
'ఆ సీఎం లేఖకు సమాధానం ఇస్తాం'
హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్ విషయమై తమిళనాడు సీఎం పన్నీరుసెల్వం రాసిన లెటర్కు త్వరలో తాము సమాధానమిస్తామని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. గురువారం శేషాచలం ఎన్కౌంటర్పై ఏపీ మంత్రులు అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఎన్కౌంటర్పై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని, విచారణలో వాస్తవాలు బయటపడతాయని చంద్రబాబు తెలిపారు.
ఈ సమావేశంలో చినరాజప్ప పాల్గొన్నారు. ఎన్కౌంటర్పై హెచ్ఆర్సీ, కోర్టులకు కూడా నివేదికలు అందజేస్తామని చెప్పారు. మృతిచెందినవారు తమిళనాడు వారు కాబట్టి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాకుండా ఎన్కౌంటర్ చేయించాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వానికి లేదని హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు.