్జ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొని ఉంద ని, ఇంతకూ జయలలితను తోసివేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. జయలలిత ఇంటిలో అనేక సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయని, జయ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే ముందు జరి గిన సంఘటనలు, ఆసుపత్రికి తీసుకెళ్లే దృశ్యాల సీసీ టీవీ ఫుటేజీని బైటపెడితే నిజాలు వెలుగులోకి వస్తాయని వారు చెప్పారు. అంతేగాక అపోలో ఆసుపత్రిలో అమర్చి ఉండి న 27 సీసీ టీవీ కెమెరాలు అకస్మాత్తుగా తొలగించబడ్డాయని, ఎవరి ప్రో ద్బలం మేరకు వాటిని తొలగించారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. జయలలిత శాంతా రాం అనే వైద్యుడే చికిత్స చేయడం ఆనవాయితీ. అయి తే ఇతన్ని పోయస్‌గార్డెన్ వైపు రాకుండా చేసింది ఎవరో తేలాలని అన్నారు. జయకు చికి త్స చేసేందుకు అపోలో ఆసుపత్రి దరఖాస్తు, ఇతర ఫారాల్లో సంతకం చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. అనారోగ్యం నుంచి కోలుకున్న అమ్మ ఇడ్లీ తిన్నారని అపోలో ప్రకటించిందని, వీవీఐపీలకు ఆహారం సరఫరా చేసేపుడు ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. జయకు సరఫరా చేసిన ఇడ్లీ ఇతర ఆహార పదార్థాలకు నిర్వహించిన ల్యాబ్ పరీక్ష రిపోర్టును వెల్లడి చేయాలని వారు కోరారు. గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీన జ యలలిత అడ్మిట్ కాగా నవంబరు 2 నుంచి డిసెంబరు 5వ తేదీ వరకు విదేశీ వైద్యులు ఎందుకు రాలేదు, జయకు ఎక్మా చికిత్సను అందించాలని కోరిన వ్యక్తులు ఎవరని వారు ప్రశ్నించారు. జయ భౌతికకాయంలో ముఖానికి ఎడమవైపున ఉన్న నాలుగు చుక్కలు ఏమిటని వైద్యులను ప్రశ్నించగా ప్లాస్టర్ గుర్తులని బదులిచ్చారని తెలిపారు. అయితే ఆ నాలుగు చుక్కలు సందేహాస్పదమని అన్నారు. మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక బీఫారంలో జయలలిత వేలిముద్ర గుర్తులకు సాక్ష్యంగా నిలిచిన డాక్టర్ బాలాజీని విచారించాల్సి ఉందని చెప్పారు. అపోలో ఆసుపత్రిలో అంతర్జాతీయ స్థాయి ఫిజియోథెరపీ విభాగం ఉండగా సింగపూర్ నుంచి వైద్యులను పిలిపించాలనే నిర్ణయం తీసుకున్నది ఎవరని ఆయన అన్నారు. సీఎం హోదాలో జయకు నేషనల్ సెక్యూరిటీ గార్డు(ఎన్ ఎస్జీ) బందోబస్తు కల్పించి ఉండగా, అపోలోలో జయ ఉన్నపుడు ఎన్ ఎస్జీ దళాలు లేకపోవడం, కొన్ని కుటుంబాలకు చెందిన వ్యక్తులు రాకపోకలు సాగించడం పలు సందేహాలకు తావిచి్చందని తెలిపారు. అపోలోకు వచ్చి వెళ్లిన వ్యక్తులు ఎవరో పేర్లు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జయలలితకు అందించిన వైద్యంపై ఎయిమ్స్ నివేదికను కేంద్రం విడుదల చేయాలని కోరారు. జయకు సింగపూర్‌లో మెరుగైన చికిత్స కోసం చెన్నై ఎయిర్‌పోర్టులో ఎయిర్ అంబులెన్స్ ను సిద్ధం చేసినా ప్రయాణాన్ని అడ్డుకున్నది ఎవరని ఆయన అన్నారు. గత ఏడాది డిసెంబరు 4వ తేదీన జయ మరణించినట్లు ప్రచారం జరిగింది. అయితే 5వ తేదీన ఆమె మరణాన్ని ప్రకటించారు, ఈ 24 గంటల్లో ఏమి జరిగిందని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి అనేక ప్రశ్నలకు సరైన సమాధానం దొరికిన పక్షంలో జయ మరణానికి కారకులెవరో తేలిపోతుందని అన్నారు. -
అండగా నిలవండి
► ఆర్థిక సాయం చేయండి ► ప్రధానికి సీఎం ఎడపాడి వినతి ► నేడు రాష్ట్రపతిని కలవనున్న పన్నీర్‌సెల్వం, ఎంపీలు ► జయ మరణంపై సీబీఐ దర్యాప్తుకు వినతి ► న్యాయనిపుణులతో దినకరన్ చర్చలు ప్రకృతి ప్రకోపానికి గురై కొట్టుమిట్టాడుతున్న తమిళనాడుకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానికి అందజేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై:ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎడపాడి పళని స్వామి సోమవారం తొలిసారిగా ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పని లోపనిగా రాష్ట్ర సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కరువుకాటకాలు, వర్ద తుపాను దెబ్బతో రా ష్ట్రం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటు న్న సంగతిని వివరించానని ఆయన అన్నారు. తమిళ ప్రజల జల్లికట్టు కోర్కె సాధనకై రాష్ట్రం జారీచేసిన ఆర్డినెన్స్ ఆమోదంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపానని అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో కరువు నెలకొని, పచ్చనిపొలాలు ఎండిపోతున్నట్లు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. కరువు సహాయకంగా గతం లో కోరిన రూ.39,565 కోట్లు, వర్ద తుపాను సహాయం కింద రూ.22,573 కోట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వా రా రాష్ట్రానికి చెందాల్సిన రూ.17,333 కోట్లు వెంటనే విడుదల చేయాల్సిం దిగా సీఎం కోరారు. నీట్ ప్రవేశపరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని, కావేరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. తమిళనాడులో సాగు, తాగునీటి కొరతలను తీర్చేందుకు మహానది, గోదావరి, కృష్ణా, పెన్న, పాలారు, కావేరి, వైగై తదితర నదులను అనుసంధానం చేయాల్సిందిగా కోరారు. జాలర్ల సంక్షేమం కోసం 1,650 కోట్లు కేటాయించాలని, శ్రీలంక చెరలో