Seshachalam encounter
-
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణకు డిమాండ్
తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం తీర్మానం ప్రతిపక్ష నేతగా స్టాలిన్ ఏకగ్రీవ ఎన్నిక సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏపీలోని శేషాచల అడవుల్లో తమిళ కూలీలను ఎన్కౌంటర్ చేసిన కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం తీర్మానించింది. తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా డీఎంకే కోశాధికారి, కొళత్తూరు ఎమ్మెల్యే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీఎంకే కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యవర్గ భేటీలో కరుణానిధి స్టాలిన్ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. -
శేషాచల ఎన్కౌంటర్ మృతులకు శ్రద్ధాంజలి
వేలూరు: తిరుపతి శేషాచలం అడవుల్లో గత సంవత్సరం ఏప్రిల్ 7న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 20 మంది కార్మికుల చిత్ర పటాలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. తిరుపతి, శేషాచల అడవులకు ఎర్రచందనం తరలిస్తున్నారనే అనుమానంతో తమిళనాడుకు చెందిన 20 మంది కార్మికులను ఆంధ్ర పోలీసులు గత సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన కాల్చి చంపిన విషయం విదితమే. మృతి చెందిన వారికి మొదటి సంవత్సరం శ్రద్ధాంజలి ఘటించేందుకు తమిళనాడుకు చెందిన 20 మంది కార్మికుల చిత్ర పటాలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం తిరువణ్ణామలై బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రజా పరిరక్షణ సంఘం డెరైక్టర్ హెండ్రీ డిపం, పెరియార్ ద్రావిడ కయగంకు చెందిన కొలత్తూర్ మణి, మృతుల కుటుంబ సభ్యులు కలుసుకొని మృతి చెందిన వారి చిత్ర పటాలను బ్యానర్లో ఉంచి వాటికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మృతి చెందిన వారిలో తిరువణ్ణామలై జిల్లా జవ్యాది కొండకు చెందిన కార్మికులే అధికం కావడంతో ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరూ బస్టాండ్ వద్దకు చేరుకొని చిత్ర పటాల వద్ద క్యాండిల్స్ వెలిగించి మౌనం పాటించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. అదే విధంగా మొదటి సంవత్సరం కావడంతో చిత్ర పటాలను చూసిన పలువురు క్యాండిల్స్ వెలిగించి వారి ఆత్మ శాంతి కలగాలని కోరుతూ కన్నీటి పర్యంతమయ్యారు. -
ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి
-
'సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేం'
-
'సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేం'
హైదరాబాద్: శేషాచలంలో ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ పై విచారణ మూడు వారాల్లో పూర్తి చేయాలని సిట్ ను హైకోర్టు ఆదేశించింది. ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేమని హైకోర్టు తేల్చి చెప్పేసింది. ఈ కేసులో భాగంగా సిట్ ముగ్గురు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను హైకోర్టుకు సమర్పించింది. గతవారం దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. శేషాచలం ఎన్కౌంటర్ కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. దాంతో హైకోర్టు కల్పించుకుని ఈ కేసును సీబీఐకి అప్పగించలేమని తేల్చి చెప్పింది. -
శేషాచలం ఎన్కౌంటర్ పై నేడు విచారణ
-
ఏపీ సర్కారు సహకరించట్లేదు: ఎన్హెచ్ఆర్సీ
చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం లేదని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) సభ్యుడు జస్టిస్ మురుగేశన్ తెలిపారు. కేసు కోర్టు విచారణలో ఉన్నందున డాక్యుమెంట్లు ఇవ్వలేమని ఏపీ ప్రభుత్వం చెబుతోందన్నారు. శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా తాము సిఫార్సు చేశామని ఆయన తెలిపారు. అలాగే, ఎన్కౌంటర్లో మరణించినవారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలో సెక్షన్ 164 కింద ప్రత్యేక పరిహారం ఇవ్వాలని మురుగేశన్ చెప్పారు. ఈ కేసులో సాక్షులకు తమిళనాడు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆయన సూచించారు. -
ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ
-
'శేషాచలం ఎన్కౌంటర్ బాధితులకు రూ. 5 లక్షల పరిహారం'
జాతీయ మానవ హక్కుల సంఘం సిఫార్సు ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ జరపాలని సూచన చిత్తూరు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల వంతున పరిహారం ఇవ్వాలని జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) సిఫార్సు చేసింది. శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ జరపాలని తెలిపింది. ఏప్రిల్ ఏడో తేదీన శేషాచలం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై తమిళనాడులోని పార్టీలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. చెన్నై సహా తమిళనాడులో ఆంధ్రా ఆస్తులపై దాడులు జరిగాయి. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు కూడా చాలా కాలం పాటు నిలిచిపోయాయి. ఎన్కౌంటర్ ప్రాంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం మే 12న పరిశీలించింది. ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు దత్తు నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో పరిశీలించింది. సచ్చినోడిబండ, చిగటీగలకోన ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించింది. వివిధ శాఖల నుంచి నివేదికలు తెప్పించుకుని, స్థానిక పరిస్థితులను కూడా పరిశీలించిన తర్వాత ఇప్పుడు తన నివేదికను వెల్లడించింది. -
'పోలీసులది తప్పని తేలితే కఠిన చర్యలు'
-
'పోలీసులది తప్పని తేలితే కఠిన చర్యలు'
న్యూఢిల్లీ: శేషాచలం ఎదురు కాల్పుల అంశంపై రాజ్యసభలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి ప్రతిపాదన లేనందున కేంద్ర దర్యాప్తు సంస్థతో ఎలాంటి దర్యాప్తు చేయించలేమని చెప్పారు. ఎదురుకాల్పులపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయని తెలిపారు. ఏపీ సర్కారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించిందని అన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. పోలీసులది తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకోవడానికి అభ్యంతరం లేదన్నారు. శేషాచలం ఎన్కౌంటర్ పై చంద్రగిరి పీఎస్ లో ఏప్రిల్ 7న మధ్యాహ్నం 12.30 గంటలకు కేసు నమోదైందని రాజ్ నాథ్ తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం అడవుల్లో ఈ నెల 7న జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
ర్యాలీలో విషాదం
విద్యుదాఘాతంతో యువకుడి మృతి 5లక్షలు ప్రకటించిన నేతలు సాక్షి, చెన్నై: శేషాచలం ఎన్‌కౌంటర్‌కు నిరసనగా చెన్నైలో జరిగిన ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతానికి గురైన యువకుడు బుధవారం కీల్పాకం ఆసుపత్రిలో మృతిచెందాడు. అతడి మృతదేహానికి నివాళులర్పించిన నేతలు బాధిత కుటుంబానికి రూ. ఐదు లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. తిరుపతి శేషాచలం ఎన్‌కౌంటర్‌కు నిరసగా, సీబీఐ విచారణకు పట్టుబడుతూ తమిళాభిమాన సంఘాలు, పార్టీల నేతృత్వంలో మంగళవారం సాయంత్రం చెన్నైలో చలో రాజ్‌భవన్ నినాదంతో ర్యాలీ జరిగిన విషయం తెలిసిందే. గిండి వేదికగా జరిగిన ఈ ర్యాలీ కోసం తిరుచెందూరు నుంచి తమిళర్ వాల్వురిమై కట్చికి చెందిన కార్యకర్త వినోద్ చెన్నైకు వచ్చాడు. ఆ పార్టీ వర్గాలతో కలసి గిండి రైల్వే స్టేషన్ మీదుగా జెండాల్ని చేత బట్టి ర్యాలీ జరుగుతున్న ప్రదేశానికి అతడు పరుగులు తీశాడు. అయితే, అతడి చేతిలో ఉన్న జెండాకు ఇనుప రాడ్డు ఉండడం విషాదానికి దారితీసింది. రైల్వే ట్రాక్ వైపుగా పరుగులు తీస్తున్న అతడు జెండాను పైకి లేపడంతో 25కేవి విద్యుత్ తీగలు తగలడంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీన్ని గుర్తించిన సహచరులు అతన్ని కీల్పాకం ఆసుపత్రికి తరలించారు. నిరసన అనంతరం సమాచారం అందుకున్న నాయకులు అతడికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం వినోద్ మరణించాడు. నేతల నివాళి : వినోద్ మరణ సమాచారంతో ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్, ఎంఎంకే నేత జవహర్లుల్లా తదితరులు పెద్ద సంఖ్యలో కీల్పాకం ఆసుపత్రి వద్దకు వచ్చారు. పోస్టుమార్టం అనంతరం వినోద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఘన నివాళులర్పించారు. అతడి మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో తిరుచెందూరుకు తరలించారు. వినోద్ మరణ సమాచారంతో అతడి కుటుంబీకులు శోక సంద్రంలో మునిగారు. తన కార్యకర్త మరణించడంతో తీవ్ర ఆవేదనకు లోనైన వేల్ మురుగన్, అతడి కుటుంబాన్ని ఆదుకునేందుకు *ఐదు లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. -
విచారణ కేంద్రం పరిధిలో లేదు
‘శేషాచలం’పై హోం మంత్రి రాజ్‌నాథ్ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు లేకుండా శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ సాధ్యం కాదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశిస్తే రాష్ట్రాల మధ్య సంబంధాలు ఏమవుతాయో మీకు తెలుసని విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేనుద్దేశించి వ్యాఖ్యానించారు. శేషాచలం ఎన్కౌంటర్లో 20 మంది ఆదివాసీలు హతమైన ఘటనపై ఎంపీలు మల్లిఖార్జున్ ఖర్గే, ములాయం సింగ్ యాదవ్, తంబిదొరై లోక్‌సభలో లేవనెత్తారు. దీనిపై మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ ఏపీలో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది చనిపోయిన ఘటనపై ములాయం చర్చించారు. ఇటీవల ఈ అంశాన్ని సభలో లేవనెత్తగా పూర్తి వివరాలు తెలుసుకుని సభకు తెలియచేస్తానని హామీ ఇచ్చాను. ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకున్నాను. దర్యాప్తు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అక్కడి కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం నమోదైంది. ఈ కేసులో ఇంకా నేనేమి చేయాలి? ఏం చేసినా రాజ్యాంగ నిబంధనల ప్రకారం జరగాలి. నేను ఏం చేయాలో మీరే చెప్పండి. మీరు చెప్పినట్టే నేను చేస్తాను’’ అని వారినుద్దేశించి అన్నారు. విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే జోక్యం చేసుకుని సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ‘సీబీఐ విచారణకు ఎలా ఆదేశించాలి? అలా చేయలేం’ అని రాజ్‌నాథ్ బదులిచ్చారు. తప్పు చేసినట్లు రుజువైతే అది ఎంత పెద్ద సంస్థ అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదని స్పష్టం చేశారు. ఏం చర్యలు తీసుకున్నారు? మరోసారి కేంద్రాన్ని ప్రశ్నించిన లోక్‌సభ ఉప సభాపతి సాక్షి, న్యూఢిల్లీ: శేషాచలం ఎన్కౌంటర్లో 20 మంది గిరిజనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొట్టనపెట్టుకున్న ఘనటనకు సంబధించి ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని లోక్‌సభ ఉప సభాపతి డాక్టర్ తంబిదురై కేంద్రాన్ని ప్రశ్నించారు. మంగళవారం ఆయన హోం శాఖ పద్దులపై ప్రసంగిస్తున్నప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై విచారణ చేపట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటి? క్రితంసారి హోం మంత్రి ప్రకటన చేసినప్పుడు వివరాలు తెప్పించుకుంటామన్నారు. ఆ సమాచారం సభతో పంచుకుంటారా? ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?. 20 మంది గిరిజనులను చంపేశారు. దీనిపై హోం మంత్రి సమాధానం చెప్పాలి’ అని తంబిదురై డిమాండ్ చేశారు. -
