
దర్యాప్తును గోప్యంగా ఉంచండి: హైకోర్టు
హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్ పై విచారణను సోమవారం హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. తన భర్తను బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపారని ఆరోపిస్తూ చెన్నైకు చెందిన మణియమ్మన్ స్పీడ్ పోస్ట్ ద్వారా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఏపీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆమెను ప్రతివాదిగా చేర్చాలంటూ ఆదేశించింది.
దర్యాపు వివరాలను గోప్యంగా ఉంచాలlr, కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఎక్కడా ఎవరూ ప్రస్తావించకూడదని తెలిపింది. కేసు విచారణలో ఉండగా వివరాలు ఎలా వెల్లడిస్తారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఆమెకు న్యాయ సహాయాన్ని అందించాల్సిందిగా లీగల్ సర్వీస్ అథారిటీని హైకోర్టు ఆదేశించింది. కాగా తన భర్తను శశికుమార్ ను ఎన్కౌంటర్లో కాల్చి చంపారని ఆరోపిస్తూ చెన్నైకు చెందిన మణియమ్మన్ స్పీడ్ పోస్ట్ ద్వారా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఈనెల 11న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.