ఉన్న 35 మంది తమిళ జాలర్లను, 120 మరపడవలను విడిపించాలని, శ్రీలంక కారణంగా చేపల వేటకు ఏర్పడుతున్న అడ్డంకులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కూడంకుళంలో ఉత్పత్తయ్యే రెండువేల మెగావాట్ల విద్యుత్‌ను పూర్తిగా తమిళనాడుకు కేటాయించాలని కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద తమిళనాడుకు అదనంగా నెలకు 85వేల మెట్రిక్ టను్నల బియా్యన్ని రాయితీపై సరఫరా చేయాలని కోరారు. సముద్ర జలాలను తాగునీటిగా మార్చే నిర్లవీకరణ పథకం అమలుకు వెంటనే అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. పలువురు మంత్రులు సీఎం వెంట ఢిల్లీ వెళ్లారు. రాజధానిలో రాష్ట్ర పంచాయితీ ఒకే ఒరలో రెండు కతు్తల్లా అన్నాడీఎంకేపై రెండు గ్రూపుల ఆధిపత్య పోరుపై పంచాయితీ రాజధానికి చేరుకుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని, హోం మంత్రిలను కలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం బృందం సోమవారం ఢిల్లీకి చేరుకుంది. చిన్నమ్మ పదవిని కాపాడేందుకు ఆమె సోదరి కుమారుడు, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ న్యాయనిపుణులతో చర్చల్లో మునిగి తేలుతున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత పార్టీ రెండుగా చీలిపోగా ఒకరినొకరు బహిష్కరించుకున్నారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని పన్నీర్‌సెల్వం వర్గం వాదిస్తోంది. శాశ్వత ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన జయలలిత చేత ప్రిసీడియం చైర్మన్ గా నియమితులైన మధుసూదన్ పన్నీర్‌సెల్వం వైపున్న కారణంగా పార్టీ తమదేనని వాదిస్తున్నారు. పది మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు పన్నీర్ పక్షాన నిలవగా, మెజార్టీ ఎమ్మెల్యేలతో విశ్వాస పరీక్షను నెగ్గిన శశికళ వర్గం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారం, పదవుల్లో ఉండేవారంతా శశికళ వైపు ఉండగా, పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు పన్నీర్‌సెల్వంను ఆదరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వర్గాన్ని మరొకరు తమవైపు లాకు్కనేందుకు తీవ్రస్థాయి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఐదేళ్లు వరుసగా ప్రాథమిక సభ్యత్వం లేని శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎను్నకోవడం చెల్లదనే ఫిర్యాదు ఎన్నికల కమిషన్ పరిశీలనలో ఉంది. శశికళ నియామకంపై అడ్డంకులు తలెత్తకుండా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. శశికళ ఎంపిక చెల్లదని ఎన్నికల కమిషన్ ప్రకటించినట్లయితే పన్నీర్‌సెల్వం తదితరులను పార్టీ నుంచి బహిష్కరించిన ఆదేశాలు చెల్లకుండా పోతాయి. అంతేగాక టీటీవీ దినకరన్ నియాకం కూడా చెల్లదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొవాల్సి ఉండగా రెండాకుల చిహ్నం ఎవరిదనే చికు్కముడి ఉంది. చట్టపరవైున చికు్కల్లో ఉన్న శశికళ వర్గీయులను మరిన్ని చికు్కలో్లకి నెట్టేందుకు పన్నీర్‌సెల్వం ఢిల్లీ పయనం అయా్యరు. అంతకు ముందు సేలం జిల్లా నేతలో పన్నీర్‌సెల్వం సమావేశమై శశికళ ఆధిపత్యాన్ని తిప్పికొట్టడం ఎలా అంశంపై అభిప్రాయాలు సేకరించారు. జయలలిత అనుమానాస్పద మరణంపై సీబీఐ విచారణ కోరుతూ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతిపత్రం సమర్పించనున్నారు. అలాగే ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలుస్తున్నారు. పన్నీర్‌వెంట 12 మంది ఎంపీలు ఢిల్లీకి వెళ్లారు. -
మిస్టరీ ఛేదిస్తా!
► జయ మృతి మిస్టరీపై పన్నీరుసెల్వం శపథం ► అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంటా ► విచారణ కమిషన్ వల్లే శశికళతో విభేదాలు ►ఆర్కేనగర్లో జయ జయంతి వేడుకలు సాక్షి ప్రతినిధి,చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంలోని మిస్టరీని ఛేదించి తీరుతా, పార్టీని, ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంటానని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం శపథం చేశారు. ఎమ్మెల్యేగా జయలలిత ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్కేనగర్లో శుక్రవారం ఆమె 69వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదికపై ఏర్పాటు చేసిన జయ చిత్రపటానికి నివాళులర్పిం చారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ సభకు అధ్యక్షత వహించగా, పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కోగా ఎ న్నో కష్టనష్టాలకోర్చి జయలలిత వాటిని అధిగమించారని తెలిపారు. అయితే నేడు అదే పార్టీ, ప్రభుత్వం కొందరి కబంధహస్తాల్లో చికు్కకు పోయిందని తెలిపారు. జయలలిత ఆశయాలకు విరుద్ధంగా వీరు వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబటా్టరు. ఎవరి చేతులో్లకి పార్టీ, ప్రభుత్వం వెళ్లకూడదని అమ్మ జాగ్రతపడ్డారో నేడు అదే వ్యకు్తలు పార్టీ పెద్దలుగా మారిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ, ప్రభుత్వాలను ఆ కుటుంబ సభ్యుల నుంచి కాపాడుకునే పోరాటంలో తమకు విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. జయలలిత మరణంపై ప్రజల మనస్సుల్లో అనేక సందేహాలు ఉన్నాయని, ఈ సందేహాల నివృత్తి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవిచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నట్లు తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరు తూ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన అన్నాడీఎంకే కార్యకర్తను కలిసేందుకు ఇటీవల తాను కీల్పాక్ ప్రభుత్వఆసుపత్రికి వెళ్లానని తెలిపారు. జయ మరణానికి అసలైన కారణాలను బైటపెటా్టల్సిందిగా అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక వృదు్ధరాలు తనను వేడుకున్నదని చెప్పారు. జయ మరణంపై విచారణ కమిషన్ వేసే ప్రయత్నంలోనే తనకు, శశికళ మధ్య విభేదాలు పొడచూపగా ప్రభుత్వం చేజారిపోయిందని అన్నారు. అందుకే జయ మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీని ఛేదించే వరకు తమ ధర్మయుద్ధం ఆగదని శపథం చేశారు. ధర్మయుద్ధం ఓడినట్లుగా చరిత్రలోనే లేదని ఆయన అన్నారు. తన జన్మదినాన ఎవ్వరూ తనను కలవొద్దు, పేదల ఇళ్లకు వెళ్లండని అమ్మ అభీష్టం మేరకు రూ.40 లక్షల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు ఆయన తెలిపారు. పన్నీర్ సెల్వం తన మొత్తం ప్రసంగంలో ఎక్కడా శశికళ పేరును ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డారు. అయితే ప్రజలు, కార్యకర్తలు శశికళ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అలాగే ఆర్కేనగర్ ప్రజలు, కార్యకర్తలు పన్నీర్‌సెల్వంను ఘనంగా సత్కరించి ‘ప్రజల ముఖ్యమంత్రి’, జల్లికట్టు కోసం కేంద్రంతో పోరాడిన వీరుడు’ అంటూ నినాదాలు చేశారు. దీప దూరమే: అన్నాడీఎంకేలో ఇటీవల చోటుచేసుకున్న సంక్షోభ దినాల్లో పన్నీర్‌సెల్వం పక్కన నిలిచిన జయలలిత మేనకోడలు దీప ఆర్కేనగర్ సభలో కానరాలేదు. ఆర్కేనగర్లో జరిగే జయ జయంతి వేడుకల్లో ఒకే వేదికపై నుంచి ప్రసంగించనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే ఆర్కేనగర్లోని సభకు దీప గైర్హాజరుకావడం ద్వారా రాజకీయాల్లో పన్నీర్‌సెల్వంతో కలిసి నడిచే అవకాశం లేదని భావించవచ్చు. -
కుటుంబపాలనను నిర్మూలిస్తాం
-
కుటుంబపాలనను నిర్మూలిస్తాం
జయ సమాధి వద్ద పన్నీర్ శపథం సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో శశికళ కుటుంబపాలనను నిర్మూలించి, అమ్మ ప్రభుత్వ ఏర్పాటుకు పాటుపడతానని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం జయలలిత సమాధి సాక్షిగా శపథం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది శశికళ ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రజాభీష్టానికి అనుగుణంగా ఎమ్మెల్యేలు ఓటు వేసేలా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పన్నీర్‌సెల్వం తన మద్దతుదారులతో మెరీనా బీచ్‌లోని జయ సమాధి వద్దకు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎంజీఆర్ స్థాపించిన, జయలలిత కృషితో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వం నేడు శశికళ ఆమె కుటుంబ సభ్యుల సొత్తుగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఏర్పడిన దౌర్భాగ్య పరిస్థితిని అన్ని నియోజకవర్గాల ప్రజలకు వివరించి ఎమ్మెల్యేలను జాగృతం చేస్తామన్నారు. శశికళ శిబిరంపై ధర్మయుద్ధం చేయనున్నామని ప్రకటించారు. 124 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి వైపుంటే ఏడుకోట్ల మంది తమిళనాడు ప్రజలు తమవైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. -
హై అలెర్ట్
► తస్మాత్ జాగ్రత్త అని గవర్నర్ ఆదేశం ► నగరంలో పోలీసుల తనిఖీలు ► అవాంఛనీయ సంఘటనలపై అనుమానం రాష్ట్రంలోని రాజకీయ పరిణామల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని చెన్నైలో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. నగరంలోకి అసాంఘిక శక్తులు ప్రవేశించాయనే సమాచారంతో లాడ్జీలు, అతిథిగృహాలను తనిఖీ చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఈనెల 5వ తేదీ మధ్యాహ్నం శాసనసభాపక్ష నేతగా ఎన్నికై ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. అదే రోజు ఉదయం పన్నీర్‌సెల్వం రాజీనామా చేశారు. ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు శశికళ సిద్ధమయ్యారు. అయితే ఇంతలో ముఖ్యమంత్రి పదవికి తన చేత బలవంతంగా రాజీనామా చేయించారంటూ పన్నీర్‌సెల్వం చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. ‘అలుగుటయే ఎరుగని అజాత శతృడే అలిగిన నాడు’ అన్నట్లుగా అత్యంత సౌమ్యుడిగా ముద్రపడిన పన్నీర్‌సెల్వం...శశికళపై బహిరంగంగా ధ్వజమెత్తగా పార్టీ రెండుగా చీలిపోయింది. అధికార పార్టీలో సంక్షోభం నెలకొనగా శశికళ ప్రమాణ స్వీకారం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పన్నీర్, శశికళ పోటాపోటీగా బహిరంగ విమర్శలకు దిగాయి. ఎమ్మెల్యేల బలం తనకే ఉందంటూ శశికళ, తిరుగులేని ప్రజాబలం తన సొంతమంటూ పన్నీర్‌సెల్వం సవాళ్లు విసురుకున్నారు. దీంతో తన వర్గ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు శశికళ క్యాంప్ రాజకీయాలకు తెరదీసారు. ఈనెల 10వ తేదీన గవర్నర్ విద్యాసాగర్‌రావును శశికళ కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. అన్నాడీఎంకేను చీల్చడం కోసమే గవర్నర్ నాన్చుడు ధోరణికి పాల్పడుతున్నారని శశికళ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ రకంగా అధికార అన్నాడీఎంకేలో పన్నీర్‌సెల్వం, శశికళ మధ్య వారం రోజులుగా ఆధిపత్య పోరుసాగుతోంది. మద్దతుదారులంతా పన్నీర్‌సెల్వం వైపు పయనిస్తుండగా శశికళ తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. శశికళ తన మద్దతుదారులతో గవర్నర్ బంగ్లా వద్ద ఆందోళనకు దిగుతుందని సమాచారం రావడంతో రాజ్‌భవన్ వద్ద పోలీసుల బందోబస్తు పెరిగింది. గవర్నర్ బంగ్లా వద్ద ఆందోళన సబబుకాదని కొందరు హితవు పలకడంతో అమ్మ సమాధి నిరాహారదీక్ష చేపట్టాలని శశికళ నిర్ణయించుకున్నట్లు మరో వార్త ప్రచారంలో ఉంది. ఇలాంటి రాజకీయ అనిశ్చితిని అసాం«ఘిక శక్తులు అవకాశంగా తీసుకోనున్నాయని పేర్కొంటూ గవర్నర్ విద్యాసాగర్‌రావు పోలీసు శాఖను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. జల్లికట్టు ఉద్యమంలో కొన్ని అసాంఘిక శక్తులు అల్లర్లు సృష్టించగా శాంతి భద్రతల సమస్య తలెత్తింది. అమ్మ సమాధి వద్ద శశికళ నిరాహారదీక్ష చేపట్టిన పక్షంలో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానంతో నగరంలోని అన్ని అతిథిగృహాలు, లాడ్జీలను పోలీసులు తనిఖీలు చేయడం ప్రారంభించారు. అనుమానిత వ్యక్తులు దిగితే సమాచారం ఇవ్వాల్సిందిగా అన్ని లాడ్జీలకు ఆదేశాలు అందాయి. -
దీపం చుట్టూ కమ్ముకుంటున్న చీకటి
► పన్నీర్‌సెల్వం వైపు వలసలు ► శశికళ వ్యతిరేకులకు ప్రత్యామ్నాయ పవర్ సెంటర్ ► దీప కొత్త పార్టీపై అనుమానాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడింది’ అన్నట్లుగా తయారైంది జయ మేనకోడలు దీప పరిస్థితి. పన్నీర్‌సెల్వం పుణ్యమాని పార్టీ పెట్టక ముందే, పర్యటనలతో ప్రజల్లో రాకముందే బలహీనపడుతోంది. అన్నాడీఎంకేలోని అందరికీ జయలలిత ఆరాధ్యదేవత. అడుగులకు మడుగులొత్తడమేకాదు, పాద నమస్కారాలు చేసేవారు. రాష్ట్ర ప్రజల చేత అమ్మగా కూడా జయ కీర్తింపబడ్డారు. జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో తీరని అగాథం ఏర్పడింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం ఆ పార్టీలో అసంతృప్తి రాజేసింది. జయ మరణానికి కారణమైన శశికళ ప్రధాన కార్యదర్శిగా సహించలేమని బహిరంగ విమర్శలు వెల్లువెత్తాయి. దీప వైపు కార్యకర్తల చూపు: అన్నాడీఎంకేలోని అసంతృప్తివాదులు ప్రత్యామ్నాయంగా జయ మేనకోడలు దీపను ఎంచుకున్నారు. చెన్నైలోని టీనగర్‌లోని ఇంటికి క్యూకట్టడం ప్రారంభించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా దీపను ఊహించుకున్నారు. ఇది కుదరని పక్షంలో దీప చేత కొత్త పార్టీ పెట్టించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించిన శశికళ వ్యతిరేకీయులు రాష్ట్రవ్యాప్తంగా దీప పేరవైలను ప్రారంభించారు. పెద్దఎత్తున సభ్యత్వ నమోదు కూడా సాగిస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆమెపై ఒత్తిడి పెంచారు. శశికళపై వ్యతిరేకత, తన పట్ల పెరుగుతున్న అభిమానానికి స్పందించిన దీప తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు గత నెల 17వ తేదీన అధికారికంగా ప్రకటించారు. ఈనెల 24వ తేదీన జయలలిత జయంతి రోజున కీలకమైన ప్రకటన చేస్తానని, ఈలోగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజలను కలుసుకుంటానని తెలిపారు. అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ సంక్షోభం శశికళకు పోటీగా దీపను రాజకీయాల్లో తేవాలని భావించిన వారిని ఆలోచనలో పడేసింది. జయ మరణించిన మూడునెలల్లోనే పన్నీర్‌సెల్వం, శశికళ వర్గంగా పార్టీ రెండుగా ముక్కలైంది. శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకేలో బలమైన పవర్‌సెంటర్‌గా మారిపోవడం వారిని ఆనందింపజేసింది. శశికళపై తమకున్న వ్యతిరేకత పన్నీర్‌సెల్వం రూపంలో తీరిందని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఇక దీప అవసరం ఏమిటనే ఆలోచనలో పడ్డారు. అన్నాడీఎంకేలో రాజకీయపోరు ప్రారంభం కాగానే దీప ఇంటి వద్ద అభిమానులు పలచన కావడం ప్రారంభమైంది. జయ మేనకోడలు హోదాలో దీపను ఆహ్వానిస్తున్నానని, ఎప్పుడు వచ్చినా తగిన మర్యాదనిస్తానని పన్నీర్‌సెల్వం ఆహ్వానించడం పరోక్షంగా దీప పేరవైని దెబ్బతీసింది. శశికళపై కక్షతో దీపను బలమైన రాజకీయనేతగా తీర్చిదిద్దేకంటే పన్నీర్‌సెల్వం పంచన చేరడం మేలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇవే పరిస్థితులు కొనసాగితే దీప నేతృత్వంలో కొత్త పార్టీ ఉదయించకుండానే అస్తమించినట్లు కాగలదు. -
గవర్నర్ కోసం ఎదురుచూపు