ఆగని నిరసన జ్వాలలు
-
రాజ్యసభలో శేషాచలం రగడ
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో 20 మంది కూలీల మరణం అంశంపై సభలో చర్చిచంఆలని రాజ్యసభ సభ్యులు డిమాండ్ చేశారు. సభ సమావేశం కాగానే సీపీఐ సభ్యుడు డి.రాజా తాను 267వ నిబంధన కింద నోటీసు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఎజెండాను సస్పెండ్ చేసి, ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 7వ తేదీన 20 మంది కార్మికులను హతమార్చిన అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సావధాన తీర్మానానికి నోటీసు ఇస్తే పరిగణిస్తామని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ చెప్పారు. అయితే.. నెట్ న్యూట్రాలిటీ అంశంపై మే 6వ తేదీలోగా సావధాన తీర్మానం చేపట్టాలని టీఎంసీ సభ్యుడు డెరిక్ ఓబ్రెయిన్ గుర్తుచేశారు. అంతకుముందు ఏప్రిల్ 21న బీహార్‌లో తుపాను కారణంగా 48 మంది మరణించిన అంశాన్ని చైర్మన్ హమీద్ అన్సారీ ప్రస్తావించి వారికి సంతాపం తెలిపారు. -
ఏపీ ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటివరకూ జ్యూడిషియల్ ఎంక్వైరీ ఎందుకు వేయలేదని ప్రశ్నించింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల వివరాలు ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. అలాగే పోలీసులు ఉపయోగించిన సెల్ నంబర్లు ఇవ్వాలని సూచించింది. అలాగే సమీపంలోని సెల్ టవర్ నుంచి వెళ్లిన అన్ని ఫోన్ కాల్స్ వివరాలను సమర్పించాలని పేర్కొంది. కాగా ఎన్‌కౌంటర్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అడిషనల్ డీజీ లీగల్ ఎఫైర్స్ వినయ్ రంజన్ ఈరోజు ఎన్హెచ్ఆర్సీ బృందానికి నివేదిక సమర్పించారు. కాగా శేషాచలం అడవుల్లో ఈనెల 7న జరిగిన ఎన్‌కౌంటర్‌పై పోలీసులపై ఉచ్చు బిగుస్తోంది. ఎన్కౌంటర్లో 20 మంది కూలీలను పోలీసులు కాల్చిచంపడం, దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం, సుప్రీం కోర్టు, రాష్ట్ర హై కోర్టు తీవ్రంగా పరిగణించడం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఆరుగురు కూలీలకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన రీపోస్టుమార్టం నివేదిక బుధవారం న్యాయస్థానం వద్దకు సీల్డు కవర్లో చేరడంతో పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పోస్టుమార్టం నివేదికలో ఎలాంటి విషయాలు వచ్చాయోనని పోలీసు బాసులు అంతర్మథనంలో ఉన్నారు. -
హైదరాబాద్‌కు ఎన్హెచ్ఆర్సీ బృందం
ఇరు రాష్ట్రాల్లో ఎన్కౌంటర్లపై ఎన్హెచ్ఆర్సీ విచారణ హైదరాబాద్ : జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం బుధవారం హైదరాబాద్ చేరుకుంది. ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ బాలకృష్ణన్‌తో పాటు సభ్యులు నగరానికి విచ్చేశారు. తెలంగాణలో జరిగిన వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌తోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై ఎన్హెచ్ఆర్సీ బహిరంగంగా విచారణ చేపట్టింది. అలాగే నందికొట్కూరు వేంపెంటలో పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆ గ్రామస్తులు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దానిపై కూడా ఈ బృందం విచారణ చేపట్టనుంది. -
కూలీల కాల్చివేతపై సీబీఐ విచారణ జరపాలి
లోక్‌సభలో కేంద్రానికి డిప్యూటీ స్పీకర్ తంబిదురై డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో శేషాచలం అడవుల్లో పోలీసులు 20 మంది తమిళ కూలీలను దారుణంగా కాల్చి చంపారని.. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిప్యూటీ స్పీకర్, ఏఐఏడీఎంకే ఎంపీ డాక్టర్ ఎం.తంబిదురై కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోక్‌సభలో జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘‘చనిపోయినవారంతా గిరిజనులు. నిరాయుధులు. ఇది అంతర్రాష్ట్ర సమస్య. తమిళనాడుకు చెందిన 20 మందిని ఊచకోత కోశారు. కేంద్ర హోంమంత్రి ఇక్కడే ఉన్నారు. వారు దీనిపై సమాధానం చెప్పాలి. ఏం చర్య తీసుకున్నారో చెప్పాలి. సీబీఐ విచారణ జరిపిస్తున్నారో లేదో స్పష్టం చేయాలి...’’ అని ప్రశ్నించారు. తరువాత 377 నిబంధన కింద రామంతపురం ఎంపీ ఎ.అన్వర్ రజా మాట్లాడుతూ శేషాచలం సంఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారంతా నిరుపేదలేనని, కేంద్రం ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించాలని కోరారు. అంతకుముందు.. ఇండియన్ ముస్లిం లీగ్ ఎంపీ (కేరళ) ఇ.అహ్మద్ శేషాచలం ఎన్కౌంటర్లో 20 మంది కూలీల మరణంతో పాటు, తెలంగాణలో ఐదుగురు అండర్ ట్రయల్ ఖైదీలు పోలీసు కాల్పుల్లో మృతిచెందిన ఘటనను కూడా ప్రస్తావిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘దేశంలో కొన్ని వర్గాల ప్రజల ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయి. అభాగ్యుల మొర విన్నవించేందుకు పార్లమెంటు మినహా మరే వేదికా లేకపోవడంతో ఇక్కడ ప్రస్తావిస్తున్నా. జరగిన సంఘటనలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. తెలంగాణలో పోలీసుల చేతిలో మృతిచెందిన వారు కేసుల్లో ఉండి ఉండొచ్చు. కానీ పోలీసు కస్టడీలో ఉన్నవారిని చంపేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం హక్కులేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత, ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇలా అమాయకులను చంపడం సిగ్గుపడాల్సిన చర్య. ప్రజలు జ్యుడిషియల్ విచారణ గానీ, సీబీఐ విచారణ గానీ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్లు నిజంగా నేరం చేసినా ఇలా ఎలా చంపేస్తారు? ఏ పార్టీ పాలిస్తుందన్నది కాదు ఇక్కడ. రాముడు పాలిస్తున్నాడా? రావణుడు పాలిస్తున్నాడా? అన్నది ముఖ్యం కాదు. మైనారిటీల హక్కులకు భంగం వాటిల్లుతోంది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలి...’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సహా పలు ఇతర పార్టీల ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, జాయిస్ జార్జి, డాక్టర్ ఎ.సంపత్, పి.కె.బిజు, ఎం.బి.రాజేశ్, శంకర్‌ప్రసాద్ దత్తలు.. తాము అహ్మద్ డిమాండ్‌కు మద్దతు పలుకుతున్నట్టు స్పీకర్‌కు తెలిపారు. అయితే.. డిప్యూటీ స్పీకర్ తంబిదురై సభలో నేరుగా ఈ అంశాన్ని లేవనెత్తటం పట్ల స్పీకర్ సుమిత్రామహాజన్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన మాట్లాడాలనుకుంటే తనను అడగవచ్చని, నేరుగా హోంమంత్రితో మాట్లాడరాదని పేర్కొన్నారు. ఆ తర్వాత హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. ‘ఎన్కౌంటర్ల’పై ఆయా రాష్ట్రాల నుంచి కేంద్రం నివేదికలు కోరిందని.. సమాధానం వచ్చాక సభ్యులకు తెలియజేస్తామని పేర్కొన్నారు. ఆయన సమాధానంపై ప్రతిపక్ష సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఏపీ బస్సులపై తమిళుల దాడి
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో మళ్లీ ఉద్రికత్త పరిస్థితులు తలెత్తాయి. శేషాచలం ఎన్ కౌంటర్ కు నిరసనగా తడ, గుమ్మడిపూడి ప్రాంతాల్లో ఏపీ బస్సులపై తమిళులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 3 బస్సులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతీకారంగా తమిళనాడు బస్సులను వరదయ్యపాలెం వద్ద సరిహద్దు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. ఈ నెల మొదటి వారంలో చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 20 మంది కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
'చంద్రబాబుపై 302 కేసు నమోదు చేయాలి'
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగినది బూటకపు ఎన్కౌంటర్ అని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు తెలిసే అక్కడి పోలీసులు కూలీలను చంపేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుపై వెంటనే 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తూ మాట్లాడిన అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని బర్తరఫ్ చేయాలన్నారు. ఎన్కౌంటర్ మీద ఇతర రాష్ట్రాలకు చెందిన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన కోరారు. -
ఆ బస్సులను రానిచ్చేది లేదు
-
ఆ బస్సులను రానిచ్చేది లేదు
శేషాచలం ఎన్కౌంటర్ ఫలితంగా ఏపీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరింత ఎక్కువవుతున్నాయి. తమిళనాడులో ఏపీ బస్సులపై తరచు దాడులు జరుగుతుండటం, దాంతో ఏపీఎస్ ఆర్టీసీ తన సర్వీసులను నిలిపివేయడం తెలిసిందే. అయితే.. ఇప్పటికీ తమిళనాడు బస్సులు మాత్రం యథేచ్ఛగా తిరుగుతుండటంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీదట తమిళనాడు బస్సులను ఏపీ గ్రామాల్లోకి రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ చాలా రోజుల నుంచి తమిళనాడుకు వెళ్లే సర్వీసులను రద్దుచేసింది. దాంతో సంస్థకు ఇప్పటికే దాదాపు రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అయితే మరోవైపు తమిళనాడు బస్సులు మాత్రం ఎంచక్కా తిరుగుతూ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నాయి. దాంతో వరదాయపాళెం గ్రామస్థులు మండిపడ్డారు. తమిళనాడు బస్సులను తమ పొలిమేరలు దాటనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పోలీసుస్టేషన్లో కూడా చెప్పారు. తమ ప్రాంతానికి వస్తే వాటిని అడ్డుకోవడం ఖాయమని తేల్చిచెప్పారు. సోమవారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడు బస్సులను తిరగనివ్వబోమని అన్నారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం మరింత ఎక్కువయ్యే ప్రమాదం కనిపిస్తోంది. -
'శశికుమార్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయండి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్కౌంటర్ కేసును గురువారం హైకోర్టు విచారించింది. ఎన్కౌంటర్లో చనిపోయిన శశికుమార్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. చెన్నైలో ఫోరెన్సిక్ నిపుణులైన డాక్టర్ల బృందంతో వీలైనంత త్వరగా రీ పోస్టుమార్టం ప్రక్రియను పూర్తిచేయాలని సూచించింది. ప్రభుత్వ విచారణ పట్ల మృతుడు శశికుమార్ భార్య మునియమ్మళ్ అనుమానం వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ రోదిస్తూ న్యాయమూర్తిని ఆమె వేడుకున్నారు. అయితే.. శేషాచలం ఎన్కౌంటర్ మీద ప్రభుత్వ విచారణ పట్ల హైకోర్టు న్యాయమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. పోస్టుమార్టం నివేదికను ఎందుకు సమర్పించలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. సుప్రీం కోర్టు నిబంధనలకు లోబడి మృతదేహాలకు వీడియోగ్రఫీతో పోస్టుమార్టం నిర్వహించామని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. అనంతరం శేషాచలం ఎన్కౌంటర్ కేసును మధ్యాహ్నం విచారించిన కోర్టు రీ పోస్టుమార్టం చేయాలని ఆదేశించింది. -
ఎన్కౌంటర్ విచారణపై మునియమ్మళ్ అనుమానం
శేషాచలం ఎన్కౌంటర్ మీద ప్రభుత్వ విచారణ పట్ల మృతుడు శేషుకుమార్ భార్య మునియమ్మళ్ అనుమానం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలంటూ రోదిస్తూ న్యాయమూర్తిని ఆమె వేడుకున్నారు. అయితే.. శేషాచలం ఎన్కౌంటర్ మీద ప్రభుత్వ విచారణ పట్ల హైకోర్టు న్యాయమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. చట్టానికి లోబడి ప్రభుత్వం అన్ని ఫార్మాలిటీస్ జరుపుతోందని, అనుమానాలకు తావులేదని ఆయన చెప్పారు. అయితే.. పోస్టుమార్టం నివేదికను ఎందుకు సమర్పించలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. సుప్రీం కోర్టు నిబంధనలకు లోబడి మృతదేహాలకు వీడియోగ్రఫీతో పోస్టుమార్టం నిర్వహించామని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. అనంతరం శేషాచలం ఎన్కౌంటర్ కేసు విచారణను కోర్టు గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. -
ఎన్కౌంటర్ చంద్రబాబు
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ధ్వజం * శేషాచలం ఘటనకు బాబు మూల్యం చెల్లించక తప్పదు * రెండు రాష్ట్రాల్లో జరిగినవీ బూటకపు ఎన్కౌంటర్లే సాక్షి, హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్ ఘట నకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదనిడమజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. మంగళవారం అర్ధరాత్రి నగరంలోని ఖిల్వత్ మైదానంలో యునెటైడ్ ముస్లిం ఫోరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 20 మంది కూలీలను కాల్చి చంపి బూటకపు ఎన్కౌంటర్ కథ అల్లుతున్నారని దుయ్యబట్టారు. దీనిపై న్యాయ విచారణ చేపట్టాలన్నారు. ఆయన నారా చంద్రబాబు కాదని, ఎన్కౌంటర్ చంద్రబాబు అని అభివర్ణించారు. ఉమ్మడి రాష్ట్రం లో బాబు అధికారంలో ఉన్నప్పుడు 2,002 బూట కపు ఘటనలను ప్రోత్సహించి తగిన మూల్యం చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. బాబు పరిపాలనకు సమర్థుడు కాదని, ఆయన్ను గద్దె దించిన ఘనత యునెటైడ్ ముస్లిం ఫోరందేనని ఆయన గుర్తు చేశారు. ముస్లిం లను జిహాది పేరుతో, దళితులను స్మగర్ల పేరుతో హతమార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సిట్‌ను అంగీకరించబోం.. ఆలేరు ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం వేసిన సిట్‌ను అంగీకరించబోమని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఆలేరు ఘటనపై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్‌ను కలసి కోరితే ఆయన పోలీసు అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేశారని అన్నారు. సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఐజీ సందీప్ శాండిల్యపై తమకు నమ్మకం లేదని, గతంలో మక్కా మసీదు బాంబు పేలుడు ఘటన సందర్భంగా జరిగిన పోలీసు కాల్పులపై ఆయన ముస్లిం యువకులకు వ్యతిరేకంగా తప్పుడు నివేదిక సమర్పించారని అన్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యదర్శి జారీ చేసిన సిట్ జీవోలో మృతి చెందిన వారిని తీవ్రవాదులుగా పేర్కొన్నారని, వారిని కోర్టు శిక్షించనప్పుడు తీవ్రవాదులని ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటరేనన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన 17 మంది పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింల వినాశనానికి మోదీ కుట్ర ప్రధాని మోదీ సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటూ... ముస్లింల వినాశనానికి పాల్పడుతున్నాడని అసదుద్దీన్ దుయ్యబట్టారు. ముస్లింల చరిత్రను మోదీ తెలుసుకోవాలని, ముస్లింలతోనే ప్రపంచం.. ప్రపంచంతోనే ముస్లింలని ఆయన పేర్కొన్నారు. -
‘ఎర్ర’ కౌంటర్లో24 మంది పోలీసులపై కేసు నమోదు
సాక్షి ప్రతినిధి తిరుపతి: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఎట్టకేలకు కేసు నమోదైంది. బాధితుల ఆందోళన, హక్కుల సంఘాల నిరసనల మధ్య ఎన్కౌంటర్లో పాల్గొన్న 24 మంది పోలీసులపై కిడ్నాప్, హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాల్పుల్లో మృతి చెందిన శశికుమార్ భార్య మునియమ్మాళ్ ఫిర్యాదు మేరకు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్కౌంటర్ బూటకం కాదంటున్న రాష్ట్ర పోలీసు అధికారగణం.. నలుదిశలా కమ్ముకుంటున్న ఆరోపణల నుంచి ఏవిధంగా బయటపడాలా? అని ఆత్మరక్షణలో పడిపోయింది. ఇక, బుధవారం నాటి పరిణామాలు పోలీసులను మరింత ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఘటనలో పాల్గొన్న వారిపై హ త్య, కిడ్నాప్ కింద కేసులు నమోదు చేశామంటూ పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించడం, తమ ప్రతివాదిగా బాధితుల్లో ఒకరైన మునియమ్మాళ్ పేరును చేర్చడంతో ఈ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. దీనికి తోడు బాధితురాలు మునియమ్మాళ్ సైతం రీ పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఇకపై జరిగే పరిణామాల ఆధారంగా కేసు నుంచి బయటపడాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఇప్పటిదాకా తీసుకున్న చర్యలతో తాత్కాలికంగా ఆందోళనలు అదుపు చేయవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని బాధితులను మభ్యపెట్టి తమవైపు తిప్పుకునేలా వ్యూహం రూపొందించడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఉన్నతాధికారుల చర్చలు పోలీసులపై కేసు నమోదైన నేపథ్యంలో ఎన్కౌంటర్ గండం నుంచి గట్టెక్కేందుకు ఉన్నతాధికారులు నానాతిప్పలు పడుతున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు తిరుపతిలోనే మకాంవేసి కేసులో తమచేతికి మట్టి అంటకుండా ఉండేలా వ్యూహరచన చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో డీఐజీ కాంతారావు, సీఐడీ ఎస్పీ అమ్మిరెడ్డి, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, కేసు విచారణాధికారి త్రిమూర్తులు సమావేశమై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. డీఎస్పీ, సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులతోనూ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసినట్టు తెలిసింది. -
హత్య, కిడ్నాప్‌ల కింద కేసు నమోదు
హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో హత్య, కిడ్నాప్‌ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఎదురు కాల్పులలో 20 మంది కూలీలు చనిపోయిన విషయం తెలిసిందే. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్లు, శ్రీనివాస మంగాపురం సమీపంలోని ఈతగుంట, ఈత పాకుల కోన పరిసర ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. సచ్చినోడి బండ ప్రాంతంలో 11 మంది, ఈతగుంట సమీపంలోని చీకటీగల కోనలో 9 మంది మృతిచెందారు. మృతుడు శశికుమార్ భార్య మునియమ్మాళ్ ఈనెల 11న చెన్నై నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు పంపారు. ఆ ఫిర్యాదు 12న స్టేషన్‌కు చేరింది. తన భర్త శశికుమార్‌ను ఎన్కౌంటర్లో కాల్చి చంపారని ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసి 302, 364 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, ఈరోజు ఈ కేసు విచారణ సందర్భంగా మునియమ్మాల్ హైకోర్టుకు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆమెను ప్రతి వాదిగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. -
'ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు రండి'
ఒంగోలు: శేషాచలం ఎన్కౌంటర్ పచ్చి బూటకమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ ఆరోపించారు. బూటకపు ఎన్ కౌంటర్ కాబట్టే ఘటనాస్థలికి ప్రజాసంఘాలను వెళ్లనివ్వడం లేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పూటకో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చైనా చంద్రబాబు ఆంధ్రుల ప్రయోజనాలు కాపాడాలని అన్నారు. -
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై విచారణ ప్రారంభం
హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలంలో ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్ కౌంటర్ కేసు విచారణ బుధవారం హైకోర్టులో ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున ఒకరు, బాధితుల తరఫున మరొకరు వాద ప్రతివాదనలు చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. గత సోమవారం విచారణ సందర్భంగా ఈ కేసును హైకోర్టు బుధవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. తన భర్తను బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపారని ఆరోపిస్తూ చెన్నైకు చెందిన మణియమ్మన్ స్పీడ్ పోస్ట్ ద్వారా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా హైకోర్టు దీనిపై సీరియస్ గా స్పందించిందిన విషయం తెలిసిందే. దర్యాప్తు వివరాలను గోప్యంగా ఉంచాలని, కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఎక్కడా ఎవరూ ప్రస్తావించకూడదని గతంలో హైకోర్టు ఆదేశించింది. తన భర్తను శశికుమార్ ను ఎన్కౌంటర్లో కాల్చి చంపారని ఆరోపిస్తూ చెన్నైకు చెందిన మణియమ్మన్ స్పీడ్ పోస్ట్ ద్వారా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఈనెల 11న ఫిర్యాదు చేసింది. -
ఎలా నమ్మించాలి?