► 9న ప్రమాణస్వీకారానికి సన్నాహాలు ► ఏ పదవీ వద్దంటున్న పన్నీర్‌సెల్వం ► ఆరుగురు మంత్రులకు ఉద్వాసన? అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ రాష్ట్ర గవర్నర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఢిల్లీలో ఉన్న గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నైకి చేరుకోగానే ఆయన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎంగా పన్నీర్‌సెల్వం, ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాలు జయ మృతి చెందిన తరువాత కేవలం 20 రోజుల్లోనే జరిగిపోయాయి. ఇంతలోనే అన్నాడీఎంకే శాసనసభా పక్షనేతగా శశికళ ఎన్నికయ్యారు. సీఎం కుర్చీలో పన్నీర్‌సెల్వం సర్దుకునేలోగా పదవీచ్యుతులయ్యారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన శశికళ పార్టీ తీర్మాన పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించి, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరాల్సి ఉం ది. శశికళ ఎంపిక కాగానే పిలుపు రావడంతో గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. ఈ నెల 9వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేసేలా శశికళ సిద్ధమవుతున్నా రు. ఢిల్లీ నుంచి గవర్నర్ రాగానే కలిసేందుకు శశికళ సిద్ధంగా ఉన్నారు. పన్నీర్‌సెల్వం మనస్తాపం సీఎంగా శశికళ బాధ్యతలు చేపట్టగానే మంత్రి వర్గంలో మార్పులు చోటుచేసుకోవడం అనివార్యమని తెలుస్తోంది. సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు కొనసాగాల్సిందిగా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కుర్చీలో శశికళ కూర్చోవడంపై పన్నీర్‌సెల్వం ప్రాతినిధ్యం వహిస్తున్న తేని జిల్లా పోడి నియోజకవర్గంలో ప్రజలు శశికళపై ఆగ్రహం వ్యక్త చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇదిలా ఉండగా సీఎం పదవిని కోల్పోయిన పన్నీర్‌సెల్వం తీవ్ర మనస్తాపంలో ఉన్నారు. సన్నిహితులతో బాధను పంచుకుంటూ తాను రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు తెలిపారు. ఈ సమాచారాన్ని అందుకున్న శశికళ కంగారు పడ్డారు. పన్నీర్‌సెల్వం అస్త్రసన్యాసానికి దిగితే ప్రజల్లోనూ, పార్టీలోనూ తనపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని భయపడి పన్నీర్‌సెల్వంను బుజ్జగించే పనిలో పడ్డారు. పన్నీర్‌సెల్వంకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తున్నట్లు సమాచారం పంపారు. అయితే శశికళ నేతృత్వంలోని ప్రభుత్వంలో తనకు ఏ పదవి ఇచ్చినా తీసుకునేది లేదని పన్నీర్‌సెల్వం భీష్మించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అందరూ ఖాయమని భావిస్తున్న తరుణంలో బెర్తు కోసం సెంగోట్టయ్యన్, రంగస్వామి, సెంథిల్ బాలాజీ సహా పలువురు ఎమ్మెల్యేలు పడరాని పాట్లు పడుతున్నారు. నియోజకవర్గాల వేట ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన ఆరు నెలల్లోగా శశికళ ఎమ్మెల్యేగా గెలుపొందాల్సి ఉండగా నియోజకవర్గ వేటలో పడ్డారు. జయలలిత ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై ఆర్కేనగర్లో శశికళపై తీవ్ర వ్యతిరేకత ఉంది. పైగా ఆర్కేనగర్ నుంచి జయ మేనకోడలు దీప పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా దక్షిణ తమిళనాడులోని సురక్షితమైన నియోజకవర్గాలను శశికళ అన్వేషిస్తున్నారు. ఆండిపట్టి లేదా ఉసిలంబట్టి నియోజకవర్గాలను ఆమె పరిశీలిస్తున్నారు. పోయెస్‌గార్డెన్ కు సీఎం కళ జయలలిత మరణం తరువాత పోయెస్ గార్డెన్ లోని ఆమె నివాసం వద్ద పోలీసు బందోబస్తును దాదాపుగా తగ్గించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరువాత మరికొంత పెంచారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన రెండు రోజుల్లో శశికళ సీఎం కాబోతున్న తరుణంలో సోమవారం మళ్లీ బందోబస్తును పెంచారు. బందోబస్తులో ఉన్న పోలీసులతో గార్డెన్ కు మళ్లీ సీఎం కళ వచ్చింది. గార్డెన్ ఇంటికి 500 మీటర్ల దూరంలోనే ప్రజలను పోలీసులు కట్టడి చేయడం ప్రారంభించారు. -
వీడియో షాపు నుంచి సీఎం దాకా
శశికళ ప్రస్థానం సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్నదానికి ‘చిన్నమ్మ’ శశికళ చక్కని ఉదాహరణ. వీడియో షాపు నడిపిన స్థాయి నుంచి సీఎం పీఠం దాకా సాగిన ఆమె ప్రస్థానం ఆసక్తికరమే కాదు వివాదాస్పదం కూడా. జయలలితకు నెచ్చెలిగానే మొన్నటి వరకు తెలిసిన ఆమె.. ‘పురుచ్చితలైవి’ మరణానంతరం అన్నాడీంకేపై, ప్రభుత్వంపై పట్టుసాధించి రాజకీయాల్లోనూ దిట్ట అని నిరూపించుకున్నారు. పార్టీలో జయ తర్వాత మరో శక్తిమంతమైన నేత లేకపోవడం శశికళకు కలసొచ్చిన అంశం. పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదవులు ఒకరి చేతిలోనే ఉండే సంప్రదాయాన్ని ఎంజీఆర్, జయల తర్వాత చిన్నమ్మ కొనసాగించనున్నారు. శశికళ 1957లో తిరుతిరైపూండిలో బలమైన దేవర్ సామాజికవర్గానికి చెందిన వివేకానందన్ , కృష్ణవేణి దంపతులకు జన్మించారు. ఆమెకు నలుగురు సోదరులు, ఒక సోదరి. తర్వాత వారి కుటుంబం మన్నార్గుడికి మారింది. 10వ తరగతి వరకు చదువుకున్న శశికళ 1973లో పౌరసంబంధాల అధికారి నటరాజన్ ను డీఎంకే చీఫ్ కరుణానిధి సమక్షంలో పెళ్లాడారు. శశికళ వీడియో షాపు నడిపేవారు. 1982లో అప్పటి సీఎం ఎంజీఆర్‌కు సన్నిహితుడైన నటరాజన్ .. చంద్రలేఖ అనే కలెక్టర్ సాయంతో భార్యకు జయను పరిచయం చేశారు. జయ హాజరయ్యే పెళ్లిళ్ల వీడియోలు శశికళ తీయించేవారు. అలా మొదలైన స్నేహం.. మధ్యలో కొన్ని పొరపొచ్చాలు మినహా జయ మరణం వరకూ దాదాపు 3 దశాబ్దాలు కొనసాగింది. పోయెస్ గార్డెన్ లో ఇద్దరూ కలసి ఉండేవారు. ఒకే రకం చీరలు, చెప్పులు, నగలు ధరించేవారు. శశి తనకు సోదరిలాంటిదని, అమ్మలేని లోటును తీరుస్తోందని జయ చెప్పేవారు. 