♦ చనిపోయిన వారు స్మగ్లర్లే అని నమ్మించేందుకు పోలీసుల యత్నాలు ♦ తమిళనాడుకు వెళ్లిన ప్రత్యేక బృందాలకు నిరాశ ♦ మూడు రోజులుగా తిరుపతిలో ఉన్నతాధికారుల సమావేశాలు సాక్షి ప్రతినిధి, తిరుపతి : శేషాచలం అడవుల్లో పోలీసుల కాల్పుల్లో తమిళనాడు కూలీలు చనిపోయిన ఘటన నుంచి ఎలా బయటపడాలో అర్థంగాక ప్రభుత్వం సతమతమవుతోంది. అటు జనాన్ని, ఇటు తమిళనాడు సర్కారును నమ్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక ఏ మార్గంలో నమ్మించాలా అనే దానిపై అన్వేషణ ప్రారంభించింది. దీనిపై ఉన్నతాధికారులు మూడు రోజులుగా తిరుపతిలో కసరత్తు చేస్తున్నారు. తమిళనాడు కూలీల వ్యవహారం జాతీయ మానవ హక్కుల సంఘం వరకు చేరడం, కేంద్ర ప్రభుత్వమూ దీనిపై వివరాల సేకరణకు దిగడంతో రాష్ట్ర ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు. మృతులు పడివున్న తీరు, అక్కడ లభించిన పాత ఎర్రచందనం దుంగలు, ఎర్రకూలీలను అదుపులోకి తీసుకున్న సమయంలో అదే బస్సులో ఉన్న సాక్షులు చెప్పిన వివరాలు పోలీసు అధికారులను, ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేశాయి. మరోవైపు తమిళనాడు నుంచి రోజురోజుకూ నిరసనలు తీవ్రమవుతున్నాయి. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యు ల ఆస్తులు, అక్కడి తెలుగువారి వ్యాపార సముదాయాలపై దాడులు సాగుతూనే ఉన్నాయి. ఈ గండం నుంచి ఏదో ఒక విధంగా బయట పడేయాలని ప్రభుత్వం ఓ పోలీసు పెద్దను ఆదేశించిందని సమాచా రం. అటవీ శాఖ అధికారులు అడవుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని పాత ఫుటేజీలను కనీసం తేదీలు మార్చకుండానే కొన్ని మీడి యా సంస్థలకు ఇచ్చి మరో తప్పు చేశారని పోలీసు ఉన్నతాధికారు లు ఆగ్రహంగా ఉన్నారు. కూలీలు ఎన్కౌంటర్లోనే చనిపోయారనే వాదనను సమర్థించేలా కొన్ని పత్రికల్లో కథనాలు రాయించే పనిని ఓ మాజీ పోలీస్ పీఆర్వోకు అప్పగించారు. ఇది కూడా అంతగా ఫలితమివ్వలేదని పోలీసు పెద్దలు నిర్ణయానికి వచ్చారు. చనిపోయిన వారంతా స్మగ్లర్లే అంటూ నేరుగా మంత్రుల ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. ఇది బెడిసి కొట్టడంతో ఏకంగా పోలీస్ అధికారుల సంఘం సహాయాన్ని అర్థించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మూడు రోజులుగా.. శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్ సీన్ హైదరాబాద్‌కు చేరింది. డీఐ జీ, ఐజీ స్థాయి అధికారులే వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎదురు కాల్పుల్లోనే కూలీలు మరణించారని నమ్మించడానికి ఎప్పటికప్పుడు కొత్తగా వ్యూహాలను రచిస్తున్నారు. ఇందులో భాగంగానే తిరుపతిలో ఐజీ గోపాలకృష్ణ, డీఐజీలు బాలకృష్ణ, కాంతారావు, సీఐడీఎస్పీ అమ్మిరెడ్డి, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, చిత్తూరు ఎస్పీ శ్రీనివాసులు, ఈ కేసు విచారణాధికారి ఏఎస్పీ త్రిమూర్తులు, డీఎస్పీలు శ్రీనివాసులు, ఈశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డితో పాటు కొంత మంది సీఐలు, ఎస్ఐలతో సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఎదురు దెబ్బ.. ఎన్కౌంటర్ ఘటనలో ప్రభుత్వానికి షాక్ మీద షాక్ తగులుతోంది. ఘటనా స్థలిలో పోలీసులు 27సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా ఆధారంగా వివరాలు బయటకు తీయాలని ఓ పోలీసు పెద్దాయన ఆదేశాలు జారీచేశారు. మృతులంతా కరుడు కట్టిన స్మగ్లర్లే అంటూ వచ్చిన తప్పుడు సమాచారానికి మురిసిపోయారు. ప్రత్యేకంగా రెండు బృందాలను విచారణ కోసం తమిళనాడుకు పంపించారు. అక్కడ నుంచి అనుకున్న మేర ఫలితం రాకపోవడంతో పాటు సహాయ నిరాకరణ ఎదురవడంతో మరో బృందాన్ని రహస్య విచారణ కోసం పంపారు. తీరా కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మృతుల్లో ఒకరికి అక్కడి ఓ రాజకీయ పార్టీతో సంబంధం ఉందని తెలుసుకున్నారు. ఇంత హంగామా చేసి తెలుసుకున్నది ఇంతేనా అంటూ ప్రభుత్వ పెద్దలు ఉసూరుమన్నారట. సర్కారును, కాల్పుల్లో పాల్గొన్న పోలీసులను బయట పడేయడానికి ఏదో బలమైన ఆధారం సంపాదించడానికి మరోసారి లోతుగా విచారించాలని ఆదేశించినట్లు వినికిడి. -
మునియమ్మాళ్ ఫిర్యాదు అందిందా?
* కేసు నమోదు చేశారా? * శేషాచలం ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి * ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * పోలీసులు ఇష్టారాజ్యంగా మాట్లాడొద్దు * విచారణ ఈ నెల 15కు వాయిదా సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు తన భర్త శశికుమార్‌ను చంపారంటూ మృతుని భార్య మునియమ్మాళ్ ఇచ్చిన ఫిర్యాదు అందిందా? అందితే దాని ఆధారంగా కేసు నమోదు చేశారా? లేదా? అని హైకోర్టు సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ఈ ఎన్కౌంటర్ గురించి పోలీసులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతుండటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారం గురించి తమ చర్యలను సమర్థించుకునే విధంగా పోలీసులు మాట్లాడటం ఎంత మాత్రం సమంజసం కాదని తేల్చి చెప్పింది. ఈ కేసు దర్యాప్తు గురించి గానీ, ఇతర విషయాల గురించి వారు నోరు తెరవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఒకవేళ అలా కాదని మాట్లాడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. సంబంధిత కోర్టు, సంబంధిత అధికారి ముందు తప్ప, పోలీసు శాఖలో ఏ స్థాయి అధికారి కూడా దర్యాప్తు గురించి గానీ, దాని ఫలితం గురించి మాట్లాడబోరని, ఆ మేర తగిన సూచనలు చేస్తానంటూ అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఇచ్చిన హామీని ధర్మాసనం రికార్డు చేసుకుంది. దర్యాప్తు గురించి మాట్లాడకుండా మౌనం వహించడం వల్ల దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం ఉంటుందని, ఇది ప్రజలకు పోలీసులపై విశ్వాసం పెరిగేందుకు దోహదపడుతుందని ధర్మాసనం తెలిపింది. 20 మంది ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ పౌర హక్కుల సంఘం నేత చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించి న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. పిటిషనర్ తరఫున వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ, ఎన్కౌంటర్లో మృతి చెందిన సంబంధీకులు ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదని ఈ కోర్టు ప్రశ్నించిందని, ఈ నేపథ్యంలో మృతుల్లో ఒకరైన శశికుమార్ భార్య మునియమ్మాళ్ చంద్రగిరి పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారంటూ, ఆ ఫిర్యాదు కాపీని ధర్మాసనం ముందుంచారు. తన భర్తతో పాటు బస్సులో వెళుతున్న ఇతర కూలీలను పట్టుకొచ్చి కాల్చి చంపారని, బాధ్యులపై కేసు నమోదు చేయాలని ఆమె ఫిర్యాదులో కోరారని తెలిపారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన ధర్మాసనం, అయితే తాము సుమోటోగా మునియమ్మాళ్‌ను ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేరుస్తున్నామని తెలిపింది. మరి ఈ ఫిర్యాదు పోలీసులకు అందిందా? కేసు నమోదు చేశారా? అని అదనపు ఏజీని ప్రశ్నించింది. దీనిపై తగిన వివరాలు తెలుసుకుని చెబుతానని అదనపు ఏజీ శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. ఫిర్యాదు అందింది కాబట్టి, ఈ నేపథ్యంలో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని తాము ఆశిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఆ వెంటనే పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాస్తవం బయటకు రావాలి ‘ఏ పోలీసు అధికారైనా సరే ఈ కేసు దర్యాప్తు గురించి ఏ విషయాన్నీ బహిర్గతం చేయకూడదు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దర్యాప్తునకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయకుండా పోలీసులను నియంత్రించదలిచాం. దానికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణిస్తాం. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మీడియా పని మీడియా చేస్తుంది. అది వారి వృత్తి. వారికి చట్ట పరిధుల మేర స్వేచ్ఛ ఉంది. దర్యాప్తు విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అయితే ఇష్టానుసారం మాట్లాడేందుకు మాత్రం వారికి స్వేచ్ఛ లేదు. వాస్తవం బయటకు రావడమే మాకు కావాల్సింది. న్యాయసాయం కోసం ఫిర్యాదుదారు (మునియమ్మాళ్) ఎప్పుడైనా హైకోర్టును ఆశ్రయింవచ్చు’ అని ధర్మాసనం స్పష్టం చేస్తూ ఆ మేర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మునియమ్మాళ్‌ను ప్రతివాదిగా చేరుస్తున్నామని, ఆమెకు నోటీసులు జారీ చేస్తున్నామని, ఆ నోటీసులను హైకోర్టు రిజిస్ట్రీ స్పీడ్ పోస్టు ద్వారా చిత్తూరు జిల్లా జడ్జికి పంపాలని, వాటిని జిల్లా జడ్జి ఫిర్యాదుదారు చిరునామాకు చేరేలా చూడాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. న్యాయవాది ద్వారా న్యాయసాయం అందుతుందన్న విషయాన్ని మునియమ్మాళ్‌కు తెలియచేయాలని రఘునాథ్‌కు ధర్మాసనం తెలిపింది. ఒకవేళ ఆమె న్యాయసాయం కావాలంటే, ఆమెకు ఓ మంచి న్యాయవాదిని ఏర్పాటు చేయాలని న్యాయ సేవాధికార సంస్థను ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. -
మళ్లీ రగడ
ఎన్‌కౌంటర్‌పై ఉధృతమైన ఆందోళనలు హెరిటేజ్‌పై పెట్రోబాంబు హైకోర్టులో పిటిషన్లు శేషాచలం ఎన్కౌంటర్ చిచ్చు తమిళనాడులో రగులుతూనే ఉంది. ఆదివారం కాస్త తగ్గినప్పటికీ, సోమవారం ఆందోళనకారులు మళ్లీ విజృంభించారు. చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్ సూపర్ మార్కెట్‌పై పెట్రోబాంబు విసిరి పరారయ్యారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: చిత్తూరు శేషాచలం కాల్పులపై ఐదురోజుల పాటు అవిశ్రాంతంగా నిరసనలు తెలిపిన ఆందోళనకారులు సోమవారం మళ్లీ విజృంభించారు. పలుచోట్ల తమ నిరసన తెలిపారు. చిత్తూరు శేషాచల అడవుల్లో 20 మంది తమిళ కూలీల మృత్యువాతను తమిళ ప్రజలు మరిచిపోలేకున్నారు. కాల్పులపై సీబీఐ విచారణ జరపాలని, సుప్రీం కోర్టు న్యాయమూర్తిని విచారణకు నియమించాలని, కాల్పులకు కారణమైన ఏపీ పోలీసులపై హత్యానేరం మోపాలని ఇలా అనేక డిమాండ్లతో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఆదివారం విశ్రాంతి తీసుకున్నట్లుగా రాష్ట్రంలో ఎటువంటి ఆందోళనలు చోటుచేసుకోలేదు. అయితే సోమవారం తెల్లారేసరికి ఏపీ ప్రభుత్వంపై ప్రజాగ్రహం మళ్లీ మిన్నంటింది. ఏపీ అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఒక తమిళ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రజల గుండెల్లో మరోసారి మంటలను రేపింది. రాజకీయ పార్టీ నేతలను రెచ్చగొట్టింది. ఆరిపోతున్న చిచ్చులో ఆజ్యం పోసింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న రాష్ట్రంలో కార్చిచ్చును రగిల్చింది. పార్టీలకు అతీతంగా ఏపీ ప్రభుత్వంపై మండిపడేలా చేసింది. చెన్నై ఐనవరంలోని హెరిటేజ్ సూపర్‌మార్కెట్ వద్దకు రెండుబైక్‌లలో వచ్చిన నలుగురు దుండగులు లోనికి జొరబడి పెట్రోబాంబును విసిరి పరారయ్యారు. అయితే అదృష్టవశాత్తు పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మార్కెట్‌కు అమర్చిన సీసీ టీవీ కెమెరాల పుటేజీ ఆధారంగా నామ్‌తమిళర్ కట్చికి చెందిన వాగైవేందన్, గౌతమన్, మణికంఠన్, శశికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ అంబేద్కర్ న్యాయకళాశాల విద్యార్థులు మైలాపూరులో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. సీమాన్ పిటిషన్ కొట్టివేత కాల్పుల ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని నామ్‌తమిళర్ కట్చి అధినేత సీమాన్ వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు సోమవారం కొట్టివేసింది. కాల్పులపై ఉదంతంపై ఏపీ హైకోర్టు సుప్రీం కోర్టుల్లో పిటిషన్, ఏపీ డీజీపీకి అక్కడి హైకోర్టు కాల్పులపై నివేదికను కోరుతూ ఆదేశాలు ఇచ్చినందున మద్రాసు హైకోర్టు అదేశాలు అవసరం లేదంటూ న్యాయమూర్తులు టీఎస్ శివజ్ఞానం, ఆర్ అమల పిటిషన్‌ను కొట్టివేశారు. మృతదేహాలకు మళ్లీ పోస్టుమార్టం చేయాలని మృతుని తల్లి మునియమ్మాళ్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తొలుత తోసిపుచ్చింది. కాల్పుల ఘటన, కేసులు ఏపీ పరిధిలో ఉన్నందున తాము ఆదేశించలేమని పేర్కొంది. అయితే, ఆరు మృతదేహాలు తమిళనాడు పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నందున మళ్లీ పోస్టుమార్టంకు ఆదేశించే హక్కు కోర్టుకు ఉందని బాధితురాలి తరపు న్యాయవాది వాదించడంతో విచారణకు అంగీకరించింది. -
ఎన్‌కౌంటర్‌పై విచారణ
* శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌తో విచారణ జరిపించండి * చంద్రబాబు సర్కారుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశం * ఏపీ సీఎస్, డీజీపీలకు కమిషన్ ప్రత్యేక ఆదేశాలు * సీఆర్పీసీలోని 176(1)(ఎ) ప్రకారం ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్‌చే ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరపాలి. * ఘటన సమయంలో విధుల్లో ఉన్న అటవీ అధికారులు, పోలీసు అధికారుల వివరాలను ఈ నెల 22లోపు ఎన్హెచ్ఆర్సీకి సమర్పించాలి. * మృతదేహాలకు శవపరీక్షను ఎన్హెచ్ఆర్సీ-2010 నాటి మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలి. * ఎస్టీఎఫ్, బాధితులు ఉపయోగించిన ఆయుధాలను కస్టడీలో ఉంచాలి. శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్ ఘటనపై ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని సోమవారం విన్న జాతీయ మానవ హక్కుల కమిషన్.. చంద్రబాబు సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఘటనపై ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌తో విచారణ జరిపించాలని, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల వివరాలను ఆమూలాగ్రం నమోదు చేసి ఈ నెల 22లోగా అందించాలని ఆదేశించింది. పోలీసు రిజిస్టర్లు, లాగ్ పుస్తకాలను భద్రపరచాలని పేర్కొంది. వాంగ్మూలం ఇచ్చిన సాక్షులకు, వారి బంధువులకు, పంచాయతీ పెద్దలకు తమిళనాడు ప్రభుత్వం పటిష్ట పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించింది. సాక్షి, న్యూఢిల్లీ: శేషాచలం ఎన్కౌంటర్ ఘటనపై చంద్రబాబు సర్కారుకు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘటనపై ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌తో మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం విన్న అనంతరం కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల వివరాలను ఆమూలాగ్రం నమోదు చేసి ఈ నెల 22లోగా తమకు అందించాలని నిర్దేశిం చింది. పోలీసు రిజిస్టర్లు, లాగ్ పుస్తకాలను పూర్తిగా భద్రపరచాలని పేర్కొంది. అలాగే.. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి వాంగ్మూలం ఇచ్చిన సాక్షులకు, వారి బంధువులకు, ఆయా గ్రామాల పంచాయతీ పెద్దలకు తమిళనాడు ప్రభుత్వం పటిష్ట పోలీసు భద్రతను కల్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. వాంగ్మూలం ఇదే: తామంతా బస్సులో ప్రయాణిస్తుండగా.. ఏపీ పోలీసులు అడ్డుకుని తమను శేషాచలం అడవులకు తీసుకెళ్లే యత్నం చేశారని, తాము తప్పించుకున్నా, తమ వాళ్లని తీసుకెళ్లి కాల్చిచంపారని ఎన్కౌంటర్ ఘటన నుంచి తప్పించుకున్న తమిళనాడుకు చెందిన శేఖర్(54), బాలచంద్రన్(29)లు ఎన్హెచ్ఆర్సీ ఎదుట వాంగ్మూలమిచ్చారు. ‘పీపుల్స్‌వాచ్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి హెన్రీ టిఫాగ్నే, సుప్రీం కోర్టు లాయర్ వ్రిందా గ్రోవర్ సహా యంతో వీరు సోమవారం ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీకి ఘటన వివరాలను వివరించారు. అనంతరం హెన్రీ ఆ వివరాలను మీడియాకు తెలిపారు. పక్కన మహిళ ఉండడంతో.. ‘శేఖర్ ఒక దినసరి కూలీ. తన బంధువు మహేంద్రన్‌కు చెందిన నిర్మాణ పనుల నిమిత్తం మహేంద్రన్, మూర్తి, మునుస్వామిలతో కలసి ఈ నెల 6న తన గ్రామమైన పూడూరు కొల్లమేడు(తిరువాణ్ణమలై జిల్లా) నుంచి బస్సులో చెన్నైకి బయలుదేరారు. మధ్యాహ్నం 2.30కు ఆర్కాట్ బస్టాండ్ దాటుతుండగా 30 ఏళ్ల వయసు, గుబురు మీసాలు ఉన్న ఓ వ్యక్తి బస్సులోకి ఎక్కి మహేంద్రన్ను తనతో రావాలని ఆదేశించాడు. ఈ క్రమంలో ‘మీరెవరంటూ..’ మహేంద్రన్ ప్రశ్నించడంతో అవతలి వ్యక్తి చొక్కా పట్టుకుని లాక్కుపోయాడు. శేఖర్ అప్పటికే భయానికి గురై వెనక్కి తిరిగి చూస్తే.. తనతో పాటు వచ్చిన మూర్తి, మునుస్వామి కూడా బస్సులో కనిపించలేదు. మరుసటి రోజు రాత్రి 7.30కు పోలీసులు మహేంద్రన్ ఫొటో చూపించి తిరుపతి వద్ద అడవిలో చనిపోయాడన్నారు. చనిపోయిన 20 మందిలో మూర్తి, మునుస్వామి ఉన్నారని తెలిసింది. శేఖర్ పక్కన ఓ మహిళ కూర్చోవడంతో.. శేఖర్ కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తున్నాడని, ఈ బృందంలో సభ్యుడై ఉండడని భావించిన పోలీసులు అతని జోలికి వెళ్లలేదు’ బాలచంద్రన్ ఇలా..: ‘బాలచంద్రన్ ఒక దినసరి కూలీ. ఈ నెల 4న కాంట్రాక్టు ఏజెంట్ పళని ఫోన్ చేసి.. పాండిచ్చేరిలో ఉపాధి ఉందన్నాడు. దీంతో బాలచంద్రన్ తన తండ్రి హరికృష్ణన్ సహా మరో 8 మందిని తీసుకుని ఈ నెల 5న బయలు దేరాడు. మరుసటి రోజు ఉదయం పళనికి సంబంధించిన మరో వ్యక్తి ఈ బృందంతో కలిశాడు. ఆర్కాట్‌కు వెళ్లేందుకు బస్ కోసం ఎదురుచూస్తుండగా బాలచంద్రన్, ఈ కొత్త వ్యక్తి మద్యం సేవించడానికి ప్రభుత్వ మద్యం దుకాణానికి వెళ్లారు. వీరిద్దరూ తిరిగి బస్టాండ్ చేరేసరికి మిగిలిన బృందం కనిపించలేదు. పళనికి సంబంధించిన వ్యక్తి పళనికి ఫోన్ చేయగా.. నగరి పుత్తూరుకు చేరుకోవాలని పళని సూచించాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ నగరి పుత్తూరుకు చేరుకునే సమయంలో పళనికి సంబంధించిన వ్యక్తి మరోసారి పళనికి ఫోన్ చేసిన అనంతరం బాలచంద్రన్‌తో.. పళని అరెస్టయ్యాడని చెప్పాడు. కానీ.. పళని ఎందుకు అరెస్టయ్యాడో బాలచంద్రన్‌కు అర్థం కాలేదు. ఆ బృందంలోని తన మరో బంధువు శివకుమార్‌కు ఫోన్ చేయగా.. పరిచయం లేని వ్యక్తి లైన్లోకి వచ్చి ‘మీ వాళ్లు తిరుపతిలో ఉన్నారు. త్వరగా వచ్చేయ్’ అని చెప్పారు. బాలచంద్రన్ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్న తరుణంలోనే తన తండ్రి, తమ బృందంలోని మరో ఏడుగురు చనిపోయారని తెలిసింది.’ ఇలంగోవన్ అలా తప్పించుకున్నాడు.. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న ఇలంగోవన్‌కు ప్రభుత్వ గుర్తింపు కార్డు లేకపోవడంతో ఎన్హెచ్ఆర్సీకి రాలేకపోయినట్టు హెన్రీ చెప్పా రు. ఇలంగోవన్ కూడా దినసరి కూలీయేనని, తన ఊరికే చెందిన పనీర్ సెల్వం పొరుగూరిలో పనులున్నాయని చెప్పడంతో ఏప్రిల్ 6న బయలుదేరారు. రాత్రి 8 సమయంలో నగరి పుత్తూర్‌లో ఆహారం తినేందుకు దిగగా.. 8 మంది పోలీసులు వీరిని చుట్టుముట్టి లారీలోకి ఎక్కిం చారు. అది తిరుపతి వద్ద రేంజర్స్ ఆఫీస్ వద్ద ఆగడంతో కొందరు పోలీసులు లారీ ఎక్కగా.. కొందరు దిగారు. ఈ సమయంలో ఇలంగోవన్ లారీ నుంచి దూకి తప్పించుకున్నాడు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలి ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపిం చాలని హెన్రీ, గ్రోవర్లు డిమాండ్ చేశారు. 14, 15 తేదీల్లో ఒక నిజ నిర్ధారణ కమిటీ ఘటనా ప్రాంతాల్లో పర్యటిస్తుందన్నారు. -