1991లో జయ తొలిసారి సీఎం కావడంతో శశికళ వెలుగులోకి వచ్చారు. ఆమె సోదరి కుమారుడైన సుధాకరన్ ను జయ దత్తత తీసుకుని కోట్ల డబ్బుతో అంగరంగవైభవంగా పెళ్లి జరిపించారు. కలర్ టీవీల స్కాంలో 1996లో ‘అమ్మ’లిద్దరూ అరెస్టయి జైలుకెళ్లారు. తర్వాతి కాలంలో ఇద్దరి స్నేహం చెడిపోయింది. 1996 ఎన్నికల్లో జయ ఓటమికి శశికళే కారణమని విమర్శలొచ్చాయి. ఆమెతో సంబంధాలు చెడిపోయాయని జయ కూడా చెప్పారు. తర్వాత తనపై కుట్రపన్నుతున్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అంటూ 2011 డిసెంబర్లో శశికళ దంపతులతోపాటు వారి బంధుమిత్రులను పార్టీ నుంచి తప్పించారు. ఐదు నెలల తర్వాత చిన్నమ్మ రాతపూర్వక క్షమాపణ చెప్పడంతో తిరిగి ఇద్దరూ దగ్గరయ్యారు. అన్నాడీఎంకేలో, ప్రభుత్వంలో క్రమంగా తన వ్యతిరేకులను తప్పించి, అనుచరులకు చోటుకల్పిస్తూ శశికళ టీమ్ పావులు కదిపిందంటారు. జయ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి చనిపోయేవరకు శశికళ ఆమె వెంట ఉండడం అనుమానాలకు తావిచ్చింది. జయను ఎవరూ కలవకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. విమర్శలను, పార్టీలో వ్యతిరేకతను అధిగమించి శశికళ ‘పురుచ్చితలైవి’ స్థానాన్ని భర్తీ చేశారు. మూడో మహిళా సీఎం శశికళ తమిళనాడు కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న వీకే శశికళ ఆ రాష్ట్రానికి మూడో మహిళా ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇంతకు ముందు జానకి రామచంద్రన్ , జయలలిత సీఎంలుగా పనిచేశారు. వీరంతా ఏఐఏడీఎంకే పార్టీlవారే కావడం విశేషం. నాడు నెడుంజెళియన్.. నేడు పన్నీర్ సెల్వం సాక్షి నాలెడ్జ్ సెంటర్: ఆదివారం రాజీనామా చేసిన తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వం రాష్ట్ర చరిత్రలో మూడు సార్లు ‘తాత్కాలిక ముఖ్యమంత్రి’గా పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్నారు. ఇటీవలే సీఎం జయలలిత కన్నుమూయటంతో ఆయన ముచ్చటగా మూడోసారి ‘తాత్కాలిక ముఖ్యమంత్రి’గా ప్రమాణం చేశారు. అంతకు ముందు జయ కోర్టు కేసుల కారణంగా ముఖ్యమంత్రి పదవికి తొలిసారి రాజీనామా చేసినప్పుడు 2001 సెప్టెంబర్ 21 నుంచి 2002 మార్చి ఒకటి వరకు, జయకు రెండోసారి జైలు శిక్ష పడినప్పుడు 2014 సెప్టెంబర్ 29 నుంచి 2015 మే 22 వరకూ పన్నీర్ సెల్వం సీఎం పదవిలో ఉన్నారు. ఏఐడీఎంకే మాతృక డీఎంకే 1967లో అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే పార్టీ నేత సీఎన్ అణ్ణాదురై మరణించాక పన్నీర్‌సెల్వం మాదిరిగానే సీనియర్ మంత్రి వీఆర్ నెడుంజెళియన్ 1969 ఫిబ్రవరి 3 నుంచి పది వరకు, 1987 డిసెంబర్లో ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు, ఎంజీ రామచంద్రన్ మరణించాక డిసెంబర్ 24 నుంచి జనవరి 7 వరకు రెండోసారి తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండోసారి నెడుంజెళియన్ ను తొలగించి ఎంజీఆర్ భార్య వీఎన్ జానకికి సీఎం పదవి అప్పగించారు. ఇప్పుడు శశికళ కోసం పన్నీర్‌తో రాజీనామా చేయించడం నాటి నెడుంజెళియన్ ఉద్వాసనను గుర్తుచేస్తోంది. -
సీఎం కుర్చీలో శశికళ?
నేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు సీఎం పీఠాన్ని శశికళకు అప్పగించడానికి రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను పదవి నుంచి తప్పించి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సీఎం పదవి చేపట్టడానికి చురుగ్గా ప్రయ త్నాలు సాగుతున్నాయి. ఆదివారం చెన్నై లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మె ల్యేల సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సీఎం పన్నీర్ సెల్వంతో పాటు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలి చ్చారు. జయలలితకు అత్యంత నమ్మకస్తురాలిగా పేరున్న రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహా దారు షీలా బాలకృష్ణన్ శుక్రవారం రాత్రి రాజీనామా చేశారు. మార్చి నెలాఖరు వరకు ఆమె పదవీకాలం ఉన్నా.. శశికళ ఒత్తిడి మేరకు ముందుగానే రాజీనామా చేసినట్లు సమాచారం. సీఎం, అధ్యక్ష పదవి ఒకరికే.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మర ణించిన తరువాత ఆమె నిర్వహిస్తున్న రెండు పదవులను పన్నీర్‌సెల్వం, శశికళ పంచుకున్నారు. అయితే రెండు పదవుల్లో ఒకరే ఉండడం పార్టీ సంప్రదాయమని కొందరు మంత్రులు, పార్టీ సీనియర్ నేత లు చెబుతున్నారు. అందుకే సీఎం పదవి కూడా శశికళకే అప్పగించాలని వాదిస్తు న్నారు. ఈ దశలో సీఎం పన్నీర్‌సెల్వం తన పదవిని కాపాడుకునేందుకు ప్రధాని మోదీని ఆశ్రయించి ఆశీర్వాదం పొందా రు. అందుకే శశికళ హడావుడిగా పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసి.. సీఎం పీఠాన్ని వెంటనే దక్కించుకునేలా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. అయితే శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకునేందుకు వీలుగా పన్నీర్‌సెల్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. తాను రాజీనామా చేస్తున్నట్లు పన్నీర్‌సెల్వం శనివారం రాత్రి వరకు అధికారికంగా ప్రకటించలేదు. అంతేగాక రాజీనామా చేసేందుకు పన్నీర్‌సెల్వం విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేలో పరిణామాలు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు బెంగళూరుతో మాట్లాడుతూ చెప్పారు. -