'చంద్రబాబు ఉండగానే అదంతా జరిగింది'
విశాఖపట్టణం: రెండు తెలుగు రాష్ట్రాల్లో స్మగ్గర్ల పరిపాలన నడుస్తోందని ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కన్వీనర్, విరసం నేత వరవరరావు ధ్వజమెత్తారు. స్మగ్గర్ల లాంటి పెట్టుబడిదారుల చేతుల్లో ప్రభుత్వాలు నడుస్తున్నాయని విమర్శించారు. శే షాచల అడవుల్లో అమాయకపు కూలీలను పట్టుకుని కాల్చి చంపారని ఆరోపించారు. ఇదంతా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఉండగానే జరిగిందని అన్నారు. 302 హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ తమవాళ్లకు కట్టబెట్టడానికి 2000 నుంచి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వరవరరావు ఆరోపించారు. -
'చిత్తూరు ఎన్కౌంటర్ సాక్షులకు రక్షణ కల్పించండి'
న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్కౌంటర్ సాక్షులకు, పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచులకు రక్షణ కల్పించాలని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీఆర్పీసీ 176 ప్రకారం ఎన్‌కౌంటర్‌పై జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌తో విచారణ జరిపించాలని పేర్కొంది. సోమవారం ఎన్హెచ్ఆర్సీ శేషాచలం ఎన్కౌంటర్ కేసును విచారించింది. ఈ నెల 23న హైదరాబాద్‌లో ఈ కేసు తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు, అటవీ అధికారుల పేర్లను వెల్లడించాలని ఎన్హెచ్ఆర్సీ సూచించింది. ఎన్కౌంటర్లో ఉపయోగించిన ఆయుధాలను సీజ్ చేయాలని, ఎఫ్ఐఆర్, డైరీ ఇతర వివరాల్ని భద్రపరచాలని ఆదేశించింది. 2010 పోస్ట్‌మార్టం నిబంధనల ప్రకారం పోస్ట్‌మార్టం ప్రక్రియను వీడియో తీయాలని సూచించింది. శేషాచలం ఎన్కౌంటర్ ప్రత్యక్ష సాక్షులు శేఖర్, బాలచంద్ర మీడియా ముందుకు వచ్చారు. మూడో సాక్షి వాంగ్మూలాన్ని ఎన్హెచ్ఆర్సీ హైదరాబాద్‌లో తీసుకోనుంది. ఈ వివరాలను ఎన్హెచ్ఆర్సీ న్యాయవాది బృందా గ్రోవర్ వెల్లడించారు. -
'ఎన్ కౌంటర్ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు హాజరయ్యారు'
ఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవిలో జరిగిన ఎన్ కౌంటర్ ఘటనకు సంబంధించి సోమవారం ఎన్ హెచ్ఆర్సీ(జాతీయ మానవ హక్కుల సంఘం)ముందు ప్రత్యక్ష సాక్షులు హాజరైనట్లు చైర్మన్ బాలకృష్ణన్ తెలిపారు. వారిచ్చే వాంగ్మూలాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాంమని ఆయన స్పష్టం చేశారు. శేషాచల ఎన్ కౌంటర్ పై ఇప్పటికే తమకు మూడు ఫిర్యాదులు అందాయన్నారు. సాక్షులకు ప్రాణాహాని ఉందన్న అంశానికి సంబంధించి వారి సమాధానం ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని బాలకృష్ణన్ తెలిపారు. -
దర్యాప్తును గోప్యంగా ఉంచండి: హైకోర్టు
-
హెరిటేజ్ స్టోర్‌పై బాంబుదాడి!
శేషాచలం ఎన్కౌంటర్ మంటలు ఇంకా తమిళనాడులో చల్లారలేదు. తాజాగా చెన్నై నగరంలోని హెరిటేజ్ దుకాణంపై గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. తమిళ అనుకూల సంఘానికి చెందిన నలుగురు వ్యక్తులను ఈ కేసులో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీన చిత్తూరు జిల్లా శేషాచలం ప్రాంతంలో 20 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాడు భగ్గుమంటోంది. -
దర్యాప్తును గోప్యంగా ఉంచండి: హైకోర్టు
హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్ పై విచారణను సోమవారం హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. తన భర్తను బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపారని ఆరోపిస్తూ చెన్నైకు చెందిన మణియమ్మన్ స్పీడ్ పోస్ట్ ద్వారా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఏపీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆమెను ప్రతివాదిగా చేర్చాలంటూ ఆదేశించింది. దర్యాపు వివరాలను గోప్యంగా ఉంచాలlr, కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఎక్కడా ఎవరూ ప్రస్తావించకూడదని తెలిపింది. కేసు విచారణలో ఉండగా వివరాలు ఎలా వెల్లడిస్తారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఆమెకు న్యాయ సహాయాన్ని అందించాల్సిందిగా లీగల్ సర్వీస్ అథారిటీని హైకోర్టు ఆదేశించింది. కాగా తన భర్తను శశికుమార్ ను ఎన్కౌంటర్లో కాల్చి చంపారని ఆరోపిస్తూ చెన్నైకు చెందిన మణియమ్మన్ స్పీడ్ పోస్ట్ ద్వారా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఈనెల 11న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
'ఏపీ, తమిళనాడు చర్చలు జరుపుతున్నాయి'
-
'ఏపీ, తమిళనాడు చర్చలు జరుపుతున్నాయి'
పామర్రు: శేషాచలం ఎన్కౌంటర్ ఘటనపై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య తెలిపారు. సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారమవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో ఆదివారం జరిగిన ఆర్యవైశ్య యువజన సమైక్య నూతన కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ లో 20 మంది కూలీలు ప్రాణాలు కోల్పయిన సంగతి తెలిసిందే. ఎన్కౌంటర్ కు నిరసనగా తమిళనాడులో ఏపీకి చెందిన వారి ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్ పై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని తమిళనాడు సర్కారు డిమాండ్ చేసింది. -
పది నెలల పాలన అస్తవ్యస్తం
వైఎస్సార్ సీపీ నేత అంబటి ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఏపీలో తన 10 నెలల పాలన అస్తవ్యస్తంగా తయారవడంతో సీఎం చంద్రబాబు తీవ్ర నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రధానంగా ఐదు అంశాల్లో ఎదురైన వైఫల్యాల వల్ల బాబుకు ఈ నిరాశ ఏర్పడిందన్నారు. ఈ మేరకు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. శేషాచలం ఎన్‌కౌంటర్‌పై బాబు ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోందన్నారు. నిరాయుధులైన కూలీలను పట్టుకెళ్లి కాల్చి చంపారని తమిళ పత్రికలు సహా తెలుగు పత్రికలు కూడా రాశాయన్నారు. హైకోర్టు కూడా పోలీసులపై సెక్షన్ 302 కింద కేసెందుకు నమోదు చేయలేదని ప్రభుత్వంపై అక్షింతలు వేసిందన్నారు. జాతీయ హక్కుల సంఘాలు కూడా ఎన్‌కౌంటర్‌ను ఖండించినట్టు చెప్పారు. బెదిరించి పాలన సాగించలేరు.. తుపాకీ గొట్టాలు, పోలీసు లాఠీలతో ప్రజలను బెదిరించి పాలన సాగించలేరని చంద్రబాబు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిదని అంబటి హితవు పలికారు. రోజాను వేధిస్తున్నారు.. ప్రజా సమస్యలపై టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోరాడుతున్న మహిళా ఎమ్మెల్యే రోజాపై ఎస్సీ కేసులు పెట్టించి మరీ వేధిస్తున్నారని అంబటి అన్నారు. -
'కూలీలను కాల్చి చంపారు.. హత్యకేసు పెట్టండి'
తమిళ కూలీలను పట్టుకొచ్చి.. కాల్చి చంపారని జాతీయ మానవహక్కుల సంఘాలు ఆరోపించాయి. బాధ్యులపై హత్యకేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. చిత్తూరు జిల్లా శేషాలచం ప్రాంతంలోని ఎన్కౌంటర్ ఘటనా స్థలిని జాతీయ మానవ హక్కుల సంఘం నేతలు పరిశీలించారు. మొత్తం 40 మంది బృందంతో ఈ నేతలు వచ్చారు. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, పీపుల్స్ యూనియన్ ఫర్ డెమొక్రాటిక్ రైట్స్, సీసీపీఎల్, పీడీఎఫ్ నేతలతో పాటు పలు జాతీయ హక్కుల సంఘాలకు చెందిన ప్రతినిధులు శేషాలచం వచ్చారు. ఇది బూటకపు ఎన్‌కౌంటరేనని స్పష్టం చేశారు. ఇందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ జేవీ రాముడు, టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు, ఎన్కౌంటర్ చేసిన పోలీసులు బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు. వీరందరిపై హత్యకేసు నమోదు చేయాలని డిమాండు చేశారు. -
ఎన్కౌంటర్ కానేకాదు.. క్రూరమైన హత్య
-
'ఎన్కౌంటర్ కానేకాదు.. క్రూరమైన హత్య'
చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ఎండీఎంకే అధినేత వైగో సహా 400 మంది అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసి జైలుకు తరలించే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ''ఇది క్రూరమైన హత్య. ఎన్ కౌంటర్ కానేకాదు. అత్యంత క్రూరంగా జరిగింది. చెట్లు కొట్టుకుంటున్న కూలీలను హతమార్చారు. వాళ్లను చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత అతి దగ్గర నుంచి కాల్చి చంపారు. వాళ్ల శరీరంపై ఉన్న గాయాలే అందుకు నిదర్శనం. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమే గెలుస్తుందన్న విశ్వాసం ఉంది. తమిళనాడు ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈ విషయంలో నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది'' అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తమిళనాడులో అన్ని ప్రాంతాల్లోను నిరసనలు జరుగుతున్నాయి. -
ఎవరైనా ఎందుకు చావాలి?
సాక్షి వెబ్సైట్ ప్రత్యేకం అది 90వ దశకంలో రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం బలంగా ఉన్న కాలం.. ఎన్ కౌంటర్లు, మందుపాతరలు నిత్యకృత్యం. అటు నక్సలైట్లు, ఇటు పోలీసులు, సాధారణ పౌరులు, ప్రజాప్రతినిధుల మరణాలు లేని రోజులు చాలా అరుదు. అలాంటి సమయంలో క్రైమ్ రిపోర్టర్‌గా ఒక ఆంగ్ల దినపత్రికలో ఉద్యోగం.. ప్రతి రోజు కత్తి మీద సామును గుర్తుకు తెచ్చేది. పోలీసు అధికారులతో పాటు ప్రజాసంఘాలు, పౌరహక్కుల ప్రతినిధులతో సమానమైన సంబంధాలు, బ్యాలెన్స్ తప్పకుండా రిపోర్టింగ్ చేయాల్సిన బాధ్యత. ఈ క్రమంలో ఎన్నెన్ని మృతదేహాలు.. ఛిద్రమైన దేహాలు.. ఇంటినుంచి బయటకు వస్తే మళ్లీ ఇంటికి ఎప్పుడు వెళతామో తెలియని అనిశ్చితి. అలా రెండు మూడేళ్లు గడిచేసరికి మనసు స్పందించడం మానేసింది. హైదరాబాద్- కరీంనగర్ రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ దాటిన తర్వాత రోడ్డుకు ఎడమవైపు మూడు కిలోమీటర్ల లోపల అహ్మదీపూర్ అనే గ్రామం ఉంది. ఎన్కౌంటర్ జరిగిందని తెలియగానే ప్రయాణం.. చెల్లాచెదురుగా మృతదేహాలు! చనిపోయింది ఏడుగురు. అక్కడ ఆరు దేహాలు మాత్రమే కనబడుతున్నాయి. 'ఏడో బాడీ ఎక్కడ?' అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ను అడిగా. పైనుంచి కిందివరకు పరికించి చూసి 'ఎన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్నావ'ని ప్రశ్న. జవాబు చెప్పేలోపే మీరు కూడా మాలాగే మొద్దుబారిపోయారు అని ముక్తాయింపు. కొరడాతో మొహం మీద కొట్టిన ఫీలింగ్. ఇన్ని సంవత్సరాల రిపోర్టింగ్ ప్రయాణంలో చాలామంది పోలీసు అధికారులు కూడా తమ మొద్దుబారిపోయిన మనసులు విప్పిన సందర్భాలు ఉన్నాయి. ''ఐ షుడ్ టేక్ ఎట్ లీస్ట్ టెన్ డెత్స్ టు మై గ్రేవ్'' అని వాపోయిన ఒక అధికారి మాటలు ఇంకా గుర్తున్నాయి. తర్వాతి కాలంలో క్రమంగా వామపక్ష తీవ్రవాదం బలహీనపడింది. 'చావు వార్తల' ఫ్రీక్వెన్సీ తగ్గింది. ఏదో ఒక రిలీఫ్ అనిపించేది. కానీ అకస్మాత్తుగా గత పదిరోజులుగా ఆ ప్రశాంతత దూరమైంది. నల్లగొండలో వరుస సంఘటనలు, చిత్తూరు ఎర్రచందనం కూలీల 'ఎన్ కౌంటర్' వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు.. వీటిమధ్య హక్కుల ఉల్లంఘన అంశం మరుగున పడిపోయింది. ఎన్కౌంటర్లపై గతంలో జరిగిన విచారణల్లో పెద్దగా తేలింది ఏమీ లేదు. ''నువ్వు చంపితే నేనూ చంపుతా''ననే ఆటవిక న్యాయం ముందు సామాన్యుడి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది.. పోతోంది. నక్సల్స్ సమస్య శాంతిభద్రతల సమస్యా, సామాజిక ఆర్థిక అంశమా అనే చర్చ దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. మత ఉగ్రవాదానికి కారణాలేమిటీ అనే చర్చ వందలకొద్దీ గంటలు టీవీల్లో వినపడుతూనే ఉంటుంది. ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్ల చేతుల్లో మోసపోతారు. పోలీసుల తూటాలకు బలి అవుతారు. 'ఒక ఎన్ కౌంటర్ చేస్తే భయపడతారు' అనే పిడివాదం ఫలితాలు ఇచ్చిందనడానికి దాఖలాలు లేవు. యాసిడ్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. లైంగిక దాడుల సంఖ్య ప్రమాదకరంగా పెరిగిపోతూనే ఉంది. బాంబులు పేలుతూనే ఉన్నాయి. ప్రతిగా వాడుతున్న తూటాల సంఖ్య భారీగానే పెరుగుతోంది. 'తుపాకులు ఉన్నది ఎందుకు' అని గతంలో మంత్రిగా పనిచేసిన ఓ పెద్దాయన ప్రశ్నిస్తాడు. గడ్డి కోసుకోవడానికి వచ్చారా అని ఒక మంత్రివర్యుడు వ్యంగంగా వ్యాఖ్యానిస్తాడు. ఎన్ కౌంటర్ అర్థాన్ని మార్చిన తెలుగు ప్రజల నేల ఇది. ''ఏంటి రెచ్చిపోతున్నావ్, ఎన్ కౌంటర్ చేస్తా''ననే ఖాకీ బెదిరింపులు సర్వసాధారణంగా వినిపిస్తున్న ఠాణాలు ఉన్న ప్రాంతం ఇది. గడిచిన పదిరోజుల సంఘటనలు భవిష్యత్తులో రెండు రాష్ట్రాల్లో ఏర్పడబోయే పరిస్థితికి ముందస్తు హెచ్చరికలా? 'వై షుడ్ ఎనీబడీ గెట్ కిల్డ్? వెదర్ ఇట్ ఈజ్ ఏ టెర్రరిస్ట్ ఆర్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఏ పోలీస్ మన్? ఈజ్ రైట్ టు లివ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్?' దిల్సుఖ్ నగర్ పేలుళ్ల తర్వాత అప్పుడే ప్రపంచాన్ని చూడటం అలవాటు చేసుకున్న నా పెద్ద కూతురు అడిగిన ప్రశ్న. చాలా రోజులపాటు నన్ను వెంటాడిన ప్రశ్న. క్రమంగా మరుగున పడిపోతున్న దశలో సూర్యాపేట బస్టాండ్ లో హోంగార్డ్, కానిస్టేబుల్ లాంటి ఇద్దరు చిరుద్యోగులు టెర్రరిస్టుల తూటాలకు బలయిన సందర్భంలో మళ్లీ గుర్తుకొచ్చిన ప్రశ్న. వరుస సంఘటనలతో ఆ ప్రశ్న మళ్లీ బలంగా వినపడుతోంది. 'వై ఎనీబడీ గెట్ షుడ్ కిల్డ్? - ఎస్. గోపినాథ్ రెడ్డి -
ఎన్కౌంటర్ పై వెల్లువెత్తిన ఆగ్రహావేశాలు
-
'ఆ సీఎం లేఖకు సమాధానం ఇస్తాం'
హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్ విషయమై తమిళనాడు సీఎం పన్నీరుసెల్వం రాసిన లెటర్‌కు త్వరలో తాము సమాధానమిస్తామని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. గురువారం శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఏపీ మంత్రులు అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఎన్‌కౌంటర్‌పై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని, విచారణలో వాస్తవాలు బయటపడతాయని చంద్రబాబు తెలిపారు. ఈ సమావేశంలో చినరాజప్ప పాల్గొన్నారు. ఎన్‌కౌంటర్‌పై హెచ్ఆర్సీ, కోర్టులకు కూడా నివేదికలు అందజేస్తామని చెప్పారు. మృతిచెందినవారు తమిళనాడు వారు కాబట్టి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాకుండా ఎన్కౌంటర్ చేయించాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వానికి లేదని హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. -
ఎన్‌కౌంటర్‌పై వెల్లువెత్తిన ఆగ్రహావేశాలు
తమిళులు.. తెలుగువారి మధ్య 'ఎన్కౌంటర్' చిచ్చు హెరిటేజ్ స్టోర్స్‌పై దాడులు.. పగిలిన అద్దాలు మైలాపూర్‌లో రైలురోకో.. ఏపీ రైళ్లను ఆపేసిన ఆందోళనకారులు హైకోర్టు ఎదుట చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం కంటిమీద కునుకు లేని తెలుగువారు చెన్నై: చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీప్రాంతంలో 20 మంది ఎన్కౌంటర్ తమిళనాడులోని తెలుగువారు, తమిళుల మధ్య చిచ్చురేపింది. ఎన్కౌంటర్లో మరణించిన వారి మృతదేహాలు గురువారం నాడు స్వగ్రామాలకు చేరుకున్నాయి. దాంతో వాటిని చూసిన బంధువులు, ఆయా గ్రామస్థులు మరింత ఆగ్రహావేశాలకు గురయ్యారు. రైలు రోకోలు చేసి, చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రైళ్లన్నింటినీ ఆపేశారు. హైకోర్టు ఎదుట చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. మృతదేహాలకు తిరిగి పోస్టు మార్టం చేయించాలని వారి బంధువులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు చెందినవారు కాకుండా వేరేవాళ్లు పంచనామా చేయాలన్నారు. మరోవైపు తమిళనాడులో ఉన్న హెరిటేజ్ స్టోర్ల మీద దాడులు ఎక్కువయ్యాయి. అక్కడ ఎవరూ ఎలాంటి కొనుగోళ్లు చేయద్దంటూ అల్టిమేటం జారీచేశారు. మైలాపూర్ ప్రాంతంలో ఉన్న దుకాణంలోకి వెళ్లి అద్దాలు పగలగొట్టారు. లోపలున్న సరుకులు, కూరగాయలను బయటకు విసిరేశారు. పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ ఆందోళనల కారణంగా తమిళనాడులో ఉన్న తెలుగువాళ్లకు కంటిమీద కునుకు లేని పరిస్థితి ఏర్పడింది. -
అటు ఫైరింగ్ ... ఇటు షూటింగ్
చిత్తూరు: పోలీసుల ఎన్కౌంటర్ చేశారంటేనే హడల్. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఎవరైనా దగ్గరలో ఉంటే వారి గుండె ఆగినంత పని అవుతుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది హీరోయిన్ శృతిహాసన్‌కి. మంగళవారం శేషాచల పర్వత ప్రాంతంలో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమయ్యారు. అదే సమయంలో ఆ ప్రదేశానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో పులి చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఆ చిత్ర హీరోహీరోయిన్లు విజయ్, శృతిహాసన్‌లు ఆ షూటింగ్లో పాల్గొన్నారు. సాయంత్రం షూటింగ్ పూర్తి అయిన తర్వాత వారు తిరుగు ప్రయాణంలో తిరుపతి వస్తుండగా తలకొన చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు ముమ్మరం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్కౌంటర్ జరిగిన విషయం చిత్ర యూనిట్‌కు తెలిసింది. కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఎన్కౌంటర్ అనేసరికి శృతి హాసన్ అవాక్కయినట్లు సమాచారం. మరోవైపు తిరుపతి పరిసర ప్రాంతాల్లో పులి చిత్ర షూటింగ్ శరవేగంతో జరుపుకుంటుంది. ఈ చిత్రంలో శ్రీదేవి, హాన్సిక, సుదీప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
శేషాచలం ఎన్కౌంటర్ మృతుల గుర్తింపు
-
కాల్చేందుకు కాకపోతే.. ఆయుధాలెందుకు
-
కాల్చేందుకు కాకపోతే.. ఆయుధాలెందుకు