ఆ ఇద్దరు నో అంటేనే నాకీ చాన్స్
ఏ రంగంలోనైనా అవకాశాలు అంత సులభంగా రావు. అందుకు తగిన అర్హతలు ఉండాలి. ముఖ్యంగా సినీరంగంలో నేమ్, ఫేమ్ చాలా అవసరం.అలాంటి వారికి వద్దన్నా అవకాశాలు వచ్చిపడతాయి. ఉదాహరణకు నటి నయనతారనే తీసుకుంటే చేతి నిండా చిత్రాలు. మరికొందరు దర్శక నిర్మాతలు ఆమె కాల్షీట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా యువ నాయికల్లో నటి కీర్తీసురేశ్ మంచి క్రేజ్‌లో ఉన్నారు. ఆమె కాల్షీట్స్ లభించడం కష్టతరంగా మారింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే విజయ్ సేతుపతికి జంటగా నటించడానికి కీర్తీసురేశ్ కాల్షీట్స్ దొరకలేదని సమాచారం. వర్తమాన నటి రితికాసింగ్ కూడా కాల్షీట్స్ సర్దుబాటు చేయలేకపోయారట. వారి అవకాశానిప్పుడు నటి లక్ష్మి మీనన్ అందుకున్నారు. విషయం ఏమిటంటే విజయ్‌సేతుపతి హీరోగా ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం కరుప్పన్ అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రేణిగుంట చిత్రం ఫేమ్ పన్నీర్‌సెల్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా క్రేజీ యువ నటి కీర్తీసురేశ్‌ను ఎంపిక చేయాలనుకున్నారట. తనకు కాల్షీట్స్ లేకపోవడంతో నటి రితికాసింగ్‌ను ప్రయత్నించగా తనూ వేరే చిత్రం కమిటై ఉండడంతో అంగీకరించలేని పరిస్థితి కావడంతో ఆ అవకాశం నటి లక్ష్మి మీనన్ ను వరించింది. నిజం చెప్పాలంటే గ్రామీణ యువతి పాత్రలకు పేటెంట్గా మారిన ఈ అమ్మడు కుంకీ, కుట్టిపులి, కొంబన్ చిత్రాల్లో మదురై యువతిగా చక్కగా ఇమిడిపోయారు. ఈ మధ్య విజయ్‌సేతుపతికి జంటగా నటించిన రెక్క చిత్రంలో కాస్త బొద్దుగా అనిపించడంతో అవకాశాలు లక్ష్మి మీనన్ దరి చేరడానికి వెనుకడుగు వేస్తున్న పరిస్థితి. కరుప్పన్ చిత్రం కోసం లక్ష్మి మీనన్ ను ఫొటో సెషన్ కు పిలిచారట దర్శక నిర్మాతలు. అప్పుడు ఆమెను చూసిన చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయారట. కారణం భారీగా బరువు తగ్గి చాలా నాజూగ్గా తయారయ్యారట. అంతే కాదు కావాలంటే మరో ఐదు కిలోల బరువు తగ్గడానికి రెడీ అని చెప్పడంతో కరుప్పన్ చిత్ర హీరోయిన్ మీరే అంటూ లక్ష్మి మీనన్ ను ఓకే చేసేశారట. అలా కీర్తీసురేశ్, రితికాసింగ్‌లను దాటి కరుప్పన్ చిత్ర అవకాశం లక్ష్మి మీనన్ ను వరించిందని సమాచారం. అయితే ఈ అమ్మడికీ చిత్ర విజయం చాలా అవసరం అవుతుంది. -
పన్నీరుకే పగ్గాలు
జయ కోసం రోడ్డుపైనే పూజలు 21 రోజులుగా ఆసుపత్రిలోనే అమ్మ నేడు లండన్ వైద్యుల రాక అమ్మ కోసం ఆత్మాహుతి యత్నం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దశలో రాష్ట్ర పరిపాలనా పగ్గాలను సీనియర్ మంత్రి పన్నీర్‌సెల్వం చేపట్టారు. సీఎం జయ పర్యవేక్షిస్తున్న శాఖలను పన్నీర్‌సెల్వంకు అప్పగిస్తూ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు మంగళవారం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అంతేగాక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంశానికి తెరపడింది. ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న హోం, ప్రజాపనులు, ఐఏఎస్, ఐపీఎస్ తదితర శాఖలను ఇక పన్నీర్‌సెల్వమే పర్యవేక్షిస్తారని గవర్నర్ పేర్కొన్నారు. ఇకపై జరిగే కే బినెట్ సమావేశాలకు సైతం పన్నీర్‌సెల్వం అధ్యక్షత వహిస్తారు. గవర్నర్ ప్రకటన వెలువడగానే ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పన్నీర్‌సెల్వంను కలిశారు. ముఖ్యమంత్రిగా జయలలితనే కొనసాగుతారని రాజ్‌భవన్ స్పష్టం చేసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని ప్రార్థిస్తూ పార్టీ శ్రేణులు జరుపుతున్న పూజలతో అపోలో ఆసుపత్రి పరిసరాలు ఆలయాలను తలపిస్తున్నాయి. జయ ఫొటో చేతపట్టుకుని ప్రార్థనల్లో మునిగి తేలుతున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరి బుధవారానికి 21 రోజులైంది. అమ్మ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు ఆసుపత్రిలోనే మరికొంత కాలం గడపాలని అపోలో వైద్యులు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. కొంతకాలం అనే మాటలతో గడువును పొడిగిస్తూ పోతున్నారు. అమ్మ నేడో రేపో విడుదల అవుతారనే ఆశలతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉదయం నుంచి రాత్రి వరకు ఆసుపత్రి వద్దనే పడిగాపులు కాస్తున్నారు. కొందరు నేతలు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద పూజలు, హారతులు ఇస్తూ అపోలో ఆలయ పరిసరాలను ఆలయ ప్రాంగణంలా మార్చివేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కేపీ కందన్ చెన్నై తిరువాన్మియూరు మరుందీశ్వరర్ ఆలయంలో అమ్మ కోసం మృత్యుంజయ యాగాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి వలర్మతి ఎంజీఆర్ నగర్‌లోని వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. కోవైలో 25 వేల పాలకలశాలతో ఊరేగింపు నిర్వహించారు. అలాగే చెన్నైలోని ఐదు వేల పాలకలశాలతో ప్రార్థనలు చేశారు. అనేక ఆలయాల్లో పూజలు నిర్వహించి అపోలోకు చేరుకున్న మాజీ మంత్రి గోకుల ఇందిరకు చేదు అనుభవం ఎదురైంది. ఆలయాల్లో పూజలు చేసిన ప్రసాదాన్ని జయకు అందజేస్తానని