దోచుకుని పోతున్న వారిని కాల్చేందుకు కాకపోతే.. అసలు పోలీసులకు ఆయుధాలుండి ఉపయోగం ఏంటని మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. ఎర్రచందనం ఏపీ రాష్ట్ర సంపద అని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికే రూ. 50 కోట్లకు పైగా విలువ చేసే ఎర్ర చందనం తరలిపోయిందని ఆయన తెలిపారు. శేషాచలం ఎన్కౌంటర్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినది మంచిపనేనని ఆయన అన్నారు. -
రక్తచందనం
శేషాచలంలో భారీ ఎన్కౌంటర్ 20 మంది ఎర్రకూలీల హతం రాష్ట్రంలోనే భారీ ఎన్కౌంటర్ స్మగ్లర్ల కోసం కొనసాగుతున్న వేట బూటకపు ఎన్కౌంటర్ అంటూ ప్రజాసంఘాల ఆగ్రహం తమిళనాడుకు ఆగిన బస్సు సర్వీసులు సాక్షిప్రతినిధి, తిరుపతి/ క్రైం: శేషాచలం అడవుల్లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. 20 మంది ఎర్రకూలీలు హతమయ్యారు. వందలాది మంది తప్పించుకుని అడవుల్లోకి పారిపోయారు. వారికోసం వేట కొనసాగుతోంది. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు సమీపంలో వందలాది మంది ఎర్రకూలీలు అడవుల్లోకి ప్రవేశించారనే పక్కా సమాచారంతో అటవీ శాఖ, రెండు టాస్క్ఫోర్స్ృబందాలు సోమవారం రాత్రి 7 గంటలకు కూంబింగ్ చేపట్టాయి. మంగళవారం తెల్లవారుజామున ఎర్రకూలీలు పోలీసులకు ఎదురపడ్డారు. ఎర్రకూలీలు రాళ్లు, గొడ్డళ్లతో పోలీసులపై దాడి చేయడంతో ఆత్మరక్షణార్థం జరిగిన పోలీస్ కాల్పుల్లో 20 మంది కూలీలు చని పోయారు. పారిపోయిన కూలీల కోసం పోలీస్ బల గాలు శేషాచలం అడవులను జల్లెడ పడుతున్నాయి. ఘటనా స్థలానికి ఉన్నతాధికారులు ఎన్కౌంటర్ విషయం తెలిసిన వెంటనే రేంజ్ డీఐజీ బాలకృష్ణ, టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని వృుతదేహాలను పరిశీలించారు. ఘటనపై కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా నియమించిన డీఆర్వో విజయచంద్ర, ఆర్డీవో వీరబ్రహ్మం సైతం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. పోలీసులు అన్ని ఆధారాలు సేకరించాక వృుతదేహాలను సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రుయాస్పత్రికి తరలించారు. రాత్రి కావడంతో బుధవారం ఉదయం పోస్ట్‌మార్టం నిర్వహించనున్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. కూలీల దాడిలో గాయపడిన పోలీసులను ఉదయమే రుయాస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. ప్రజా సంఘాల ఆగ్రహం శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బూటకపు ఎన్‌కౌంటర్‌గా అభివర్ణిస్తున్నాయి. వృుతిచెందిన వారంతా తమిళనాడుకు చెందిన వారే కావడంతో అక్కడ కూడా తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళ్లే 80 బస్సును నిలిపివేశారు. ఉనికిని చాటుకోవడానికే ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రత్యేకంగా డీఐజీ కాంతారావు నేతృత్వంలో టాస్క్ఫోర్సును ఏర్పాటు చేసినప్పటికీ స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల్లో భయం నెలకొల్పేందుకు భారీ ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం. రోజూ వందల సంఖ్యలో ఎర్రకూలీలు శేషాచల అడవుల్లో ప్రవేశిస్తుండడం, వారిని అడ్డుకునేంత సిబ్బంది లేకపోవడంతో పక్కా ప్రణాళికతో ఈ ఎన్కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతోనైనా కొంతమేర ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చని భావనతో అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించినట్లు చర్చ జరుగుతోంది. మట్టుపెట్టింది అమాయకులనే ఎర్రచందనం కూలీలను అడవుల్లో ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు స్మగ్లరని స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ వారిపైన టాస్క్‌ఫోర్స్ ఎటువంటి చర్యలూ తీసుకోలేకపోయింది. కేవలం ఎర్రకూలీలను మాత్రమే మట్టుపెట్టింది. దీని పైన తమిళనాడులో సైతం తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయి. కీలక ఆధారాల సేకరణ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా వారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులే ఇక్కడికి తరలించి మట్టుబెట్టి ఉంటారనే అనుమానాలు పోలీస్ వర్గాల నుంచే వ్యక్తమౌతున్నాయి. ఎన్కౌంటర్ ప్రాంతంలో శవాలు ఒకేచోట పడి ఉన్న తీరు, ఎర్రకూలీల వద్ద పడి ఉన్న పాత ఎర్రచందనం దుంగలు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఘటనా స్థలంలో 83 రూపాయలు విలువ చేసే బస్ టికెట్ పోలీసులకు లభ్యమైందని సమాచారం. దీని ఆధారంగా ఎర్రకూలీలు 105 కి.మీ ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఊత్తుకోట నుంచిగాని లేక వేలూరు నుంచి గానీ తిరుపతికి ప్రయాణించి ఉండవచ్చు. టికెట్ ఆధారంగా సోమవారం రోజున ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. మొత్తం మీద ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం రేపింది. తిరుమలలో పాగా సాక్షి, తిరుమల: శేషాచలంలో లభించే ఎర్రచందనం అక్రమ రవాణా చేసేందుకు స్మగ్లర్లు, కూలీలు శ్రీవారి భక్తుల అవతారం ఎత్తుతున్నారు. తిరుమలలో ఉచిత భోజనం చేస్తూ, వసతి సముదాయాల్లో బసచేస్తూ, అదను చూసి అడవిలో చొరబడి విలువైన సంపదను కొల్లకొడుతున్నారు. అడ్డువచ్చిన అటవీ శాఖాధికారులను హతమార్చుతున్నారు. చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలోని శేషాచల అడవులను ఆనుకుని ఉన్న గ్రామాల నుంచి వెళ్లే మార్గాలపై అధికారులు నిఘా పెట్టారు. ప్రధానంగా తమిళనాడులోని తిరువన్నామలై, సేలం, కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, కర్ణాటకలోని సరిహద్దు గ్రామాల నుంచి కూలీలు భక్తుల రూపంలో తిరుమల చేరుకుంటున్నారు. ఇక్కడి ఉచిత వసతి సముదాయా ల్లో ఉంటూ, నిత్యాన్న ప్రసాదాన్ని భుజిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా రోజుల తరబడి తిష్టవేస్తారు. వాతావరణం అనుకూలించాక అడవుల్లోకి చొరబడుతున్నారు. జిల్లాలో ‘ఎర్ర’ స్మగ్లర్ల దాడులు ఇలా.. చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం చెట్లను నరకడానికి వచ్చే కూలీలతో పాటు స్మగ్లర్లు కూడా జిల్లాలో ఎన్నోమార్లు అల్లకల్లోలం సృష్టించారు. అడ్డొచ్చిన వారిని చంపడానికి ఏ మాత్రమూ ఆలోచించడం లేదు. ఎర్ర స్మగ్లర్లకు, పోలీసు అటవీ శాఖ అధికారుల మధ్య జరిగిన కొన్ని ఘటనలు... 2013 డిసెంబరులో శేషాచల అడవుల్లో పోలీసులకు, ఎర్రచందనం స్మగ్లర్లకు మధ్య జరిగిన భీకరపోరులో అటవీశాఖ అధికారులు డేవిడ్ కరుణాకర్, శ్రీధర్‌ను ఎర్రచందనం స్మగ్లర్లు అత్యంత దారుణంగా బండరాళ్లతో కొట్టి చంపేశారు. ఈ దాడిలో పది మందికి పైగా సిబ్బంది గాయపడ్డారు. 2012లో భాకరాపేట చామలరేంజ్లోని కనుమలో అటవీశాఖ సిబ్బంది చొక్కలింగం, జయరామన్‌ను బంధించి వారిపై దాడి చేసి ఎర్రచందనం దుంగలను తీసుకుని పారిపోయారు. శ్రీకాళహస్తి అటవీశాఖలో సహాయ బీట్ అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను లారీతో ఢీకొట్టిన ఎర్రచందనం స్మగ్లర్లు దుంగల్ని తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతిలోని టాస్క్ఫోర్సుకు చెందిన డెప్యూటీ రేంజ్ అధికారి మల్లికార్జున సైతం ద్విచక్ర వాహనంలో వెళుతుండగా భారీ వాహనంతో స్మగ్లర్లు ఢీకొట్టి చంపేశారు. కుప్పం బాదూరు సమీపంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వాహనాన్ని వెంబడించిన టాస్క్ఫోర్సు వాహనాన్ని స్మగ్లర్లు భారీ వాహనంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎస్సై అశోక్‌తో పాటు నలుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. 2014లో బెంగళూరులోని కటినగనహళ్లిలో ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయడానికి వెళ్లిన ‘ఆపరేషన్రెడ్’లోని జిల్లాకు చెందిన పోలీసులపై విచక్షణారహితంగా భౌతిక దాడులకు తెగబడ్డారు. గత ఏడాది నవంబరులో పుత్తూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ఓ లారీని టాస్క్ఫోర్సు పోలీసులు వెంబడించారు. ఇందులో ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ సుభాష్ లారీని గట్టిగా పట్టుకున్నాడు. స్మగ్లర్లు సుభాష్‌ను లారీలోనే లాక్కెళ్లి ఓ చెట్టుకు మోదించి వెళ్లిపోయారు. ప్రాణాపాయ స్థితి వరకు వెళ్లిన సుభాష్ నాలుగు నెలల తర్వాత కోలుకున్నాడు. -
'చనిపోయినవారు స్మగ్లర్లా? కూలీలా?'
గుంటూరు: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచాణ జరిపించాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగి, దాదాపు 20 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయినవారు స్మగ్లర్లా? కూలీలా? అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని అంబటి డిమాండ్ చేశారు. తమ కూలీలను ఆంధ్ర పోలీసులు చంపేశారని తమిళ నేతలు అంటున్నారని చెప్పారు. న్యాయవిచారణ జరిపి వాస్తవాలు బహిర్గతం చేయాలని అంబటి కోరారు.