అపోలో ఆసుపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు గట్టిగా అడ్డుకున్నారు. దీంతో చేసేదేమి లేక అక్కడి మహిళా నేతలతోనే ఉండిపోయారు. అపోలో వద్ద అరుణ్‌జైట్లీ, అమిత్‌షా: జయను పరామర్శించే నిమిత్తం కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా బుధవారం అపోలోకు వచ్చారు. కొద్దిసేపు వైద్యులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. నేడు లండన్ వైద్యుల రాక: జయకు చికిత్స నిమిత్తం గతంలో రెండుసార్లు చెన్నైకి వచ్చిన అంతర్జాతీయ వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్బీలే గురువారం మరోసారి లండన్ నుండి వస్తున్నారు. ఐదు రోజులపాటూ చెన్నైలోనే ఉండి జయకు చికిత్స అందిస్తారు. వదంతులపై పోలీస్ సీరియస్: జయ అనారోగ్యంపై సామాజిక మాధ్యమాల ద్వారా వదంతులు పుట్టిస్తున్న వారిపై పోలీస్ శాఖ సీరియస్‌గా ఉంది. ఇప్పటికే సతీష్‌కుమార్, మాడస్వామి అనే ఇద్దరు యువకులను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బెంగళూరుకు చెందిన మరో యువతిని అరెస్ట్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే 52 మందిపై కేసులు బనాయించగా, వారందరి సామాజిక మాధ్యమాల అకౌంట్లను సైబర్ క్రైం పోలీసులు స్తంభిపజేస్తున్నారు. ఆత్మాహుతి యత్నం: అమ్మ ఆనారోగ్యానికి గురికావడాన్ని తట్టుకోలేక చెన్నై తాంబరం సమీపంలో సద్గుణం అనే యువ కార్యకర్త బుధవారం సాయంత్రం ఆత్మాహుతి యత్నానికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలకు గురైన అతడిని క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. -
'ఆ సీఎం లేఖకు సమాధానం ఇస్తాం'
హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్ విషయమై తమిళనాడు సీఎం పన్నీరుసెల్వం రాసిన లెటర్‌కు త్వరలో తాము సమాధానమిస్తామని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. గురువారం శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఏపీ మంత్రులు అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఎన్‌కౌంటర్‌పై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని, విచారణలో వాస్తవాలు బయటపడతాయని చంద్రబాబు తెలిపారు. ఈ సమావేశంలో చినరాజప్ప పాల్గొన్నారు. ఎన్‌కౌంటర్‌పై హెచ్ఆర్సీ, కోర్టులకు కూడా నివేదికలు అందజేస్తామని చెప్పారు. మృతిచెందినవారు తమిళనాడు వారు కాబట్టి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాకుండా ఎన్కౌంటర్ చేయించాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వానికి లేదని హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. -
ఉమ్మడి నిరసనలు!
కేంద్రంలో నడుస్తున్న నరేంద్ర మోదీ, రాష్ట్రంలోని పన్నీరు సెల్వం ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఉమ్మడి ఉద్యమానికి వామపక్షాలు శ్రీకారం చుట్టాయి. వళ్లువర్ కోట్టం వేదికగా సీపీఎం, సీపీఐ నేతలు నిరసనలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ప్రభుత్వాల తీరుపై కరపత్రాలు, ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేయనున్నారు. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో వామపక్షాలు ఎవరికి వారే అన్న ట్లు గత కొంత కాలంగా వ్యవహరించారుు. దీంతో సీపీఎం, సీపీఐ కార్యక్రమాలు తగ్గుముఖం పట్టా యి. ప్రజల పక్షాన నిలబడి ఉద్యమించే వామపక్షాలు, ఉన్నట్టుండి తమ దారిలో తాము అన్నట్టుగా సాగడం చర్చనీయాంశంగా మారింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సాగిన వీరు ఎట్టకేలకు ఒకే తాటిపైకి చేరారు. ఉమ్మడిగా ఉద్యమించి ప్రజల్లో నమ్మకాన్ని, తమ ఉనికిని చాటుకునేందుకు సీపీఎం, సీపీఐలు సిద్ధమయ్యాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ, రాష్ట్రం లోని పన్నీరు సెల్వం ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఉమ్మడి ఉద్యమాలకు నిర్ణయించాయి. తొలి విడతగా సోమవారం నుంచి ఈనెల 14 వరకు నిరసనలకు సిద్ధమయ్యారు. కేంద్రంలోని మోదీ సర్కారు వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీలను గుర్తు చేస్తూ కరప్రతాలను సిద్ధం చేశారు. విదేశాల్లోని బ్లాక్ మనీ రప్పించే నినాదంతో, ధరల తగ్గింపు డిమాండ్‌తో, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ విధానాల్ని ప్రజల నెత్తిన రుద్దేందుకు చేస్తున్న వ్యూహాల్ని, హిందుత్వాన్ని, మతతత్వాన్ని చాటుకునే విధంగా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టడంతో పాటుగా రాష్ట్రంలోని పన్నీరు సెల్వం ప్రభుత్వం రూపంలో ప్రజలు ఎదుర్కొంటున్న అష్టకష్టాల్ని వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించారు. సోమవారం సాయంత్రం వళ్లువర్‌కోట్టం వేదికగా జరిగిన నిరసనలో తమ ఉమ్మడి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత టీ పాండియన్లు ఈ నిరసనలో పాల్గొని, కేంద్రం, రాష్ట్రంలోని ప్రభుత్వ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వాల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈనెల 14 వరకు ప్రచార, నిరసనలు చేపట్టనున్నారు. అనంతరం దశల వారీగా తమ ఉద్యమాల్ని ఉధృతం చేయడానికి ముందుకు సాగుతున్నారు.